డేటా రకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పైథాన్ 3 లో డేటా రకాల వంశవృక్షం

కంప్యూటరును మన అవసరం కొరకు, ఆ అవసరానికి సంబంధించిన ప్రోగ్రామును కంప్యూటరుకు అందించాలి. ప్రోగ్రాము వ్రాయటానికి Cobal, Basic, Fortran, Pascal, C, C++ మొదలగు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషలు ఉన్నాయి. ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషలలో మనకు అనుకూలమైన భాషను ఎన్నుకొని ప్రోగ్రాము వ్రాస్తాము. ప్రోగ్రాము వ్రాయటానికి కొన్ని నియమ నిబంధనలు, ఆ భాషకు అనుకూలమైన డేటా రకాలు ఎన్నుకొని ప్రోగ్రాములు వ్రాస్తారు.

ప్రధానంగా డేటా టైపులు రెండు రకాలు. అవి : 1. న్యూమరిక్ డేటా (Numeric Data) 2. ఆల్ఫా న్యూమరిక్ డేటా (Alpha Numeric Data)

న్యూమరిక్ డేటా[మార్చు]

న్యూమరిక్ డేటా అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే నంబర్లతోటి ఏర్పాటవుతుంది. న్యూమరిక్ డేటాని మరల పూర్ణసంఖ్యలు Integers అనే తరగతులుగా విభజించవచ్చు.

Integrers : Integers అంటే వీటిలో అన్ని పూర్ణ సంఖ్యలే ఉంటాయి. వీటినే Whole numbers అని కూడా అంటారు. ఉదాహరణ : 0, +16, -32, +24.

Real Numbers : రియల్ నంబర్లనే సహజ సంఖ్యలు అంటారు. అన్ని రకాల సంఖ్యలు ఈ కోవలోకి వస్తాయి. ఉదాహరణ : 0, +5, 1/4, -9. న్యూమరిక్ డేటాను కంప్యూటర్ గుర్తించినప్పుడు ఆ అంకె ఉన్న స్థానాన్ని బట్టి దాని విలువ ఉంటుంది. ఈ అంకెలతో కూడిన సంఖ్యలతో కూడికలు, తీసివేతలు మొదలగు కాలిక్యులేషన్స్ చేయవచ్చు.

ఆల్ఫా న్యూమరిక్ డేటా[మార్చు]

ఆల్ఫా న్యూమరిక్ డేటాలో ఆల్ఫాబెటిక్ డేటాకి సంబంధించిన అక్షరాలు (a నుండి z వరకు చిన్నవి, A నుండి Z వరకు పెద్దవి) గుర్తులు (?, %, @ మొదలగునవి) అంకెలు (0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9) కూడా ఉంటాయి. అయితే ఇందులో అంకెలకు స్థాన విలువ ఉండదు. ఈ అంకెలు కూడా సాధారణ అక్షరాలలాగే (Characters) పరిగణించబడతాయి. ఇందులో వచ్చే అంకెలు, సంఖ్యలతో కూడికలు, తీసివేతలు లాంటి లెక్కలు చేయలేము. ఉదాహరణకు : జేమ్స్‌బాండ్ 777, XYZ - 1632, AIW 4289


మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

"https://te.wikipedia.org/w/index.php?title=డేటా_రకం&oldid=3263481" నుండి వెలికితీశారు