టాన్సిల్స్
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
|
|
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
సూక్ష్మక్రిములు, కాలుష్యాలు శరీరంలోకి వెళ్లకుండా టాన్సిల్స్ కాపాడుతాయి. మనం తినే ఆహారంలో, తాగే నీళ్లలో కాలుష్యాలు, విషపదార్థాలు, సూక్ష్మక్రిములు ఉంటాయి. అలాగే పీల్చేగాలిలోనూ ఈ కల్మషాలు ఉంటాయి. ఇవన్నీ నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తే పలు రకాల వ్యాధులూ తలెత్తవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయమూ ఏర్పడవచ్చు. వీటిని నిరోధించడమే టాన్సిల్స్ పని. వీటివల్లే కల్మషాల్లేని, క్రిముల్లేని ఆహార పానీయాలు శరీరంలోకి వెళతాయి.
కాలుష్యాలను నిరోధించే క్రమంలో కొన్నిసార్లు టాన్సిల్స్ బాధకు లోనవుతాయి. టాన్సిల్స్‌లో వాపు, తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. జ్వరం కూడా రావచ్చు. టాన్సిల్ సమస్యకు సరైన చికిత్స చేయించకపోతే, గొంతులోని ఇన్‌ఫెక్షన్లు, చెవిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనివల్ల చెవిలో నొప్పి, వినిపించకపోవడంతో పాటు కొందరిలో చెవిలో చీము కూడా రావచ్చు. చాలా అరుదుగా కొందరిలో చెవి వెనుక ఉండే నాస్టాయిడ్ ఎముక కూడా దెబ్బ తింటుంది. ఇక్కడికి వెళ్లిన ఇన్‌ఫెక్షన్లు మెదడులోకి వెళ్లవచ్చు. ఇది చాలా ప్రమాదం.