జ్యోతిషం

వికీపీడియా నుండి

(జ్యోతిష్యం నుండి దారిమార్పు చెందింది)

జ్యోతిష్యం లేదా జోస్యం , ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన శాస్త్రమని కొందరంటారు. మరొ కొందరు ఇది కేవలం నిరాధారమైన నమ్మకాల పరంపర అంటారు. మనిషి జీవితంలో జరిగినది జరగబోయేదీ శరీర లక్షణాలు, అర చేతులు, పుట్టిన తేదీలు, పుట్టిన రోజు ఉన్న నక్షత్రము మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిషము ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు. హస్తసాముద్రికము, గోచారము, నాడీ జ్యోస్యము, న్యూమరాలజీ, ప్రశ్న చెప్పడం, సోది మొదలైన విధానాలుగా జ్యోస్యం చెప్పడం వాడుకలో ఉంది. పగలు వెంట రాత్రిలా, కష్టం వెంట సుఖం ఉందని రేపటి పై ఆశను రేకిత్తించడం ఈ రోజు అనుభవిస్తున్న దుఃఖానికి కొంత ఉపశమనం కలిగించడం దీని లక్ష్యం.

విషయ సూచిక

[మార్చు] పురాణాలలో జ్యోతిష్యం

  • శ్రీనివాసుడు పద్మావతిని చేపట్టడానికి సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి తన ప్రణయ వృత్తాంతాన్ని ఆకాశరాజు దంపతులకు తెలిపి వారిలో తమ వివాహం పట్ల సుముఖత కలిగించి పద్మావతిని పరిణయమాడటంలో విజయం సాధించనట్లు పురాణ కధనాలు చెప్తున్నాయి.
  • కంసుడికి మేనల్లుడి రూపంలో మరణం పొంచివున్నట్లు ఆకాశవాణి ముందుగానే వినిపించింది.
  • శిశుపాలుని మరణం కృష్ణుని ద్వారా సంభవించనున్నదని పెద్దలు చెప్పినట్లు అందువలన శిశుపాలుని తల్లి కృష్ణుని నుండి నూరు తప్పుల వరకు సహించేలా వరం పొందినట్లు భారతంలో వర్ణించబడింది. ఆ తరవాత నూరు తప్పులు చేసి శిశుపాలుడు కృష్ణుని చేతిలో మరణించడం లోక విదితం.
  • త్రిజటా స్వప్నవృత్తాంతము శ్రీ రాముడు రావణుని వధించి సీతమ్మను విడిపించినట్లు త్రిజట ద్వారా వాల్మీకి పలికించడం స్వప్న ఆధారిత జ్యోస్యం వాడుకలో ఉన్నదని చెప్పడానికి నిదర్శనం.

[మార్చు] జానపదుల జోస్యం

  • చిలుక జోస్యం, పుల్లల జోస్యం, రాగుల జోస్యం, చిప్పకట్టె జోస్యం, అంజన పసరు జోస్యం, చెంబు జోస్యం మొదలైనవి జానపదుల జోస్యాలు.
  • బాలసంతు వారు శైవులు.తెల్లవారు ఝామున గంట వాయిస్తూ ఇంటింటికి వచ్చి ఇంటి యజమాని విన్నా వినకపోయినా జోస్యం చెప్పి వెళతారు.

[మార్చు] సాయన, నిరయణ సిద్ధాంతాలు

రాశి చక్రానికి ప్రారంభ బిందువు ఎక్కడ అన్నదొక వివాదం. ప్రతీ సంవత్సరం సూర్యుడు భూమధ్యరేఖ పైకి వచ్చే బిందువుని వసంత విషువద్బిందువు (Vernal Equinox) అని అంటారు. అది సుమారుగా మార్చి 21వ తేదీన జరుగుతుంది. ఆరోజు భూమధ్య రేఖమీద పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఈ బిందువే రాశి చక్రానికి ప్రారంభ బిందువు అని ఒక సాంప్రదాయం. ఇలా లెక్కపెట్టే రాశిచక్రాన్ని సాయన రాశిచక్రం అంటారు. కానీ భూమి తనచుట్టూ తాను తిరగడమే కాక బొంగరంలా ధృవాల దగ్గర అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. ఈ ఊగే చలనం ఫలితంగా ప్రతి ఏడాదీ సూర్యుడు భూమధ్య రేఖ మీదకి వచ్చే బిందువు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది (Precession of the Equinoxes). దీని ఫలితంగా రాశిచక్రపు ప్రారంభ బిందువు కూడా మారిపోతూ ప్రతీ డెబ్భైరెండు సంవత్సరాలకు ఒక డిగ్రీ చొప్పున వెనక్కి జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సాయన రాశి చక్రం అంటే ప్రతీ ఏడాదీ ప్రారంభ బిందువు మారిపోయే రాశిచక్రం (Tropical Zodiac). దీన్ని ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషంలో ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న భారతీయ జ్యోతిశ్శాస్త్రం ఇలా మారిపోయే రాశిచక్రాన్ని పరిగణనలోకి తీసుకోదు. ఒకానొక స్థిరమైన బిందువునించి రాశిచక్రాన్ని లెక్కిస్తుంది. ఆ రాశిచక్రాన్ని నిరయణ రాశి చక్రం అంటారు. వసంతవిషువద్బిందువుకీ (అంటే పాశ్చాత్య రాశిచక్రపు ప్రారంభ బిందువుకీ) ఈ స్థిరబిందువుకీ మధ్య ప్రస్తుతం సుమారు 23 డిగ్రీల తేడా ఉన్నది. దాన్నే అయనాంశ అంటారు. అయితే ఈ స్థిరబిందువు ఎక్కడ ఉండాలి అన్నదానిపై కూడా జ్యోతిష్కులకి ఏకాభిప్రాయం లేదు. భారతీయ జ్యోతిషంలో కూడా ఒక సంప్రదాయానికీ మరొక సంప్రదాయానికీ ఈ స్థిరబిందువు కొద్దిగా మారుతుంది. అంటే అయనాంశ మారుతుంది. ఈ అయనాంశలో లాహిరి, రామన్, దేవదత్త, కృష్ణమూర్తి మొదలైన రకాలు ఉన్నాయి. ఇవన్నీ వేర్వేరు రాశిచక్రాలు అనుకోవచ్చు. సాయన రాశిచక్రం ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషానికి చెందినది. ఒకే వ్యక్తి యొక్క జాతకచక్రాన్ని ఈ రెండు రాశిచక్రాల ప్రకారం గుణిస్తే అసలు ఒకదానికీ మరొకదానికీ సామ్యమే ఉండదు. ఒక జాతకం ప్రకారం మేషంలో సూర్యుడుంటే, మరొక జాతకం ప్రకారం మీనంలో ఉంటాడు (భారతీయ, పాశ్చాత్య రాశిచక్రాల మధ్య 23 డిగ్రీల భేదం ఉంది కాబట్టి). అదే విధంగా భారతీయ జ్యోతిషంలో కూడా అయనాంశ భేదాల ప్రకారం అంత కాకపోయినా కొద్ది భేదంతో (ఒక డిగ్రీ సుమారు) రాశిచక్రాలు మారతాయి.నిరయణ సిద్ధాంతం ప్రకారం విషువములూ, అయనములూ (Equinoxes and Solstices) ఋతువులని అనుసరించి రావు. భాగవత ప్రమాణం ఇలా ఉంటుంది - మేష తులలయందు మిహిరుండహో రాత్రు లందు తిరుగు సమ విహారములను. (పంచమ స్కంధం, ద్వితీయాశ్వాసం, 21వ అధ్యయం, 79వ పద్యం.) అంటే మేష, తులా సంక్రమణాల సమయంలో పగలూ రాత్రీ సమానంగా ఉంటాయి అని. సాయన సిద్ధాంతం ప్రకారం మేష తులా సంక్రమణాలు వరుసగా మార్చి 21, సెప్టెంబరు 22న వస్తాయి. ఆ దినాల్లో భూమధ్యరేఖ పైన రాత్రీ, పగలూ సమానంగా ఉంటాయి. కానీ నిరయణమతం ప్రకారం మేష తులా సంక్రమణాలు ఏప్రిల్ 14, అక్టోబర్ 14 న వస్తాయి. ఆ రోజుల్లో పగలూ రాత్రీ సమానంగా ఉండవు.

[మార్చు] గోచారము

గోచారము అంటే గోళాలు యొక్క సంచారం ఆధారంగా జోస్యం చెప్పడం. చంద్రగోళం భూప్రదక్షణం చేసే సమయంలో ఒక్కొక్క రోజూ ఒక్కొక్క నక్షత్రం సమీపంలో కనిపిస్తుంది. చంద్రుడు సమీపలోని నక్షత్రాన్ని జాతకుని జన్మ నక్షత్రం. ఈ నక్షత్రాలను వాటి ప్రక్కన కనిపించే నక్షత్రాతో కలిపి ఒక ఊహా రేఖతో గుర్తించి వాటిని రాసులుగా గుర్తించారు. దీని ఆధారంగా చంద్రుని సమీపంలో ఉన్న నక్షత్రరాసిని జాతకుని రాశిగా వ్యవహరిస్తారు. సూర్యుడు ఒకరాశినుండి ఇకంకొక రాశి మారటానిని సంక్రమణ లేక సంక్రాంతి అంటారు. సూర్యుడు జ్యోతిష్యశాస్త్రాన్ననుసరించి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాసిలో ప్రవేసిస్తాడు. సంవత్సరాకాలంలో 12 రాసులలో సంచరిస్తాడు. తమిళులు తమ సంవత్సరాన్ని సూర్య సంచారాన్ని అనుసరించి గణిస్తారు. సుర్యుడు మేషంలో ప్రవేసించే రోజు వారికి నూతన సంవత్సర ఆరంభం అవుతుంది. సూరుడు మకరరాశిలో ప్రవేసించినపుడు హిందువులు పెద్ద పండుగగా ఆచరించే సంక్రాంతి పండుగ పర్వదినం. సంక్రాంతిని మకర సంక్రాంతి అనే పేరుతో కూడా పిలవడం హిందువుల అలవాటు. ఒక సంవత్సర కాలంలో 12 సంక్రాంతులు వస్తాయి. ఈ విధంగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని మొదలైన గ్రహాలు ఛాయా గ్రహాలుగా జ్యోతిష్యశాస్త్రాలలో పిలవబడే రాహువు, కేతువు యొక్క సంచారము జ్యోతిష్య గణనలో భాగాలు. ఇవి కాక తెలుగు, మళయాళ జ్యోతిష్కులు శని గ్రహ ఊపగ్రహాలలో పెద్దదైన మందిని శని పుత్రునిగా వ్యహరిస్తూ గణనలోకి తీసుకుంటారు. తమిళ జ్యోతిష్యంలో మాంది గణనలోకి తీసుకొనే ఆచారం లేదు. గ్రహాలు సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేసే కాలాన్ని 12 రోజులుగా విభజించి జ్యోతిష్య గణన చేస్తారు. వీటి ఆధారంగా గోచార ఫలితాలు ఉంటాయి.

[మార్చు] రాశులు నక్షత్ర పాదాలు

సాదారణంగా ఒక రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి.ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి.

రాశి నక్షత్రపాదాలు దినారంభంలో లగ్నం
మేషరాశి అశ్విని 1,2,3,4 పాదాలు భరణి 1,2,3,4 పాదాలు కృత్తిక 1 పాదం మేష సంక్రాంతి నుండి వృషభ సంక్రాంతి వరకు మేషలగ్నం
వృషభరాశి కృత్తిక 2,3,4 పాదాలు రోహిణి 1,2,3,4 పాదాలు మృగశిర 1,2 పాదాలు వృషభ సంక్రాంతి నుండి మిధున సంక్రాంతి వరకు వృషభ లగ్నం
మిధునరాశి మృగశిర 3,4 పాదాలు ఆరుద్ర 1,2,3,4 పాదాలు పునర్వసు 1,2,3 మిధున సంక్రాంతి నుండి కటక సంక్రంతి వరకు మిధిన లగ్నం
కటకరాశి పునర్వసు 4వ పాదం పుష్యమి 1,2,3,4 పాదాలు ఆశ్లేష 1,2,3,4 పాదాలు కటక సంక్రాంతి నుండి సింహ సంక్రాంతి వరకు కటక లగ్నం
సింహరాశి మఖ 1,2,3,4 పాదాలు పూర్వఫల్గుణి 1,2,3,4 పాదాలు ఉత్తర ఫల్గుణి 1 పాదం సింహ సంక్రాంతి నుండి కన్యాసంరాంతి వరకు సింహ లగ్నం
కన్యారాశి ఉత్తర ఫల్గుణి 2,3,4 పాదాలు హస్త 1,2,3,4 పాదాలు చిత్త 1,2 పాదాలు కన్యా సంక్రాంతి నుండి తులా సంక్రాంతి వరకు కన్యా లగ్నం
తులారాశి చిత్త 3,4 పాదాలు స్వాతి 1,2,3,4 పాదాలు విశాఖ 1,2,3 పాదాలు తులా సంక్రాంతి నుండి వృశ్చిక సంక్రాంతి వరకు తులా లగ్నం
వృశ్చికం విశాఖ 4వ పాదం అనూరాధ 1,2,3,4 పాదాలు జ్యేష్ట 1,2,3,4 పాదాలు వృశ్చిక సంక్రాంతి నుండి ధనస్సు సంక్రాంతి వరకు వృశ్చిక లగ్నం
ధనస్సురాశి మూల 1,2,3,4 పాదాలు పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు ఉత్తరాషాఢ 1 పాదం ధనస్సు సంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు ధనుర్లగ్నం
మకరరాశి ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు శ్రవణం 1,2,3,4 పాదాలు ధనిష్ట 1,2 పాదాలు మకర సంక్రాంతి నుండి కుంభ సంక్రాంతి వరకు మకర లగ్నం
కుంభరాశి ధనిష్ట 3,4 పాదాలు శతభిష 1,2,3,4 పాదాలు పూర్వాభద్ర 1,2,3,పాదాలు కుంభ సంక్రాంతి నుండి మీన సంక్రాంతి వరకు కుంభలగ్నం
మీనరాశి పూర్వాభద్ర 4వ పాదం ఊత్తరాభద్ర 1,2,3,4 పాదాలు రేవతి 1,2,3,4 పాదాలు మీన సంక్రాంతి నుండి మేష సంక్రాంతి వరకు మీన లగ్నం

[మార్చు] నక్షత్రాలు అధిదేతలు వర్ణం రత్నం

నక్షత్రం అధిదేవత వర్ణం రత్నం నామం గణం
అశ్విని అర్ధనారీశ్వరుడు పసుపు వైడూర్యం చూ,చే,చో,ల దేవగణం
భరణి రవి ఆకాశనీలం వజ్రం లీ,లూ,లే,లో మానవగణం
కృత్తిక అగ్ని కావి మాణిక్యం ఆ,ఈ,ఊ,ఏ రాక్షసగణం
రోహిణి చంద్రుడు తెలుపు ముత్యం ఒ,వా,వృ,వో మానవగణం
మృగశిర దుర్గ ఎరుపు పగడం వే,వో,కా,కి దేవగణం
ఆరుద్ర కాళి ఎరుపు గోమేధికం కూ,ఘ,బ,చ మానవగణం
పునర్వసు రాముడు పసుపు పుష్పరాగం కే,కో,హా,హీ దేవగణం
పుష్యమి దక్షిణామూర్తి పసుపు,ఎరుపు నీలం హూ,హే,హో,డా దేవగణం
ఆశ్లేష చక్రత్తాళ్వార్ కావి మరకతం డి,డూ,డె,డొ రాక్షసగణం
మఖ ఇంద్రుడు లేతపచ్చ వైడూర్యం మా,మి,మూ,మే రాక్షసగణం
పూర్వఫల్గుణి రుద్రుడు శ్వేతపట్టు పచ్చ మో,టా,టి,టూ మానవగణం
ఉత్తరఫల్గుణి బృహస్పతి లేతపచ్చ మాణిక్యం టే,టో,పా,పీ మానవగణం
హస్త అయ్యప్ప ముదురునీలం ముత్యం పూ,ష,ణ,డ దేవగణం
చిత్త విశ్వకర్మ ఎరుపు పగడం పే,పో,రా,రీ రాక్షసగణం
స్వాతి వాయువు తెలుపు గోమేధికం రూ,రే,రో,త దేవగణం
విశాఖ మురుగన్ పచ్చ పుష్పరాగం తీ,తూ,తే,తో రాక్షసగణం
అనూరాధ మహాలక్ష్మి పసుపు నీలం నా,నీ,నూ,నే దేవగణం
జ్యేష్ట ఇంద్రుడు శ్వేతపట్టు మరకతం నో,యా,యీ,యూ రాక్షసగణం
మూల నంది ముదురుపచ్చ వైడూర్యం యే,యో,బా,బీ రాక్షసగణం
పూర్వాషాఢ వరుణుడు బూడిద వజ్రం బూ,దా,థా,ఢా మానవగణం
ఉత్తరాషాఢ గణపతి తెలుపు మాణిక్యం బే,బో,జా,జీ మానవగణం
శ్రవణం మహావిష్ణు కావి ముత్తు ఖీ,ఖూ,ఖే,ఖో దేవగణం
ధనిష్ట చిత్రగుప్తుడు పసుపుపట్టు పగడం గా,గీ,గూ,గే రాక్షసగణం
శతభిష భద్రకాళి కాఫి గోమేదికం గో,సా,సీ,సూ రాక్షసగణం
పూర్వాభద్ర కుబేరుడు ముదురుపసుపు పూస సే,సో,దా,దీ మానవగణం
ఉత్తరాభద్ర కామధేను గులాబి నల్లపూస దు,శం,ఛా,దా మానవగణం
రేవతి అయ్యప్ప ముదురునీలం ముత్యం దే,దో,చా,చీ దేవగణం

[మార్చు] గోచార ఫలదర్శన చక్రం

స్థానం రవి చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుకృడు శని రాహువు కేతువు
1 స్థానచలనం సౌజన్యం దు॰ఖం బంధనం గమనం ఆరోగ్యం విపత్తు భయం భయం
2 భయం వ్యయం వ్యయం లాభం ధనలాభం భాగ్యం హాని కలహం విరోధం
3 సంపత్తు లాభం లాభం వ్యయం విపత్తు సౌభాగ్యం సంపద సౌఖ్యం సుఖం
4 మానభంగం హాని రిపుభయం శుభం వ్యయం సుఖం రోగం మానహాని మానహాని
5 భయం కార్యనాశం రిపుభయం దరిద్రం సంపద పుత్రలాభం సుతక్షయం ధనవ్యయం క్లేశం
6 రిపుహాని శుభం ధనలాభం భూషణం దు॰ఖం వ్యయం సంపద సుఖం సంతోషం
7 దేహపీడ లాభం కలహం వ్యసనం ఆరోగ్యం క్లేశం రాజాగ్రహం భయం భీతి
8 రోగం వ్యయం భయం సంతోషం హాని భయం దు॰ఖం మృత్యువు హాని
9 భయం వ్యాకులం వ్యయం దు॰ఖం ధనాగమం ధనలాభం రోగం సంతానం కలహం
10 లాభం లాభం చలనం శుభం హాని సౌఖ్యం జాడ్యం కలహం విరోధం
11 ఆరోగ్యం శుభం లాభం సుఖం సంతోషం సౌఖ్యం లాభం లాభం ధనాగమం
12 వ్యయం దు॰ఖం రోగం వ్యయం పీడ లాభం క్లేశం హాని హాని

[మార్చు] మహర్ధశ అంతర్ధశ

గ్రహం రవి

సం-నె-రో

చంద్రుడు

సం-నె-రో

కుజుడు

సం-నె-రో

రాహువు

సం-నె-రో

గురువు

సం-నె-రో

శని

సం-నె-రో

బుధుడు

సం-నె-రో

కేతువు

సం-నె-రో

శుకృడు

సం-నె-రో

మహర్దశాకాలం
1.రవి 0-3-18 0-6-0 0-4-6 0-10-24 0-9-18 0-11-12 0-0-6 0-4-6 1-0-0 6 సంవత్సరాలు
2.చంద్రుడు 0-6-0 0-10-0 0-7-0 1-6-0 1-4-0 1-7-0 1-5-0 0-7-0 1-8-0 10 సంవత్సరాలు
3.కుజుడు 0-4-6 0-7-0 0-4-27 1-0-18 0-11-6 1-1-9 0-11-27 0-4-27 1-2-0 7 సంవత్సరాలు
4.రాహువు 0-10-24 1-6-0 1-0-18 2-8-12 2-4-24 2-10-6 2-6-18 1-0-18 3-0-0 18 సంవత్సరాలు
5.గురువు 0-9-18 1-4-0 0-11-6 2-4-24 2-1-18 2-6-12 2-3-6 0-11-6 2-8-0 16 సంవత్సరాలు
6.శని 0-11-12 1-7-0 1-1-9 2-10-6 2-6-12 3-0-3 2-8-9 1-1-9 3-2-0 19 సంవత్సరాలు
7.బుధుడు 0-10-6 1-5-6 0-11-27 2-6-18 2-3-6 2-8-9 2-4-27 0-11-27 2-10-0 17 సంవత్సరాలు
8.కేతువు 0-4-6 0-7-0 0-4-27 1-0-18 0-11-6 1-1-9 0-11-27 0-4-27 1-2-0 7 సంవత్సరాలు
9.శుకృడు 1-0-0 1-8-0 1-2-0 3-0-0 2-8-0 3-2-0 2-10-0 1-2-0 3-4-0 20 సంవత్సరాలు

[మార్చు] గ్రహాలు శత్రువులు మిత్రులు సములు

గ్రహం మిత్రుడు శత్రువు సముడు
రవి చంద్రుడు,కుజుడు,గురువు శని,శుకృడు బుధుడు
చంద్రుడు రవి,బుధుడు శత్రువులు లేరు మిగిలిన వారు సములు
కుజుడు గురువు,చంద్రుడు,రవి చంద్రుడు కుజ,గురువు,శని
బుధుడు శుకృడు,రవి చంద్రుడు కుజుడు,గురువు,శని
గురువు రవి,కుజుడు,చంద్రుడు బుధ,శుకృడు శని
శుకృడు శని,బుధుడు రవి,చంద్రుడు కుజుడు,గురువు
శని శుకృడు,బుధుడు రవి,చంద్రుడు,కుజుడు గురువు

[మార్చు] జన్మలగ్నము

భూమి తనచుట్టూ తాను తిరిగే ఆత్మ ప్రదక్షిణ కాలంలో ప్రతి రెండు గంటలకు లగ్నం మారుతూ 24 గంటల సమాయాన్ని 12 రాశుల లగ్నాలుగా విభజిస్తూ జ్యోతిష్య గణన చేస్తారు. చైత్రమాసం పాడ్యమి సూర్యోదయం మేషలగ్నంతో ఆరంభం ఔతుంది. ఒక రోజుకు నాలుగు నిమిషాల కాలం ముందుకు జరుగుతూ చేర్చుకొని ఒక మాసకాలంలో 120 నిమిషాలు లగ్న కాలం మారుతూ వైశాఖమాస ప్రారంభం వృషభలగ్నంతో ఉదయం ఆరంభం ఔతుంది. ఈ విధంగా లగ్న గణన చేస్తూ జాతకుడు పుట్టిన లగ్న నిర్ణయం చేస్తారు.

[మార్చు] ఛాయాగ్రహాలు

జ్యోతిష్య శాస్రంలో రాహుకేతువులు ఛాయా గ్రహాలు.వీటికి జ్యోతిష్య శాస్రంలో ఇల్లు లేదు.రాహుకేతువులు అపసవ్య మార్గంలో ప్రయాణం చేస్తాయి.రాహువు కేతువుకు సరిగ్గా ఏడు రాశులు దూరంలో ప్రయాణం చేస్తాయి.కనుక ఈ రెండు గ్రాహాలు ప్రయాణకాలం సమమే.రాహువును కాలసర్పంగా వ్యవహరిస్తారు.రాశి చక్రంలో రాహువు కేతువుకు మద్యలో అన్ని గ్రహాలు ఉంటే దానిని కాలసర్ప దోషంగా నిర్ణయిస్తారు.

[మార్చు] విమర్శలు

జ్యోతిష్యాన్ని శాస్త్రవేత్తలు, హేతువాదులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జ్యోతిష్యులు ఇప్పుడు కూడా భూకేంద్రక సిధ్ధాంతాన్ని ప్రామాణికంగా భావిస్తున్నారు. వీరు నికోలాస్ కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్య కేంద్రక సిధ్ధాంతాన్ని అంగీకరించరు. భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు ఏర్పడతాయన్న ఆర్యభట్టు సూత్రీకరణని కూడా వీరు అంగీకరించరు. వీరు ఇప్పుడు కూడా ఉనికిలో లేని రాహుకేతువులని నమ్ముతారు.

[మార్చు] మూలాలు

పేజీకి సంభందించిన లింకులు