డీప్ పర్పుల్
| Deep Purple | |
In 2004, from left to right, Roger Glover, Ian Paice, Ian Gillan, Don Airey and Steve Morse |
|
| నేపథ్యం | |
|---|---|
| మూలం | Hertford, England, U.K. |
| సాహిత్యం | Hard rock, heavy metal, blues-rock, progressive rock |
| క్రియాశీలక కాలం | 1968–1976 1984–present |
| రికార్డు కంపెనీలు | Edel, EMI, BMG, Polydor, Warner Bros., Tetragrammaton, Aquarius |
| సంబంధిత కార్యక్రమాలు | Rainbow, Whitesnake, Green Bullfrog, Gillan, Paice, Ashton & Lord, Black Sabbath, Blackmore's Night, Episode Six, Screaming Lord Sutch, Captain Beyond, Dixie Dregs, Coverdale and Page, Trapeze, Fandango, Black Country |
| వెబ్ సైటు | www.deeppurple.com |
| Members | |
| Ian Gillan Steve Morse Roger Glover Ian Paice Don Airey |
|
| Past members | |
| see list of Deep Purple band members | |
డీప్ పర్పుల్ అనేది 1968లో హెర్ట్‌ఫోర్డ్‌లో ఏర్పాటు చేసిన ఒక ఇంగ్లీష్ హార్డ్ రాక్ బ్యాండ్.[1] బ్యాండ్ సభ్యులు కొందరు తమను ఏదో ఒక సాహిత్య శైలిగా వర్గీకరించరాదని ప్రయత్నించినప్పటికీ, లెడ్ జెప్పిలిన్ మరియు బ్లాక్ సబ్బాత్‌లతో పాటు దీనిని అగ్రగామి హెవీ మెటల్ మరియు ఆధునిక హార్డ్ రాక్ బ్యాండ్‌లలో ఒకటిగా పరిగణించారు.[2] ఈ బ్యాండ్ శాస్త్రీయ సంగీతం, బ్లూస్-రాక్ (విలాపగీతాలు), పాప్ మరియు ప్రోగ్రెసివ్ రాక్ విభాగాలను కూడా కలిగి ఉంది.[3] ఇది ప్రపంచంలోనే పెను శబ్దం కలిగిన బ్యాండ్,[3][4][5]గా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ ఆల్బమ్‌లు విక్రయించబడ్డాయి.[6][7][8][9] VH1 యొక్క విశిష్ట హార్డ్ రాక్ కళాకారుల ప్రోగ్రామ్‌లో డీప్ పర్పుల్ బ్యాండ్ #22 ర్యాంకు పొందింది.[10]
సభ్యుల అమరిక (లైనప్)పరంగా బ్యాండ్ పలుమార్లు మార్పులు చేర్పులు చేపట్టింది. ఎనిమిదేళ్ల విరామం (1976–84) కూడా తీసుకుంది. 1968–76 మధ్యకాలంలోని లైనప్‌లను సాధారణంగా మార్క్ I, II, III మరియు IVగా గుర్తించారు.[11][12] ఇయాన్ గిల్లాన్(పాటలు), రిట్చీ బ్లాక్‌మోర్ (గిటారు), జాన్ లార్డ్ (కీబోర్డులు), రోజర్ గ్లోవర్ (బాస్) మరియు ఇయాన్ పైస్ (డ్రమ్స్) వారి యొక్క రెండోది మరియు అత్యంత విజయవంతమైన లైనప్ (సభ్యుల అమరిక)గా పేర్కొనబడింది.[5] ఈ లైనప్ 1969 నుంచి 1973 వరకు క్రియాశీలకంగా వ్యవహరించింది. అలాగే బ్లాక్‌మోర్ మరియు ఇతర సభ్యుల మధ్య వివాదం తారాస్థాయికి చేరక ముందు అంటే 1984 నుంచి 1989 వరకు మరియు తిరిగి 1993లో ఈ బ్యాండ్ పునరుద్ధరించబడింది. 2002లో లార్డ్ వైదొలగిన తర్వాత బ్యాండ్‌ను విడిచిపెట్టని ఏకైక వాస్తవిక సభ్యుడుగా పైస్ అవతరించినా, ప్రస్తుత లైనప్‌లో గిటారిస్ట్ స్టీవ్ మోర్స్ సుస్థిరంగా ఉన్నాడు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
[మార్చు] డీప్ పర్పుల్ పూర్వ సంవత్సరాలు (1967–68)
1967లో సెర్చర్స్ మాజీ డ్రమ్మర్ క్రిస్ కర్టిస్ బహుశా రౌండ్‌ఎబౌట్ పేరుతో ఒక బ్యాండ్‌ను నిర్వహించగలననే నమ్మకంతో లండన్ వ్యాపారవేత్త టోనీ ఎడ్వర్డ్స్‌ను కలిశాడు. బ్యాండ్‌కు ఈ పేరును ప్రతిపాదించడానికి కారణం సభ్యులు ఒక సంగీత రంగుల రాట్నం మాదిరిగా ఒక క్రమం అంటూ లేకుండా ఉండటం. అతని ఆలోచన నచ్చడంతో ఇద్దరు వ్యాపార భాగస్వాములు జాన్ కోలెట్టా మరియు రాన్ హైర్ (హైర్-ఎడ్వర్డ్స్-కోలెట్టా-HEC ఎంటర్‌ప్రైజెస్)తో కలిసి పెట్టుబడి పెట్టడానికి ఎడ్వర్డ్స్ సుముఖత వ్యక్తం చేశాడు.
ఈ దిశగా తొలుత శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన హమ్మాండ్ ఆర్గాన్ ప్లేయర్ జాన్ లార్డ్‌కు అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా ది ఆర్ట్‌వుడ్స్ (కీఫ్ హార్ట్‌లీ కలిగిన భవిష్యత్ రోలింగ్ స్టోన్స్ బ్యాండ్ గిటారిస్ట్ రూనీ వుడ్ సోదరుడైన ఆర్ట్ వుడ్‌కు చెందినది) బ్యాండ్ ద్వారా అతను సుపరిచితుడు. అతని తర్వాత సెషన్ గిటారిస్ట్ రిట్చీ బ్లాక్‌మోర్‌కు అవకాశం కల్పించారు. కొత్త గ్రూపు ఆడిషన్ (ఎంపిక ప్రక్రియ) కోసం హంబర్గ్ నుంచి తిరిగొచ్చేలా అతన్ని ఒప్పించడం జరిగింది. కర్టిస్ బ్యాండ్‌కు స్వస్తి పలికిన వెంటనే HEC ఎంటర్‌ప్రైజెస్ మరియు లార్డ్, బ్లాక్‌మోర్ మాత్రం కార్యకలాపాలను కొనసాగించేందుకే నిర్ణయించుకున్నారు.
బాస్ గిటారును వాయించడానికి లార్డ్ తన పాత మిత్రుడు నిక్ సింపర్ పేరును సిఫారసు చేశాడు. 1967కు ముందు ది ఫ్లవర్ పాట్ మెన్ అండ్ దెయిర్ గార్డెన్ (గతంలో ది ఐవీ లీగ్) బ్యాండ్ తరపున లార్డ్ అతనితో కలిసి పనిచేశాడు. (డీప్ పర్పుల్ మాత్రమే కాక) జానీ కిడ్ అండ్ ది పైరేట్స్ రాక్ బ్యాండ్ తరపున పనిచేయడం మరియు కిడ్ మరణానికి కారణమైన కారు దుర్ఘటనలో తాను కూడా ఉండటంతో సింపర్ బాగా ప్రాచుర్యం పొందాడు. అంతేకాక అతను బ్లాక్‌మోర్‌తో కలిసి పనిచేసిన స్క్రీమింగ్ లార్డ్ సట్చ్‌కి చెందిన ది సావేజెస్ రాక్ బ్యాండ్ సభ్యుడు కూడా.
ది మేజ్ కు చెందిన గాయకుడు రాడ్ ఎవాన్స్ మరియు డ్రమ్మర్ ఇయాన్ పైస్ ద్వారా లైనప్ ప్రక్రియ పరిసమాప్తమయింది. 1968 వసంతంలో డెన్మార్క్ పర్యటన తర్వాత, బ్యాండ్‌కు డీప్ పర్పుల్ అనే కొత్త పేరును బ్లాక్‌మోర్ ప్రతిపాదించాడు. అది అతని అవ్వకు బాగా నచ్చిన పాట.
[మార్చు] మలుపు (1968–70)
అక్టోబరు, 1968లో జో సౌత్ యొక్క ప్రధాన పాట "హష్" ద్వారా ఈ బ్యాండ్ తొలి విజయం సాధించింది. ఇది US బిల్‌బోర్డ్ చార్టులో #4ను మరియు కెనడియన్ RPM చార్ట్స్‌లో #2ను ఆక్రమించింది. ఈ పాట బ్యాండ్ యొక్క అరంగేట్ర ఆల్బమ్ షేడ్స్ ఆఫ్ డీప్ పర్పుల్ నుంచి తీసుకోబడింది. అలాగే బ్యాండ్ యొక్క గుడ్‌బై పర్యటన సందర్భంగా క్రీమ్‌కు మద్దతు కోసం వారు ఎంపికయ్యారు.
బ్యాండ్ రెండో ఆల్బమ్ ది బుక్ ఆఫ్ తాలీసిన్ (నీల్ డైమండ్ యొక్క ప్రధాన పాట "కెంటకీ ఉమన్" సహా) తమ పర్యటన సమయంలోనే అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో విడుదలయింది. ఇది బిల్‌బోర్డ్ చార్టులో #38ను మరియు RPM చార్టుల్లో #21ని ఆక్రమించింది. మరుసటి ఏడాది వరకు ఇది తమ స్వదేశంలో విడుదల కాకపోయినా, విశేష ఆదరణ పొందటం గమనార్హం. 1969లో బ్యాండ్ తమ మూడో ఆల్బమ్ డీప్ పర్పుల్ ను విడుదల చేసింది. ఇందులోని ఒక పాట ("ఏప్రిల్")ను స్ట్రింగ్‌లు మరియు వుడ్‌వైండ్ పరికరాలతో రూపొందించారు. వివిధ ప్రభావాలు స్పష్టంగా గోచరించాయి. ప్రత్యేకించి, వానిల్లా ఫడ్జ్ (తమ గ్రూపు ఒక "వానిల్లా ఫడ్జ్ క్లోన్" కావాలనుకుంటోందని బ్లాక్‌మోర్ పేర్కొన్నాడు[13]) మరియు బాష్, రిమ్‌స్కై-కోర్సకోవ్ వంటి లార్డ్ యొక్క శాస్త్రీయమైన పూర్వగాముల ప్రభావం కూడా విపరీతంగా ఉంది.
ఈ మూడు ఆల్బమ్‌లు మరియు అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించిన తర్వాత వారి అమెరికా రికార్డింగ్ కంపెనీ టెట్రాగ్రామేషన్ వ్యాపార కార్యలకాపాల నుంచి తప్పుకుంది. దాంతో బ్యాండ్‌కు ఆర్థిక సాయం లేక దాని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. (టెట్రాగ్రామేషన్ ఆస్తులను వార్నర్ బ్రదర్స్ రికార్డ్స్ హస్తగతం చేసుకుంది. 1970ల్లో డీప్ పర్పుల్ రికార్డులను ఇది US అంతటా విడుదల చేసింది) 1969 ప్రారంభంలో ఇంగ్లాండ్‌కు తిరిగొచ్చాక, ఎవాన్స్ మరియు సింపర్‌ను తొలగించడానికి ముందు, ఎవాన్స్ మోహించడానికి ప్రయత్నించిన సంగీత విభావరి హెయిర్ యొక్క అప్పటి సభ్యుడు ఎమ్మారెట్టా మార్క్స్ పేరు మీద "ఎమ్మారెట్టా" పాటను బ్యాండ్ రికార్డు చేసింది.
గాయకుడిని మార్చాలని అన్వేషిస్తున్న సమయంలో 19 ఏళ్ల గాయకుడు టెర్రీ రీడ్‌ను బ్లాక్‌మోర్ గుర్తించాడు. ఏడాది ముందు కొత్తగా ఏర్పడిన లెడ్ జెప్పిలిన్ బ్యాండ్ తరపున వచ్చిన అదే విధమైన అవకాశాన్ని అతను తోసిరాజన్నాడు. తనకు వచ్చిన అవకాశం "ప్రయోజనకరం"గా ఉన్నప్పటికీ, రీడ్ తన నిర్మాత మిక్కీ మోస్ట్‌తో కుదుర్చుకున్న ప్రత్యేకమైన రికార్డింగ్ ఒప్పందానికి ఇప్పటికీ కట్టుబడ్డాడు. అతను ఒంటరిగా రాణించడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడు.[14] తనకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో బ్లాక్‌మోర్ మరొకరి కోసం అన్వేషించాడు.
ఎపిసోడ్ సిక్స్ బ్యాండ్‌కు చెందిన గాయకుడు ఇయాన్ గిల్లాన్ కోసం డీప్ పర్పుల్ అన్వేషించింది. ఎపిసోడ్ సిక్స్ UKలో వివిధ పాటలు విడుదల చేసింది. అయితే అవి ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ వాణిజ్య విజయం సాధించలేదు. సిక్స్ డ్రమ్మర్ మరియు సావేజెస్ రోజుల నుంచి బ్లాక్‌మోర్‌కు మిత్రుడైన మిక్ అండర్‌వుడ్ మరియు బాసిస్ట్ వెండీ జెస్సాప్ పరిచయమయ్యారు. అండర్‌వుడ్ తీవ్రమైన పశ్చాత్తాపానికి గురయ్యాడు. అది సుమారు దశాబ్దికాలం పాటు అంటే 1970ల చివర్లో పర్పుల్ తదనంతరం ఏర్పాటు చేసిన కొత్త బ్యాండ్ కోసం అతనికి గిల్లాన్ అవకాశం కల్పించేంత వరకు.
తద్వారా నాణ్యతకు ఓ మచ్చుతునకగా డీప్ పర్పుల్ మార్క్ II లైనప్ రూపొందింది. ఇది తొలుత అపవిత్రమైన "హల్లేలుజా" పేరుతో గ్రీన్‌అవే-కుక్ ట్యూన్‌ను విడుదల చేసింది. అయితే ఇది విఫలమైంది.
తర్వాత కన్సెర్ట్ ఫర్ గ్రూప్ అండ్ ఆర్కెస్ట్రా ద్వారా బ్యాండ్ అవసరమైన ప్రజాదరణ చూరగొంది. త్రి గమన (ముగ్గురు వాద్యకారులు మాత్రమే) మహాకావ్యమైన దీనిని ఏకైక ప్రాజెక్టుగా లార్డ్ స్వరపరిచాడు. రాయల్ అల్బర్ట్ హాల్‌లో రాయల్ ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి బ్యాండ్ దీనిని ప్రదర్శించింది. దీనిని మాల్కమ్ ఆర్నాల్డ్ నిర్వహించాడు. ది నైస్‌కి చెందిన ఫైవ్ బ్రిడ్జెస్ తో కలిసి నిర్వహించిన ఇది ఒక రాక్ బ్యాండ్ మరియు ఒక ఆర్కెస్ట్రా మధ్య భాగస్వామ్యంగా పేరుగాంచింది. ఆ సమయంలో డీప్ పర్పుల్ యొక్క పలువురు సభ్యులు (ప్రత్యేకించి, బ్లాక్‌మోర్ మరియు గిల్లాన్) అసంతృప్తి చెందారు. తమ గ్రూపును ఒక హార్డ్-రాకింగ్ శైలిలో మరింత పటిష్టం చేయాలని వారు భావించారు. అయితే "వాద్యబృందాలతో కలిసి ప్రదర్శనలు ఇచ్చే ఒక గ్రూపు"గా అది పేరుతెచ్చుకోవడం పట్ల వారు నిరాశ చెందారు. ఇలాంటి అనుభవం ఎదురైనప్పటికీ, 1970 చివర్లో లార్డ్ రాసిన పాటలను జెమిని సూట్ అనే మరో ఆర్కెస్ట్రా/గ్రూపు భాగస్వామ్యంతో బ్యాండ్ రికార్డు చేసింది.
[మార్చు] పేరుప్రఖ్యాతులు మరియు విభజన(1970–76)
ఆర్కెస్ట్రా సంబంధిత విడుదల తర్వాత బ్యాండ్ వెంటనే ఒక భారీ పర్యటన మరియు రికార్డింగ్ షెడ్యూల్‌కు ఉపక్రమించింది. అది మరో మూడేళ్ల పాటు బ్యాండ్‌కు కొంత ఉపశమనం కలిగించింది. 1970 మధ్యకాలంలో బ్యాండ్ విడుదల చేసిన తొలి స్టూడియో ఆల్బమ్ ఇన్ రాక్ (వాద్య బృందం (కన్సెర్ట్) నుంచి రాక్ ఆల్బమ్‌ను దూరం చేయడానికి ఉద్దేశ్యపూర్వకంగా ఈ పేరును ఎంపిక చేశారు[citation needed]). ఇందులో అప్పటి కచ్చేరీకి సంబంధించిన "స్పీడ్ కింగ్", "ఇన్‌టు ది ఫైర్" మరియు "చైల్డ్ ఇన్ టైమ్" పొందుపరచబడినవి. అంతేకాక ఈ బ్యాండ్ UK టాప్ టెన్ పాటగా నిలిచిన "బ్లాక్ నైట్"ను కూడా విడుదల చేసింది. బ్లాక్‌మోర్ గిటారు, లార్డ్ యొక్క వక్రీకృత అవయవం మధ్య జరిగిన అంతర్గత చర్య మరియు గిల్లాన్ అద్భుతమైన పాటలు, గ్లోవర్, పైస్‌ల లయ కలయిక ద్వారా డీప్ పర్పుల్ విశిష్ట గుర్తింపు పొందింది. అలాగే ఐరోపా వ్యాప్తంగా ఉన్న రాక్ అభిమానుల్లో విపరీతమైన ఆదరణను చూరగొంది[citation needed].
శ్రావ్యమైనమూస:Or మరియు సృజనాత్మకంగా పురోగామియైన రెండో ఆల్బమ్ ఫైర్‌బాల్ (గిల్లాన్ తప్ప మిగిలిన బ్యాండ్ సభ్యులకు నచ్చనిది[citation needed]) 1971 వేసవిలో విడుదలయింది. "స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ ఉమన్" మాదిరిగా టైటిల్ ట్రాక్ "ఫైర్‌బాల్" ఒక సింగిల్‌గా విడుదలయింది. ఇది ఆల్బమ్ నుంచి కాకపోయినా అదే సెషన్ల సమయంలోనే రికార్డు చేయబడింది (ఇది UK వెర్షన్ యొక్క "డెమాన్స్ ఐ" పాటకు బదులు ఆల్బమ్ యొక్క US వెర్షన్‌లో చోటు చేసుకుంది).
ఫైర్‌బాల్ యొక్క విడుదల జరిగిన కొద్ది వారాల్లోనే తదుపరి ఆల్బమ్‌కు ఉద్దేశించిన పాటలను ప్రదర్శించడం బ్యాండ్ అప్పటికే ప్రారంభించింది. ఒక పాట (తర్వాత అది "హైవే స్టార్"గా మారింది) ఫైర్‌బాల్ పర్యటన యొక్క తొలి బుకింగ్ ద్వారా ప్రదర్శించబడింది. పోర్ట్‌స్మౌత్‌లో ప్రదర్శనకు బయలుదేరిన బస్సుపై ఒక పాత్రికేయుడి యొక్క "పాటల రచనకు నీవు ఏం చేస్తావు?" అనే ప్రశ్నకు సమాధానం రాయబడింది. మూడు నెలల తర్వాత, డిసెంబరు, 1971లో మెషిన్ హెడ్ రికార్డింగ్ కోసం బ్యాండ్ స్విట్జర్లాండ్ బయలుదేరింది. రోలింగ్ స్టోన్స్ మొబైల్ స్టూడియోని ఉపయోగించి మాంట్రియక్స్‌లోని ఒక జూదశాల (క్యాసినో)లో ఈ ఆల్బమ్ రికార్డు చేయాల్సి ఉంది. అయితే ఫ్రాంక్ జప్పా మరియు మదర్స్ ఆఫ్ ఇన్వెన్షన్ ప్రదర్శన సందర్భంగా జూదశాల అగ్నిప్రమాదానికి గురైంది. దాంతో ఈ ఆల్బమ్‌ను చివరికి సమీపంలో ఖాళీగా ఉన్న ఒక గ్రాండ్ హోటల్‌లో రికార్డు చేశారు. ఈ సంఘటన "స్మోక్ ఆన్ ది వాటర్" అనే పాటకు ప్రేరణగా నిలిచింది. ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి ప్లేర్ గన్ ద్వారా పైకప్పులో మంటలు సృష్టించడాన్ని తాను కళ్లారా చూశానని గిల్లాన్ పేర్కొనడం మదర్స్‌కు చెందిన మార్క్ వోల్మన్ ఈ విధంగా వ్యాఖ్యానించడానికి ప్రేరణ కలిగించింది, "వ్యక్తిగతంగా ఆర్థర్ బ్రౌన్"!
గత ఆల్బమ్‌లను ముగించిన చోటు నుంచి కొత్త వాటి రికార్డింగ్‌పై బ్యాండ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా రికార్డు చేసిన మెషిన్ హెడ్ ఆల్బమ్ బ్యాండ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందినదిగా పేరుగాంచింది. అందులో "హైవే స్టార్", "స్పేస్ ట్రక్కిన్'", "లేజీ" మరియు "స్మోక్ ఆన్ ది వాటర్" వంటివి ఇప్పటికీ కళాత్మకమైన పాటలుగా నిలిచిపోయాయి. ఇక డీప్ పర్పుల్ పాట అత్యంత ప్రసిద్ధిగాంచింది. ముప్పై ఏళ్ల కాలంలో అరుదైన విధంగా డీప్ పర్పుల్ పర్యటనలను కొనసాగించడం మరియు రికార్డింగ్ కార్యక్రమాలు చేపట్టింది. మెషిన్ హెడ్ రికార్డు చేసినప్పుడు, ఈ గ్రూపు మూడున్నరేళ్లుగా మాత్రమే కలిసుంది. అప్పటికి అది వారి ఏడో LP. మరోవైపు 1972లో నాలుగు ఉత్తర అమెరికా పర్యటనలు మరియు డబుల్-వినైల్ లైవ్ రిలీజుకు దారితీసిన జపాన్ ఆగస్టు టూర్ మేడ్ ఇన్ జపాన్ ను బ్యాండ్ చేపట్టింది. నిజానికి దీనిని జపాన్ భాషలో మాత్రమే రికార్డు చేయాలని అనుకున్నారు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలై, తద్వారా డబుల్ LP అనూహ్య విజయం సాధించింది. ఇది ఒకానొక రాక్ సంగీతం యొక్క అత్యంత ఆదరణ పొందిన మరియు అత్యధికంగా అమ్ముడైన ప్రత్యక్ష కచేరి రికార్డింగ్స్‌గా నిలిచింది (ఆ సమయంలో కొన్ని సందర్భాల్లో దీనికి తక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. అయితే గ్లోవర్ మరియు పైస్ మాత్రమే దీనిని మిక్స్ చేయడానికి నడుం బిగించారు).
డీప్ పర్పుల్ మార్క్ II లైనప్ కలిసి పనిచేయడం కొనసాగించింది. హూ డు వుయ్ థింక్ వుయ్ ఆర్ (1973) అనే ఆల్బమ్‌ను విడుదల చేసింది. ఇందులో "ఉమన్ ఫ్రమ్ టోక్యో" అనే హిట్ పాట కూడా ఉంది. అయితే అంతర్గత ఉద్రిక్తతలు మరియు క్షయం మునుపెన్నడూ లేని విధంగా హెచ్చుమీరాయి. బ్యాండ్ నుంచి గిల్లాన్ వైదొలగడం ద్వారా దురభిప్రాయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 1973 వసంతంలో వారు రెండోసారి జపాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా గిల్లాన్ మరియు బ్లాక్‌మోర్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ సంఘటన నేపథ్యంలో గిల్లాన్ తప్పుకున్నాడు. ఆడిషన్లను నిర్వహించారు. ప్రాధమికంగా ఇద్దరు ఎంపికయ్యారు. అందులో ఒకరు స్కాట్లాండ్‌కు చెందిన ఏంగస్ కేమరూన్ మెక్‌కిన్లే మరియు డేవిడ్ కవర్‌డాలే. గంభీరమైన స్వరం లేని కారణంగా ఏంగర్‌ను తొలగించారు.[citation needed]. చివరకు ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని సాల్ట్‌బర్న్‌కి చెందిన అనామక గాయకుడు కవర్‌డాలే మరియు మిడ్‌ల్యాండ్స్‌కి చెందిన బాసిస్ట్/గాయకుడు గ్లెన్ హ్యూస్‌లను ఎంపిక చేసుకున్నారు. హ్యూస్ గతంలో ట్రాపీజ్ ఆర్టిస్ట్. హ్యూస్‌ను తొలుత ఎంపిక చేసుకున్న తర్వాత అతన్ని బాసిస్ట్ మరియు గాయకుడిగా ఉపయోగించుకుని, నాలుగు సభ్యుల ప్రదర్శనలు ఇవ్వడంపై చర్చించారు.[15] ఈ కొత్త లైనప్ బ్లూస్-రాక్ ఆల్బమ్ బర్న్ విడుదల వరకు అంటే 1974 వరకు కొనసాగింది. ఇది మరో విజయవంతమైన ఆల్బమ్ మరియు ప్రపంచ పర్యటన. హ్యూస్ మరియు కవర్‌డాలే ఇద్దరూ బ్యాండ్ సంగీతానికి శ్రావ్యమైన గీతాలను మరియు మరింత అసహ్యమైన అంశాన్ని[citation needed] జోడించారు. ఇది 1974 చివర్లో విడుదలైన స్టార్మ్‌బ్రింజర్ లో మరింత స్పష్టంగా కన్పించింది. టైటిల్ పాటే కాక ఈ ఆల్బమ్‌లో పలు పాటలున్నాయి. ఇవి రేడియో శ్రోతలను ఎంతగానో అలరించాయి. వాటిలో "లేడీ డబుల్ డీలర్", "ది జిప్సీ" మరియు "సోల్జర్ ఆఫ్ ఫార్చ్యూన్" వంటివి ప్రధానమైనవి. అయితే బ్లాక్‌మోర్ మాత్రం ఈ ఆల్బమ్ మరియు డీప్ పర్పుల్ యొక్క గతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతను ఇలా అన్నాడు, "అసహ్యమైన సంగీతాన్ని నేను ఇష్టపడను."[16] ఫలితంగా, Elfకి చెందిన రూనీ జేమ్స్ డియోతో కలిసి రిట్చీ బ్లాక్‌మోర్స్ రెయిన్‌బో పేరుతో సొంతంగా ఒక కొత్త బ్యాండ్‌ను ఏర్పాటు చేయడానికి 1975 వసంతంలో బ్లాక్‌మోర్ డీప్ పర్పుల్‌ను వీడాడు. ఒక్క ఆల్బమ్‌ను విడుదల చేసిన తర్వాత బ్యాండ్ పేరును రెయిన్‌బోగా కుదించారు.
బ్లాక్‌మోర్ బయటకు వెళ్లడంతో రాక్ మ్యూజిక్ పరంగా ఒక దిగ్గజ బ్యాండ్ సభ్యుడు ఖాళీని భర్తీ చేయాల్సిన పరిస్థితి డీప్ పర్పుల్‌కు ఏర్పడింది. అయినప్పటికీ, మిగిలిన బ్యాండ్ సభ్యులు ప్రదర్శనల నిలుపుదలకు నిరాకరించారు. చిరకాల అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా "మార్చలేని" బ్లాక్‌మోర్ స్థానంలో టామీ బోలిన్‌ను బ్యాండ్ ప్రకటించింది.
అయితే బోలిన్‌ను ఎంపిక చేయడం వెనుక కనీసం రెండు రకాల వాదనలున్నాయి: బోలిన్‌కు ఎంపిక పరీక్ష (ఆడిషన్) నిర్వహించమని సిఫారసు చేసినట్లు కవర్‌డాలే చెప్పాడు.[17] "అతను లోపలికి ప్రవేశించాడు, పోకిరి మాదిరిగా సన్నగా ఉన్నాడు, అతని కేశాలు పచ్చ, పసుపు మరియు నీలం రంగులో ఉన్నాయి. అందులో ఈకలున్నాయి. అతని పక్కనే నడుస్తూ కనిపించిన హవాయి అమ్మాయి అల్లిన దుస్తులను ధరించి ఉంది. అయితే ఆమె కింది భాగంలో మాత్రం ఏమీ లేదు. అతను నాలుగు మార్షల్ 100-watt గొట్టాల్లోకి ప్రవేశించాడు...అదే అతని పని". అయితే నిజానికి జూన్, 1975లో మెలోడీ మేకర్ ప్రచురించిన ఒక ఇంటర్వూ ప్రకారం, బ్లాక్‌మోర్ సిఫార్సు ద్వారానే తాను ఆడిషన్‌కు వచ్చానని బోలిన్ పేర్కొన్నాడు.[18] బోలిన్ ప్రస్తుతం అంతా మరిచిపోయిన 1960ల చివర్లోని డెన్నీ & ది ట్రింప్స్, అమెరికన్ స్టాండర్డ్ మరియు 1969-72 మధ్యకాలంలో మూడు ఆల్బమ్‌లు విడుదల చేసిన జెపిర్ వంటి పలు బ్యాండ్‌ల తరపున పనిచేశాడు. డీప్ పర్పుల్‌కు ముందు బిల్లీ కోబమ్ యొక్క 1973 నాటి జాజ్ ఫ్యూజన్ ఆల్బమ్ స్పెక్ట్రమ్ తరపున సెషన్ సంగీత విద్వాంసుడుగా బోలిన్ పలు ప్రసిద్ధ రికార్డింగ్‌లు చేశాడు. అలాగే రెండు జేమ్స్ గ్యాంగ్ ఆల్బమ్‌లు బ్యాంగ్ (1973) మరియు మియామి (1974) కోసం జో వాల్ష్ స్థానంలోనూ పనిచేశాడు. డాక్టర్.జాన్, అల్బర్ట్ కింగ్, ది గుడ్ ర్యాట్స్ మోక్సీ మరియు అల్ఫోన్స్ మౌజాన్ వంటి నిష్ణాతులతోనూ అతను కలిసి పనిచేశాడు. అలాగే డీప్ పర్పుల్‌లో చేరడానికి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించిన సమయంలో అతను తన ఒంటరి ఆల్బమ్ ట్రెజర్ పనుల్లో తలమునకలై ఉన్నాడు.
ఫలితంగా కమ్ టేస్ట్ ది బ్యాండ్ అనే ఆల్బమ్ అక్టోబరు, 1975లో విడుదలయింది. దీనికి మిశ్రమ సమీక్షలు వచ్చినా, కలెక్షన్ (పాటల మిశ్రమం) బ్యాండ్ తిరిగి పుంజుకునేలా చేశాయి. తద్వారా వారి హార్డ్ రాక్ శబ్దానికి కొత్త, తీవ్రమైన స్థితి[citation needed] కలిగింది. గిటారిస్ట్ బోలిన్ ప్రభావం కీలకమైంది. హ్యూస్ మరియు కవర్‌డాలే ప్రోత్సాహంతో అతను బ్యాండ్‌కు విశేష సేవలు అందించాడు. తర్వాత, బోలిన్ మాదకద్రవ్యాలకు బానిసైన విషయం బ్యాండ్ సభ్యులకు అర్థమైంది. ఫలితంగా పలు ప్రదర్శనలను రద్దు చేసుకున్నారు. అలాగే ఆశించిన స్థాయిలో కచేరిలు ఇవ్వలేకపోయారు. ఫలితంగా బ్యాండ్ ఉనికి ప్రమాదంలో పడింది.
[మార్చు] బ్యాండ్ విభజన, ఇతర ప్రాజెక్టులు (1976–84)
మార్చి, 1976లో బ్రిటన్ పర్యటన సందర్భంగా అక్కడ లివర్‌పూల్ ఎంపైర్ థియేటర్‌లో ప్రదర్శనప్పుడు బ్యాండ్ విభజన ఏర్పడింది. కంటతడితో వేదిక నుంచి వెళ్లిపోయిన కవర్‌డాలే తన రాజీనామాను సమర్పించినట్లు తెలిసింది. వైదొలగడానికి బ్యాండ్ అంటూ ఏమీ లేదని అతను వ్యాఖ్యానించాడు. అసలు డీప్ పర్పుల్‌ను రద్దు చేయాలన్న నిర్ణయం లార్డ్ మరియు పైస్ (మిగిలిన వాస్తవిక బ్యాండ్ సభ్యులు) ఆఖరి ప్రదర్శనకు ముందే తీసుకోబడింది. అయితే వారు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. బ్యాండ్ రద్దు అనేది జులై, 1976లో బహిరంగమైంది.
తర్వాత, 4 డిసెంబరు 1976న విషాదం తలెత్తినప్పుడు బోలిన్ తన రెండో ఏకైక ఆల్బమ్ ప్రైవేట్ ఐస్ రికార్డింగ్ పూర్తి చేశాడు. మియామిలో జెఫ్ బెక్ మద్దతుగా నిర్వహించిన పర్యటన సందర్భంగా బోలిన్ తన ప్రియురాలితో అపస్మారక స్థితిలో ఉండటం గుర్తించబడింది. అతన్ని స్పృహలోకి తీసుకురాలేని కారణంగా ఆమె వెంటనే వైద్యులను సంప్రతించింది. అయితే పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది. మరణానికి అధికారిక కారణం: బహుళ-మాదకద్రవ్య నిషా. అప్పటికి అతని వయస్సు 25 ఏళ్లు.
రద్దు తర్వాత డీప్ పర్పుల్ యొక్క గత మరియు ప్రస్తుత సభ్యుల్లో ఎక్కువ మంది రెయిన్‌బో, వైట్‌స్నేక్, బ్లాక్ సబ్బాత్ మరియు గిల్లాన్ వంటి ఇతర పలు బ్యాండ్‌లల్లో విజయాలు సాధించడానికి ప్రయత్నించారు. మరోవైపు 1970ల ఆఖర్లో /1980ల ప్రారంభంలో హార్డ్ రాక్ మార్కెట్ పునరుద్ధరణ నేపథ్యంలో తమ బ్యాండ్‌కు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి వారు అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. 1980 నాటికి డీప్ పర్పుల్‌లోనే ఎప్పటికీ ఉండిపోయిన ఎవాన్స్ ఏకైక సభ్యుడుగా బ్యాండ్ నుంచి ఒక అనధికారిక వెర్షన్ దర్శనమిచ్చింది. అయితే బ్యాండ్ పేరును అనధికారికంగా ఉపయోగించుకోవడంపై చట్టబద్ధమైన అర్హత ఉన్న డీప్ పర్పుల్ శిబిరం చట్టపరమైన చర్య తీసుకుంది. తద్వారా ఎట్టకేలకు ఈ వ్యవహారం వివాదంగా ముదరకుండా ముగిసింది. అనుమతి లేకుండా బ్యాండ్ పేరును ఉపయోగించుకున్నందుకు నష్టపరిహారం కింద $672,000 (US) చెల్లించాలని ఎవాన్స్‌ను ఆదేశించారు.[19]
[మార్చు] పునఃసంయోగాలు మరియు విభజనలు (1984–94)
ఏప్రిల్, 1984లో డీప్ పర్పుల్ శకం ముగిసిన ఏనిమిదేళ్ల తర్వాత 1970ల ప్రారంభంలోని "అద్భుతమైన" లైనప్ బ్లాక్‌మోర్, గిల్లాన్, గ్లోవర్, లార్డ్ మరియు పైస్‌తో ఒక పూర్తిస్థాయి (మరియు చట్టపరమైన) పునఃసంయోగం ఏర్పడింది. పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ ఆల్బమ్ అక్టోబరు, 1984లో విడుదలయింది. ఇది విపరీతంగా అమ్ముడైంది. (UKలో #5 మరియు USలోని బిల్‌బోర్డ్ 200లో #6లో నిలిచింది[20]) ఇందులో "నాకిన్' ఎట్ యువర్ బ్యాక్ డోర్" మరియు "పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్" వంటి పాటలు మరియు ప్రధానమైన కచేరి అంశాలను పొందుపరిచారు. ఈ కొత్త సంయోగం తొలుత ఆస్ట్రేలియాలో పర్యటించి, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉత్తర అమెరికా వరకు చుట్టింది. తర్వాత మరుసటి వేసవిలో ఐరోపాలో ప్రవేశించింది. ఆర్థికంగా కూడా ఈ పర్యటన చక్కటి విజయం సాధించింది. UK ప్రయాణం మాత్రం పరిమితంగానే సాగింది. ఎందుకంటే, నెబ్‌వర్త్ వద్ద వారు ఒకే ఒక్క పండగ ప్రదర్శన ఇచ్చారు (స్కార్పియాన్స్ నుంచి ప్రధాన మద్దతు ద్వారా; బిల్లులో UFO, బెర్నీ మార్స్‌డెన్ యొక్క అలస్కా, మామాకి చెందిన బాయ్స్, బ్లాక్‌ఫుట్, మౌంటెన్ మరియు మీట్ లోఫ్ కూడా ఉన్నాయి). ప్రతికూల వాతావరణం (ఎడతెరిపిలేని వర్షం మరియు 6" వరకు బురద) ఉన్నప్పటికీ, 80,000 మంది అభిమానులు హాజరయ్యారు. ఈ ప్రదర్శన "రిటర్న్ ఆఫ్ ది నెబ్‌వర్త్ ఫేరీ"గా పిలవబడింది.
ఈ లైనప్ తర్వాత 1987లో ది హౌస్ ఆఫ్ బ్లూ లైట్ ను విడుదల చేసింది. అనంతరం ఒక ప్రపంచ పర్యటన (వేదికపై బ్లాక్‌మోర్ వేలు విరిగిపోవడంతో దీనికి అంతరాయం కలిగింది) మరియు మరో లైవ్ ఆల్బమ్ నోబడీస్ పర్ఫెక్ట్ (1988) రూపొందించబడింది. పర్యటనలోని వివిధ ప్రదర్శనల నుంచి దీనిని రూపొందించారు. అయితే ఇప్పటికీ ప్రస్తుతం బాగా తెలిసిన మేడ్ ఇన్ జపాన్ సెట్-లిస్ట్‌పైనే ఇది ఎక్కువగా ఆధారపడింది. UKలో "హష్" యొక్క కొత్త వెర్షన్ (ప్రధాన పాటలను గిల్లాన్ ఆలపించాడు) బ్యాండ్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలయింది. 1989లో బ్లాక్‌మోర్‌తో సంబంధాలు మరియు వారి సంగీతపరమైన విభేదాలు కూడా మళ్లీ బెడిసికొట్టడంతో గిల్లాన్ తొలగింపుకు గురయ్యాడు. దాంతో అతని స్థానంలో రెయిన్‌బో బ్యాండ్ మాజీ గాయకుడు జో లిన్ టర్నర్‌కు అవకాశం కల్పించారు. ఈ విధంగా ఏర్పడిన కొత్త లైనప్ స్లేవ్స్ & మాస్టర్స్ (1990) అనే ఒకే ఒక్క ఆల్బమ్‌ను మాత్రమే విడుదల చేసింది. దానికి మద్దతుగా పర్యటన కూడా చేసింది. బహుశా ఇది "డీప్ రెయిన్‌బో" ఆల్బమ్ అని కొంతమంది అభిమానులు వ్యాఖ్యానించినా, బ్లాక్‌మోర్‌కు బాగా నచ్చిన డీప్ పర్పుల్ ఆల్బమ్‌లలో,[citation needed] ఇదొకటి.
పర్యటన ముగిసిన తర్వాత టర్నర్‌పై వేటు పడింది. అందుకు కారణం బ్యాండ్ 25వ వార్షికోత్సవం సందర్భంగా గిల్లాన్‌కు తిరిగి అవకాశం కల్పించాలని లార్డ్, పైస్ మరియు గ్లోవర్ (మరియు రికార్డింగ్ కంపెనీ) గట్టిగా కోరుకోవడం. బతిమలాడిన తర్వాత బ్లాక్‌మోర్ అన్యమస్కంగానే దిగివచ్చాడు. ఎట్టకేలకు అతని బ్యాంకు ఖాతా[21]లో 250,000 డాలర్ల సొమ్ము జమైంది. తర్వాత ఈ అద్భుతమైన లైనప్ ది బ్యాటిల్ రేజెస్ ఆన్ రికార్డు చేసింది. అయితే విజయవంతమైన ఐరోపా పర్యటన సందర్భంగా గిల్లాన్ మరియు బ్లాక్‌మోర్ మధ్య విభేదాలు మళ్లీ ఆవిష్కృతమయ్యాయి. దాంతో నవంబరు, 1993లో బ్యాండ్ నుంచి బయటకు వెళ్లిన బ్లాక్‌మోర్ ఆ తర్వాత ఎప్పుడూ తిరిగి రాలేదు. డిసెంబరులో తలపెట్టిన జపాన్ షెడ్యూల్‌ను నెరవేర్చడానికి జో శాట్రియానికి అవకాశం కల్పించారు. అతను 1994 ఐరోపా వేసవి పర్యటన (యూరోపియన్ సమ్మర్ టూర్) వరకు కొనసాగాడు. శాశ్వతంగా చేతులు కలపమని అతన్ని బ్యాండ్ కోరింది. అయితే అతని రికార్డ్ స్థాయి కాంట్రాక్టులు దీనికి మోకాలడ్డాయి. బ్లాక్‌మోర్ శాశ్వత వారసుడిగా డిక్సీ డ్రెగ్స్/కన్సాస్ గిటారిస్ట్ స్టీవ్ మోర్స్‌ను బ్యాండ్ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
[మార్చు] స్టీవ్ మోర్స్‌తో పునరుద్ధరణ (1994–ఇప్పటివరకు)
మోర్స్ రాకతో బ్యాండ్ సృజనాత్మక తిరిగి మొదలైంది. 1996లో పర్పెండికులర్ పేరుతో ఒక కొత్త ఆల్బమ్ విడుదలయింది. ఇందులో విభిన్న సంగీత శైలిలు ఉన్నాయి. పునరుద్ధరించిన బ్యాండ్ ద్వారా పర్యటనలు చేయడం ప్రారంభించడంతో డీప్ పర్పుల్ 1990ల శేష భాగాన్ని విజయవంతంగా ముగించింది. 1998లో గంభీరమైన శబ్దం కలిగిన అబాండన్ ను విడుదల చేసింది. సరికొత్త ఉత్సాహంతో పర్యటనలు చేపట్టింది. 1999లో లార్డ్ మ్యూజికాలజిస్ట్ మరియు స్వరకర్తయైన ఒక అభిమాని సాయంతో తీవ్రంగా శ్రమించి, కన్సెర్ట్ ఫర్ గ్రూప్ అండ్ ఆర్కెస్ట్రాను తిరిగి ఏర్పాటు చేశాడు. అయితే వాస్తవిక స్వరకల్పన దారిపోయింది. సెప్టెంబరు, 1999లో ఈ సారి పాల్ మన్ నిర్వహణలో లండన్ సింఫోనీ ఆర్కెస్ట్రాతో కలిసి రాయల్ అల్బర్ట్ హాల్‌లో బ్యాండ్ తిరిగి ప్రదర్శన ఇచ్చింది. ఈ సంగీత విభావరిలోనూ ప్రతి సభ్యుడి యొక్క ఒంటరి ఆల్బమ్‌ల నుంచి కొన్ని పాటలను తీసుకున్నారు. అలాగే ఒక చిన్న డీప్ పర్పుల్ సెట్‌ను కూడా వినియోగించారు. 2000 ఆల్బమ్ లైవ్ ఎట్ ది రాయల్ అల్బర్ట్ హాల్ సందర్భంగా ఈ సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకోవడం జరిగింది. 2001 ప్రారంభంలో టోక్యోలో ఒకే విధమైన రెండు ప్రదర్శనలను బ్యాండ్ ఇచ్చింది. దీనిని బాక్స్ సెట్ ది సౌండ్‌బోర్డ్ సిరీస్ లో భాగంగా విడుదల చేశారు.
బ్యాండ్ తర్వాత కొన్నేళ్ల పాటు రోడ్లపై పర్యటిస్తూ గడిపింది. ఈ గ్రూపు 2002 వరకు దూసుకుపోయింది. అంటే, వ్యవస్థాపక సభ్యుడు లార్డ్ (అతను బ్యాండ్ జయాపజయాల సమయాల్లో పైస్‌తో కలిసి అక్కడే కొనసాగిన ఏకైక సభ్యుడు) వ్యక్తిగత ప్రాజెక్టుల (ప్రత్యేకించి, ఆర్కెస్ట్రా సంబంధిత పనులు)పై దృష్టి సారించాలని పేర్కొంటూ బ్యాండ్ నుంచి స్నేహపూర్వకంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించేంత వరకు. లార్డ్ తన స్థానం భర్తీ కోసం హమ్మాండ్ ఆర్గాన్ (ఒక విధమైన సంగీత వాద్య పరికరం)ను వదులుకున్నాడు. 2001లో లార్డ్ మోకాలికి గాయమైనప్పుడు డీప్ పర్పుల్‌కు సాయపడిన రాక్ కీబోర్డ్ దిగ్గజం డాన్ ఎయిరీ (రెయిన్‌బో, ఓజీ ఓస్‌బోర్న్, బ్లాక్ సబ్బాత్, వైట్‌స్నేక్) బ్యాండ్‌లో చేరాడు. 2003లో కొత్త నిర్మాత మైఖేల్ బ్రాడ్‌ఫోర్డ్‌తో కలిసి డీప్ పర్పుల్ ఐదేళ్లలో తొలిసారిగా తన మొదటి స్టూడియో ఆల్బమ్‌ను విడుదల చేసింది. బనానాస్ చెప్పుకోదగ్గ విధంగా ప్రశంసలందుకుంది[citation needed] (అయితే వివాదాస్పదమైన నామకరణం చేశారు). ఆల్బమ్‌ను విడుదల చేసిన వెంటనే దానికి మద్దతును కూడగట్టడానికి బ్యాండ్ పర్యటన చేపట్టింది. జులై, 2005లో పార్క్ ప్లేస్ లోని లైవ్ 8 (బారీ, ఒంటారియో)లో బ్యాండ్ ప్రదర్శన ఇచ్చింది. అదే ఏడాది అక్టోబరులో తన మూడో ఆల్బమ్ రప్చర్ ఆఫ్ ది డీప్ ను విడుదల చేసింది. ఆ తర్వాత రప్చర్ ఆఫ్ ది డీప్ టూర్ విడుదలైంది.
ఫిబ్రవరి, 2007లో సోనీ BMG విడుదల చేసిన లైవ్ ఆల్బమ్‌ను కొనుగోలు చేయొద్దని గిల్లాన్ అభిమానులకు సూచించాడు. ఇది 1993లో బర్మింగ్‌హామ్‌లోని NECలో బ్యాండ్ ప్రదర్శనకు సంబంధించిన రికార్డింగ్. ఈ ప్రదర్శనకు సంబంధించిన రికార్డింగ్‌లను అంతకుముందు గిల్లాన్ లేదా ఇతర బ్యాండ్ సభ్యుల అభ్యంతరాలు లేకుండా విడుదల చేయబడ్డాయి. దీనిపై గిల్లాన్ ఈ విధంగా అన్నాడు, "నిజానికి, నా జీవితం, మా అందరి జీవితాల్లో చోటు చేసుకున్న అత్యంత దీన పరిస్థితుల్లో ఇదొకటి".[22]
ఇయాన్ గిల్లాన్ ప్రకారం, ఫిబ్రవరి, 2010[23]లో ఈ గ్రూపు తన పందొమ్మిదో స్టూడియో ఆల్బమ్‌ను రికార్డు చేస్తుంది. తర్వాత దాని మద్దతుకు ఒక పర్యటన కూడా చేపడుతుంది. (టూర్ డేట్స్)
[మార్చు] ప్రపంచ పర్యటనలు
డీప్ పర్పుల్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పర్యటన బ్యాండ్‌లలో ఒకటిగా పరిగణించబడింది.[24][25][26] 1968 నుంచి నేటి వరకు (బ్యాండ్ యొక్క 1976-1983 మధ్యకాలం మినహాయించి) ప్రపంచ పర్యటనలను బ్యాండ్ కొనసాగిస్తోంది. 2007లో ఒక్క ఫ్రాన్స్‌లోనే 40 రోజుల పాటు ప్రదర్శన ఇవ్వడం, 150,000 పైగా టిక్కెట్లు విక్రయించడం ద్వారా బ్యాండ్ విశిష్ట పురస్కారాన్ని అందుకుంది.[27] 2007లో డీప్ పర్పుల్ యొక్క రప్చర్ ఆఫ్ ది డీప్ టూర్‌ను ప్లానెట్ రాక్ శ్రోతలు #6 కన్సర్ట్ టూర్ ఆఫ్ ది ఇయర్‌గా పేర్కొన్నారు.[28] రోలింగ్ స్టోన్స్ యొక్క ఎ బిగ్గర్ బ్యాంగ్ టూర్ #5గా ఎంపికైంది. తద్వారా పర్పుల్ టూర్‌ను 1% తేడాతో మాత్రమే పక్కకు నెట్టింది. మే, 2008లో ఎరౌండ్ ది వరల్డ్ లైవ్ పేరుతో డీప్ పర్పుల్ ఒక సరికొత్త ప్రత్యక్ష సంకలన DVD బాక్సును విడుదల చేసింది. ఫిబ్రవరి, 2008లో రష్యా అధ్యక్ష పదవిని అలంకరించే అవకాశమున్నట్లు అందరూ భావించిన డిమిట్రీ మెడ్‌విదెవ్ వ్యక్తిగత అభ్యర్థన మేరకు డీప్ పర్పుల్ తొలిసారిగా మాస్కో క్రెమ్లిన్[29]లో ప్రదర్శన ఇచ్చింది. అంతేకాక చెక్ రిపబ్లిక్‌లోని లిబరెక్‌లో నిర్వహించిన FIS నార్డిక్ వరల్డ్ స్కై ఛాంపియన్‌షిప్స్ 2009 సందర్భంగా నిర్వహించిన వినోద కార్యక్రమాల్లోనూ డీప్ పర్పుల్ భాగమైంది.[30]
- డీప్ పర్పుల్ డెబ్యూ టూర్, 1968
- షేడ్స్ ఆఫ్ డీప్ పర్పుల్ టూర్, 1968
- ది బుక్ ఆఫ్ తాలీసిన్ టూర్, 1968
- [[డీప్ పర్పుల్ యూరోపియన్
టూర్]], (ఇన్ రాక్ కోసం పూర్వ పర్యటన) 1969-1970
- ఇన్ రాక్ వరల్డ్ టూర్ - 1970-1971
- ఫైర్‌బాల్ వరల్డ్ టూర్, 1971–1972
- మెషిన్ హెడ్ వరల్డ్ టూర్, 1972–1973
- డీప్ పర్పుల్ యూరోపియన్ టూర్ 1974
- బర్న్ వరల్డ్ టూర్, 1974
- స్టార్మ్‌బ్రింజర్ వరల్డ్ టూర్, 1974–1975
- కమ్ టేస్ట్ ది బ్యాండ్ వరల్డ్ టూర్, 1975–1976
- రీయూనియన్ టూర్ 1984-1985గా కూడా పిలిచే పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ వరల్డ్ టూర్
- ది హౌస్ ఆఫ్ బ్లూ లైట్ వరల్డ్ టూర్, 1987–1988
- స్లేవ్స్ అండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్, 1991
- ది బ్యాటిల్ రేజెస్ ఆన్ టూర్, 1993గా కూడా పిలిచే డీప్ పర్పుల్ 25 ఇయర్స్ ఏనివర్సరే వరల్డ్ టూర్
- డీప్ పర్పుల్ అండ్ జో శాంట్రియాని టూర్, 1993–1994
- డీప్ పర్పుల్ సీక్రెట్ మెక్సికన్ టూర్ (స్టీవ్ మోర్స్‌తో లఘు సన్నాహక పర్యటన)
- డీప్ పర్పుల్ సీక్రెట్ USA టూర్ 1994-1995
- డీప్ పర్పుల్ ఆసియన్ & ఆఫ్రికన్ టూర్ 1995
- పర్పెండికులర్ వరల్డ్ టూర్, 1996–1997
- ఎ బ్యాండ్ ఆన్ వరల్డ్ టూర్, 1998–1999
- కన్సర్ట్ వరల్డ్ టూర్, 2000–2001
- డీప్ పర్పుల్ వరల్డ్
టూర్, 2001–2003
- బనానాస్ వరల్డ్ టూర్, 2003–2005
- రప్చర్ ఆఫ్ ది డీప్ వరల్డ్ టూర్, 2006–2009
- అప్‌కమింగ్ వరల్డ్ టూర్, 2010
[మార్చు] డిస్కోగ్రఫీ
- ప్రధాన వ్యాసం: Deep Purple discography
- షేడ్స్ ఆఫ్ డీప్ పర్పుల్ (1968)
- ది బుక్ ఆఫ్ తాలీసిన్ (1968)
- డీప్ పర్పుల్ (1969)
- డీప్ పర్పుల్ ఇన్ రాక్ (1970)
- ఫైర్‌బాల్ (1971)
- మెషిన్ హెడ్ (1972)
- హూ డు వుయ్ థింక్ వుయ్ ఆర్ (1973)
- బర్న్ (1974)
- స్టార్మ్‌బ్రింజర్ (1974)
- కమ్ టేస్ట్ ది బ్యాండ్ (1975)
- పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ (1984)
- ది హౌస్ ఆఫ్ బ్లూ లైట్ (1987)
- స్లేవ్స్ & మాస్టర్స్ (1990)
- ది బ్యాటిల్ రేజెస్ ఆన్ (1993)
- పర్పెండికులర్ (1996)
- అబాండన్ (1998)
- బనానాస్ (2003)
- రప్చర్ ఆఫ్ ది డీప్ (2005)
[మార్చు] బ్యాండ్ సభ్యులు
డీప్ పర్పుల్ ప్రస్థానంలో ఇప్పటివరకు ఎనిమిది విభిన్నమైన లైనప్‌లు ఉన్నాయి. వాస్తవిక మార్క్ I లైనప్‌లో గిటారిస్ట్ రిట్చీ బ్లాక్‌మోర్, కీబోర్డు విద్వాంసుడు జాన్ లార్డ్, డ్రమ్మర్ ఇయాన్ పైస్, గాయకుడు రాడ్ ఎవాన్స్ మరియు బాసిస్ట్ నిక్ సింపర్ మూడు ఆల్బమ్‌లు విడుదల చేసింది. మార్క్ IIని ఏర్పాటు కోసం ఎవాన్స్ మరియు సింపర్‌ల స్థానాలను ఇయాన్ గిల్లాన్ మరియు రోజర్ గ్లోవర్‌లతో భర్తీ చేయకముందు వరకు.[31] రెండో లైనప్ "అద్భుతమైన" (క్లాసిక్) డీప్ పర్పుల్‌గా,[32][33] ఇన్ రాక్ , ఫైర్‌బాల్ , మెషిన్ హెడ్ మరియు హూ డు వుయ్ థింక్ వుయ్ ఆర్ ఆల్బమ్‌లు రికార్డు చేసింది. ఈ లైనప్ గిల్లాన్ (తర్వాత గ్లోవర్) బ్యాండ్ నుంచి వైదొలిగేంత వరకు అంటే 1973 వరకు ఉనికిని చాటుకుంది. బ్యాండ్ సహ వ్యవస్థాపక సభ్యుడు మరియు గిటారిస్ట్ బ్లాక్‌మోర్ 1975లో వైదొలగడం, అతని స్థానంలో టామీ బోలిన్ రావడం జరిగినా, డేవిడ్ కవర్‌డాలే మరియు గ్లెన్ హ్యూస్ డీప్ పర్పుల్ మార్క్ III,[34] ఏర్పాటు కోసం జతకట్టారు. మార్క్ IV ఏడాది మాత్రమే ఉనికిలో ఉంది. 15 మార్చి 1976న లివర్‌పూల్‌లోని ఎంపైర్ వద్ద ఒక కచేరి అనంతరం బ్యాండ్ రద్దయింది. అప్పటికి అది అవతరించి ఎనిమిదేళ్లు.[35]
విరామ సమయంలో బ్యాండ్ సభ్యులు ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించారు. అందులో రెయిన్‌బో (బ్లాక్‌మోర్ మరియు గ్లోవర్), వైట్‌స్నేక్ (కవర్‌డాలే లార్డ్ మరియు పైస్), బ్లాక్ సబ్బాత్ (వేర్వేరు కాలాల్లో గిల్లాన్ మరియు హ్యూస్) మరియు గిల్లాన్ (గిల్లాన్) ఉన్నాయి.
డీప్ పర్పుల్ మార్క్ II లైనప్ గిల్లాన్, బ్లాక్‌మోర్, గ్లోవర్, పైస్ మరియు లార్డ్‌తో కలిసి 1984లో తిరిగి ఒక్కటైంది.[36] గిల్లాన్ మరియు బ్లాక్‌మోర్ మధ్య అభిప్రాయభేదాలు ఉండేవి. దాంతో గిల్లాన్‌ను తొలగించి, అతని స్థానంలో రెయిన్‌బోలోని బ్లాక్‌మోర్ మాజీ సహ సభ్యుడు జో లిన్ టర్నర్‌ను నియమించారు. మార్క్ II లైనప్ ముచ్చటగా మూడోసారి తిరిగి జతకట్టేంత వరకు అంటే, 1992 వరకు టర్నర్ బ్యాండ్‌లో కొనసాగాడు. గిల్లాన్ మరియు బ్లాక్‌మోర్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో 1993లో చేపట్టిన ది బ్యాటిల్ రేజెస్ ఆన్ పర్యటన మధ్యలోనే గిటారిస్ట్‌యైన బ్లాక్‌మోర్ బ్యాండ్ నుంచి శాశ్వతంగా వైదొలిగాడు. మిగిలిన ప్రదర్శనల కోసం అతని స్థానంలో జో శాట్రియానికి అవకాశం కల్పించారు. అయితే ఒప్పంద సంబంధమైన వివాదాల కారణంగా శాట్రియాని బ్యాండ్‌లో శాశ్వతంగా చేరలేదు.
1994,[37]లో బ్లాక్‌మోర్ స్థానంలో స్టీవ్ మోర్స్ను పూర్తిస్థాయిలో నియమించడానికి ఎంపిక చేశారు. అతను ఈరోజు వరకు కూడా గిటారిస్ట్‌గానే కొనసాగుతున్నాడు. బ్యాండ్ యొక్క ప్రతి మార్పులోనూ అట్టిపెట్టుకుని ఉన్న లార్డ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమంటూ తప్పుకోవడం ద్వారా 2002లో తాజాగా లైనప్ మారింది. అతని స్థానంలో గతంలో రెయిన్‌బో మరియు ఓజీ ఓస్‌బోర్న్ బ్యాండ్ తరపున పనిచేసిన డాన్ ఎయిరీను ప్రస్తుత మార్క్ VIII లైనప్ కోసం ఎంపిక చేశారు. 1968లో బ్యాండ్ ఆవిష్కరణ మొదలుకుని ఇప్పటివరకు కొనసాగుతూ దాని ప్రతి లైనప్‌లోనూ భాగస్వామియైన డ్రమ్మర్ పైస్ ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాడు.
[మార్చు] ప్రస్తుత సభ్యులు
- ఇయాన్ గిల్లాన్ - ప్రధాన గాయకుడు (1969-1973, 1984-1989, 1992-ఇప్పటివరకు)
- స్టీవ్ మోర్స్ - ప్రధాన & రిథమ్ గిటార్ (1994-ఇప్పటివరకు)
- రోజర్ గ్లోవర్ - బాస్ (1969-1973, 1984-ఇప్పటివరకు)
- ఇయాన్ పైస్ - డ్రమ్స్, పెర్క్యూషన్ (1968-1976, 1984-ఇప్పటివరకు)
- డాన్ ఎయిరీ - కీబోర్డులు, ఆర్గాన్ (2001-ఇప్పటివరకు)
[మార్చు] మాజీ సభ్యులు
- రిట్చీ బ్లాక్‌మోర్ - ప్రధాన & రిథమ్ గిటార్ (1968-1975, 1984-1993)
- జాన్ లార్డ్ - కీబోర్డులు, ఆర్గాన్ (1968-1976, 1984-2001)
- రాడ్ ఎవాన్స్ - ప్రధాన గాయకుడు (1968-1969)
- నిక్ సింపర్ - బాస్ (1968-1969)
- డేవిడ్ కవర్‌డాలే - ప్రధాన గాయకుడు (1973-1976)
- గ్లెన్ హ్యూస్ - బాస్ (1973-1976)
- టామీ బోలిన్ - ప్రధాన & రిథమ్ గిటార్ (1975-1976)
- జో లిన్ టర్నర్ - ప్రధాన గాయకుడు (1989-1992)
- జో శాంట్రియాని - ప్రధాన & రిథమ్ గిటార్ (1993-1994)
[మార్చు] సూచనలు
[మార్చు] గమనికలు
- ↑ షేడ్స్ ఆఫ్ డీప్ పర్పుల్ ఆల్బమ్ స్లీవ్ నోట్స్ పేజీ 4-5.
- ↑ ఇంటర్వూ టు ఇయాన్ గిల్లాన్ అండ్ ఇయాన్ పైస్ ఫ్రమ్ www.deep-purple.net
- ↑ 3.0 3.1 డీప్ పర్పుల్ బియో బై జాసన్ అంకెనీ & గ్రెగ్ ప్రాటో ఆఫ్ ఆల్‌మ్యూజిక్
- ↑ డీప్ పర్పుల్ కన్సర్ట్ అక్లాండ్, లోగాన్ క్యాంప్‌బెల్ సెంటర్
- ↑ 5.0 5.1 డీప్ పర్పుల్ - హార్డ్ రాక్ - రాక్/పాప్ - మ్యూజిక్ - www.real.com
- ↑ Deep Purple - Rapture Of The Deep. I Like Music article. తీసుకొన్న తేదీ: 21 April 2007.
- ↑ డీప్ పర్పుల్ | ఈవెంట్స్ | హల్లామ్ FM అరీనా
- ↑ ఆర్టిస్ట్ ప్రొఫైల్ - డీప్ పర్పుల్
- ↑ డీప్ పర్పుల్ అండ్ పెయిడ్, ఇంక్. లాంచ్ ఫస్ట్ VIP ఫ్యాన్ ఎక్స్‌పీరియన్స్ కన్సర్ట్ ప్యాకేజ్ సేల్స్ ఆన్ www.DeepPurple.org
- ↑ VH1.comలో ది గ్రేటెస్ట్: 100 గ్రేటెస్ట్ ఆర్టిస్ట్స్ ఆఫ్ హార్డ్ రాక్ (40–21)
- ↑ డీప్ పర్పుల్ రివ్యూస్
- ↑ డీప్ పర్పుల్ మార్క్ I & మార్క్ II
- ↑ http://www.thehighwaystar.com/interviews/blackmore/rb199102xx.html
- ↑ "Interview: Singer and guitarist Terry Reid", The Independent, 7 March 2007. Retrieved on 27 March 2010.
- ↑ బర్న్ ఎడిషన్ 30వ వార్షికోత్సవానికి సంబంధించిన లైనర్ నోట్స్
- ↑ "డీప్ పర్పుల్: హిస్టరీ మరియు హిట్స్ " DVD
- ↑ డీప్ పర్పుల్ 4-CD బాక్సు సెట్‌లోని వరుస సూచనలు
- ↑ http://www.deep-purple.net/interviews/tommy-bolin.htm
- ↑ బోగస్ డీప్ పర్పుల్
- ↑ డీప్ పర్పుల్ ఎసన్షియల్ కలెక్షన్ - ప్లానెట్ రాక్
- ↑ Rockpages.grలో ఇయాన్ గిల్లాన్ ఇంటర్వూ
- ↑ BBC న్యూస్ ఆన్‌లైన్ - లైవ్ ఆల్బమ్‌ను డీప్ పర్పుల్ ఉపసంహరించుకుంది
- ↑ http://www.metalunderground.com/news/details.cfm?newsid=46354
- ↑ ది హైవే స్టార్ — ఫాల్ టూర్ ఆఫ్ జర్మనీ
- ↑ ది హైవే స్టార్ — పిస్కో సోర్ అండర్ పెరూవియన్ స్కైస్
- ↑ ది డీప్ పర్పుల్ లైవ్ ఇండెక్స్
- ↑ డీప్ పర్పుల్, 2007 టూర్ రివ్యూస్
- ↑ http://www.planetrock.co.uk/article.asp?id=544140#Tour Of The Year
- ↑ Gillan, Ian. "Deep Purple perform for Russias future president", The Times, 17 February 2008. Retrieved on 1 May 2010.
- ↑ FIS న్యూస్‌ఫ్లాష్ 215. 21 జనవరి 2009.
- ↑ Deep Purple Mark 1 History. www.deep-purple.net. తీసుకొన్న తేదీ: 5 January 2009.
- ↑ Google Book Search All Music Guide to Rock, p. 292. Backbeat Books, 2002. Retrieved on 5 January 2009.
- ↑ "Classic Albums: Deep Purple - Machine Head - Trailer - Cast - Showtimes - NYTimes.com", movies.nytimes.com. Retrieved on 5 January 2009.
- ↑ Deep Purple Mark 3 History. www.deep-purple.net. తీసుకొన్న తేదీ: 5 January 2009.
- ↑ Deep Purple Mark 4. www.thehighwaystar.com. తీసుకొన్న తేదీ: 5 January 2009.
- ↑ Deep Purple Mark 2 Reunion History. www.deep-purple.net. తీసుకొన్న తేదీ: 5 January 2009.
- ↑ Deep Purple Mark 7 History. www.deep-purple.net. తీసుకొన్న తేదీ: 5 January 2009.
[మార్చు] గ్రంథ పట్టిక
- స్మోక్ ఆన్ ది వాటర్: ది డీప్ పర్పుల్ స్టోరీ , డేవ్ థాంప్సన్, ECW ప్రెస్, 2004, ISBN 1-55022-618-5
- ది కంప్లీట్ డీప్ పర్పుల్ , మైఖేల్ హీట్లీ, రీనాల్డ్స్ & హెర్న్, 2005, ISBN 1-903111-99-4
[మార్చు] బాహ్య వలయాలు
- ప్రమోటర్లు మరియు మీడియాకు ఉద్దేశించిన డీప్ పర్పుల్ యొక్క అధికారిక బిజినెస్ వెబ్సైటు
- క్లాసిక్ డీప్ పర్పుల్ 1970-1974
- డీప్ పర్పుల్ at the Open Directory Project
- All articles with unsourced statements
- Articles with unsourced statements from May 2009
- Articles with invalid date parameter in template
- Articles with unsourced statements from January 2009
- Articles with unsourced statements from October 2009
- Articles with unsourced statements from March 2009
- 1968లో ఏర్పాటైన సంగీత బృందాలు
- ఐదుగురి సభ్యుల సంగీత బృందం
- 1960ల సంగీత బృందాలు
- 1970ల సంగీత బృందాలు
- 1980ల సంగీత బృందాలు
- 1990ల సంగీత బృందాలు
- 2000ల సంగీత బృందాలు
- ఇంగ్లీష్ రాక్ సంగీత బృందాలు
- ఇంగ్లీష్ హెవీ మెటల్ సంగీత బృందాలు
- ఇంగ్లీష్ హార్డ్ రాక్ సంగీత బృందాలు
- డీప్ పర్పుల్
- పార్లోఫోన్ కళాకారులు
- హెర్ట్పోర్డ్ ప్రజలు