ఝాము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాములు నాలుగు 1.రాత్రి 6 నుండి 9 వరకు 2.9 నుండి 12 వరకు 3.12 నుండి 3వరకు 4.3 నుండి 6వరకు

బైబిలు కాలాల్లో, కావలివాళ్లు ముఖ్యంగా రాత్రి పూట కాపలా కాసేవాళ్లు. ఇశ్రాయేలీయులు రాత్రిని మూడు భాగాలుగా విభాగించారు, వాటిని ‘జాములు’ అని పిలిచేవాళ్లు. (కీర్త. 119:148) న్యాయాధిపతులు 7:19⁠లో “నడిజాము” గురించి చదువుతాం. అయితే యూదులు, యేసు పుట్టే సమయానికి గ్రీకుల, రోమన్ల పద్ధతిని పాటిస్తూ రాత్రిని నాలుగు జాములుగా విభాగించడం మొదలుపెట్టారు.

రాత్రి జాముల గురించి సువార్త వృత్తాంతాల్లో చాలాసార్లు ప్రస్తావించబడింది. ఉదాహరణకు, యేసు నీళ్ల మీద నడుచుకుంటూ, శిష్యులు ఉన్న పడవ దగ్గరికి “రాత్రి నాలుగో జామున” వెళ్లాడని బైబిలు చెప్తుంది. (మత్త. 14:25) అంతేకాదు యేసు ఒక ఉదాహరణలో ఇలా చెప్పాడు, “యజమాని రెండో జామున వచ్చినా, చివరికి మూడో జామున వచ్చినా ఆ దాసులు సిద్ధంగా ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటారు!”—లూకా 12:38.

యేసు తన శిష్యులతో, “ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో మీకు తెలీదు. అతను సాయంకాలం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, పొద్దున వస్తాడో మీకు తెలియదు. అందుకే అప్రమత్తంగా ఉండండి” అని చెప్పినప్పుడు నాలుగు జాముల గురించి ప్రస్తావించాడు. (మార్కు 13:35, అధస్సూచి) మొదటి జాము, “సాయంకాలం” అంటే సూర్యాస్తమయం నుండి దాదాపు రాత్రి తొమ్మిది గంటల వరకు. రెండో జాము, “అర్ధరాత్రి” అంటే దాదాపు రాత్రి తొమ్మిది గంటల నుండి మధ్యరాత్రి వరకు. మూడో జాము, “తెల్లవారుజాము” లేదా ‘కోడి కూసే’ సమయం అంటే మధ్యరాత్రి నుండి దాదాపు ఉదయం మూడు గంటల వరకు. యేసును బంధించిన రాత్రి కోడి కూసింది ఈ జాములోనే అయ్యుంటుంది. (మార్కు 14:72) నాలుగో జాము, “పొద్దున” అంటే దాదాపు ఉదయం మూడు గంటల నుండి సూర్యోదయం వరకు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఝాము&oldid=3561267" నుండి వెలికితీశారు