డింకో సింగ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
డింకో సింగ్
Personal information
Full name Ngangim Dingko Singh
Nationality  భారతదేశం
Weight 54 kilograms (119 lb)
Sport
Sport Boxing
Rated at Bantamweight

డింకో సింగ్ (జననం:జనవరి 1 ,1979 )1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకున్న భారత బాక్సింగ్ క్రీడాకారుడు. అతను [1]మణిపూర్ కు చెందినవాడు.

సాధనలు[మార్చు]

1997లో బ్యాంకాక్ లో జరిగిన కింగ్ కప్ గెలుచుకున్నాడు. 1998లో బ్యాంకాక్ లో జరిగిన ఆసియా క్రీడల్లో బంగారుపతకం సాధించాడు. న్గంగిం డింకో సింగ్, డింకో సింగ్ గా సుపరిచితుడు. అతను భారతీయ అత్యుత్తమ బాక్సింగ్ క్రీడాకారులలో ఒకడు. 1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకోవటం అతనికి పేరుప్రతిష్టలు తెచిపెట్టాయి.

ప్రారంభ జీవితం[మార్చు]

అతను జనవరి 1, 1979లో మణిపూర్ లోని ఒక కుగ్రామంలో అతిపేద కుటుంబం నందు జన్మించాడు. డింకో చిన్నతనంలోనే అనాధాశ్రమంలో పెరుగుతూ ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురుకోవలసి వచ్చింది.

జాతీయ బాక్సింగ్[మార్చు]

భారత జాతీయ క్రీడామండలి ప్రవేశపెట్టిన ప్రత్యేక క్రీడల విభాగంలోని శిక్షకులు డింకోలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి నిపుణుడైన మేజర్ ఓ.పి.భాటియా పర్యవేక్షణలో శిక్షణ ఇప్పించారు. తర్వాతి కాలంలో భాటియా భారత జాతీయ క్రీడామండలి యందు ఉన్న జట్టుల విభాగంలో ఎక్స్జిక్యూటివు డైరెక్టర్ గా పనిచేసారు. 1989లో అంబాలలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ను 10 సంవత్సరాల పిన్నవయసులోనే గెలుచుకోవటంతో అతని అత్యుత్తమమైన ప్రతిభాపాటవాలు, అలుపెరుగని శిక్షణకు ఫలితం దక్కినట్లు అయినది. ఈ విజయంతో అతను సెలక్టర్లు, కోచ్ లకు భారత బాక్సింగ్ కు ఆశాజ్యోతిగా కనిపించాడు.

అంతర్జాతీయ బాక్సింగ్[మార్చు]

అతను 1997లో అంతర్జాతీయ బాక్సింగ్ లోకి అడుగుపెట్టి, థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగిన 1997 కింగ్ కప్ ను గెలుచుకున్నాడు. అంతేకాక టోర్నమెంటులో పాల్గొన్న అందరిలోకి అత్యుత్తమ బాక్సర్ గా ప్రకటించబడ్డాడు.

బంగారు అవకాశం[మార్చు]

దేశానికి పతకం తెస్తాడన్న అంచనాలేనప్పటికీ ,1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల బాక్సింగ్ దళంలో స్థానం దక్కించుకున్నాడు. నిజానికి బ్యాంకాక్ విమాన ప్రయాణానికి రెండు గంటల ముందు కూడా అతనికి స్థానం లభిస్తుందో లేదో తెలియదు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడలలో 54 కిలోల బంటాంవెయిట్ బాక్సింగ్ విభాగములో బంగారు పతకం గెలిచి చరిత్ర సృష్టించడంతో, అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని బంగారు అవకాశంగా వర్ణిస్తారు.

బంగారు బాట[మార్చు]

ఈ బంగారు పతకం గెలుచుకునే క్రమములో వాంగ్ ప్రగేస్ సొంటయా అనే థాయిలాండ్ కు చెందిన గొప్ప ఆటగాడని సెమీ ఫైనల్ నందు ఓడించటం అందరిని విస్మయానికి గురిచేసింది. అప్పుడు వాంగ్ ప్రపంచంలోనే 3వ ఆటగానిగా కొనసాగుతున్నాడు. అలాంటి ఒక గొప్ప ఆటగాడిని ఓడించిన డింకో నుంచి భారత ప్రజలు ఇంకా ఎక్కువ విజయాలను ఆశిస్తున్నారు.

అద్భుతమైన క్షణం[మార్చు]

1998 బ్యాంకాక్ ఆసియా క్రీడలలో ఫైనల్ మ్యాచ్ లో ఉజ్బెకిస్థాన్ కి చెందిన సుపరిచితుడైన టిమోర్ తుల్యకోవ్ ను ఓడించిన క్షణం అతని జీవితంలో అద్భుతమైనది గా చెప్పవచ్చు. అప్పుడు టిమోర్ ప్రపంచంలోనే ఉత్తమమయిన ఆటగాళ్లలో 5వ స్థానంలో ఉన్నాడు. అంతకు కొద్ది నెలల ముందే డింకో 51 కేజీల విభాగం నుండి 54 కీజీల విభాగంలోకి మారినప్పటికీ, బంగారుపతకం గెలుచుకున్నాడు. దీనితో ఆ విజయం అతనికి మరింత మెప్పును ప్రసాదించినది. మ్యాచ్ లో అతని ప్రత్యర్ది కన్నా మెరుగయిన ఆటతీరు ప్రదర్శించటంతో టిమోర్ నాలుగవ రౌండు లోనే ఓటమితో నిష్క్రమించవలసి వచ్చింది.

అవార్డులు మరియు గౌరవాలు[మార్చు]

డింకోకు గల ప్రతిభాసామర్ద్యాలు, ఉత్తమమయిన ఆట తీరు మరియు బాక్సింగ్ లో అతను దేశానికి చేసిన సేవలకు గాను 1998లో డింకోకు అర్జున అవార్డు లభించింది.

సూచనలు[మార్చు]

  1. S. Rifaquat, Ali (November 13, 1999). "India's most volatile pugilist". The Tribune. Retrieved 20 November 2009.