టోక్యో డ్రిఫ్ట్
| The Fast and The Furious: Tokyo Drift | |
| దస్త్రం:Thefastandthefurioustokyodrift bigearlyposter.jpg Theatrical release poster |
|
| దర్శకత్వం | Justin Lin |
|---|---|
| నిర్మాత | Neal H. Moritz Associate Producer: Grace Morita Chiaki Yamase Co-Producer: Amanda Lewis Line Producer: Kazutoshi Wadakura Executive Producer: Ryan Kavanaugh Lynwood Spinks Clayton Townsend |
| రచన | Chris Morgan Characters: Gary Scott Thompson |
| తారాగణం | Lucas Black Bow Wow Sung Kang Brian Tee Nathalie Kelley Sonny Chiba Zachary Ty Bryan |
| సంగీతం | Brian Tyler |
| ఛాయాగ్రహణం | Stephen F. Windon |
| కూర్పు | Kelly Matsumoto Dallas Puett Fred Raskin |
| స్టూడియో | Relativity Media Original Film Munich Pape Filmproductions |
| పంపిణీదారు | Universal Pictures |
| విడుదలైన తేదీ | June 16, 2006 |
| నిడివి | 104 minutes |
| దేశం | United States Germany |
| భాష | English Japanese |
| పెట్టుబడి | US$ 85 Million |
| వసూళ్లు | $158,401,402 |
ది ఫస్ట్ అండ్ ది ఫ్యూరియస్: టోక్యో డ్రిఫ్ట్ (జపాన్‌లో మూస:Nihongo గా కూడా గుర్తించబడిన) జస్టిన్ లిన్ దర్శకత్వం వహించిన 2006 సంవత్సరపు చలచిత్రం, మరియు ది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫిలిం సీరీస్‌లో ఇది మూడవ వాయిదా (కాలక్రమానుసారముగా ఇది నాలుగోది). ముందు రెండు చిత్రాల కంటే భిన్నమైన నేపధ్యం (టోక్యో, జపాన్) కలిగి ఉన్న ఈ చిత్రంలో తారాగణం అంతా కొత్తవారు. చిత్రాన్ని టోక్యోలోనూ,లాస్ ఏంజిల్స్‌లో కొన్ని భాగాలలోనూ చిత్రించారు, ఇదే టోక్యో అన్న భ్రాంతి కలగచేయడానికి లాస్ ఏంజిల్స్ ను తరచూ లైట్లతో మరియు ఇతర సాధనాలతో అలంకరించారు. పాల్ వాకర్ చిత్రంలో లేకపోగా, విన్ డీజిల్ డొమినిక్ టోరెట్టోగా అతిధి పాత్రలో నటించి మరోసారి కనిపించాడు.
విషయ సూచిక |
[మార్చు] ఇతివృత్తం
మూస:Plot సీన్ బోస్‌వెల్ల్ (లూకాస్ బ్లాక్), ఆటో మెకానిక్‌గా మంచి ప్రతిభ ఉన్న 17 ఏళ్ళ యుక్తవయస్కుడు, ఎప్పుడూ గొడవలలో తలదూర్చి తలనొప్పి తెచ్చుకునే విధంగా జీవితాన్ని గడిపాడు. అతని తల్లి భిన్నమైన నగరాలకు తరలి పోవలసి వచ్చింది, ఆమె అతనికి ప్రతిసారి, బడిలోనో లేదా స్థానిక అధికారులతోనో అతని సమస్యలు శృతి మించుతున్నాయని చెప్పేది. ఒక రోజు ఆరిజోనాలో, అతను హై స్కూల్ ఫుట్‌బాల్ ఆటగాడితో ఒక వీధుల్లో కార్ రేస్‌కి దిగాడు. ఇద్దరు మగాళ్ళూ రేస్‌లో ఒకరి కారును ఇంకొకరు గుద్దుకోవడం వల్ల వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ సంఘటన సీన్‌ను జైల్‌కు పంపెంత పని చేసింది, అతని తల్లి, మళ్ళీ అక్కడి నుండి మరోచోటికి వెళ్ళకూడదని నిర్ణయించుకుని, అతనిని జపాన్‌లోని టోక్యోలో ఉన్న అతని తండ్రితో కలిసి జీవించడానికి పంపిస్తుంది. అతను టోక్యోలో U.S. నావికాదళ అధికారిగా పని చేస్తున్నాడు. టోక్యోలో అడుగు పెట్టగానే అతనిని అతని తండ్రి, ఇక్కడ ఎలాంటి సమస్యా తీసుకురాకూడదనీ, ఒకవేళ అదే జరిగితే U.S.కు జైల్‌లో సమయం గడపడానికి తిరిగి పంపిస్తాననీ హెచ్చరిస్తాడు.
సీన్ తన ప్రైవేటు బడిలో ట్వింకీ (బౌ వౌ)ను కలుస్తాడు, అతనో అమెరికన్ సావాసి, అతను ముందుగా ఎవరో ఉపయోగించిన దిగుమతి చేసుకోబడిన వస్తువులను తన జపనీస్ సహావిద్యార్ధులకు అమ్ముతూ ఉంటాడు. ఆ రాత్రి, ట్వింకీ మరియు అతని ముటా, సీన్‌ను ఒక కార్‌పార్క్ దగ్గరికి తీసుకువచ్చి అతనిని డ్రిఫ్ట్ రేసింగ్ ప్రపంచానికి పరిచయం చేస్తారు. సీన్ వెంటనే తకాషి (బ్రైయన్ టీ)ని కలుస్తాడు - అతనిని DK అని అంటారు (డ్రిఫ్ట్ కింగ్ అనేదానికి కుదింపు). సీన్ తకాషి యొక్క దగ్గరి స్నేహితుడు అయిన హాన్ ల్యూ (సుంగ్ కాంగ్)ని కూడా కలుస్తాడు, అతను అమెరికాలో పుట్టి పెరిగాడు. సీన్ నీలాతో (నథాలీ కెల్లీ)తో మాట్లాడుతూ ఉండగా తకాషి చూస్తాడు, ఆమె తకాషి యొక్క ఆస్ట్రేలియన్ గర్ల్‌ఫ్రెండ్. సీన్‌ను తనకు దూరంగా ఉండమని తకాషి చెప్పగా, సీన్ అతనిని తనతో రేస్‌లో పాల్గొనమని సవాలు విసురుతాడు. డ్రిఫ్టింగ్‌లో సీన్‌కు పెద్దగా అనుభవం లేక పోవడం వల్ల, తకాషి అతనిని తన గ్రే అండ్ బ్లాక్ నిస్సన్ 350z కారుని ఉపయోగించి తేలిగ్గా ఓడిస్తాడు. సీన్ కోపంతో హాన్ యొక్క నిస్సాన్ S15ను ధ్వంసం చేస్తాడు. మరుసటి రోజు, బడి అయిపోయాక హాన్ సీన్‌ను కలిసి తన కారుని పాడు చేసినందుకు గాను ఆ డబ్బుని చెల్లించడానికి బదులుగా తన కోసం పని చేయాలని చెబుతాడు. హాన్‌కు తకాషితో వ్యాపారసంబంధం ఉందని సీన్ తెలుసుకుంటాడు.
హాన్, సీన్‌కు స్నేహితుడు అయ్యి, అతను తన తండ్రి ఇల్లు వదిలినపుడు తన విభాగంలో చేర్చుకుని అతనికి ఎలా డ్రిఫ్ట్ చేయాలో నేర్పి, అతనికి కొంత ధన సహాయం చేసి, రేస్ చేయడానికి ఒక రెడ్ మిత్‌సుబిషి లాన్సర్ ఎవల్యూషన్ IX ఇస్తాడు. తకాషికి భయపడనివాడు సీన్ ఒక్కడే అని తెలిసి హాన్ ఇదంతా అతని కోసం చేస్తాడు (అతను సీన్‌ను తకాషి యొక్క "క్రిప్టోనైట్" అని పిలుస్తాడు). సీన్ నెమ్మదిగా డ్రిఫ్ట్ ఆటలో పేరు సంపాదించి సహవిద్యార్ధిని అయిన నీలాకు దగ్గరవుతాడు. నీలా సీన్‌తో, తను కూడా జపాన్ కు చెందినది కాకపోవటంతో తనను కూడా గైజిన్ అనుకున్నారనీ వెల్లడిస్తుంది. తన తల్లి చనిపోయాక, తాను తకాషి కలిసి పెరిగామని ఆమె వివరిస్తుంది. కానీ, సీన్‌ను నీలాతో చూసిన తరువాత, వారిద్దరూ ఎంత సమయం కలిసి గడిపారో తెలుసుకున్న తరువాత, తకాషి సీన్‌ను కొట్టి, నీలాకు దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు. సీన్‌కు తగిలిన దెబ్బలు చూసి కోపం తెచ్చుకున్న నీల సీన్‌తో ఉండడానికి తకాషిని వదిలేస్తుంది.
తకాషి మామయ్య అయిన కమతా, ఒక పెద్ద కేటుగాడు, చట్టవ్యతిరేక ముఠా అయిన యకూజా (సొన్ని చిబా)తో సంబంధం ఉన్నవాడు, అతను తకాషికి పుస్తకాలలో ఏదో తేడా ఉందని, తమని హాన్ డబ్బు విషయంలో మోసం చేస్తూ ఉండి ఉండచ్చనీ చెబుతాడు. తకాషి, హాన్‌ను అతని సమూహాన్ని ఈ తేడా విషయమై ప్రశ్నించి గొడవకు దిగుతాడు, తర్వాత తకాషి ఈ విషయం పై చర్య తీసుకోక ముందే హాన్, సీన్ మరియు నీలా పారిపోతారు. టోక్యో వీధుల్లో ఒక కార్‌చేస్ మొదలవుతుంది, తకాషి అతని కుడి భుజం అయిన మోరిమోటో లు హాన్, సీన్ మరియు నీలా వెంటపడతారు. వెంబడిస్తున్న సమయంలో, హాన్ యొక్క కారు మరో కారుని ఒక కూడలిలో గుద్దుకుని తలక్రిందులయి నిలబడుతుంది. సీన్ మరియు నీలా హాన్ యొక్క మాజ్డా RX-7కు దగ్గరవుతుండగా, గాసొలీన్ లీక్ అయ్యి, ఒక పెద్ద మంటగా మారి కారు పేలిపోతుంది, దానితో హాన్ మృతి చెందుతాడు. తకాషి తోడుదొంగ అయిన మోరిమోటో కూడా మరో కారుతో గుద్దుకున్నపుడు మరణిస్తాడు.
సీన్ మరియు నీలా అతని తండ్రి ఇంటికి వెళ్తారు. అప్పుడు తకాషి సీన్‌ను చంపి నీలాని తీసుకువెళ్ళడానికి వస్తాడు. అతను అలా చేసేముందరే సీన్ యొక్క తండ్రి కల్పించుకుంటాడు. నీలా తనకు తానే స్వచ్ఛందంగా తకాషితో వెళ్ళిపోతుంది. సీన్ అప్పటికే టోక్యోలో చాలా సమస్య తెచ్చిపెట్టినందుకు, అతని తండ్రి అతనిని బట్టలు సర్దుకుని దేశాన్ని వదిలి వెళ్ళమని చెబుతాడు, కానీ సీన్ తాను సృష్టించిన గందరగోళాన్ని తానే శుభ్రం చేసుకునే అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తాడు.
సీన్ ట్వింకీను కలుస్తాడు, ట్వింకీ అతనికి కమతా నుండి హాన్ కొట్టివేసిన ఒక డబ్బు సంచి అందజేస్తాడు. కమతాకు డబ్బు తిరిగి ఇచ్చేయడం ద్వారా సీన్ జరిగిన తప్పుని సరిదిద్దుకుని తకాషిని ఒక "గౌరవపూర్వక రేస్"కు రమ్మని సవాలు విసురుతాడు, అందులో ఎవరు ఓడిపోతే వాళ్ళు పట్టణం వదిలిపోవాలి. రేస్, తకాషికి అనుకూలత ఉన్న టోజ్ (పర్వతపు దారి) మీద జరగాలి, ఎందుకంటే ఒకే ఊపులో క్రిందకు వచ్చిన ఘనత అతనికి ఒక్కడికే ఉంది. మిగిలిన అన్ని కార్లను పోలీసులు జప్తు చేసారు కాబట్టి, సీన్ మరియు అతని జట్టు, తన మొదటి రేస్‌లో సీన్ పాడు చేసిన S15 సిల్వియాలోని ఇంజన్, RB26DETT ఉపయోగిద్దామని నిర్ణయించుకున్నాడు. సీన్, ట్వింకీ మరియు హాన్ యొక్క బృందం అతని తండ్రి యొక్క కారుని అరువు తీసుకుని దాని మీద పని చేద్దామని అనుకుంటారు. అది ఒక నల్లటి 1967 ఫోర్డ్ ముస్టాంగ్ ఫాస్ట్‌బాక్. నిస్సన్ ఇంజన్‌ను అందులోకి మార్చి, కొంత బాగు చేసాక, పర్వతాల మీద టెస్ట్ రన్స్ చేసాక, పాత ముస్టాంగ్ రేస్‌కి పూర్తిగా మార్పులు చెంది సిధ్ధమయ్యింది.
పర్వతాలలో ఒక పొడవాటి రేస్ యుధ్ధం జరిగాక, తకాషి చివరి నిముషపు ప్రమాదం నుండి బ్రతికి బయటపడడం, సీన్ గెలవడం జరుగుతుంది. తకాషి యొక్క ఓటమి అతనికి గొప్ప అవమానాన్ని కలుగచేసాయి, ఎందుకంటే అతను అప్పటికీ సీన్‌ను బయటివాడిగానే భావిస్తాడు. కమతా నువ్వు వెళ్ళచ్చని సీన్‌కు చెబుతాడు మరియు తకాషి బహుశా టోక్యో వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు. నీలా సీన్ దగ్గరికి వచ్చేస్తుంది.
రేస్ జరిగి చాలా కాలం కాకముందు, సీన్ క్రొత్త డ్రిఫ్ట్ కింగ్ అయ్యి, ఒక రోజు కార్‌పార్క్‌లో నీలా మరియు తన బృందంతో కలిసి ఉంటాడు. ట్వింకీ సీన్ దగ్గరికి వచ్చి, ఆసియా అంతా కూడా అందరు రేసర్స్‌ను ఓడిస్తోన్నవాడు ఎవరో అతనికి సవాలు విసరాలనుకుంటున్నాడని చెప్తాడు, దానికి సీన్ ఆ పందెం కాస్తున్నవాడు హాన్ అని తెలుసన్నాకే ఆ సవాలుని స్వీకరిస్తాడు. సీన్ సిల్వర్ ప్లీమత్ రోడ్ రన్నర్ పక్కన ఉన్న తన నిస్సన్ S15 బయటకు తీసి, తనకు సవాలు విసిరిన మిస్టరి డ్రైవర్ ఎవరొ కాదు, డోమినికొ టోరెట్టో అని గుర్తిస్తాడు (ఆ పాత్రని మొదటి చిత్రంలో విన్ డీసెల్ పోషించాడు). హాన్ తనకు U.S.లో మంచి స్నేహితుడు అనీ, తాను రోడ్‌రన్నర్ ను అతని నుండి గెలిచాననీ టోరెట్టో సీన్‌కు చెప్తాడు. నీలా రేస్ మొదలవ్వడానికి నంబర్లు లెక్కబెడుతుంది, దానితో కార్లు మొదటి కార్నర్ నుండి రేస్‌కి బయలుదేరతాయి.
[మార్చు] తారాగణం
- లూకాస్ బ్లాక్ సీన్ బోస్‌వెల్గా చేసాడు, అతను స్ట్రీట్ రేసింగ్ పట్ల మక్కువ గల ఒక యువకుడిగా చేసాడు, అతనిది ప్రధాన పాత్ర.
- ట్వింకీగా బౌ వౌ, టోక్యోలో సీన్ యొక్క మొదటి స్నేహితుడు, అతను అనేక వినియోగదారుల సరుకులను అమ్మేవాడు, అతనే విపత్కరంగా సీన్‌ను డ్రిఫ్ట్ రేసింగ్‌కు పరిచయం చేస్తాడు.
- సీన్‌ను స్నేహితుడిగా చేసుకుని అతనికి డ్రిఫ్ట్ ఎలా చేయాలో నేర్పించిన సుంగ్ కాంగ్‌గా హాన్ ల్యూ, DK యొక్క బిజినెస్స్ పార్ట్నర్ (మరియు డోమినిక్ టోరెట్టో కి పాత స్నేహితుడు.
- బ్రియాన్ టీ తకాషీDKగా చేసాడు అతను సీన్‌కు శత్రువు. అతనిని అత్యుత్తమ డ్రిఫ్ట్ రేసర్‌గా గుర్తించి "డ్రిఫ్ట్ కింగ్" అనే పేరు కూడా పెట్టడం జరిగింది.
- నథాలీ కెల్లీ నీలాగా చేసింది, ఆమె ఒక ఆస్ట్రేలియన్, తకాషికి గర్ల్‌ఫ్రెండ్, తర్వాత సీన్‌ను ప్రేమిస్తుంది.
- జేసన్ టోబిన్ అర్ల్‌గా, హాన్ స్నేహితులలో ఒకడు.
- కీకో కిటాగవా రీకోగా చేసాడు, అర్ల్ యొక్క స్నేహితుడు.
- సోన్ని షీబా కమతాగా చేసాడు, అతను చిత్రంలో తకాషి యొక్క అంకుల్ ఇంకా యకూజాకు నాయకుడు.
- లియొనార్డో నామ్ మోరిమోటోగా చేసాడు, తకాషి యొక్క చ్లోజ్ ఫ్రెండ్ మరియు అతని కుడి భుజం.
- లెఫ్టినెంట్ బోస్‌వెల్‌గా బ్రైయాన్ గుడ్‌మన్, సీన్ యొక్క తండ్రి.
- లిండా బాయ్డ్ Ms. బోస్‌వెల్, సీన్ యొక్క తల్లిగా చేసింది, ఆమె సీన్ తో విసిగిపోయి, అతనిని జపాన్‌లోని టోక్యో నగరానికి తన తండ్రి దగ్గర బ్రతకడానికి పంపిస్తుంది.
- జాఖెరి టై బ్రైయాన్ క్లేగా నటించాడు, సీన్ స్కూల్‌లో ఫుట్‌బాల్ ఆటగాడు, అతనితో సీన్ చిత్రం మొదట్లో రేస్‌కి దిగుతాడు.
- సిండీగా, నిక్కి గ్రిఫ్ఫిన్ చేసింది, ఆమె క్లేకు గర్ల్‌ఫ్రెండ్, ఆమె క్లేకు తనను గెలవడానికి సీన్‌తో పోటీ పడమని చెప్తుంది.
- విన్ డీసెల్ డోమినిక్ టోరెట్టో (గుర్తింపులేని)గా చేసాడు, అతను చిత్రం చివర్లో, అతిధిపాత్రలో కనిపిస్తాడు.
[మార్చు] ఆదరణ
[మార్చు] బాక్స్ ఆఫీస్
చిత్రపు సమీక్షలలో మిశ్రమ ప్రతిస్పందన వచ్చినా కూడా మొదటి వారంలో టోక్యో డ్రిఫ్ట్ బాక్స్ఆఫీస్ కలెక్షన్లు 24 మిలియన్ డాలర్లు వచ్చాయి. చిత్రం జపాన్‌లో పరిమితంగా విడుదల అయ్యింది (వైల్డ్ స్పీడ్ 3 పేరుతో విడుదల అయ్యింది). జనవరి 28, 2007 నాటికి, దేశవాళీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు 6,25,14,415 డాలర్లు ఉండగా, విదేశీ బాక్స్ ఆఫీస్‌నుండి, 9,58,86,987 డాలర్లు వచ్చాయి, ఇది మొత్తం కపిపి 15,84,01,402 డాలర్ల వసూళ్ళకు దారి తీసాయి.[1] టోక్యో డ్రిఫ్ట్ ముందు వచ్చిన చిత్రాల కంటే తక్కువ కలెక్షన్లు వసూలు చేసింది.
[మార్చు] విమర్శనాత్మక ప్రతిస్పందన
చిత్రానికి విమర్శకుల సమీక్షలలో మిశ్రమ ప్రతిస్పందన లభించింది. చిత్రానికి రాటెన్ టొమేటోస్[2] నుండి 34% రేటింగ్ లభించింది, మెటా క్రిటిక్స్‌నుండి 100కి 46 స్కోర్ లభించింది.[3] చికాగో సన్-టైంస్ కు చెందిన రోజర్ ఎబర్ట్ నాలుగు నక్షత్రాలలో మూడు నక్షత్రాలు ఇచ్చి చిత్రాన్ని ప్రశంసించాడు. దర్శకుడు జస్టిన్ లిన్ "అప్పటికే విజయం సాధించిన ఫ్రాంచైజీని తీసుకుని చాలా ఆశ్చర్యకరంగా తాజాగానూ, అనుమానాస్పదంగానూ చిత్రించాడు" అన్నాడు. పైన చెప్పిన దానికి అదనంగా, టోక్యో డ్రిఫ్ట్ , "అనుకున్న దానికంటే చాలా పరిశీలనాత్మకంగా ఉంది" అనీ, "చిత్రపు కధ ఫాస్ట్ కార్ల గురించి మాత్రమే కాదనీ, అంత కన్నా కొంచం ఎక్కువే అర్థం ఉందనీ" చెప్పాడు.[4] బాల్టిమోర్ సన్ కు చెందిన మైఖేల్ స్రాగో "మొదటి అరగంట సేపటి చిత్రం పెడల్ టు మెటల్ (ఆక్సిలరేటర్ పెడల్‌ను కారు మెటల్ దాకా తొక్కిపెట్టడం) చిత్ర నిర్మాణానికి అమర్యాదపూరితమైన క్లాసిక్‌గా నిలిచే అవకాశం ఉంది" అని భావించాడు.[5] ది హాలీవుడ్ రిపోర్టర్ కు చెందిన కిర్క్ హనీకట్ "ఇది ఒక చిత్రం కాదు, నరకం లాంటి స్వారీ" అని చెప్పాడు.[6]
మైఖేల్ మెడ్వెడ్ టోక్యో డ్రిఫ్ట్ కు నాలుగు నక్షత్రాలకు ఒకటిన్నర నక్షత్రాల మార్కులు ఇచ్చి: "ఇందులో అర్థమయ్యే ఇతివృత్తం గానీ భావం కానీ, హాస్యం గానీ లేదు" అన్నాడు.[7] రీల్ వ్యూస్‌కు చెందిన జేంస్ బెరార్డినెల్లి కూడా చిత్రానికి నాలుగు నక్షత్రాలలో ఒకటిన్నర మార్కులు ఇచ్చి: "నేను రేసింగ్ చిత్రం ఉత్పత్తి చేసేదిగా ఉండాలని కోరుకుంటాను. అప్పుడు అది సరిగ్గా ఉంటుంది. ఇతివృత్తం కోసం, ఎవరూ కూడా ఒక వేగవంతమైన, కోపోద్రిక్తమైన చిత్రం చూడరు. కళ్ళతో జుర్రుకునే వాటికి సంబంధించినంత వరకూ, చిత్రం చాలా భేషుగ్గా ఉంది, ఇందులో చాలా మంది భామలు మరియు కార్లూ కనపడతాయి (కార్లను భామలకంటే చక్కగా చూపించారు). కానీ, చిత్రపు ఆక్షన్ సన్నివేశాలు (రేసులు మరియు చేజ్‌లు) తలనొప్పిగానూ, అసంబధ్ధంగానూ ఉన్నాయంటే, ఒప్పుకోలేము. చిత్రము తన అతి ముఖ్యమైన వస్తువు విషయంలో సరిగా ఉండకపోతే చేసేది ఏముంది?".[8]
రిచర్డ్ రూపర్ చిత్రాన్ని ఘాటుగా విమర్శించాడు, "అంతా కూడా అర్థరహితంగా ఉంది. నటన ఎంత భయంకరంగా ఉందంటే, కొన్ని ఏళ్ళ తర్వాత నేను చూసిన చెత్త నటనలలో కొన్ని ఈ చిత్రంలో ఉన్నాయి.[9] అదే విధంగా, రోలింగ్‌స్టోన్ కు చెందిన పీటర్ ట్రావర్స్ టోక్యో డ్రిఫ్ట్ గురించి "చిత్రపు దృక్పథం చాలా అస్పష్టంగా ఉంది, మోటారు లాగినట్లుగానూ, ఇతివృత్తం సెగలు కక్కుతున్నట్లుగానూ ఉంది. స్టార్ కామియో గురించి చూడండి - అది ఒక్కటే ఈ మోపులోనుండి మీకు దక్కే ఆశ్చర్యకరమైన అనుభవం."[10] సాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ కు చెందిన మిక్ లాసల్లె ఇలా అన్నాడు : "ముఖ్య పాత్రకు ఊరికే కార్లను ధ్వంసం చేయాలని, ఒక గూండా యొక్క గర్ల్‌ఫ్రెండ్‌ను పొందాలన్న ఒక గుడ్డి కోరిక తప్ప ఒక ప్రణాళిక లేదు, ఒక దిశ లేదు. [...] రేసింగ్ సీన్‌లకు సంబంధించినంత వరకు వేగంగా వెళ్ళడంతో పోలిస్తే, యుక్తిగా డ్రిఫ్టింగ్ చేయడాన్ని ఎవరు పట్టించుకుంటారు? పార్కింగ్ స్థలాలలో కుర్రాళ్ళ రేసులను ఎవరు చూడాలని కోరుకుంటారు? ఆ విషయానికొస్తే, ఎవరు కుర్రాళ్ళను అనేక మలుపులున్న కొండ మీద నుండి క్రిందకు రేస్ చేయడాన్ని చూడాలనుకుంటారు?"[11]
[మార్చు] అతిథి నటులు
విన్ డీసెల్ డామినిక్ టోరెట్టోగా మళ్ళీ చేసాడు, చిత్రంలో తను హాన్ ఫ్రెండ్‌నని చెప్పుకున్నాడు. 2009 చిత్రం ఫాస్ట్ & ఫ్యూరియస్ , ఆరంభపు సన్నివేశం టోరెట్టోనూ, హాన్‌నూ డొమినికన్ రిపబ్లిక్‌లో ఫ్యూయెల్ టాంకర్స్ హైజాక్ చేయడానికి కలిసి పనిచేసినట్లుగా చూపింది. విన్ ఆ సమయంలో చిత్రంలో నటించలేకపోయాడు కానీ ఒక సారి కనపడగలిగాడు.
ల్యూకాస్ బ్లాక్ పాత్ర (సీన్ బోస్‌వెల్) ఎలా డ్రిఫ్ట్ చేయాలో నేర్చుకుంటున్న సన్నివేశాలలో నిజ జీవితపు "డ్రిఫ్ట్ కింగ్" మరియు డ్రిఫ్ట్ నిపుణుడు అయిన కెయిచి ట్సూచియా ఒక సారి దర్శనమిస్తాడు. అతను సీన్‌కు సరి అయిన డ్రిఫ్త్ పధ్ధతి లేకపోవడాన్ని గురించి ఒక సైడ్ కామెంట్ చేస్తాడు, అది నిస్సందేహంగా ఒక జోకు. అతను ఒక పాత, చేపలు పట్టేవాడిగా కనపడతాడు. డ్రిఫ్ట్ డ్రైవర్ రైస్ మిల్లెన్‌ను అమెరికా నుండి జపాన్‌కు బదిలీ అయ్యేపుడు ఒక జపనీస్ జంటతో మాట్లాడుతూ ఉండగా చూడచ్చు.
పాల్ వాకర్‌ను నటించమని అడిగారు కానీ అతనికి ఇతర ప్రాజెక్ట్‌లు ఉండడం వల్ల త్రోసి పుచ్చాడు. దాంతో యూనివర్సల్, కొత్త నటులను కొత్త స్క్రిప్ట్‌ను తేవాలని నిర్ణయించుకుంది.
[మార్చు] సాంకేతిక వివరాలు:
ఆటోమోటివ్ ఉత్సాహకులచేత, ముస్టాంగ్ మరియు నిస్సాన్ సిల్వియా S15లకు శక్తినిచ్చి, నిస్సాన్ స్కైలైన్ GTRలో కనపడ్డ RB26DETT మోటారు చాలా విమర్శకు గురయ్యింది. RB26ను ముస్టాంగ్ క్రింద మార్చడానికంటే, ఉపరిభాగ సంబంధిత హాని కలిగిన S15ను రిపెయిర్ చేయడం చాలా సులువైన పని అని స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా అసంపూర్తిగా ఉన్న ముస్టాంగ్‌తో S15 యొక్క హై పెర్ఫార్మెన్స్ మార్పులను పోల్చినపుడు ఇది మరింత సరళతరం అవుతుంది. కారుని ఎక్కువసేపు స్క్రీన్‌పైన చూపించకపోవడంతో మరియు ఎప్పుడూ డ్రిఫ్టింగ్ సన్నివేశాలకు ఉపయోగించే స్టంట్ ముస్టాంగ్‌లకు 351cid విండ్‌సర్ V8 ఇంజన్లను ఉపయోగించడంతో ఈ విమర్శలు పెరిగిపోయాయి.[12] హాట్ రాడ్ మాగజీన్ ట్యూనర్స్ జపనీస్ మోటార్లను అమెరికన్ కార్లతో మార్పు చేసే అవకాశం ఉందని చాలా బాధ వ్యక్తం చేసింది.[12] SCC ప్రకారం, ఒక ముస్టాంగ్ RB26 స్వాప్‌ను రిసీవ్ చేసుకుంది, అయిదు ఇతర ముస్టాంగ్‌లను డ్రిఫ్టింగ్ లక్ష్యాల కోసం సృష్టించారు అందులో రెండింటిని ఆ ప్రక్రియలో ధ్వంసం చేసారు.[13] దానితో పాటు, RB26 ముస్టాంగ్‌ను సమయాలు 0-60, 5.38 సెకన్లలోనూ, పావు మైలు 13.36 సెకన్లలోనూ, 109.83 MPH వేగంతోనూ ఉన్నట్లుగా, అంటే V8 చే శక్తినివ్వబడిన కిన్ కంటే కూడా వేగంగా వెళ్తుందని చూపించారు.[14]
కర్మాగారం విడుదల చేసిన లాన్సర్ ఇవల్యూషన్స్ అన్నీ కూడా ఆల్-వీల్-డ్రైవ్ అయినప్పటికీ, చిత్ర నిర్మాతలు ప్రాక్టీస్ సన్నివేశాలలో డ్రిఫ్ట్ స్టంట్లకు, డ్రిఫ్ట్ సన్నివేశాలకూ, హాన్ మరియు తకాషి చేజ్‌లో కొన్ని డ్రిఫ్ట్ సన్నివేశాలకూ ఉపయోగించడం కోసం, కొన్ని ప్రత్యేకంగా తయారు చేసిన ఇవల్యూషన్స్‌ను రేర్-వీల్-డ్రైవ్‌గా మార్చారు.
బ్లాక్ యొక్క పాత్ర జపాన్‌లోని మొదటి రేసులో క్రాష్ చేసిన S15 సిల్వియాకు RB26DETT ఇంజన్ స్వాప్ ఉన్నట్లు చూపారు, దానినే ముస్టాంగ్‌కు విరాళంగా ఇచ్చారు. కానీ, కారు నిజానికి S15 బేస్ SR20DE ఇంజనుచేత శక్తిని పొందింది.[15] వెయిల్‌సైడ్ ఫార్చ్యూన్ బాడి కలిగిన RX-7 మొదట సుంగ్ కాంగ్ యొక్క పాత్రచే నడపబడింది, దానిని మొదటగా 2005 ఆటో సెలాన్ కొరకు, వెయిల్‌సైడ్ తయారు చేసింది. దాని తరువాత యూనివర్సల్ కొని తిరిగి పెయింట్ వేసింది (మొదట దట్టమైన ఎరుపు రంగులో ఉండేది, చిత్రంలో కనపడ్డట్లుగా కమలా పండు రంగు, నలుపు రంగు కాదు).[16]
SCC టోక్యో డ్రిఫ్ట్ చిత్రంలోని కార్లను పరీక్షించి, టోక్యోలోని కార్లు, వేగం పుంజుకునే విషయంలో కొద్దిగా వేగవంతమైనవి అనీ, అవి 2 ఫాస్ట్ 2 ఫ్యూరియస్ కు సరితూగుతాయనీ పేర్కొంది.[17]
రంగంలో మంచి పేరున్న వ్యక్తులయిన కెయిచి షూచియా, రైస్ మిల్లెన్ మరియు సామ్యుఎల్ హూబినెట్టిలను సంప్రదించి వారి సేవలను వినియోగించడం జరిగింది. వారు చిత్రంలో డ్రిఫ్టింగ్ మరియు డ్రైవింగ్ స్టంట్లను అమలు చేసారు.[18] యూనివర్సల్ యొక్క సొంత డ్రైవర్లు ఎవరూ కూడా డ్రిఫ్ట్ చేయలేరని తెలిసినపుడు, టానర్ ఫౌస్ట్, రిచ్ రూథర్‌ఫోర్డ్, కాల్విన్ వాన్, మరియు అలెక్స్ ఫీఫర్‌లను కూడా వినియోగించడం జరిగింది.[19] కొన్ని రేసింగ్ సంఘటనలను లాస్ ఏంజిల్స్‌లోని హాథోర్న్ మాల్ పార్కింగ్ లాట్‌లో చిత్రించారు.[20]
జస్టిన్ లిన్ యొక్క బెటర్ లక్ టుమారో లో నటించిన ఒక పాత హై స్కూల్ ఫ్రెండ్ అయిన రోజర్ ఫాన్‌ను, జపనీస్ సీరీస్‌ను నిర్వహించిన వారినీ, ఇంకా A'PEXiలో అతని మాజీ బాస్‌ను సంప్రదించాక చిత్రంలోని అంశాలను సరిగ్గా చూపించడానికి, తోషి హయామాను కూడా తీసుకు వచ్చారు. అందులో కొన్ని రెఫరెన్సెస్ తనిఖీలో ఉంచడం జరిగింది. నైట్రస్ ఆక్సైడ్‌ను మలుపుల్లో కాకుండా తిన్నగా ఉన్న వాటిల్లో ఉపయోగించడం, స్పోన్సర్స్ నుండి వచ్చే రెఫరెన్సెస్‌ను కనిష్టంగా ఉంచడం మొదలగునవి.).[21] ప్రాప్ కారుని కొంతమంది ఆక్షన్ స్టార్లు "దొంగిలించారని", దానిని ఒక "డ్రిఫ్ట్ సెషన్" కోసం అప్పటికప్పుడు తీసుకు వెళ్ళారనీ తిరిగి ఇవ్వలేదనీ వాదించాడు.[19]
[మార్చు] సౌండ్‌ట్రాక్
- ప్రధాన వ్యాసం: The Fast and the Furious: Tokyo Drift (soundtrack)
[మార్చు] సూచనలు
- ↑ The Fast and the Furious: Tokyo Drift (2006). Box Office Mojo. Amazon.com.
- ↑ The Fast and the Furious: Tokyo Drift reviews. Rotten Tomatoes. Flixster.
- ↑ The Fast and the Furious: Tokyo Drift reviews. Metacritic. CBS.
- ↑ చికాగో సన్-టైమ్‌స్‌లో రోజర్ రాబర్ట్ వ్రాసిన సమీక్ష, జూన్, 16, 2006.
- ↑ మైఖేల్ స్రాగో వ్రాసిన సమీక్ష, బాల్టిమోర్ సన్
- ↑ కిర్క్ హనీకట్‌చే సమీక్ష, ది హాలీవుడ్ రిపోర్టర్
- ↑ మైఖేల్ మెడ్వెడ్ చే సమీక్ష, మైఖేల్‌మెడ్వెడ్.కాం, 21 జూన్ 2006
- ↑ జేమ్‌స్ బెరార్డినెల్లి చే సమీక్ష, రీల్ వ్యూస్
- ↑ రిచర్డ్ రోపర్ చే సమీక్ష, రాటెన్‌టొమేటోస్.కామ్, జులై 18, 2006[dead link]
- ↑ పీటర్ ట్రావర్స్ యొక్క సమీక్ష, రోలింగ్ స్టోన్
- ↑ మిక్ లాసాల్లె యొక్క సమీక్ష, సాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్
- ↑ 12.0 12.1 హాట్ రాడ్ మాగజీన్ "బిల్డ్ ఫాస్ట్. ఫాబ్రికేట్ ఫ్యూరియస్లి." బై జాన్ పియర్లీ హఫ్ఫ్మాన్ జులై 2006 పేజ్. 56-64
- ↑ స్పోర్ట్ కాంపాక్ట్ కార్ "టోక్యో డ్రిఫ్ట్ బై ది నంబర్స్" బై జాన్ పియర్లీ హఫ్ఫ్మాన్ జులై 2006 పేజ్. 92
- ↑ స్పోర్ట్ కంపాక్ట్ కార్ "ఫోర్డ్ ముస్టాంగ్ GT-R; పోని విత్ అ స్కైలైన్'స్ హార్ట్" బై జాన్ పియర్లి హఫ్ఫ్మన్ జులై 2006 పేజ్. 84-86
- ↑ "IGN కార్స్: ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్: టోక్యో డ్రిఫ్ట్ కార్ ఆఫ్ ది డే: హాన్'స్ S15." IGN కార్స్ ఆక్సెస్డ్ జూన్ 19, 2006
- ↑ "IGN కార్స్: ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్: టోక్యో డ్రిఫ్ట్ కార్ ఆఫ్ ది డే: వెయిల్‌సైడ్ RX-7." IGN కార్స్ ఆక్సెస్డ్ జూన్ 19, 2006
- ↑ స్పోర్ట్ కాంపాక్ట్ కార్ "ఫాస్ట్, ఫ్యూరియస్, & డ్రిఫ్టింగ్" బై జాన్ పియర్లీ హఫ్ఫ్మన్ జులై 2006 పేజ్. 56-92
- ↑ The Fast and the Furious: Tokyo Drift Video 1535879. IGN. News Corporation.
- ↑ 19.0 19.1 వొంగ్, జొనాథన్ "ఇంటెరాగేషన్ రూమ్: వాట్స్ అప్, టోషి?" సూపర్ స్ట్రీట్, సెప్టెంబర్ 2006, పేజ్. 116
- ↑ http://www.edmunds.com/insideline/do/Features/articleId=115709 Edmund's Article
- ↑ ఇంటెరాగేషన్ రూమ్: వాట్ అప్, టోషి? బై జొనాథన్ వోంగ్ సూపర్ స్ట్రీట్ సెప్టెంబర్ 2006, పేజెస్ 144-118
[మార్చు] బాహ్య లింకులు
- మూస:IMDB title
- ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్ అధికారిక సైట్
- All articles with dead external links
- Articles with dead external links from September 2010
- Articles with invalid date parameter in template
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్
- 2006 చలన చిత్రాలు
- 2000లలోని ఆక్షన్ చిత్రాలు
- అమెరికా వారి ఆక్షన్ మరియు ఉత్కంఠభరిత చలన చిత్రాలు
- నేర సంబంధితమైన ఉత్కంఠభరిత చిత్రాలు
- ఆటో రేసింగ్ చిత్రాలు
- యకూజా చిత్రాలు
- ఏషియన్ అమెరికన్ చిత్రాలు
- ఆంగ్ల భాషా చిత్రాలు
- ఆరిజోనాలో తీసిన చిత్రాలు
- కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్, లో చిత్రీకరించిన చిత్రాలు
- జపాన్‌లో చిత్రీకరించిన విదేశి చిత్రాలు
- రిలేటివిటీ మీడియా చిత్రాలు
- సీక్వెల్ సినిమాలు
- యూనివర్సల్ పిక్చర్స్ వారి చిత్రాలు
- 1990 ల నేర చిత్రాలు
- 2000 లోని ఉత్కంఠభరిత చలన చిత్రాలు
- టోక్యోలో తీసిన చిత్రాలు