టంగుటూరి అంజయ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
టంగుటూరి అంజయ్య
Anjayya.jpg
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలం
1980 అక్టోబరు - 1982 ఫిబ్రవరి
Preceded by డా.మర్రి చెన్నారెడ్డి
Succeeded by భవనం వెంకట్రామ్
వ్యక్తిగత వివరాలు
జననం ఆగష్టు 16 , 1919
మరణం అక్టోబరు 19 , 1986
రాజకీయ పార్టీ కాంగ్రెసు
మతం హిందూ

టంగుటూరి అంజయ్య(ఆగష్టు 16 , 1919 - అక్టోబరు 19 , 1986), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. ఈయన 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల కూలీగా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు[1]. కాంగ్రెసు పార్టీ కి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుండి రాష్ట్ర శాసన సభ కు ఎన్నికైనాడు.

ముఖ్యమంత్రిగా[మార్చు]

1980 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడముతో కాంగ్రెసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో ఇందిరా గాంధీ మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య వివిధ వర్గాల వారికి మంత్రివర్గములో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. 61 మంది మంత్రులతో, అంజయ్య భారీ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా జంబో మంత్రివర్గమని పిలిచేవారు[2]. మంత్రుల సభ్యులను తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడితేగా, తొలగించినవారికి పదవులిచ్చి సంతృప్తి పరచడానికి అనేక నిరుపయోగమైన కార్పోరేషన్లు సృష్టించాడు. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద ఖర్చుచేశాడు[3]. అంజయ్య ప్రభుత్వములో కూడా 1982 కల్లా అసమ్మతి వర్గము పెరిగిపోయినందున, ఈయన అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది.

అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి.[4]

1984 పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాదు నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా రాజీవ్ గాంధీ మంత్రివర్గములో పనిచేశాడు. ఈయన తర్వాత ఈయన సతీమణి టంగుటూరి మణెమ్మ కూడా సికింద్రాబాదు నియోజకవర్గము నుండి పార్లమెంటుకు ఎన్నికైనది.

విశేషాలు[మార్చు]

  • అసలు పేరు తాళ్ళ అంజయ్య కానీ తన పేరు టంగుటూరి కృష్ణారెడ్డి అని, తాను రెడ్డినే అని అంజయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత చెప్పాడు.
  • హిందీ, ఉర్దూ మాట్లాడటం,అంజయ్యకు కలిసివచ్చాయి. ముఖ్యమంత్రిగా ఆయన జంబో జెట్ మంత్రివర్గాన్ని 61మందితో ఏర్పరచి ఏమంత్రికి ఎవరి సిఫారసు ఉన్నదో బయట పెట్టాడు. కాదనలేక జాబితా పెంచుతూ పోయాడు.
  • అంజయ్య మాట్లాడేదే అసలైన తెలుగని దాశరథి వ్యాఖ్యానించాడు. సముద్రంలో తేల్ పడిందంట లాంటి తెలుగు ఉర్దూ కలిపిన పదాలు ఆయన ఎన్నో వాడుతుండేవారు.

మూలాలు[మార్చు]

  1. లుంబినీ పార్కు వద్ద అంజయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భముగా హిందూ పత్రికలో వ్యాసం
  2. Parties, Elections, and Mobilisation - K. Ramachandra Murty పేజీ.41
  3. Plotting, Squatting, Public Purpose, and Politics: Land Market Development, Low Income Housing and Public intervention in India - Robert-Jan Baken పేజీ.41
  4. The Indian Journal of Political Science By Indian political science association Vol. 35, no. 4 (Oct.-Dec. 1974) పేజీ.542[1]


ఇంతకు ముందు ఉన్నవారు:
డా.మర్రి చెన్నారెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
11/10/1980—24/02/1982
తరువాత వచ్చినవారు:
భవనం వెంకట్రామ్