డెల్టా ఫోర్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మూస:Infobox military unit

1వ స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషనల్ డిటాచ్ మెంట్-డెల్టా (1st SFOD-D )అనేది విశిష్టమైన ఒక స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ (SOF)మాత్రమే కాకుండా, జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (జ్సోక్) యొక్క సమగ్ర అంశం. అమెరికా సంయుక్త రాష్ట్రాల రక్షణ శాఖలో ఇది సాధారణంగా డెల్టా , డెల్టా ఫోర్స్ లేదా కాంబ్యాట్ అఫ్లికేషన్స్ గ్రూప్ (CAG)గా సుపరిచితం. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క ప్రాథమిక తీవ్రవాద నిరోధక విభాగం.

తీవ్రవాద నిరోధం, తిరుగుబాటు నిరోధం, జాతీయ మధ్యవర్తిత్వ చర్యలు లాంటివి డెల్టా ఫోర్స్ యొక్క ప్రాథమిక విధులు. అయినప్పటికీ, ఇది కేవలం బంధీలను కాపాడడం, దాడులు నిర్వహించడం లాంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా, అనేక కోవర్ట్ మిషన్లులో భాగం వహించగలిగిన ఒక పూర్తి స్వతంత్ర బృందం.[1]

విషయ సూచిక

చరిత్ర[మార్చు]

అందరి దృష్టినీ ఆకర్షించే రీతిలో 1970లలో అసంఖ్యాకమైన తీవ్రవాద సంఘటలను చోటు చేసుకోవడంతో దేశంలో ఒక తీవ్రవాద నిరోధ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ విధంగా డెల్టా ఫోర్స్ తెరమీదకు వచ్చింది.

మరోవైపు 60ల ప్రారంభంలోనే ఈ రకమైన బృందం కోసం ఒక నమూనా రూపంలో కీలక సైనిక, ప్రభుత్వ రూపాలను సంక్షిప్తం చేయడం జరిగింది. US ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ సభ్యుడైన ఛార్లెస్ బెక్‌విత్, ఒక ఎక్ఛేంజ్ ఆఫీసర్‌గా బ్రిటీష్ స్పెషల్ ఎయిర్ సర్వీస్‌(22 SAS రెజిమెంట్)తో కలిసి పనిచేశారు. బెక్‌విత్ అమెరికాకు తిరిగి వచ్చాక, SAS-తరహా విభాగాన్ని కలిగి ఉండకపోవడం వల్ల తమ దేశ సైన్యం ఎంత దుర్భలమైన స్థితిలో ఉందనే విషయాన్ని ఎత్తి చూపుతూ ఒక వివరణాత్మక నివేదికను సమర్పించారు. ఆ సమయంలో U.S. సైనిక ప్రత్యేక దళాలు అసాంప్రదాయక యుద్ధ తంత్రాలపై దృష్టిపెట్టి ఉన్నాయి. అయితే, బెక్‌విత్ మాత్రం ప్రత్యక్ష చర్య మరియు తీవ్రవాద వ్యతిరేక అంశాల్లో ప్రత్యేక తర్ఫీదు పొందిన అత్యధిక స్వతంత్ర బృందాల ఆవశ్యకతను గుర్తించారు. ఈ కారణంగానే ప్రత్యేక దళాల శ్రేణికి వెలుపల మరో విభాగాన్ని సృష్టించేందుకు ప్రాథమికంగా నిరోధం కలిగిన సైనిక, ప్రభుత్వ రూపాలను బెక్‌విత్ సంక్షిప్తం చేశారు. చివరకు 70ల మధ్య కాలంలో తీవ్రవాదం హెచ్చు మీరడంతో, బెక్‌విత్ సూచించిన విధంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు పెంటగాన్ అధికారులు సిద్ధమయ్యారు.[2]

తాను ప్రతిపాదించిన కొత్త విభాగానికి సంబంధించిన బృందం సిద్ధం కావాలంటే 24 నెలల కాలం పట్టవచ్చని బెక్‌విత్ అంచనా వేశారు. ఇదిలా ఉండగా, 5వ స్పెషల్ ఫోర్సెస్ గ్రూప్, బ్లూ లైట్ పేరుతో ఒక చిన్న తీవ్రవాద నిరోధక దళాన్ని ఏర్పాటు చేసింది. 1980ల ప్రారంభంలో డెల్టా పూర్తిస్థాయిలో విధులు నిర్వహణకు సిద్ధమయ్యే సమయం వరకు ఈ దళం పనిచేసింది.

ఇక డెల్టా రంగంలోకి వచ్చిన కొద్ది రోజులకే అంటే, నవంబర్ 4, 1979న ఇరాన్‌లోని తెహ్రాన్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంలో 53 మంది అమెరికన్లు బంధీలుగా తీసుకోబడ్డారు. దీంతో ఆపరేషన్ ఈగిల్ క్లావ్‌ నిర్వహణకు ఆజ్ఞలు స్వీకరించిన ఈ బృందం రహస్యంగా ఆ దేశంలో ప్రవేశించడంతో పాటు,1980, ఏప్రిల్ 24-25 మరియు 25-26 రాత్రి సమయంలో బలప్రయోగం ద్వారా రాయబార కార్యాలయం నుంచి బంధీలను విడిపించింది. అయితే, సమస్యలు ఉత్ఫన్నం కావడం, ప్రమాదాల కారణంగా ఈ ఆపరేషన్ మధ్యలోనే ఆగిపోయింది. ఆపరేషన్ వైఫల్యాన్ని పరీక్షించిన సమీక్షా కమిషన్‌ ఈ ఆపరేషన్‌తో పాటు 23 సమస్యలను గుర్తించింది. ఎయిర్‌క్రాఫ్ట్ ప్రతికూల వాతావరణానికి గురికావడం, బహుళ-సేవ అంశానికి సంబంధించిన కమాండర్స్ మధ్య ఆదేశం-మరియు-నియంత్రణ సమస్యలు ఏర్పడడం, హెలిక్యాప్టర్, గ్రౌండ్-రీఫ్యూయిలింగ్ ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ మధ్య ఘర్షణ మరియు మెకానికల్ సమస్యలు లాంటివి ఇందులో ముఖ్యమైనవి. ఈ రకమైన సమస్యలన్నీ కలిసి ఊహించని విధంగా మిషన్ సైనికదళం ట్రాన్స్ లోడింగ్/రీఫ్యూయిలింగ్ ప్రదేశం నుంచి నిష్క్రమించడానికి ముందుగానే అందుబాటులో ఉన్న హెలిక్యాప్టర్ల సంఖ్యను ఎనిమిది నుంచి ఐదుకు (కోరుకున్న కనిష్ట సంఖ్య కంటే ఒకటి తక్కువ) తగ్గించి వేశాయి.[3]

ఈ విఫలమైన ఆపరేషన్ తర్వాత, అమెరికా ప్రభుత్వం అనేక తీవ్రవాద నిరోధక విభాగాలను ఏర్పాటు చేసింది. ఆపరేషన్ ఈగిల్ క్లావ్ లాంటి మిషన్ల నిర్వహణ సందర్భంగా డెల్టా లోపలికి వెళ్లేందుకు/బయటకు వచ్చేందుకు 160వ స్పెషల్ ఆపరేషన్స్ ఏవియేషన్ రెజిమెంట్ (ఎయిర్‌బోర్న్)ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. నైట్‌స్టాల్కర్స్ గా కూడా ఇది సుపరిచితమైనది. అలాగే సముద్ర సంబంధిత సంఘటనల కోసం నేవీ SEAL టీమ్ సిక్స్ ను ఏర్పాటు చేసింది. అమెరికా సైన్యానికి సంబంధించిన వివిధ శాఖల యొక్క తీవ్రవాద నిరోధక ఆస్తుల మధ్య సంయుక్త శిక్షణను నియంత్రించేందుకు మరియు పర్యవేక్షించేందుకు జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్‌ను ఏర్పాటు చేశారు.

సంస్థ మరియు నిర్మాణం[మార్చు]

ఈ బృందం అమెరికా ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (USASOC)యొక్క పరిధిలో ఉన్నప్పటికీ, జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (JSOC)ద్వారా ఈ బృందం నియంత్రించబడుతుంటుంది. నిజానికి ఈ బృందానికి సంబంధించిన అన్ని రకాల సమాచారం అత్యంత రహస్యమైనది. అలాగే నిర్థిష్ట మిషన్స్ లేదా ఆపరేషన్లకు సంబంధించిన వివరాలు సాధారణంగా బహిరంగంగా అందుబాటులో ఉండవు. కమాండ్ సార్జంట్ మేజర్ ఎరిక్ ఎల్. హెనీ (రిటైర్డ్)రచించిన ఇన్‌సైడ్ డెల్టా ఫోర్స్తో సహా అనేక ఆధారాలు సూచిస్తున్న ప్రకారం, ఆపరేషన్లలో పాల్గొనే బృందాలతో కలిపి డెల్టా బృందంలోని మొత్తం సభ్యుల సంఖ్య 800 నుంచి 1000 వరకు ఉండవచ్చు:

విభాగానికి సంబంధించిన హోదాలు[మార్చు]

 • D - కమాండ్ అండ్ కంట్రోల్ (ప్రధాన కార్యాలయం)
 • E - కమ్యూనికేషన్స్, ఇంటెలిజెన్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ (ఆర్థికం, సేవా తంత్రాలు, వైద్య విభాగం, పరిశోధన మరియు అభివృద్ధి, సాంకేతికత మరియు ఎలక్ట్రానిక్స్, మొదలగువాటిని కూడా ఇది కలిగి ఉంటుంది.)
 • F - ఆపరేషనల్ ఆర్మ్ (సైనిక చర్యలకు సంబంధించిన బృందాలు)
 • వైద్య విభాగం అనేది ప్రత్యేక వైద్యులను ఫోర్ట్ బ్ర్యాగ్‌ వద్ద నిర్వహిస్తుంది. అలాగే, అవసరమైన సమయంలో వైద్య సాయం అందించడం కోసం వివిధ రకాల ఇతర స్థావరాలను సైతం దేశవ్యాప్తంగా రహస్యంగా నిర్వహిస్తుంది
 • ఆపరేషనల్ సపోర్ట్ ట్రూప్, లేదా "ది ఫన్నీ ప్లాటూన్" అనేది డెల్టా యొక్క అంతర్గత ఇంటెలిజెన్స్ శాఖ. ఇంటెలిజెన్స్ సపోర్ట్ యాక్టివిటీతో దీర్ఘకాలం సాగిన వివాదం/వైరం నుంచి ఇవి పుట్టుకొచ్చాయి. రహస్య సమాచారాన్ని సేకరించేందుకు డెల్టా జోక్యం చేసుకోవడానికి ముందుగానే ఇవి ఒక దేశంలోకి చాకచక్యంగా ప్రవేశించగలవు.
 • డెల్టా అనేది 160వ- స్పెషల్ ఆపరేషన్స్ ఏవియేషన్ రెజిమెంట్ పైనే ఆధారపడినప్పటికీ, మరియు ఆపరేషనల్ సైన్యాలు పంపడం, శిక్షణ కసరత్తుల కోసం తరలించడానికి అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఆస్తులు ఉపయోగపడినప్పటికీ, బృందం లోపల చిన్నపాటి వైమానిక రవణా కోసం ఒక చిన్న వైమానిక దళాన్ని కూడా ఉపయోగించారు. ఈ వైమానిక దళం పన్నెండు AH-6 అటాక్ మరియు MH-6 ట్రాన్స్ ఫోర్ట్ హెలిక్యాప్టర్స్ (ఈ సంఖ్య పెరిగి ఉండినప్పటికీ) కలిగి ఉంటుంది. ఈ హెలిక్యాప్టర్లను నడిపే పైలట్లను ఎయిర్‌ఫోర్స్ నుంచి నియమించారా అనే విషయం తెలియనప్పటికీ, 160వ SOAR లేదా డెల్టాకు చెందిన నిర్వాహకులు ఒకవేళ హెలిక్యాప్టర్ పైలట్లుగా శిక్షణ పొంది ఉండవచ్చు.
 • ఆపరేషనల్ రీసెర్చ్ సెక్షన్
 • ట్రైనింగ్ వింగ్

డెల్టా ఫోర్స్ నిర్మాణం, బ్రిటీష్ 22 స్పెషల్ ఎయిర్ సర్వీస్ రెజిమెంట్‌ను పోలి ఉంటుంది. డెల్టా ఫోర్స్ ఏర్పాటు చేసేలా చార్లెస్ బెక్‌విత్‌ను ప్రేరేపించింది కూడా ఈ రెజిమెంటే. నాట్ ఏ గుడ్ డే టు డై: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఆపరేషన్ అనకొండ , ఆర్మీ టైమ్స్ ల రచయిత సేన్ నయ్‌లార్ వర్ణించిన ప్రకారం, డెల్టా అనేది కనీసం 1,000 మంది నిర్వాహకులను కలిగి ఉండేది.[4] ఇందులో సరాసరిగా 250 మంది నిర్వాహకులు ప్రత్యక్ష చర్య మరియు పర్యవేక్షణ లాంటి మిషన్ల కోసం శిక్షణ అందుకునే వారని నయ్‌లార్ తన రచనల్లో పేర్కొన్నారు.[4] మొత్తంమీద డెల్టాలో మూడు ప్రధానమైన ఆపరేషనల్ సైన్యవిభాగాలు ఉండేవి:

 • A సైన్యవిభాగం
 • B సైన్యవిభాగం
 • C సైన్యవిభాగం

ఈ సైన్యవిభాగాలు SAS "సబ్రే స్క్వాడ్రాన్" యొక్క సంస్థపై ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి విభాగం 75 నుంచి 85 మంది నిర్వాహకులను కలిగి ఉంటుంది[5]. ప్రతీ సబ్రే స్క్వాడ్రాన్ మూడు బృందాలుగా విడిపోతుంది. ఇందులో మొదటిది రెక్కె/స్నిపెర్ బృదం, రెండవది డైరెక్ట్ యాక్షన్/అస్సాల్ట్ బృందాలు. ఇవి నలుగురు నుంచి ఆరుగురు వ్యక్తులను కలిగి ఉండడంతో పాటు జట్లలో లేదా బృందాల్లో పనిచేస్తుంటాయి.

నియామకం మరియు శిక్షణ[మార్చు]

నియామకం[మార్చు]

డెల్టాలో నియమితులయ్యే చాలామంది యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ స్పెషల్ ఫోర్స్ మరియు 75వ రేంజర్ రెజిమెంట్ నుంచి వస్తుంటారు. అయితే కొంతమంది నిర్వాహకులు మాత్రం ఆర్మీలోని ఇతర విభాగాల నుంచి కూడా వస్తుంటారు.[6] 1990ల నుంచి, 1వ SFOD-D[7] కోసం అమెరికా సైన్యం విడుదల చేసిన నియామక ప్రకటనలన్నీ డెల్టా ఫోర్స్ నియామకం కోసమేనని అనేకమంది విశ్వసించేవారు. అయితే, సైన్యం మాత్రం ఈ దళం కోసం అధికారికంగా ఒక్క పత్రాన్ని కూడా విడుదల చేయలేదు. "...బృందాల నిర్వహణ కోసం పనిచేస్తున్న అమెరికా సైన్యం యొక్క ప్రత్యేక చర్యల విభాగం కోసం వివిధ రకాల అద్వితీయమైన ప్రత్యేక చర్యల నైపుణ్యాలతో పాటు వేగవంతమైన ప్రతిస్పందన కలిగిన అభ్యర్థులు అవసరమయ్యారు..." అని ఫోర్ట్ బ్రాగ్ వార్తా పత్రిక, పారాగ్లిడ్‌ లో ప్రచురితమైన నియామక ప్రకటనలను డెల్టా ఫోర్స్ కోసమేనని అప్పట్లో భావించేవారు.[8] ఆ ప్రకటనలోని సారాంశం ప్రకారం దరఖాస్తుదారులు తప్పకుండా పురుషులై ఉండాలి, E-4 నుండి E-8 వరకు ర్యాంకుల్లో ఉండాలి, కనీసం రెండున్నర సంవత్సరాల సర్వీసు ఉండాలి, 21 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసులో ఉండాలి. దీంతోపాటు అభ్యర్ధులను ప్రవేశం కోసం పరిగణించాలంటే వారు ఆర్మ్ డ్ సర్వీసెస్ వొకేషనల్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్టులో ఎక్కువ ప్రతిభ కనబరిచి ఉండాలి.

చారిత్రాత్మక ఎంపిక విధానం[మార్చు]

ఎరిక్ హెనీస్‌ పుస్తకం, ఇన్‌సైడ్ డెల్టా ఫోర్స్ లో ఎంపిక విధానం ప్రారంభం గురించి సంపూర్ణంగా వివరించబడింది. ఎంపిక కోర్సు అనేది ,పుష్-అప్స్, సిట్-అప్స్, మరియు 3-మైళ్ళు (4.8 కిమీ) పరుగుతో కూడిన ప్రామాణిక పరీక్షలతో ప్రారంభమవుతుందని హెనీ తన పుస్తకంలో రాశారు. ఎంపిక కోసం వచ్చిన అభ్యర్థులు మొదట ఒక వరుస భూయానం క్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో 18-మైళ్ళు (29 కిమీ) ఒక పూర్తి రాత్రి భూయానం కూడా కలిసి ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులు 40-pound (18 kg) వీపుపై బరువైన ఒక సంచిని కూడా మోయాల్సి ఉంటుంది. వీపుపై మోసే సంచీ బరువు, దూరం క్రమంగా పెంచబడుతాయి. మరియు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన సమయ ప్రామాణికాలు నడకను ప్రారంభించే ప్రతిసారి తగ్గించబడుతుంటాయి. అత్యంత కఠినమైన మార్గంలో 75-pound (34 kg)వీపుపై బరువైన సంచీతో ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియని విధంగా సాగే ఒక 40-మైళ్ళు (64 కిమీ)నడకతో శారీరక పరీక్ష అనేది పూర్తవుతంది. హెనీ రాసిన ప్రకారం, కేవలం సీనియర్ అధికారి, ఎంపిక కార్యక్రమం యొక్క ఇన్‌ఛార్జ్ NCO మాత్రమే నిర్థేశించిన సమయ పరిమితులను చూసేందుకు అనుమతించబడుతారు. అయితే, అన్ని రకాల మదింపులు, ఎంపిక కార్యక్రమాలు, పరిస్థితులు మాత్రం డెల్టా శిక్షణ కేడర్ ద్వారా మాత్రమే రూపొందించబడుతాయి.[9][10] ఇక ఈ పరీక్షల్లో భాగమైన మానసిక పరిశీలన అనేది వివిధ రకాలైన మానసిక పరీక్షలతో ప్రారంభమవుతుంది. దీని తర్వాత ఎంపిక కోసం వచ్చిన అభ్యర్థిని డెల్టా అధ్యాపకులు, మనో విశ్లేషణా బృందం, డెల్టా కమాండర్‌ల వద్దకు పంపుతారు. అక్కడ వారు అభ్యర్థిని కఠినమైన ప్రశ్నలతో పరీక్షిస్తారు. అంతేకాకుండా అభ్యర్థిని మానసికంగా అలసటకు గురిచేసి అతని నుంచి వచ్చే ప్రతిఒక్క ప్రతిస్పందన, అలవాటును వారు పూర్తిగా విశ్లేషిస్తారు. ఈ ప్రక్రియలన్నీ తట్టుకుని అభ్యర్థి ఎంపికైనట్టైతే, అప్పుడు యూనిట్ కమాండర్ వెళ్లి ఎంపికైన విషయాన్ని ఆ అభ్యర్థికి స్వయంగా తెలుపుతాడు. అభ్యర్థి డెల్టా ఫోర్స్ కోసం ఎంపికైన తర్వాత, 6 నెలలపాటు కఠినంగా సాగే ఆపరేటర్ ట్రైనింగ్ కోర్స్ (OTC)కి పంపబడుతాడు. ఇక్కడ అతను తీవ్రవాద నిరోధం, రహస్య నిరోధం లాంటి పద్దతులను నేర్పుకోవడం జరుగుతుంది. తుపాకీ పేల్చడంలో కచ్చితత్వం, వివిధ రకాల ఆయుధ సంపత్తి గురించిన శిక్షణ కూడా ఇందులో కలిసి ఉంటుంది.[10] సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎజెన్సీకి చెందిన అత్యంత రహస్య స్పెషల్ యాక్టివిట్స్ డివిజన్ (SAD) మరియు మరింత ప్రత్యేకంగా దాని ఉన్నత స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) లాంటివి తరచూ డెల్టా ఫోర్స్ నుంచి నిర్వాహకులను నియమిస్తూ ఉంటాయి.[11]

శిక్షణ[మార్చు]

డెల్టా ఫోర్స్ అప్పుడప్పుడూ మిత్ర దేశాల బృందాలైన ఆస్ట్రేలియన్ స్పెషల్ ఎయిర్ సర్వీస్ రెజిమెంట్, బ్రిటీష్ స్పెషల్ ఎయిర్ సర్వీస్ మరియు స్పెషల్ బోట్ సర్వీస్, కెనడియన్ జాయింట్ టాస్క్ ఫోర్స్ 2, ఫ్రెంచ్ GIGN, జర్మన్ GSG 9, మరియు ఇజ్రయిల్ సయరెట్ మత్కల్ లాంటి వాటినుంచి కూడా పరస్పర శిక్షణ తీసుకుంటుంది.[12] దీంతోపాటు ఈ మిత్రదేశ దళాలు అమెరికాకు చెందిన ఇతర తీవ్రవాద నిరోధ బృందాలైన FBI యొక్క హోస్టేజ్ రెస్క్యూ టీమ్ మరియు నేవీ యొక్క DEVGRU లాంటి వాటి శిక్షణకు సాయపడడం, పరస్పర శిక్షణ తీసుకోవడం చేస్తుంటాయి.

యూనిఫాం[మార్చు]

డెల్టా ఫోర్స్ గురించిన సమాచారాన్ని ది పెంటగాన్ పూర్తిగా నియంత్రిస్తుంటుంది. అలాగే, అత్యంత రహస్యంగా వ్యవహరించే ఈ బృందం గురించి బహిరంగంగా మాట్లాడేందుకు అది తిరస్కరిస్తుంటుంది. డెల్టా నిర్వాహకులకు అత్యధిక అనుకూలత, స్వయంప్రతిపత్తి అనుమతించబడి ఉంటుంది. డెల్టా సభ్యులు తమ గురించిన సమాచారాన్ని రహస్యంగా దాచడంలో భాగంగా అరుదుగా మాత్రమే యూనిఫాం ధరిస్తారు. సాధారణంగా వారు విధి నిర్వహణలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎక్కువగా సాధారణ దుస్తులనే ధరిస్తుంటారు.[10] డెల్టా సభ్యులు సైనిక యూనిఫాం ధరించిన సమయంలో, వారి దుస్తులపై ఎలాంటి గుర్తులు గానీ, పొట్టిపేర్లు కానీ, శాఖ పేరుగానీ ఉండదు.[10] సాధారణ జనంలో కలిసిపోయేందుకు, సైనిక అధికారిగా గుర్తించబడకుండా ఉండేందుకు వీలుగా సాధారణ పౌరుల తరహాలో తలకట్టు, మీసకట్టు ఉంచుకోవడానికి సైన్యం డెల్టా సభ్యులను అనుమతిస్తుంది.[10][13]

ఆపరేషన్లు మరియు కోవర్టు చర్యలు[మార్చు]

డెల్టా బృందానికి అప్పగించిన ఆపరేషన్లలో ఎక్కువ భాగం అత్యంత రహస్యమైనవే కాకుండా సాధారణ ప్రజానీకానికి వాటిగురించి ఏమాత్రం తెలియదు. అయినప్పటికీ, కొన్ని ఆపరేషన్లకు సంబంధించిన వివరాలు మాత్రం సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉంది. చాలా సందర్భాల్లో డెల్టా బృందం సహకారం అందజేయడం,ఆపరేషన్ ప్రణాళికలను అభివృద్ధి చేయడం జరిగినప్పటికీ వివిధ రకాల కారణాల వల్ల ఆ బృందం తెరవెనుకే ఉండిపోయింది. డెల్టాకు సంబంధించి బాగా తెలిసిన ఆపరేషన్లు మరియు సైనిక నియోగం కింది విధంగా ఉన్నాయి:

సెంట్రల్ అమెరికన్ ఆపరేషన్లు[మార్చు]

డెల్టా జరిపిన చర్యలన్నీ ఎక్కువగా మధ్య అమెరికాలో కనిపిస్తాయి. సాల్వడోరన్ విప్లవ బృందం ఫారాబుండో మార్టీ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌తో యుద్ధం, నికారాగువాలో నిధులు సమకూర్చే కాంట్రాస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సాయం చేయడం లాంటివి ఇందులో ముఖ్యమైనవి.[10]

ఆపరేషన్ అర్జంట్ ఫ్యూరీ[మార్చు]

గ్రెనెడాలో ఆపరేషన్ అర్జంట్ ఫ్యూరీ ప్రారంభమైన మొదటిరోజు తెల్లవారు జామున డెల్టాకు సంబంధించిన రెండో మిషన్ ప్రారంభమైంది. రిచ్‌మండ్ హిల్‌లోని జైలును ముట్టడించడం ద్వారా, అక్కడున్న రాజకీయ బంధీలను రక్షించేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. నిటారుగా ఉండే ఎత్తైన కొండపై నిర్మితమైన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన పురాతన కోటలోని మిగిలిన భాగంలో ఏర్పాటైన ఈ జైలును చేరాలంటే, దట్టమైన అడవితో నిండిన ఒక వైపు నుంచి మినహా మిగిలిన మూడు వైపుల నుండి కాలినడకన చేరుకోవడం వీలుకాదు; ఇక నాలుగో వైపు దారిపొడవునా ఎత్తైన చెట్లతో నిండిన ఇరుకైన మార్గం గుండా ఈ కోటను చేరుకోవచ్చు. ముట్టడికి ప్రయత్నించే బృందంతో కూడిన హెలిక్యాప్టర్ దిగేందుకు అవసరమైన ప్రదేశమేదీ ఈ జైలు వద్ద లేదు. రిచ్‌మండ్ హిల్‌ ఒకవైపు లోతైన లోయను కలిగి ఉంది. ఈ లోయ వెంబడి పైన బాగా ఎత్తైన ప్రదేశంలో మరో పురాతన కోట ఉంది.ఫోర్ట్ ఫ్రెడ్రిక్ అనబడే ఈ కోట గ్రెనడియన్ రక్షక దళానికి ఆవాసం. ఫోర్ట్ ఫ్రెడ్రిక్‌లో ఉండే ఈ రక్షక దళం అక్కడి నుంచి సులభంగా కొండ వాలు ప్రాంతాలపై మరియు కింద ఉండే లోయ అడుగు భాగంపై కేవలం చిన్నపాటి ఆయుధాలు, మెషిన్ గన్ కాల్పులతో పూర్తి అదుపును ప్రదర్శించగలిగేది. గ్రెనడియన్ తుపాలకుల రక్షణలో ఉన్న ఈ లోయలోకి డెల్టా ఫోర్స్ యొక్క హెలిక్యాప్టర్లు ఉదయం 6:30 సమయంలో ప్రవేశించాయి.[citation needed]

టాస్క్ ఫోర్స్ 160కి చెందిన హెలిక్యాప్టర్లు ఈ లోయలోకి ప్రవేశించడంతో పాటు ఆ ప్రాంతంలోని జైలు వైపుగా తమ ప్రయాణాన్ని కొనసాగించాయి. అయితే అక్కడ దిగేందుకు వీలుకాకపోవడంతో, డెల్టా ఫోర్స్ వీరులు హెలిక్యాప్టర్ల తలుపుల నుంచి పాకుతూ బయటకు వచ్చి తాళ్ల సాయంతో కిందకు దిగేందుకు ప్రయత్నించారు. అయితే, తాళ్ల సాయంతో వారు దిగడం ప్రారంభంకాగానే, ముందుభాగంలోని జైలు వద్ద ఉన్న బలగాలు ప్రారంభించిన ముమ్మరమైన కాల్పుల్లో హెలిక్యాప్టర్లు చిక్కుకున్నాయి; అదేసమయంలో వెనుకభాగం నుంచి కూడా హెలిక్యాప్టర్లపైకి భీకరమైన దాడి ప్రారంభమైంది. పై భాగంలో ఉన్న ఫోర్ట్ ఫ్రెడ్రిక్‌లోని శత్రు బలగాలు కింద ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్లపైకి ఎక్కువ సంఖ్యలో చిన్నపాటి ఆయుధాలను, మెషిన్ గన్ కాల్పులను కురిపించాయి. ప్రత్యక్ష సాక్షులైన గ్రెనెడియన్ ప్రజల వివరాల ప్రకారం, అనేక హెలిక్యాప్టర్లు లోయ నుంచి వెలుపలకు వెళ్లిపోయాయి. అయితే,ఒక సందర్భంలో ఒక్క పైలెట్ మాత్రం ఎలాంటి ఆదేశాలు లేకుండా వెనక్కు రావడంతో పాటు ముట్టడి కోసం ముందుకు వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో ఆ నైట్‌స్టాకర్‌ పైలట్‌పై డెల్టా సభ్యులు ద్వారా పిరికతనం ఆరోపణలు నమోదయ్యాయి. ఈ పైలట్‌ను వారు అంతకుముందు తమతో చేర్చుకోవాలని అనుకున్నా అటుపై ఆ ఆలోచన విరమించుకున్నారు.[14]

ఏరోపోస్టల్ ఫ్లైట్ 252[మార్చు]

జూలై 29, 1984న కరాకస్ నుంచి కురాకవో ద్వీపానికి బయలుదేరిన ఏరోపోస్టల్ ఫ్లైట్ 252 హైజాక్‌కు గురైంది. రెండు రోజుల తర్వాత, హైజాకర్స్ ని మట్టుబెట్టిన వెనిజులన్ కమెండోలచే DC-9 ముట్టడించబడింది.[15] ఈ కఠిన పరీక్ష సమయంలో డెల్టా ఫోర్స్ సలహాను సమకూర్చింది.[16]

అకిల్లే లౌరో హైజాక్[మార్చు]

అధ్యక్షుడు రొనాల్ట్ రీగన్ ఏర్పాటు చేసిన నేవీ SEAL టీం సిక్స్ , డెల్టా ఫోర్స్ రెండూ కలిసి హైజాక్‌కు గురైన ''అకిల్లే లౌరో'' ను సిప్రస్ వద్ద ఆపి, ఆ నౌకను కాపాడేందుకు అవకాశమున్న సహాయక ప్రయత్నాలను సిద్ధం చేశాయి.

ఆపరేషన్ రౌండ్ బాటిల్[మార్చు]

హెజ్‌బొల్లా ద్వారా బంధీలైన పశ్చిమ దేశీయులను రక్షించేందుకు మూడు బృందాలుగా లెబనాన్‌లోని బీరుట్‌కు వెళ్లేందుకు డెల్టా పథక రచన చేసింది, అయితే ఆయుధాల మార్పిడి ద్వారా బంధీలను విడిచిపెట్టేందుకు రాజీ ప్రయత్నాలు చోటు చేసుకోవడంతో ఆ చర్య నిలిపివేయబడింది. ఇరాన్-కాంట్రా వ్యవహారం గురించి బహిరంగపర్చిన లాస్ ఏంజెల్స్ టైమ్స్ ద్వారా చివరకు ఈ ఆపరేషన్ ప్రాముఖ్యాన్ని కోల్పోయింది.[17]

ఆపరేషన్ హెవీ షాడో[మార్చు]

కిల్లింగ్ పాబ్లో పుస్తక రచయిత మార్క్ బౌడెన్ ప్రకారం, డెల్టా ఫోర్స్ కు చెందిన అధికారి చాటునుంచి తుపాకీ పేల్చడం ద్వారా కొలంబియా మత్తుమందుల వ్యాపారి పాబ్లో ఎస్కోబర్‌ను అంతమొందించాడు. అయితే, దీనికి ఎలాంటి గట్టి సాక్షాధారాలు లేకపోవడంతో పాటు ఈ పని చేసింది కొలంబియన్ భద్రతాధికారులేననే ఆరోపణలు వినిపించాయి.

ఆపరేషన్ జస్ట్ కాజ్[మార్చు]

ఆపరేషన్ జస్ట్ కాజ్‌ను అమెరికా దళాలు నిర్వహించడానికి ముందుగా, దానికి సంబంధించిన కీలక చర్యలను స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ కు అప్పగించడం జరిగింది. పనామా సిటీలోని కార్సెల్ మోడెలో అనే జైలులో బంధీగా మారిన కుర్ట్ మ్యూస్‌ను రక్షించి తీసుకురావడం కోసం ఆపరేషన్ యాసిడ్ గాంబిట్‌ను డెల్టాకు అప్పగించడం జరిగింది. దీని తర్వాత ఆపరేషన్ నిఫ్టీ ప్యాకేజ్ పేరుతో మరో ముఖ్యమైన ఆపరేషన్‌ను డెల్టాకు అప్పగించడం జరిగింది. బంధీగా మారిన జనరల్ మాన్యూల్ ఆంటోనియో నోరియగాను రక్షించడం కోసం ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు.

ఆపరేషన్ డెజెర్ట్ షీల్డ్/డెజెర్ట్ స్ట్రోమ్[మార్చు]

డెజెర్ట్ స్ట్రోమ్ సమయంలో అనేక బాధ్యతలను నిర్వహించడం కోసం డెల్టాను ఆ ప్రాంతంలో నియోగించారు. సౌదీ అరేబియాలోని జనరల్ నార్మన్ స్క్వార్‌జ్‌కోఫ్ రక్షణ కోసం అంగరక్షకులుగా నియమించబడిన సైనిక బృందాలకు మద్దతుగా నిలవడం కోసం డెల్టాను ఇక్కడకు పంపారు. మరోవైపు స్క్వార్‌జ్‌కోఫ్‌కు పెరుగుతున్న అంగరక్షకుల సంఖ్యను తగ్గించేందుకు సైనిక సంబంధాల అధికారులు ప్రయత్నించారు. ఇక SCUD క్షిపణులును వెతకడం కోసం బ్రిటీష్ స్పెషల్ ఎయిర్ సర్వీస్ మరియు ఇతర మిత్ర దేశాల స్పెషల్ ఫోర్సెస్‌తో కలిసి కూడా డెల్టా పనిచేసింది.

ఆపరేషన్ గోథిక్ సెర్పెన్ట్[మార్చు]

ఆపరేషన్ గోథిక్ సెర్పెన్ట్ అనే కోడ్‌నేమ్‌తో సొమాలియాలోని మొగడిషులో జరిగిన పోరాటంలో పాల్గొనడం కోసం 3 అక్టోబర్ 1993న U.S ఆర్మీ రేంజర్స్ తో పాటు డెల్టా ఫోర్స్ సభ్యులను కూడా పంపారు.

మొహమద్ ఫరాహ్ ఎయిడిడ్‌ యొక్క అగ్రశ్రేణి లెప్టినెంట్స్ తో పాటు మరికొందరు ఇతర ప్రముఖలకు భద్రత కల్పించడం కోసం డెల్టా సభ్యులు ఇక్కడకు చేరారు. RPGల ద్వారా రెండు MH-60L బ్లాక్‌హాక్ హెలిక్యాప్టర్లు కూల్చివేయబడిన తర్వాత ఈ చర్య రాజీతో ముగిసింది. కొనసాగుతున్న యుద్ధంలో ఈ రకమైన ఫలితంగా అనేది ఐదు మంది డెల్టా నిర్వాహకులు (కొన్ని రోజుల తర్వాత ఆరో నిర్వాహకుడు మోర్టార్ పేలుడులో మృతి చెందాడు), ఆరుగురు రేంజర్లు, ఐదుగురు ఆర్మీ ఏవియేషన్ సిబ్బంది, ఇద్దరు 10వ మౌంటైన్ డివిజన్ సైనికులు మృతి చెందడానికి దారితీసింది. సొమాలీ మృతుల సంఖ్య 133 నుంచి ఉండవచ్చని ఎయిడిడ్ పరిధి కమాండర్ అంచనా వేయగా[18], సొమాలియాలోని అమెరికా రాయబారి మాత్రం ఈ సంఖ్య 1500 నుంచి 2000 వరకు ఉండవచ్చని అంచనా వేశారు.[19] 1999లో రచయిత మార్క్ బౌడెన్ ప్రచురించిన పుస్తకంBlack Hawk Down: A Story of Modern War లో అక్టోబర్ 3, 1993లో జరిగిన మొగడిషు యుద్ధంకు సంబంధించిన అంశాలన్నీ చోటు చేసుకున్నాయి.[13] ఈ యుద్ధానికి దారితీసిన ముందస్తు సంఘటనలకు సంబంధించిన చర్యల్లో డెల్టా ఫోర్స్ ప్రమేయం గురించి ఈ పుస్తకంలో కొన్ని వివరణలు చోటు చేసుకున్నాయి.[13] 2001లో దర్శకుడు రిడ్లే స్కాట్ ద్వారా ఈ పుస్తకం చలనచిత్రం గా రూపొందింది.

తీవ్రవాద నిరోధక శిక్షణ[మార్చు]

జపనీస్ రాయబారుల నివాస స్వాధీనం ఘటన తర్వాత వెంటనే తక్షణ చర్యగా జనవరి 1997లో ఒక చిన్న డెల్టా బృందం, ఆరుగురు సభ్యులతో కూడిన బ్రిటీష్ SASలు పెరూలోని లిమాకు పంపబడ్డాయి.[20]

సియాటిల్ WTO[మార్చు]

1999 సియాటిల్‌ WTO కాన్ఫరెన్స్ భద్రతలో డెల్టా ఫోర్స్ సభ్యులు పాలుపంచుకున్నారు. ప్రత్యేకించి రసాయన ఆయుధ దాడులను తిప్పికొట్టడం కోసం డెల్టా సభ్యులు ఈ భద్రతకు నియోగించబడ్డారు.[21]

ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడం[మార్చు]

తోరా బోరా వద్ద డెల్టా ఫోర్స్ మరియు బ్రిటీష్ స్పెషల్ బోట్ సర్వీస్ కమెండోలు.

2001లో అఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్‌లకు వ్యతిరేకంగా జరిగిన పోరులోనూ డెల్టా ఫోర్స్ పాలుపంచుకుంది.[22] 2001లో ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడం ప్రారంభమైన సమయం నుంచి హై వ్యాల్యూ టార్గెట్ (HVT)గా పేర్కొనబడిన ఒసామా బిన్ లాడెన్, ఆల్‌ఖైదాకు చెందిన ఇతర ప్రముఖులు, తాలిబన్ అగ్రనాయకులను వేటాడం కోసం డెల్టా ఫోర్స్ ఒక ప్రత్యేక పోరాట దళంగా ఏర్పాటు చేయబడింది. 75వ రేంజర్ రెజిమెంట్ మద్దతు ద్వారా కాందహార్ వైమానిక స్థావరం వద్ద ఉన్న ముల్లా మొహమద్ ఒమర్ ప్రధాన కేంద్రంపై డెల్టా ఫోర్స్ జరిపిన వైమానిక దాడి ఆపరేషన్‌ ఈ రకమైనదే. మొహమద్ ఒమర్‌ను బంధించే విషయంలో డెల్టా ఫోర్స్ చర్య విఫలమైనప్పటికీ, రేంజర్స్ మాత్రం ఒక ప్రధానమైన వ్యూహాత్మక వైమానిక తలాన్ని స్వాధీనం చేసుకోగలిగాయి.[23]. ఈ రకమైన దాడుల కోసం నియమించిన బలగాన్ని టాస్క్ ఫోర్స్ 11, టాస్క్ ఫోర్స్ 20, టాస్క్ ఫోర్స్ 121, టాస్క్ ఫోర్స్ 145 మరియు టాస్క్ ఫోర్స్ 6-26 అని వివిధ రకాలుగా పేర్కొనడం జరిగింది. 2009లో తూర్పు అఫ్ఘనిస్థాన్‌లో డెల్టా ఫోర్స్ తన చర్యలను ముమ్మరం చేసింది. DEVGRUతో కలిసి SFOD-D ఈ ప్రాతంలోని హఖ్ఖానీ వ్యవస్థపై అనేక విజయాలను సాధించింది. తాలిబన్‌కు చెందిన ఈ బలమైన ముఠా అవసరమైన పక్షంలో పాకిస్థాన్ సరిహద్దు వెంబడి కార్యకలాపాలు నిర్వహిస్తుంది.[24]

ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడం[మార్చు]

ఉదయ్ మరియు క్యూసేలను చివరిసారిగా ముట్టడించిన సందర్భంగా తీసిన ఫోటో ఇది.MICH హెల్మెట్‌లను ధరించిన సాధారణ సైనికులకు ముందు భాగంలో డెల్టా ఫోర్స్ నిర్వాహకులను చూడవచ్చు.

డెల్టా ఫోర్స్ నిర్వాహకులు కీలక భాగస్వామ్యం వహించిన అనేక ఆపరేషన్లలో 2003 ఇరాక్ దండయాత్ర కూడా ఒకటి.[25] ఈ ఆపరేషన్ కోసం వారు ముందస్తుగానే రహస్యంగా బాగ్దాద్‌కు చేరుకున్నారనే ఆరోపణలున్నాయి. వైమానిక దాడులకు మార్గనిర్థేశం చేయడం, రహస్య సమాచారాన్ని పొంచివిని తెలియజేసే వ్యక్తుల నెట్‌వర్క్ ను అభివృద్ధి చేయడం, ఇరాకీ సమాచార వ్యవస్థను నాశనం చేయడం లాంటి చర్యలను డెల్టా సభ్యులు నిర్వహించేవారు. ఏప్రిల్ 2004లో జరిగిన ఆపరేషన్ ఫాంటమ్ ఫ్యూరీలో కూడా డెల్టా సభ్యులు ముఖ్య భూమిక వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా USMS కంపెనీలతో కలిసి పనిచేసిన డెల్టా సభ్యులు, సాధారణంగా దాగిఉండి కాల్చే దళంగానే వ్యవహరించారు. దీనికి కారణం ఇప్పటికీ తెలియదు.[26]

ఉదయ్ మరియు ఖ్యూసే హుస్సేన్‌లు చంపబడిన మోసుల్ ముట్టడిలోనూ డెల్టా పాల్గొంది, అలాగే సద్దాం హుస్సేన్‌ను పట్టి బంధించడం కోసం కూడా వారు పనిచేశారు. వీటితోపాటు అల్-జర్ఖావి నివశిస్తున్న ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకోవడం కోసం జూన్ 7, 2006లో డెల్టా బఖూబా ఉత్తర ప్రాంతానికి వెళ్లింది. ముమ్మరమైన వేట తర్వాత, జర్ఖావి కంటపడడంతో డెల్టా బృందం వైమానిక దాడికి సిద్ధమైంది[27]

వీటిని కూడా చూడండి[మార్చు]

గ్రంధవివరణ[మార్చు]

 • బెక్‌విత్, ఛార్లెస్‌ (డొనాల్డ్ నాక్స్ తో) (1983). డెల్టా ఫోర్స్
 • హెనీ, ఎరిక్ ఎల్. (2002). ఇన్‌సైడ్ డెల్టా ఫోర్స్ న్యూయార్క్: డెలాకార్ట్ ప్రెస్, 325. ISBN 978-0-385-33603-1.
 • బౌడెన్, మార్క్ (1999). బ్లాక్ హౌక్ డౌన్: ఏ స్టోరీ ఆఫ్ మాడ్రన్ వార్ . అట్లాంటిక్ మంత్లీ ప్రెస్. బెర్కిలీ, కాలిఫోర్నియా (USA). ISBN 0-87113-738-0 ఆపరేషన్ గోతిక్ సెర్పెన్ట్ గురించి
 • బౌడెన్, మార్క్ (2001). కిల్లింగ్ పాబ్లో: ది హంట్ ఫర్ ది వరల్ట్స్ గ్రెటెస్ట్ ఔట్‌లా . ISBN 0-87113-783-6 ది హంట్ ఫర్ పాబ్లో ఎస్కోబర్ గురించి
 • Bowden, Mark (2006). Guests Of The Ayatollah: The First Battle In America's War With Militant Islam. Atlantic Monthly Press. ISBN 0-87113-925-1. 
 • Bowden, Mark (May 2006). "The Desert One Debacle". The Atlantic Monthly. 
 • నయ్‌లార్, సేన్‌ (2005). "నాట్ ఏ గుడ్ డే టు డై: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఆపరేషన్ అనకొండ ", పెంగ్విన్ గ్రూప్, న్యూయార్క్ ఆపరేషన్ అనకొండ గురించి
 • గ్రిస్‌వల్డ్, టెర్రీ. "డెల్టా, అమెరికాస్ ఎలైట్ కౌంటర్‌టెర్రరిస్ట్ పోర్స్", ISBN 0-87938-615-0
 • రాబిన్‌సన్, లిండా, మాస్టర్స్ ఆఫ్ చావోస్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది స్పెషల్ ఫోర్సెస్
 • నేషనల్ జియోగ్రఫిక్ డాక్యుమెంటరీ: రోడ్ టు బాగ్దాద్
 • పుషీస్, ఫ్రెడ్ జె., et al. (2002). U. S. కౌంటర్-టెర్రరిస్ట్ ఫోర్సెస్. అన్‌నోన్: క్రిస్టలైన్ ఇంప్రింట్స్, 201. ISBN 0-7407-5029-1
 • హార్ట్ ముట్ స్కావియర్: డెల్టా ఫోర్స్ . మోటార్‌బుచ్, వెర్‌లాగ్, స్టట్‌గార్ట్ 2008. ISBN 978-3-613-02958-3

సూచనలు[మార్చు]

 1. http://www.military.com/Recruiting/Content/0,13898,rec_step02_special_forces,,00.html
 2. బేక్‌విత్, ఛార్లెస్. "డెల్టా ఫోర్స్", అవోన్ బుక్స్, 2000. (మాస్ మార్కెట్ పేపర్‌బ్యాక్; ఒరిజినల్ వర్క్ పబ్లిష్డ్ 1983.) ISBN 0-262-08150-4
 3. గాబ్రియల్, రిచర్డ్ ఏ. (1985). మిలటరీ ఇన్‌కంపెటెన్స్: వై ది అమెరికన్ మిలటరీ డస్‌నాట్ విన్ , హిల్ అండ్ వాంగ్, ISBN 0-374-52137-9, pp. 106-116. మొత్తానికి, టాస్క్ పోర్స్ యొక్క తాత్కాలిక స్వభావాన్ని మరియు భద్రత యొక్క అపరిమిత శ్రేణిని హోలోవే కమిషన్ తప్పుపట్టింది. ఈ రెండింటిలో ఆధిపత్య-మరియు-నియంత్రణ సమస్యలు ఎక్కువ కావడమే ఇందుకు కారణం.
 4. 4.0 4.1 Naylor, Sean (2006). Not a Good Day to Die: The Untold Story of Operation Anaconda. Berkeley: Berkley Books. ISBN 0425196097. 
 5. సేన్ నయ్‌లార్, ఎక్స్ పాన్‌సియన్ ప్లాన్స్ లీవ్ మెనీ ఇన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ అన్‌ఇజీ , ఆర్ముడ్ ఫోర్సెస్ జర్నల్, నవంబర్, 2006.
 6. http://www.globalsecurity.org/military/agency/army/sfod-d.htm
 7. మౌంటైనీర్. SFOD-D సీకింగ్ న్యూ మెంబర్స్. ఫోర్ట్ కార్సన్, కొలరాడో: మౌంటైనీర్ (పబ్లికేషన్). జనవరి 17, 2007.
 8. "Fort Bragg's newspaper Paraglide, recruitment notice for Delta Force". Retrieved November 17, 2009.  Text "To find the cited document, use the 11/12/2009 edition of Paraglide, page A6" ignored (help)
 9. Beckwith, Charlie A (1983). Delta Force. Harcourt. 
 10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 Haney, Eric L. (2002). Inside Delta Force. New York: Delacorte Press. p. 325. ISBN 9780385336031. 
 11. వాల్లెర్, డగ్లస్ (2003-02-03). "ది CIA సీక్రెట్ ఆర్మీ". టైమ్ (టైమ్ ఇంక్). http://web.archive.org/web/20030201095351/http://www.time.com/time/covers/1101030203/
 12. "Unit Profile: 1st Special Forces Operational Detachment - Delta (SFOD-D)". Retrieved 3-10-2010.  Check date values in: |accessdate= (help)
 13. 13.0 13.1 13.2 Bowden, Mark (1999). Black Hawk Down: A Story of Modern War. Berkeley: Atlantic Monthly Press. ISBN 0-87113-738-0. 
 14. [రోనాల్ట్ హెచ్. కోలే, 1997, ఆపరేషన్ అర్జంట్ ఫరీ: ది ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ జాయింట్ ఆపరేషన్స్ ఇన్ గ్రెనెడా 12 అక్టోబర్ - 2 నవంబర్ 1983 జాయింట్ హిస్టరీ ఆఫీస్ ఆఫ్ ది ఛైర్మన్ ఆఫ్ ది జాయింట్ చీప్స్ ఆఫ్ స్టాఫ్ వాషింగ్టన్, DC], p.62.]
 15. Castro, Janice; Thomas A. Sancton; Bernard Diederich (1984-08-13). "Terrorism: Failed Security". TIME. 
 16. Offley, Edward (2002). "Chapter 13 - Going to War I: Realtime". Pen & Sword: A Journalist's Guide to Covering the Military. Marion Street Press, Inc. p. 220. ISBN 9780966517644. 
 17. Smith, Mark (March 6, 2007). Killer Elite. St. Martin's Press. ISBN 0312362722. 
 18. [1]
 19. [2]
 20. స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషనల్ డెటాచ్‌మెంట్ - డెల్టా
 21. న్యూస్: డెల్టాస్ డౌన్ విత్ ఇట్ (సీట్టిల్ వీక్లీ)
 22. సెప్టెంబర్ 2003 ఇంజనీర్ అప్‌డేట్
 23. [3]
 24. సాన్ జోష్ మెర్కురీ న్యూస్
 25. W:\pmtr\ventura\#article\noonan.vp
 26. [4]]
 27. [5]]

బాహ్య లింకులు[మార్చు]

మూస:US Special Operations Forces

Coordinates: 35°07′14″N 79°21′50″W / 35.12047°N 79.363775°W / 35.12047; -79.363775 (Delta Force (1st SFOD-D))