జొయంతో నాథ్ చౌదరి

వికీపీడియా నుండి
మేజర్ జనరల్ (ఆ తరువాత జనరల్ మరియు సైన్యాధ్యక్షుడు) జొయంతో నాథ్ చౌదరి కి సికింద్రాబాదు వద్ద లొంగిపోయి హైదరాబాదు రాజ్యపు సైన్యాన్ని అప్పగిస్తున్న మేజర్ జనరల్ ఎల్ ఎద్రూస్ (ఎడమ వైపు)

జనరల్‌ జొయంతో నాథ్ చౌదరి భారత దేశ 8వ పదాతి దళ సైన్యాధ్యక్షుడు. పద్మ విభూషణ పురస్కార గ్రహీత మరియు హైదరాబాదు రాష్ట్ర తొలి సైనిక అధ్యక్షుడు. ఈయన భారత జాతీయ కాంగ్రేస్ అధ్యక్షుడు డబ్ల్యూ.సి.బెనర్జీ మనుమడు. ఈయన తండ్రి అమియ నాథ్ చౌధరీ ప్రఖ్యాత బెంగాలీ బారిష్టరు.

చౌదరి ప్రస్తుతము బంగ్లాదేశ్లో ఉన్న పబ్నా జిల్లాలోని హరీపూర్ లో 1908లో జన్మించాడు.

జనరల్ చౌదరి నేతృత్వములో సెప్టెంబర్ 12, 1948 భారత సైన్యము హైదరాబాదుపై సైనిక చర్య జరిపి నిజాంను గద్దె దించి హైదరాబాదును భారతదేశములో విలీనము చేసుకొన్నది. సెప్టెంబర్ 18న ఆపరేషన్ పోలోను విజయవంతమైనదిగా ప్రకటించి మేజర్ జనరల్ చౌదరిని హైదరాబాదు రాష్ట్ర తొలి సైనిక పాలకునిగా నియమించారు.

జనరల్ చౌదరి నవంబర్ 19, 1962 నుండి జూన్ 7, 1966 వరకు పదాతి దళ 8వ సర్వసైన్యాధ్యక్షునిగా భాధ్యతులు నిర్వహించాడు. సైన్యంలో 38 సంవత్సరాల విశిష్ట సేవకు గాను జనరల్ చౌదరిని భారత ప్రభుత్వము రెండవ అత్యున్నత పౌరసత్కారమైన పద్మవిభూషణ పురస్కారముతో సత్కరించింది.

భారత సైనికదళము నుండి పదవీ విరమణ చెందిన ఆరు వారాల లోపే ఆయన 1966 జూలై 19న కెనడాలో భారత రాయబారిగా నియమితుడయ్యాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైన్యంలో విశిష్ట సేనానిగానే కాకుండా, జనరల్ చౌదరి రచయితగా మరియు సాహిత్య విమర్శకునిగా కూడా ప్రతిభను కనబరిచారు. ఈయన మిలటరీ నేపథ్యములో రెండు పుస్తకాలు వ్రాయటమే కాకుండా ఒక ప్రముఖ భారతీయ దినపత్రికలో సైనిక వ్యవహారాల ప్రతినిధిగా, సాహితీ విమర్శకునిగా పనిచేశాడు. 1983, జూలై 6న 75 యేళ్ళ వయసులో జనరల్ ఛౌదరి పరమపదించాడు.

బయటి లింకులు [మార్చు]