టెలిస్కోపు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

టెలిస్కోపు (ఆంగ్లం Telescope), 'విద్యుదయస్కాంత రేడియేషన్' సేకరించుటద్వారా సుదూర ప్రాంతాలలో వున్న వస్తువులను పరిశీలించుటకు ఉపయోగిందు సాధనం . 'టెలిస్కోపు' పదానికి మూలం 'గ్రీకుభాష', టెలి అనగా 'సుదూరం', స్కోపు అనగా 'వీక్షణం' లేక 'దర్శనం', క్లుప్తంగా "దూరవీక్షణి" లేదా "దూరదర్శిని".[1].టెలిస్కొపు అనెది అంతరిక్షములొ చాలా దూరములొ ఉన్న వస్తువులను చుసేందుకు ఉపయొగించు ఉపకరణం.మొట్టమొదటి టెలిస్కొపు నెదర్లాలెంద్స్ లో 17వ శతాబ్దము మొదటలో కనుగొన్నారు.ఇది గాజు లెంసులను ఉపయోగించి రూపొందించబడింది.ఇది భూమి నుండి దూరపు ప్రంతాలను చుసేందుకు వాడబడింది.

టెలిస్కొపు

కొన్ని దశాబ్దాల్లో, 'ప్రతిబింబ టెలిస్కోప్' కనుగొనబడింది. అందులో అద్దాలను ఉపయోగించారు . 20 వ శతాబ్దంలో టెలీస్కోప్ యొక్క అనేక కొత్త రకాల పరిసోధనలలో భాగంగా 1930 లో రేడియో టెలీస్కోప్ మరియు 1960 లో పరారుణ టెలీస్కోప్ ఆవిష్కరించబడ్డాయి. ప్రస్తుతం టెలిస్కోప్ అను పదం విస్తృతంగా విద్యుదయస్కాంత వర్ణపటం యొక్క వివిధ సాధనాలను సూచించుటకు మరియు డిటెక్టర్లను సూచించుటకు వినియోగిస్తున్నారు.

వివిధ రకముల టెలిస్కోపులు[మార్చు]

టెలిస్కోపు అను పదము ఎన్నో రకాల సాధనాలకు వినియోగిస్తారు. ముఖ్యంగా విద్యుదయస్కాంత వికిరణం గుర్తించడంతో పాటుగా వివిధ పౌనఃపున్య బ్యాండ్లలో కాంతిని సేకరించడం ద్వారా దూర ప్రాంత వస్తువులను తెలుసుకోవడంలో అనేక పద్ధతులు ఉంటాయి.

టెలిస్కోపులను కాంతిని గుర్తించే తరంగదైర్ఘ్యాల ద్వారా వర్గీకరిస్తారు:

 • ఎక్స్-రే టెలిస్కోపులు
 • అతినీలలోహిత టెలీస్కోప్
 • ఆప్టికల్ టెలిస్కోపులు
 • ఇన్ఫ్రారెడ్ టెలిస్కోపులు
 • Submillimeter టెలీస్కోప్

ఎక్స్-రే టెలిస్కోపులు[మార్చు]

ఎక్స్-రే టెలిస్కోపులలో వోల్టర్ టెలిస్కోపులవలెనే బరువైన లోహాలతో తయారు చేయబడిన వలయాకారపు అద్దాలను వినియోగిస్తారు. అందులో ఎక్స్-రే ఆప్టిక్స్ ను ఉపయోగిస్తారు. ఇవి కొద్ది కోణం వరకు కిరణాన్ని ప్రతిబింబించగలవు. 1952లో హాంస్ వొల్టర్ ఇటువంటి అద్దాలను వినియోగించి 3 రకాల టెలిస్కోపులను తయారు చేయవచ్చని పేర్కొన్నాడు. ఇటువంటి టెలిస్కోపులను ఐన్స్టీన్ అబ్జర్వేటరీ, ROSAT మరియు చంద్రా X-రే అబ్జర్వేటరీ వంటి ప్రయోగశాలలో వినియోగించారు.

ఆప్టికల్ టెలిస్కోపులు[మార్చు]

ఆప్టికల్ టెలిస్కోప్ విద్యుదయస్కాంత వర్ణపటం యొక్క కనిపించే భాగం నుంచి కాంతి సేకరిస్తుంది. ఆప్టికల్ టెలిస్కోపుల దూరంగా ఉన్న వస్తువులను స్పష్టమైన కోణీయ పరిమాణాన్ని అలాగే వాటి కచ్చితమైన కాంతిని పెంచుతుంది. ఆప్టికల్ టెలిస్కోపులలో 3 రకాలు కలవు.

 • అవర్తక దూరదర్శిని
 • పరావర్తక దూరద్శని
 • కెటాడియోప్ట్రిక్ దూరద్శని


ఇతర సాధనాలు[మార్చు]

"విద్యదయస్కాంత స్పెక్ట్రం" చిత్రం.

పేర్కొనదగ్గ టెలీస్కోపులు[మార్చు]

అమెరికా, న్యూ మెక్సికో లో గల పెద్ద అర్రే.

ఇవీ చూడండి[మార్చు]

Notes[మార్చు]

మూలాలు[మార్చు]

 • Contemporary Astronomy - Second Edition, Jay M. Pasachoff, Saunders Colleges Publishing - 1981, ISBN 0-03-057861-2
 • {{{Last}}} ({{{Year}}})
 • {{{Last}}} ({{{Year}}})
 • {{{Last}}} ({{{Year}}})

బయటి లింకులు[మార్చు]