టెలీఫోను

వికీపీడియా నుండి
(టెలిఫోను నుండి దారిమార్పు చెందింది)
టచ్ టోన్® సింగల్ లైన్ వాణిజ్య టెలీఫోను, వార్త నిరీక్షణ ల్యాంపు తో
అలెగ్జాండర్ గ్రాహంబెల్ యొక్క అసలైన ఫోను కాపీ, పారిస్ లోని Musée des Arts et Métiers
1896 టెలీఫోను (స్వీడెన్)

టెలీఫోను (గ్రీకు నుండి 'టెలీ' (τηλέ) = దూర, మరియు 'ఫోను' (φωνή) = వాణి) ఒక 'దూర సమాచార' పరికరం, దీనిని శబ్ద ప్రసారం మరియు శబ్ద గ్రహణ కొరకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇద్దరు సంభాషించుకోవడానికి, కొన్ని సమయాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఇది సర్వసాధారణ పరికరం.

విషయ సూచిక

[మార్చు] అన్ని సెల్‌ఫోన్లకు ఒకే ఛార్జర్

భవిష్యత్తులో తయారయ్యే అన్ని కంపెనీల మొబైల్ ఫోన్లకు మోడల్‌తో సంబంధంలేకుండా ఒకే ఛార్జర్‌తో ఛార్జింగ్ చేసే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్(యూసీఎస్)తో ప్రపంచంలో ఏ ఛార్జర్‌తోనైనా సెల్‌ఫోన్ ఛార్జింగ్ చేసుకొనే వీలుకలుగుతుంది. ఛార్జింగ్‌కు అయ్యే విద్యుత్తు పరిమాణం కూడా తగ్గుతుంది.(ఈనాడు25.10.2009)

[మార్చు] సెల్‌ఫోన్ అతి వినియోగంతో కేన్సర్ ముప్పు

సెల్ ఎక్కువగా వినియోగించేవారు భవిష్యత్తులో కేన్సర్ బారినపడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధ్యయనంలో వెల్లడైంది. సెల్‌ఫోన్లను వాడుతున్న వారి మెదడులో కణితులు ఏర్పడే ప్రమాదమున్నట్లు తేలిందని ఎక్కువకాలం సెల్‌ఫోన్లు వినియోగించినవారు కేన్సర్ బారిన పడినట్లు గుర్తించారు.(ఈనాడు26.10.2009)

[మార్చు] ఒకర్నొకరు చూస్తూ మాట్లాడుకోవచ్చు

సెల్‌ఫోన్‌లో లైవ్‌ టీవీ,మొబైల్‌లో ఒకర్నొకరు చూస్తూ మాట్లాడుకోవటం, క్షణాల్లో ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేయటం, సెల్‌ఫోన్‌లో టీవీ చూడటం , ఇంటర్నెట్‌ వంటి సౌకర్యాలు (త్రీజీ సర్వీసులు) అందుబాటులోకి వస్తున్నాయి.

  • అవతలివ్యక్తిని సెల్‌ తెరపై చూస్తూ ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు (వీడియోకాల్‌). ఆన్‌లైన్‌లో టీవీ. మల్టీమీడియా, అధిక వేగంతో కూడిన మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌. ఈ-మెయిల్‌, వీడియో, ఆడియో డౌన్‌లోడ్‌.
  • డౌన్‌లోడ్‌ వేగం 384 కేబీపీఎస్‌ నుంచి 8 ఎంబీపీఎస్‌ వరకు ఉంటుంది. ఈ నెట్‌వర్క్‌కు సెక్యూరిటీ అధికం.
  • మొబైల్‌ను ల్యాప్‌టాప్‌ లేదా కంప్యూటర్‌కు యూఎస్‌బీ కేబుల్‌, బ్లూటూత్‌, ఇన్‌ఫ్రారెడ్‌ ద్వారా అనుసంధానం చేసి నెట్‌ను వినియోగించుకోవచ్చు.
  • ఒక ఎంబీ వీడియో డౌన్‌లోడ్‌కు పట్టే సమయం నిమిషం మాత్రమే. ఎంత పెద్ద ఫైళ్లనైనా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • త్రీజీ సేవలు పొందాలంటే ప్రత్యేకమైన ఫోను అవసరం.రూ.5 వేల నుంచి లభిస్తున్నాయి.
  • ప్రస్తుత సాధారణ సిమ్‌కార్డులతో త్రీజీ సర్వీసులు పొందలేము. దీనికోసం ప్రత్యేకంగా యూసిమ్‌ (యూనివర్సల్‌ సబ్‌స్క్రైబర్‌ ఐడెంటిఫికేషన్‌ మోడ్యూల్‌) కావాలి. సిమ్‌ సామర్థ్యం 256 కిలోబైట్‌ (కేబీ) ఉండాలి. వీటిని బీఎస్‌ఎన్‌ఎల్‌ సరఫరా చేస్తుంది.
  • ప్రస్తుతమున్న సిమ్‌కార్డులు 16కె, 32కె ఉన్నాయి. 32కే సిమ్‌ సహాయంతో ఎడ్జ్‌ టెక్నాలజీ ద్వారా జీపీఆర్‌ఎస్‌ సేవలు పొందవచ్చు.
  • ప్రస్తుతానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే త్రీజీ సర్వీసులు అందిస్తున్నందున ఇతర కంపెనీల మొబైల్‌ వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

[మార్చు] సెల్ ఆల్

వాతావరణంలోకి విషవాయువులు విడుదలైన సమయంలో ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరించే మొబైల్‌.

"http://te.wikipedia.org/w/index.php?title=టెలీఫోను&oldid=711958" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు