టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ వీరుల పట్టిక

వికీపీడియా నుండి

టెస్ట్ క్రికెట్ లో ఒకే ఇన్నింగ్సులో బ్యాట్స్‌మెన్ 300 పరుగులకు పైగా స్కోరు సాధించిన వారి పేర్లు ఈ పట్టికలో ఇవ్వబడింది. ఈ ఘనతను 6 టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలకు చెందిన 19 గురు బ్యాట్స్‌మెన్లు 21 సందర్భాల్లో సాధించారు. బంగ్లాదేశ్, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే ల నుంచి ఇంతవరకు ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఒకే ఇన్నిగ్సులో 300 పరుగులు సాధించలేడు. న్యూజీలాండ్ కు చెందిన మార్టిన్ క్రో 1991 లో శ్రీలంక పై ఆడుతూ 299 పరుగుల వద్ద అవుటై ఈ అవకాశాన్ని వదులుకున్నాడు.

టెస్ట్ క్రికెట్ లో మొట్టమొదటి త్రిపుల్ సెంచరీ సాధించిన ఘనత ఇంగ్లాండు కు చెందిన ఆండీ సాంధమ్ కు దక్కింది. ఇతడు 1930 లో వెస్ట్‌ఇండీస్ పై ఆడుతూ 325 పరుగులు సాధించాడు. కాగా భారత్ నుంచి ఈ ఘనతను సాధించిన ఏకైక వీరుడు వీరెంద్ర సెహ్వాగ్. 2004 లో పాకిస్తాన్ పై ఆడుతూ 309 పరుగులు సాధించాడు. ఈ ఘనతను సాధించిన తాజా ఆటగాడు శ్రీలంక కు చెందిన మహేలా జయవర్థనే . ఇతను జూలై 20065 లో దక్షిణాఫ్రికా పై 374 పరుగులు చేసి ఈ ఘనత పొందినాడు. బ్యాట్స్‌మెన్లు టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీలు సాధించడం బౌలర్లు హాట్రిక్ చేసిన సందర్భాల కన్నా తక్కువగా ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో బౌలర్లు 36 పర్యాయాలు హాట్రిక్ లు సాధించగా బ్యాట్స్‌మెన్ల ట్రిపుల్ సెంచరీల సంఖ్య 21 మాత్రమే.

టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు ట్రిపుల్ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్లు ఆస్ట్రేలియా కు చెందిన డొనాల్డ్ బ్రాడ్‌మెన్ మరియు వెస్ట్‌ఇండీస్ కు చెందిన బ్రియాన్ లారా లు. వీరిరువురు చెరో 2 సార్లు ట్రిపుల్ సెంచరీ సాధించారు. 1932 లో బ్రాడ్‌మెన్ దక్షిణాఫ్రికాపై ఆడుతూ 299 పరుగుల వద్ద ఉండగా చివరి బ్యాట్స్‌మెన్ సున్నాకే అవుటవడంతో మరో ట్రిపుల్ సెంచరీ సాధించే అవకాశం కోల్పోయాడు.

బ్రియాన్ లారా 2004 లో ఇంగ్లాండు పై ఆడుతూ 400 పరుగులు చేసి నాటౌట్ గా నిల్చి తన రెండో ట్రిపుల్ సెంచరీ ఘనతనే కాకుండా టెస్ట్ క్రికెట్ చరిత్ర లోనే ఏకైక క్వాడ్రుపుల్ సెంచరీ (400 పైబడి పరుగులు ) సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ గా చరిత్ర సృష్టించాడు.

[మార్చు] ట్రిపుల్ సెంచరీల పట్టిక

స్కోర్ బ్యాట్స్‌మెన్ దేశం ప్రత్యర్థి ఇన్నింగ్స్ టెస్ట్ వేదిక తేది
400* బ్రియాన్ లారా వెస్ట్‌ఇండీస్ ఇంగ్లాండు తొలి 4 వ ఆంటిగ్వా ఏప్రిల్ 2004, (10,11,12)
380 మాథ్యూ హేడెన్ ఆస్ట్రేలియా జింబాబ్వే తొలి 1 వ పెర్త్ అక్టోబర్ 2003 (9,10)
375 బ్రియాన్ లారా వెస్ట్‌ఇండీస్ ఇంగ్లాండు తొలి 5 వ ఆంటిగ్వా ఏప్రిల్ 1994 (16,17,18)
374 మహేలా జయవర్థనే శ్రీలంక దక్షిణాఫ్రికా తొలి 1 వ కొలంబో జూలై 2006 (27,28,29)
365* గారీఫీల్డ్ సోబర్స్ వెస్ట్‌ఇండీస్ పాకిస్తాన్ తొలి 3 వ కింగ్‌స్టన్ ఫిబ్రవరి (27,28), మార్చి (1)1958
364 లెన్ హట్టన్ ఇంగ్లాండు ఆస్ట్రేలియా తొలి 5 వ లండన్ ఆగస్ట్ 1938 (20,22,23)
340 సనత్ జయసూర్య శ్రీలంక భారతదేశం తొలి 1 వ కొలంబో ఆగస్ట్ 1997 (4,5,6)
337 హనీఫ్ మహ్మద్ పాకిస్తాన్ వెస్ట్‌ఇండీస్ రెండవ 1 వ బ్రిడ్జిటౌన్ జనవరి 1958 (20,21,22,23)
336* వాలీ హమ్మండ్స్ ఇంగ్లాండు న్యూజీలాండ్ తొలి 2 వ ఆక్లాండ్ మార్చి 1933 (31) ఏప్రిల్ (1)
334* మార్క్ టేలర్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ తొలి 2 వ పెషావర్ ఒక్టోబర్ 1998 (15,16)
334 డొనాల్డ్ బ్రాడ్‌మెన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండు తొలి 3 వ లీడ్స్ జూలై 1930 (11,12)
333 గ్రాహం గూచ్ ఇంగ్లాండు భారతదేశం తొలి 1 వ లార్డ్స్ జూలై 1990 (26,27)
329 ఇంజముమ్-ఉల్-హక్ పాకిస్తాన్ న్యూజీలాండ్ తొలి 1 వ లాహోర్ మే 2002 (1,2)
325 ఆండీ సాంధమ్స్ ఇంగ్లాండు వెస్ట్‌ఇండీస్ తొలి 4 వ కింగ్‌స్టన్ ఏప్రిల్ 1930 (4,5)
317 క్రిస్ గేల్ వెస్ట్‌ఇండీస్ దక్షిణాఫ్రికా తొలి 4 వ ఆంటిగ్వా మే 2005 (1,2)
311 బాబ్ సింమ్సన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండు తొలి 4 వ మాంచెస్టర్ జూలై 1964 (23,24,25)
310* జాన్ ఎడ్రిచ్ ఇంగ్లాండు న్యూజీలాండ్ తొలి 3 వ లీడ్స్ జూలై 1965 (7,8,9)
309 వీరేంద్ర సెహ్వాగ్ భారతదేశం పాకిస్తాన్ తొలి 1 వ ముల్తాన్ మార్చి 2004 (28,29)
307 బాబ్ కావ్‌పర్ ఆస్ట్రేలియా ఇంగ్లాడు తొలి 5 వ మెల్బోర్న్ ఫిబ్రవరి 1966 (12,14,16)
304 డొనాల్డ్ బ్రాడ్‌మెన్ ఆస్ట్రేలియా ఇంగ్లాడు తొలి 4 వ లీడ్స్ జూలై 1934 (21,23)
302 లారెన్స్ రో వెస్ట్‌ఇండీస్ ఇంగ్లాడు తొలి 3 వ బ్రిడ్జిటౌన్ మార్చి 1974 (7,9,10)

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు