డెట్రాయిట్

వికీపీడియా నుండి
డెట్రాయిట్ నగరం
Thomaspaine'smontageofDetroit request2.jpg
Flag of డెట్రాయిట్ నగరం
Flag
Official seal of డెట్రాయిట్ నగరం
Seal
ముద్దు పేరు: The Motor City, Motown, Hockeytown, Rock City, The D
నినాదం: "Speramus Meliora; Resurget Cineribus"
(Latin for, "We Hope For Better Things; It Shall Rise From the Ashes")
Location in Wayne County, Michigan
Location in Wayne County, Michigan
Coordinates: 42°19′53.76″N 83°2′51″W / 42.3316, -83.0475
Country United States
State Michigan
County Wayne
Founded 1701
Incorporation 1806
ప్రభుత్వము
 - Type Mayor-Council
 - Mayor Kenneth Cockrel Jr.
 - City Council
వైశాల్యము
 - City 143.0 sq mi (370.2 km²)
 - భూమి 138.8 sq mi (359.4 km²)
 - నీరు 4.2 sq mi (10.8 km²)
 - పట్టణ 1,295 sq mi (3,354 km²)
 - మెట్రో 3,913 sq mi (10,135 km²)
ఎత్తు [1] 600 ft (183 m)
జనాభా (2007)[2]
 - City 9,16,952
 - సాంద్రత 6,856/sq mi (2,647/km2)
 - పట్టణ 39,03,377
 - మెట్రో 44,67,592
 - CSA 5
కాలాంశం EST (UTC-5)
 - Summer (DST) EDT (UTC-4)
Area code(s) 313
FIPS code 26-22000[3]
GNIS feature ID 1617959[4]
వెబ్‌సైటు: detroitmi.gov

డెట్రాయిట్ అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలోని పెద్ద నగరం. అమెరికాలోని మిడ్‌వెస్ట్ ప్రాంతంలో డెట్రాయిట్ నగరం డెట్రాయిట్ నదిపైన ఉన్న ముఖ్యరేవు పట్టణం. కెనడా దక్షిణప్రాంతంలో ఉన్న అమెరికా నగరాలలో డెట్రాయిట్ ఒక్కటీ గుర్తించ తగినంత పెద్ద నగరం. 1701లో ఫ్రెంచ్‌ దేశస్తుడైన ఫ్రెంచ్‌ మాన్ ఆంటోనీ డీ లా మోత్ కాడిలాక్చే స్థాపించబడింది.

డెట్రాయిట్ నగరం అమెరికాలోని సంప్రదాయక ఆటోమోటివ్ కేంద్రం. మోటర్ సిటీ మరియు మోటోటౌన్ డెట్రాయిట్ నగరానికికున్న అతి ముఖ్యమైన మారు పేర్లు. 2007లో డెట్రాయిట్ నగరం జనసాంద్రతలో 916,952 మంది నివాసితులతో పదకొండవ స్థానంలో ఉంది. 1.8 మిలియన్ల జనాభాతో డెట్రాయిట్ నగరం అమెరికాలో నాల్గవ స్థానంలో ఉండేది ఆతరవాత నగర ప్రధాన జనవాహిని నగర పురాలను దాటి విస్తరించింది.

డెట్రాయిట్ అనే పేరు కొన్నిసార్లు డెట్రాయిట్ మహానగరానికి వర్తిస్తుంది. 2007 సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం తొమ్మిది కౌంటీలతో కలసి 5,405,918 జసంఖ్య కలిగిన మహానగరం అమెరికాలో పదకొండవ స్థానంలో ఉంది. 57,00,000 జనాభా కలిగిన డెట్రాయిట్-విండ్సర్ ప్రదేశం అమెరికా కెనడా దేశాలమద్య ఉన్న కీలక వాణిజ్య కేంద్రం.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

డెట్రాయిట్ నగరానికి ఈ పేరు డెట్రాయిట్ నది కారణంగా వచ్చింది. ఈ నగరం డెట్రాయిట్ నదీతీరంలో స్థాపించబడి విస్తరించింది. డెట్రాయిట్ నదిపై లీ గ్రిఫిన్ నౌకలో ఫాదర్ హెన్నెపిన్ నదికి ఉత్తర తీరాన ఉన్న ఈ ప్రాంతం ఒప్పందం మూలంగా అభివృద్ధిపరచడానికి అనుకూలమైనదిగా భావించాడు. 1701లో ఆంటోనీ డీ లా మోత్ కాడిలాక్51 మంది కెనడా దేశానికి చెందిన ఫ్రెంచ్ దేశస్థులను వెంట పెట్టుకుని పోర్ట్ పంచార్‌ట్రెయిన్ డ్యూ డెట్రాయిట్ పేరుతో ఒప్పందం కుదుర్చుకొని డెట్రాయిట్ నగరానికి పునాది వేశాడు.ఈ ఒప్పందం తరవాత కాలంలో కోమ్ట్ డీ పంచార్‌ట్రియన్ గా నామాంతరం చెందింది. నౌకాదళ మంత్రి 14వ లూయిస్ నాయకత్వంలో ఫ్రెంచ్ దేశస్థులు డెట్రాయిట్‌లో ఉచితంగా స్థలంకేటాయించి ప్రజలను డెట్రాయిట్ వైపు ఆకర్షించారు. ఈ కారణంగా ఇక్కడి జనసంఖ్య 800 నుండి 1765 కు అభివృద్ధి చెందింది. ఫ్రాంకోయిస్ మారీ పికోట్,సియూర్ డీ బెలెస్ట్రే ఫోర్ట్ డెట్రాయిట్ యొక్క ఆఖరి సైకాధికారి(మిలటరీ కమాండర్)(1758-1760)1760 నవంబర్ 29న ఈ ప్రాంతాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వానికి అప్పగించాడు.

ఫ్రెంచ్ మరియు ఇండియన్ యుద్ధసమయంలో (1760) బ్రిటిష్ సైన్యం ఈ నగరాన్ని స్వాధీన పరచుకుని దీనికి డెట్రాయిట్ నామాన్ని ధృవీకరించారు. పలు ఓత్వా నాయకుడు చీఫ్ పోంటియాక్ నాయకత్వంలో పోంటియాక్ రిబెల్లియన్ రూపుదిద్దుకుని సైజ్ ఆఫ్ ఫోర్ట్ డేట్రాయిట్ పేరుతో జరిగిన దాడి అనంతరం అనధికారిక ఇండియన్ భూమి మీద అంక్షలతో చేర్చి రాయల్ ప్రొక్లెమేషన్ 1963గా ప్రకటన వెలువడింది. జయ్ ట్రీటీ (1796)పేరుతో జరిగిన ఒప్పందం మూలంగా డెట్రాయిట్ అమెరికా ప్రభుత్వ వశమైంది. ఈ ఒప్పందం ద్వారా పొందిన డెట్రాయిట్ నగరం దాదాపు నగరమంతా మంటలపాలైంది. నదీతీరంలో ఉన్న గోడౌన్ ఒకటి చెక్క ఇళ్ళ ఇటుకల చిమ్నీలు మాత్రమే అవశేషాలలా మిగిలిన నిర్మాణాలు.

డెట్రాయిట్ 1805నుండి 1847 డెట్రాయిట్ మిషిగాన్ రాష్ట్ర రాజధానిగా ఉంది. అగస్టస్ బి వుడ్‌వార్డ్ రూపకలపనలో నగరాభివృద్ధి జరిగింది.వా ఆఫ్ 1812సమయంలో డెట్రాయిట్ తిరిగి బ్రిటిష్ సైన్యం వశమైంది . ఈ ఆక్రమణకు సయిజ్ జ్ ఆఫ్ డెట్రాయిట్ అని నామకరణం చేశారు. 1813 నాటికంతా డెట్రాయిట్ నగరాన్ని తిరిగి అమెరికా ప్రభుత్వం స్వాధీనపరచుకుని 1815 నాటికి అమెరికా ప్రభుత్వం కార్పొరేషన్‌గా చేసి నగర హోదాను ఇచ్చింది. వ్యూహాత్మకంగా గ్రేట్ లేక్స్ జలమార్గం వెంట ఉండటం మరొక ప్రత్యేకత. డెట్రాయిట్ నగరం ప్రముఖ రవాణా కేంద్రంగా రూపుదాల్చింది.

సివిల్ వార్‌కు ముందు కెనడా సరిహద్దులను చేరటానికి డెట్రాయిట్ నగర భూగర్భ రైలు మార్గం ప్రధాన కేంద్రం. ఆ సమయంలో లెఫ్టినెంట్ ఉలిసెస్ ఎస్ గ్రాంట్ ఈ నగరంలో నివసించాడు. ఆ తరవాత కాలంలో ఆయన అమెరికాదేశ ప్రెసిడేంట్ హోదాకు చేరుకున్నాడు. ఆయన నివసించిన ఇల్లు ఇంకా ఈ నగరంలో మిచిగాన్ రాష్ట్రం ఫైర్ గ్రౌండ్స్‌లో ఉంది. ఈ అనుబంధం కారణంగా సివిల్ వార్ సమయంలో అనేక డెట్రాయిట్ నగరవాసులు స్వచ్చందంగా సైన్యంలో చేరి యుద్ధంలో పాల్గొన్నారు. సివిల్ వార్ ప్రారంభంలో ఐరన్ బ్రిగేడ్ పేరుతో వాషింగ్టన్ డి.సిని రక్షించారు. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ప్రత్యేకంగా మిషిగాన్ రాష్ట్రానికి కృతజ్ఞతలు చెప్పటం ఈ రాష్ట్రవాసులకు గర్వకారణం. అబ్రహాం లింకన్ మరణానంతరం మార్టియస్ పార్క్ ఆవరణలో అక్కడకు చేరిన వేలకొలది శ్రోతల సమీపంలో జార్జ్ ఆర్మ్ స్ట్రాంగ్ కస్టర్ అంజలి ఘటించాడు. వాల్వరిన్స్‌ పేరుతో పిలువబడిన మిషిగాన్ బ్రిగేడ్‌కు కస్టర్ నాయకత్వం వహించాడు.ఆతరవాత వీరిని వాల్వరిన్స్ అని పిలిచేవారు.

1800 ఆఖరి కాలం 1900ఆరంభకాలంలో గిల్డెడ్ ఏజ్ మాన్‌షన్స్(పురుషుల వసతి గృహాలు)మరియు భవనాలు రూపుదిద్దుకున్నాయి. పడమటి తీర పారిస్‌గా డెట్రాయిట్ నగరం నిర్మాణ సౌందర్యం మరియు సరికొత్తగా థామస్ ఆల్వా ఎడిసన్ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణ చేయబడిన వాషింగ్టన్ వ్యూహాత్మకంగా గ్రేట్ లేక్స్ తీరంలో నిర్మించిన వాషింగ్టన్ డి.సి బౌల్‌వర్డ్ ప్రత్యేకత సాధించింది.1830నుండి నౌకలూ మరియు నౌకానిర్మాణం అభివృద్ధి చెందడంతో డెట్రాయిట్ నగరం స్థిరంగా అభివృద్ధి చెందుతూ ఉంది.నగరంలో నూతనంగా కర్మాగారాలు స్థాపించడం అభివృద్ధికి మరొక కారణం.1896లో అత్యధికంగా అభివృద్ధి చెందిన హెన్రీ ఫోర్డ్ వాహన వాణిజ్యం ఇచ్చిన ప్రేరణతో ఒక మ్యాక్‌ అవెన్యూలోఅద్దెకు తీసుకున్న ప్రదేశంలో ఆటోమొబైల్(వాహన) కర్మాగారం ప్రారంభించాడు.1904లో హెన్రీ ఫోర్డ్ ఈ నగరంలో ఫోర్డ్ మోటర్ కంపెనీని స్థాపించాడు.అలాగే విలియమ్ సి డ్యురాంట్ స్థాపించిన జెనరల్ మోటర్ కంపెనీ మరియు చెవర్లెట్ కంపెనీ,ది డాడ్జి బ్రదర్స్,పాకర్డ్ మరియు వాల్టర్ క్రిస్లర్‌లు డెట్రాయిట్ నగరాన్ని ఆటోమొబైలె రాజధానిగా మార్చారు.అలాగే గార్బోస్కై మరియు రాపిడ్‌ల ట్రక్ తయారీ కంపెనీల స్థాపనకు ప్రేరణ కలిగించింది.

మధ్యపాన నిషేధం అమలులో ఉన్న కాలంలో అక్రమ రవాణాదారులు ఈ నదిని ముఖ్యమార్గంగా ఉపయోగించుకున్నారు.అప్రతిష్టా కరమైన కెనెడియన్లు అధికంగా కలిగిన పర్పుల్ గ్యాంగ్ రూపుదిద్దుకుని వారు సాగించిన అక్రమ కార్యకలాపాలు చరిత్రలో బాధాకరమైన గుర్తులుగా మిగిలాయి.లో యునైటెడ్ ఆటో వర్కర్స్ డెట్రాయిట్ ఆటో తయారీదారుల మధ్య చలరేగిన వివాదాలనంతరం లేబర్ సమస్యలు 1930 నాటికి ముగింపుకు వచ్చాయి.ఆ సమయంలో చెలరేగిన లేబర్ సమ్మె కార్యకలాపాలు యూనీన్లీడర్లైన జిమ్మీ హోఫా మరియు వాల్టర్ ర్యూథర్ లకు కొంత అపకీర్తిని తెచ్చాయి. 1940 లో నగరంలో ప్రపంచంలోని మొదటి ఫ్రీవే(రహదారి)ది డేవిషన్నిర్మాణం జరిగింది.డెట్రాయిట్ నగరంలో రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధితో నగరానికి ఆర్సనల్ ఆఫ్ డెమాక్రసీ అనే మరొక మారు పేరు రావడానికి కారణం అయింది.

20వ శతాబ్ధపు మొదటి సగభాగంలో నగరంలో విస్తరించిన పరిశ్రమల కారణంగా డెట్రాయిట్ నగరానికి వచ్చి అనేక వేలమంది వచ్చి స్థిరపడసాగారు.వీరిలో ప్రత్యేకంగా దక్షిణామెరికా కార్మికులు ఉన్నారు.ఆ కారణంగా ఆసమయంలో డెట్రాయిట్ అమెరికాలో నాలగవ పెద్ద నగరంగా గుర్తించబడింది.అదేసమయంలో అనేకవేల యురేపియన్లు డెట్రాయిట్ నగరానికి ప్రవాహంలా వచ్చి చేరారు.ఈ అసాధారణ అభివృద్ధి కొంత సాంఘిక ఉద్రిక్తలకు దారి తీసాయి.1950 నాటికి ఆటోమబైల్ రంగంలో ఉద్యోగాలకు పోటీ పెరిగింది.1950 మరియు 1960 వరకూ నిర్మించబడిన ఫ్రీవే(రహదారి) ఉద్యోగుల రాకపోకలను సులభతరం చేసింది.1967 లో జరిగిన ట్వెల్త్ స్ట్రీట్ రాయిట్ తరవ్శాత వెలువడిన న్యాయస్థాన ఆదేశాలు శ్వేతజాతీయులు నగరం వెలుపలకు వెళ్ళి నివాసాలు ఏర్పరుచుకోవడానికి దారితీసాయి.ఈ వలసలు నగరంలో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాయి.ప్రజలు ఉద్యోగాలు నగరం వెలుపలకు వెళ్ళడంతో నగర జనసంఖ్య సగానికి దిగివచ్చింది.

డెట్రాయిట్ నగరంలో 1973 నుండి 1979 వరకూ కొనసాగిన చమురు(గ్యాసో లైన్) కొరత విదేశీ లఘు వాహనాలను(చిన్న కార్లు) అమెరికా రోడ్లపై పయనించేలా చేసింది.బచ్ జోన్స్,మసెరాటి రిక్ మరియు చాంబర్స్ బ్రదర్స్ ప్రభావంతో నగరంలో క్రాక్ కోకైన్ మరియు హెరాయిన్ లాంటి మత్తు పదార్ధాల వినియోగం ఎక్కవై యువతపై దుష్ప్రభావం చూపించింది.నిరంతరంగా సాగుతున్న బృహత్ నిర్మాణాలవైపు నగర పెద్దలదృష్టి పడటంతో 1970 లో రినైసెన్స్ సెంటర్ నిర్మించడానికి దోహదమైంది.ఇది నగరంలో మరొక నగరం వర్ణించబడిన బృహత్తర ఆకాశహర్మ్యాల సముదాయం.ఆతరవాతి కాలంలో 1990 నగరపురాల వలస అనివార్యంగా సాగినా వలసలు చాలావరకు నెమ్మదించాయి అన్నది వాస్తవం.

డెట్రాయిట్ నగరంలో 1980 నిర్వహించబడిన రిపబ్లికన్ నేషనల్ కాన్‌వెన్‌షన్ మహాసభలో రోనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్‌గా ప్రతిపాదించబడిన ప్రతిపాద విజయయవంతమై రోనాల్డ్ రీగన్ ను అమెరికా ప్రెసిడెంట్‌ను చేసింది.ఆతరవాత చాలినంత పోలీస్ బలం లేని కారణంగా మూడు దశాబ్ధాల కాలం మత్తుపదార్ధాల వినియోగం మరియు నేరాలు నగరంలో స్వైర విహారం చేసి ఎల్మ్ హర్స్ట్ బ్లాక్ లాంటి ప్రదేశాలను నిర్మూలించడానికి దారితీసాయి.1980 సమయంలో నిరాదరంగా వదిలివేయబడిన కట్టడాలను పడగొట్టి మత్తుపదార్ధాల అమ్మకందారుల దారులను మూసివేసే ప్రయత్నాలకు ఊపిరి పోసారు.ఇలాటి ప్రదేశాలు అర్బన్ ప్రెయరీ(నిర్మాణాలను పడగొట్టడం ద్వారా ఏర్పడిన బయలు) లుగా మారాయి.

1990 లో డౌన్‌టౌన్ కేంద్రాంలో అధికంగా కలిగిన చైతన్యం నగర ప్రజలను ఆనందపరచింది.కొమెరికా సెంటర్ ఎట్ డెట్రాయిట్ సెంటర్ 1990 డౌన్ టౌన్‌లో ఆకాశసౌధాల జాబితాలో చేరింది.ఆతరవాత నగరంలో ఎమ్‌జి్‌ఎమ్ కాసినో ,మోటర్సిటీ కాసినో మరియు గ్రీక్ టౌన్ కాసినో ల నిర్మాణం జరిగింది.వాటిలో 2007,2008 లలో వసతిగృహాలు నిర్మించి అదనపు సౌకర్యాలను చేర్చారు.2000 నుండి 2002 వరకు డెట్రాయిట్ టైగర్స్ మరియు డెట్రాయిట్ లైన్స్ కొరకు స్టేడియమ్‌లు నిర్మించబడ్డాయి.1974 తరవాత డెట్రాయిట్ లయిన్స్ కు స్వస్థలంలో స్టేడియమ్ వసతి కలిగింది.డెట్రాయిట్ నగరం 2005 లో ఎమ్‌ఎల్‌బి ఆల్‌స్టార్ గేమ్ ,2006 లో సూపర్ బౌల్ ఎక్స్‌ఎల్ ,2006 వరల్డ్ సీరీస్ మరియు 2007 లో రెస్టెల్ మానియా 23 క్రీడలకు ఆతిధ్యం ఇచ్చింది.ఈ క్రీడలు డౌన్ టౌన్ ప్రదేశంలో అత్యంత అభివృద్ధిని తీసుకువచ్చింది.

డెట్రాయిట్ నగర నదీతీరాలు అభివృద్ధి చేయడానికి తగిన కేంద్రాలయ్యాయి.నదీ తీరంలోని కొన్ని మైళ్ళ పొడవున ఉద్యానవనాలు మరియు ఫౌంటెన్లతో చేరిన డెట్రాయిట్ రివర్ వాక్ నిర్మించబడింది.నగరపురాలలో అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్ డెట్రాయిట్ పేరొతో ఆరంభించిన ఈ అభివృద్ధి నగరానికి పర్యాటకుల ద్వారా ఆదాయం కలిగేలా చేసింది.నదీతీరం వెంట అత్యంత ఖరీదైన వాటర్ మార్క్ డెట్రాయిట్ లాంటి కట్టడాలను నగరవాసులు ఇదివరకు చూడని విధంగా నిర్మించడం ఆరంభమైంది.వెల్‌కమ్ టు డెట్రాయిట్,ది రీనైసెన్స్ సిటీ ఫౌండెడ్ 1701 ఫలకం అందంగా నగరంలోకి వచ్చేవారికి అతిధిలా స్వాగతం ఇస్తుంది.

[మార్చు] నగర ఉపస్థితి

డెట్రాయిట్ నదీతీరం

డెట్రాయిట్ నగర విస్తీర్ణం యునైటెడ్ స్టేట్ సెన్సస్ బ్యూరో గణాంకాలననుసరించి 143 చదపపు మైళ్ళు ఉంటుంది.అందులో 138.8 చదరపు మైళ్ళు భూభాగం,4.2 చదరపు మైళ్ళు జలభాగం.నగరానికి వాయవ్య భాగంలో ఉన్న యూనివర్శిటీ డిస్ట్రిక్ నగర పరిసరప్రాంతంలోని ఎత్తైనన భూభాగం.డెట్రాయిట్ మరియు ఆగ్నేయ మిచిగాన్ భూభాగం కలిపి డెట్రాయిట్ మహానరంగా పరిగణిస్తారు.నగరానికి వాయవ్యంలో ఉన్న యూనివర్శిటీ భూభాగం ఎత్తు 670 అడుగులు.డెట్రాయిట్ నదీతీర భూభాగం నగరంలో లోతట్టు ప్రాంతం.దాని ఎత్తు 579 అడుగులు. నగరంలోని హామ్ట్రాక్ మరియు హైలాండ్ పార్కుల ప్రాంతాలను పూర్తిగా చుట్టి దెట్రాయిట్ ప్రవహిస్తూ ఉంది.నగరానికి ఈశాన్యంలో సంపన్నులు అధికంగా నివాసమున్న గ్రాస్ పాయింట్ ఉంది.ది డెట్రాయిట్ రివర్ ఇంటర్నేషనల్ విల్డ్ లఫ్ రెఫ్యూజ్ ప్రాంతం ఉత్తర అమెరికాలోని ఒకే ఒక అంతర్జాతీయ వన్యమృగ సంరక్షణ భూభాగం.మహానగర కేంద్రంలో ప్రతిష్టితమై ఉన్న ఈ సంరక్షణ కేంద్రం దీవులు,నదీతీర చిత్తడి నేలలు,పచ్చిక బయళ్ళు,జలచరాలతో సమ్మిశ్రితమై 48 నది మరియు వెస్ట్రన్ లేక్ ఎర్రీ తీరం వెంట వ్యాపించి ఉన్న సుందర ప్రాంతం.నగరాన్ని కలుపుతూ మూడు రహదార్లు దాటి పోతుంటాయి. అమెరికా మరియు కెనడాల సరహద్దులలో ఉన్న ప్రధానమెరికా నగరం డెరాయిట్ మాత్రమే.నగరంలో సరిహద్దులు దాటటానికి నాలుగు మార్గాలు ఉన్నాయి.ది అంబాసిడర్ బ్రిడ్జ్ మరియు డెట్రాయిట్ వండ్సర్ టన్నెల్ గుండా వాహనాలలో వెళ్ళే సదుపాయం ఉంది.మిచిగాన్ సెంట్రల్ రైల్వే టన్నెల్ మార్గంలో రైలుద్వారా కెనడాను చేరుకోవచ్చు.నాల్గవ మార్గంలో విండ్సర్ సాల్ట్ మైన్ మరియు జంగ్ ఇలాండ్ ప్రాంతం నుండి డెట్రాయిట్ విండ్సర్ ట్రక్ ఫెర్రీ లద్వారా కెనడాను చేరుకోవచ్చు.15,00 ఎకరాలలో విస్తరించి ఉన్న విండసర్ సాల్ట్ మైన్ సముద్ర తీరానికి 1,100 అడుగుల లోతు వరకు ఉంటుంది.డెట్రాయిట్ సాల్ట్ మైన్ రోడ్ల పొడవు 100 మైళ్ళు.

[మార్చు] వాతావరణం

నగరంలోని వాతావరణం నదీ మరియు సరసు ప్రభావంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.చలికాలం స్వల్పమైన హిమపాతంతో కూడిన చలి ఉంటుంది.చలికాలంలో కొన్ని సమయాలలో ఆకశ్మికంగా ఉష్ణోగ్రత పడిపోవడం ఇక్కడ సహజం.అలాగే వేసవిలో కొన్ని సమయాలలో హెచ్చుతూ ఉండటం సహజమే.చలికాలంలో అత్యల్పంగా మైనస్ 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వేసవి కాలంలో 90 డిగ్రీల సెంటీ గ్రేడ్ అత్యధిక ఉష్ణం కలిగిన వాతావరణం ఉంటుంది.నవంబర్ నుండి ఏప్రిల్ మాస ప్రారంభం వరకు హిమపాతం ఉంటుంది.హిమపాతం 1 నుండి 10 అంగుళాలు పడుతుంది.

[మార్చు] భవన నిర్మాణం

డెట్రాయిట్ నగర జలతీరాలలో విభిన్న సుందర భవన సముదాయాలు చోటు చేసుకున్నాయి.ఆధినిక నిర్మాణాలకు కొంచం ముందుగా నిర్మించబడిన నియోగోతిక్ గోపురాలు కలిగిన డెట్రాయిట్ సెంటర్లో కోమెరికా టవర్ ఆఫ్ డెట్రాయిట్ సెంటర్ ఆర్ట్ డికో సంస్థ ఆధ్వైర్యంలో1993 లో రూపుదిద్దుకున్నాయి. రినైసెన్స్ సెంటర్‌తో చేర్చి వారు ప్రత్యేకత కలిగిన గుర్తించతగిన ఆకాశసౌధాల నిర్మాణం చేసారు.ఉదాహరణగా డౌన్ టౌన్‌లో ఉన్న ఆర్ట్ డికో శైలిలో నిర్మించబడిన గార్డియన్ బిల్డింగ్ మరియు పెనోబ్‌స్కాట్ బిల్డింగ్ అలాగే వేన్‌సెంటర్‌ డిస్ట్రిక్ లో న్యూ సెంటర్‌లో ప్రదేశంలో ఫిషర్ బిల్డింగ్ మరియు కాడిలాక్ ప్యాలెస్ ప్రధానమైన బృహత్తర నిర్మాణాలు.నగర ప్రముఖ భవనాల మద్య దేశంలోనే బృహత్తర నిర్మాణాలైన ఫాక్స్ ధియేటర్ ,ది డెట్రాయిట్ ఒపేరా హౌస్ మరియు డెట్రాయిట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ భవనాలు చోటు చేసుకున్నాయి.

ఒకవైపు డౌన్ టౌన్ మరియు న్యూసెంటర్‌లో ఆకాశసౌధాలు ఉన్నట్లే నగరమంతా సాధారణమైన ఎత్తులో నిర్మించిన నివాసగృహాలతో నిండి ఉన్నాయి.నగరవెలుపలి ప్రాంతాలలో ఎత్తైన నివాసగృహ సముదాయాలు ఉన్నాయి.తూర్పుతీరాలలో గ్రాస్ పాయింట్ మరియు పాలమర్ పార్క్ వరకు విస్తరించి ఉన్న భవన సముదాయాలు వీటిలో కొన్ని.ఈ భవన సముదాయాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు శ్రామిక వర్గం నిర్మించుకున్నవి.ఈ గృహాలు కలపతో చేసిన చట్రాలూ ఇటుక రాళ్ళు వాడి కట్టబడి ఆకాల నిర్మాణ శైలికి అద్దం పడుతున్నాయి.మద్యతరగతి వారు నివసించే పెద్ద పెద్ద ఇటుకరాళ్ళ గృహాలు మరియు పురుషుల వసతి గృహాలూ కలిగిన ప్రాంతాలూ నగరంలో ప్రసిద్ధం.ఇవి బ్రష్ పార్క్,ఉడ్ బ్రిడ్జ్,ఇండియన్ విలేజ్ ,పాల్మర్ ఉడ్స్,షర్ ఉడ్ ఫారెస్ట్ మరియు ఇతరాలు.పడమటి తీరంలో దూరంగా 8 మైళ్ళ రోడ్డు సమీపంలో 1950 లో శ్రామిక వర్గ గృహనిర్మాణాలు ఉడ్ వార్డ్ మరియు జఫర్సన్ సమీపంలో ఉన్న క్రాక్‌ టౌన్ లో తమ ప్రాచీనతను ప్రతిబింబిస్తూ ఉన్నాయి.ప్రస్థుతం ఐరిష్ మరియు బ్రష్ పార్క్ ప్రాంతాలలో అనేక మిలియన్ల డాలర్లతో నిర్మించబడుతున్న నివాస గృహసముదాయాలు ఉన్నాయి.

నగరంలోని ప్రత్యేకంగా కళాత్మక విలువలు కలిగిన భవనాలు జాతీయ చారిత్రక భవనాలుగా గుర్తించబడి సంరక్షించ బడుతున్నాయి.నగరంలో పంతొమ్మదవ శతాబ్ధం ఆఖరి దశలో మరియు ఇరవై ప్రారంభ దశలో నిర్మించబడిన భవనాలు అనేకం ఇంకా సజీవంగా ఉన్నాయి.వాటిలో సెంయింట్ జోసెఫ్ కాథలిక్ చర్చి ,సెయింట్ అన్నే డీ డెట్రాయిట్ కాథలిక్ చర్చ్ లాంటి చర్చీలు అనేకం ఉన్నాయి.

నదీ తీరంలో మూడున్నర మైళ్ళ వరకు విస్తరించి ఉన్న డెట్రాయిట్ ఇంటర్‌నేషనల్ రివర్ ఫ్రంట్ నివాస గృహాలు ఉద్యానవనాల కలయికతో సుందరంగా ఉంటుంది.

[మార్చు] పరిసరాలు

[మార్చు] నగర సంస్కృతి

[మార్చు] వినోదం

[మార్చు] పర్యాటక రంగం

[మార్చు] ప్రచార మాద్యమం

[మార్చు] ఆర్ధిక రంగం

[మార్చు] జన సంఖ్య

[మార్చు] చట్టం ప్రభుత్వం

[మార్చు] రాజకీయాలు

[మార్చు] నేరం

[మార్చు] విద్య

[మార్చు] నగర నిర్మాణం

[మార్చు] ఆరోగ్యం

[మార్చు] ప్రయాణ సౌకర్యాలు

[మార్చు] మూలాలు

  1. [[[:మూస:Gnis3]] USGS detail on Detroit]. తీసుకొన్న తేదీ: 2007-02-18.
  2. Annual Estimates of the Population for Incorporated Places Over 100,000, Ranked by July 1, 2006 Population: April 1, 2000 to July 1, 2006. U.S. Census Bureau. తీసుకొన్న తేదీ: 2007-06-28.
  3. American FactFinder. United States Census Bureau. తీసుకొన్న తేదీ: 2008-01-31.
  4. US Board on Geographic Names. United States Geological Survey (2007-10-25). తీసుకొన్న తేదీ: 2008-01-31.
"http://te.wikipedia.org/w/index.php?title=డెట్రాయిట్&oldid=708364" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు