డ్యుయిష్ బ్యాంక్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Deutsche Bank AG
రకం Aktiengesellschaft (మూస:FWB, NYSE: DB)
Founded 1870
ప్రధానకార్యాలయం Frankfurt am Main, Germany
Area served Worldwide
కీలక వ్యక్తులు Josef Ackermann (CEO and chairman of the management board), Clemens Börsig (Chairman of the supervisory board)
పరిశ్రమ Financial services
ఉత్పత్తులు Investment, commercial, retail and private banking, asset management
ఆదాయం 27.95 billion (2009)[1]
లాభము €4.973 billion (2009)[1]
ఆస్తులు €1.501 trillion (2009)[1]
Total equity €36.6 billion (2009)[1]
ఉద్యోగులు 81,929 (FTE, 2010)
వెబ్‌సైటు DB.com
డ్యుయిష్ బ్యాంక్ ట్విన్ టవర్స్, ఫ్రాంక్ఫర్ట్, జెర్మని లోని బ్యాంకింగ్ జిల్లాలో డ్యుయిష్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం

డ్యుయిష్ బ్యాంక్ AG ("జెర్మన్ బ్యాంకు" అని అర్ధం; pronounced [ˈdɔʏtʃə ˈbaŋk]; మూస:FWB, NYSE: DB) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక అంతర్జాతీయ బ్యాంకు. దీని ప్రధాన కార్యాలలయం జెర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లో ఉంది. ఈ బ్యాంకులో 72 దేశాలలో 80,000 కంటే ఎక్కువ మంది పని చేస్తున్నారు. ఐరోపా, అమెరికాలు, ఆసియా పసిఫిక్ మరియు క్రొత్త మార్కట్ లలో ఈ బ్యాంకు ప్రసిద్దంగా ఉంది.

న్యూ యార్క్, లండన్, ఫ్రాంక్ఫర్ట్, పారిస్, మాస్కో, అంస్టర్డం, టొరన్టొ, సావ్ పాలో, సింగపూర్, హాంగ్ కాంగ్, టోక్యో, సిడ్నీ వంటి ప్రధాన ఆర్ధిక కేంద్రాలలో డ్యుయిష్ బ్యాంక్ కార్యాలయాలు ఉన్నాయి. అంతే కాక, మధ్య తూర్పు దేశాలు, లాటిన్ అమెరికా, సెంట్రల్ & ఈస్టర్న్ యూరోప్ మరియు ఆసియా పసిఫిక్ వంటి క్రొత్త మార్కెట్ లలో ఈ బ్యాంకు, పెట్టుబడి పెట్టుతుంది.

కార్పరేట్ మరియు సంస్థాగత ఖాతాదారులతో పాటు ప్రైవేట్ మరియు వ్యాపార ఖాతాదారులకు కూడా ఈ బ్యాంకు ఆర్ధిక సేవలను అందిస్తుంది. బ్యాంకు అందిస్తున్న సేవలలో కొన్ని: ఋణం మరియు ఈక్విటీలలో అమ్మకం మరియు లావాదేవీలు, విలీనాలు & కొనుగోలు (M&A); రిస్క్ మానేజ్మెంట్ సేవలు, డెరివేటివ్ లు, కార్పరేట్ ఫైనాన్స్, వెల్త్ మానేజ్మెంట్, రిటైల్ బ్యాంకింగ్, నిదుల మానేజ్మెంట్, మరియు లావాదేవీల బాంకింగ్.[2]

2002 నుంచి జోసెఫ్ అకేర్మాన్ డ్యుయిష్ బ్యాంక్ యొక్క ప్రధాన నిర్వాహణా అధికారి గాను గ్రూప్ పాలక కమిటి అధ్యక్షుడు గాను వ్యవహరిస్తున్నారు. మరో మూడు సంవత్సరాలు, అనగా 2013 వరకు ప్రధాన నిర్వాహణా అధికారిగా కొనసాగడానికి ఆయిన 2009 ఆకరిలో అంగీకరించారు.[3] ఫ్రాంక్ఫర్ట్ (FWB) మరియు న్యూ యార్క్ స్టాక్ ఎక్స్ చెంజీలలో (NYSE) డ్యుయిష్ బ్యాంక్ నమోదు అయి ఉంది.

చరిత్ర[మార్చు]

డ్యుయిష్ బ్యాంక్, సిడ్నీ

1870-1919[మార్చు]

డ్యుయిష్ బ్యాంక్, 1873లో బెర్లిన్ లో విదేశీ వ్యాపారము కొరకు ఒక ప్రత్యేక బ్యాంకుగా జెర్మనిలో స్థాపించబడింది[4]. బ్యాంకు యొక్క చట్టం 22 జనవరి 1870 నాడు ఆమోదించబడి, 10 మార్చ్ 1870 నాడు ప్రుష్యన్ ప్రబుత్వం దీనికి బాంకింగ్ లైసెన్స్ మంజూరు చేసింది. ఆ చట్టంలో విదేశీ వ్యాపారం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టబడింది: "అన్ని రకాల బాంకింగ్ వ్యాపారం చేయడం, ముఖ్యంగా జెర్మనికి ఇతర ఐరోపా దేశాలాకు మరియు విదేశీ మార్కట్లకు ఉన్న వ్యాపార సంబంధాన్ని బలపరచడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం"[5]

బ్యాంకు యొక్క మొదటి శాఖలు బ్రేమేన్[6] లో 1871 లోను హాంబర్గ్[7] లో 1872 లోనూ ప్రారంభీంచబడింది. కొన్ని రోజుల తరువాత విదేశములో బ్యాంకు అడుగు పెట్టింది. 1872లో షాంఘై[8] లోనూ లండన్[9] లో 1873 లోనూ శాఖలు ప్రారంభించబడ్డాయి. అప్పటికే, ఆ తొలి దశలోనే, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, ఆసియా మరియు టర్కీ లలో బాంక్ పెట్టుబడి పెట్టింది.

ఆరంభములో బ్యాంకు పెట్టుబడి పెట్టిన కొన్ని ప్రధాన ప్రాజక్ట్ లు: USలో నార్తర్న్ పసిఫిక్ రైల్రోడ్[10] మరియు బాగ్దాద్ రైల్వే[11] (1888).

జెర్మనిలో క్రుప్ స్టీల్ కంపని యొక్క బాండ్ విడుదలకు పెట్టుబడి పెట్టడంలో బ్యాంకు ముఖ్య పాత్ర వహించింది. అంతే కాక, రసాయన సంస్థ అయిన బేయర్ బెర్లిన్ స్టాక్ మార్కెట్ లో ప్రవేశించడానికి బ్యాంకు తోడ్పడింది.

ప్రారంభ దశాబ్దాలలో డ్యుయిష్ బ్యాంక్ దురిత గతిలో విస్తరించింది. 1880లలో ఇష్యూ వ్యాపారం యొక్క ప్రాముఖ్యత పెరగడం ప్రారంభించింది. 1890లలో ఈ వ్యాపారం బాగా వృద్ధి చెందింది. జెర్మనీ యొక్క ఎలక్ట్రికల్-ఇంజనీరింగ్ పరిశ్రమ యొక్క పెరుగుదలలో బ్యాంకు పెద్ద పాత్ర వహించింది. అంతే కాక, ఉక్కు మరియు స్టీల్ పరిశ్రమలలోను గట్టి పట్టు సాధించింది. జేర్మనిలో గట్టి పునాది లభించడంతో, బ్యాంకు విదేశములో వ్యాపారాలకు పెట్టుబడి పై దృష్టి పెట్టింది. కొన్ని సార్లు, బాగ్దాద్ రైల్వే వంటి ప్రాజెక్ట్ లలో బ్యాంకు సంవత్సరాల తరబడి ఉండవలసి వచ్చేది.

1890ల రెండవ భాగములో డ్యుయిష్ బ్యాంక్ లో క్రొత్త విస్తరణ పర్వం మొదలయింది. పెద్ద ప్రాంతీయ బ్యాంకులతో ఈ బ్యాంకు పొత్తులు ఏర్పరుచుకోవడం వలన, జెర్మని యొక్క ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలలో బ్యాంకు ప్రవేశించింది. ఆప్పట్లో జర్మన్ బ్యాంకింగ్ పరిశ్రమలో నేలకున్న కేంద్రీకరణ బాటలోనే ఈ బ్యాంకు కూడా పొత్తులు పెట్టుకుంది.

డ్యుయిష్ బ్యాంక్ కు, తమ సొంత శాఖాలు చాలా తక్కువగా ఉండేవి; ఫ్రాంక్ఫర్ట్ శాఖ[12] 1886 నుంచి పని చేస్తుంటే, మ్యూనిచ్ శాఖ 1892 నుంచి పని చేస్తుంది. మరి కొన్ని శాఖలు డ్రెస్డెన్ మరియు లీప్జిగ్[13]లో 1901లో స్థాపించబదిండి. 

అంతే కాక, విదేశీ వ్యాపారాన్ని పెంపొందించడానికి ప్రత్యేక సంస్థలు అవసరమని బ్యాంకు తోరలోనే గ్రహించింది. విదేశాంగ మంత్రిత్వం ఒత్తిడి తేవడంతో, 1886లో డ్యుయిష్ యూబెర్సీయుష్ బ్యాంకు[14] స్థాపించబడింది. మూడు సంవత్సరాలు తరువాత స్థాపించబడిన డ్యుయిష్-అసియాటిష్ బ్యాంకులో[15] ఈ బ్యాంకు వాటా తీసుకుంది. అయితే, ఈ సంస్థల విజయం వలన, వాటి స్థాపన ఒక మంచి నిర్ణయం అని రుజువయింది.

1914 వసంత కాలములో, "ప్రపంచములోనే అతి పెద్ద బ్యాంకు, డ్యుయిష్ బ్యాంక్" అని "ఫ్రాంక్ఫర్టర్ జీటుంగ్" ప్రచురించింది. ఫ్రాంక్ఫర్టర్ జీటుంగ్, ఎర్స్టస్ మొర్గేన్బ్లాట్, 5 మార్చ్ 1914. ఇది బ్యాంకు యొక్క చరిత్రలోనే అత్యుత్తమ స్థానం. అయితే అదే సమయం దీనితో ఒక పెద్ద యుగం ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయములో, ఎన్నో విజయవంతమైన సంస్థలను స్థాపించిన ఆసక్తి క్రమంగా ఎండిపోయింది.

1919-1933[మార్చు]

యుద్ధం ముగిసిన వెంటనే, సంస్థలు మూతబడుతూ ఉన్నాయి. అప్పటికే తమ విదేశీ ఆస్తులను కోల్పోయిన డ్యుయిష్ బ్యాంక్, తమ ఇతర ఆస్తులను అమ్మవలసిన పరిస్థిదికి నెట్టబడింది. అప్ప్దుడు సాధించిన విజయాలను మరింత పటిష్టం చేయడానికి బ్యాంకు శక్తి అంత వినియోగించింది. అయితే, కొత్త వ్యాపారాలు కూడా తెర పైకి వచ్చాయి. వాటిలో కొన్ని రాబోయే కాలములో సంస్థ మీద పెద్ద ప్రభావం చూపించాయి. UFA అనే ఒక చిత్ర నిర్మాణ సంస్థ స్థాపనలో బ్యాంకు పెద్ద పాత్ర వహించింది. అలాగే, డైమ్లర్, బెంజ్ సంస్థల విలీనములో బ్యాంకు పెద్ద పాత్ర వహించింది.

1929లో, ఈ బ్యాంకు ఇతర స్థానిక బ్యాంకులతో విలీనం అవడంతో, డ్యుయిష్ బ్యాంక్ ఉండ్ డిస్కంటోజేసెల్షాఫ్ట్ అనే క్రొత్త సంస్థ ఏర్పడింది. అ సమయములో, జెర్మన్ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇదే అతి పెద్ద విలీనంగ నిలిచింది. పెరుగుతున్న ఖర్చులు ఈ విలీనానికి ఒక కారణము. 1920లలో పరిశ్రమ అంత కేంద్రీకరణము వైపు మొగ్గు చూపించడము మరొక కారణము. అప్పుడే ప్రారంభమైన ప్రపంచవ్యాప్త ఆర్ధిక మరియు బ్యాంకింగ్ సంక్షోబాన్ని ఎదుర్కొనడానికి ఈ విలీనం సహాయపడింది. 1937లో, సంస్థ పేరు మల్లి డ్యుయిష్ బ్యాంక్ గా మార్చబడింది.

ఈ సంక్షోబం తీవ్రమైన రాజకీయ ప్రభావం చూపించింది. ఇది శతాబ్దంలోనే అతి ఘోరమైన ఆర్ధిక సంఘటన అని చెప్పవచ్చు. బ్యాంకులు పని స్తంభించేలా చేసిన లిక్విడిటి కొరతను రెండు అంశాలు మరింత ప్రభావితం చేసాయి. అవి, స్వల్ప కాల విదేశీ ఋణం మరియు ఋణగ్రహీతలు రుణాన్ని తిరిగి చెల్లించలేక పోవడం. ప్రబుత్వం యొక్క ఖరాఖండి ప్రవర్తన కూడా ఈ పరిస్థిది మరింత విషమించేలా చేసింది. జర్మన్ బ్యాంకులకు ఈ సంక్షోబం పరిశ్రమలోనే ఒక ముఖ్య ఘటనగా మిగిలింది. మొదటి ప్రపంచ యుద్దానికి ముందు నెలకొన్న "స్వర్ణ యుగాన్ని" తిరిగి పొందే పరిస్థిది చాలా సంవత్సరాల వరకు లేదు.

1933-1945[మార్చు]

అడాల్ఫ్ హిట్లేర్ అధికారములోకి వచ్చిన తరువాత, మూడవ రీచ్ ఏర్పరచిన తరువాత, 1933లో డ్యుయిష్ బ్యాంక్ తమ మూడు జ్యూయిష్ పాలక మండలి సభ్యులని తొలగించింది. తరువాత సంవత్సరాలలో, జ్యూయిష్ యాజమాన్యం కలిగి ఉన్న వ్యాపారాలలో ఆర్యనైజేషణ్ చేసే ప్రక్రయిలో డ్యుయిష్ బ్యాంక్ పాల్గొంది: నవంబర్ 1938 నాటికి, అటువంటి 363 స్వదీనపరుచుకోవడములో బ్యాంకు పాల్గొంది అని బ్యాంకు యొక్క సొంత చరిత్రకారులే చెపుతున్నారు.[16] యుద్ధం సమయములో, తూర్పు ఐరోపా ఆక్రమణ జరిగినప్పుడు, జెర్మని ఆధీనములోకి వచ్చిన ఇతర బ్యాంకులను డ్యుయిష్ బ్యాంక్ నెలకొల్పింది. డ్యుయిష్ బ్యాంక్ గెస్టపో కు బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించింది. ఆష్విట్జ్ క్యాంపు మరియు సమీపములో ఉన్న IG ఫార్బెన్ సదుపాయాలను నిర్మించడానికి బ్యాంకు ఋణం ఇచ్చింది. తమకు ఆష్విట్జ్ కు ఉన్న సంబంధాన్ని బ్యాంకు ఫిబ్రవరి 1999లో వెల్లడించింది.[17] డిసంబర్ 1999లో, ఇతర ప్రముఖ జర్మన్ సంస్థలతో కలిస డ్యుయిష్ $5.2 బిలియను పరిహార నిధికి తమ వంతుగా విరాళం ఇచ్చింది. ఇది హోలోకాస్ట్ హతశేషులు వేసిన వాజ్యం కారణంగా ఇవ్వబడింది.[18][19] రెండవ ప్రపంచ యుద్ధం సమయములో డ్యుయిష్ బ్యాంక్ చరిత్ర గురించి బ్యాంకు ఏర్పాటు చేసిన స్వతంత్ర చరిత్రకారులు రాశారు.[20]

రెండవ ప్రపంచ యుద్ధం సమయములో, డ్యుయిష్ బ్యాంక్ ఈ క్రింది బాధ్యతలను చేపట్టింది: ప్రాగ్ లోని బోహేమియన్ యూనియన్ ను నిర్వహించింది. ఈ బ్యాంకుకు ప్రోటేక్టరేట్ మరియు స్లోవేకియా లోను శాఖాలు ఉండేవి. యుగోస్లావియా లోని బాన్కువేరేయిన్ ను నిర్వహించింది (ప్రస్తుతం ఈ సంస్థ రెండు ఆర్ధిక కార్పరేషన్లుగా విభజించబడింది. ఒఅక్తి సెర్బియా లో మరొకటి కోరేషియాలో). ఆంస్టర్డం లోని ఆల్బర్ట్ డి బారి బ్యాంకును, ఎథెన్స్ లోని నేషనల్ బ్యాంకు అఫ్ గ్రీస్ ను, ఆస్ట్రియా మరియు హంగేరి లోని Oesterreichische Creditanstalt-bankuverein ను, బల్గేరియా లోని డ్యుయిష్-బల్గారీష్ క్రెడిట్ బ్యాంకు ను, బుచారెస్ట్ లోని బంకా కమర్షియల్ రోమాన ను డ్యుయిష్ బ్యాంక్ నిర్వహించింది. టర్కీ లోని ఇస్టాన్బుల్ లో ఒక శాఖను నిర్వహించేది.

WWII అనంతరం[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధంలో జెర్మని ఓటమి తరువాత, 1948లో అలైడ్ అధికారులు డ్యుయిష్ బ్యాంక్ ను పది ప్రాంతీయ బ్యాంకులుగా విభజించాలని ఆదేశించారు. ఈ 10 ప్రాంతీయ బ్యాంకులు 1952లో మూడు ప్రధాన బ్యాంకులుగా విలీనం చేయబడ్డాయి: నార్డ్ డ్యుయిష్ బ్యాంక్ AG; సుడ్ డ్యుయిష్ బ్యాంక్ AG; మరియు రీనిష్-వెస్ట్ఫలిష్ బ్యాంక్ AG. 1957లో ఈ మూడు బ్యాంకులు మల్లి విలీనమయి ఫ్రాంక్ఫర్ట్ ప్రధాన కార్యాలయంగా డ్యుయిష్ బ్యాంక్ AG గా ఏర్పడ్డాయి.

1959లో, ఈ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించి చిరు వ్యక్తిగత రుణాలను ఇవ్వడం ప్రారంభించింది. 1970లో, ఈ బ్యాంక్, అంతర్జాతీయ విస్తరణ చేబట్టింది. మిలన్ (1977), మాస్కో, లండన్, పారిస్, టోక్యో వంటి కోత్త ప్రదేశాలలో కార్యాలయాలు తెరిచింది. 1980లలోను ఇదే కొనసాగింది. 1986లో, బాంకా డి’అమెరికా ఈ డి’ఇటాలియ ను బ్యాంకు US$603 మిలియను చెల్లించి కొనుగోలు చేసింది. బ్యాంకు అఫ్ అమెరికా 1922లో బంకా డెల్'ఇటాలియా మేరిడియోనేల్ ను కొనుగోలు చేసినప్పుడు బాంకా డి’అమెరికా ఈ డి’ఇటాలియ ను తమ ఇటాలియన్ ఉపసంస్థ గా స్థాపించింది. డ్యుయిష్ బ్యాంక్ మరొక ఐరోపా దేశములో ఎక్కువ సంఖ్యలో బ్రాంచీలు కలిగిన బ్యాంకు ను కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి.

1989లో, మోర్గాన్ గ్రెన్ఫెల్ అనే ఒక UK పెట్టుబడి బ్యాంకును కొనుగోలు చేయడంతో, పెట్టుబడి-బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించడానికి ఈ బ్యాంకు తొలి అడుగు వేసింది. 1990ల మధ్యలో, కేపిటల్ మార్కెట్లలో ప్రవేశించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జరిగాయి. ప్రధాన పోటీ బ్యాంకులనుంచి పలు పెద్ద వ్యక్తులు ఈ బ్యాంకులోకి వచ్చారు. మోర్గన్ గ్రెన్ఫెల్ ను కొనుగోలు చేసి పది సంవత్సరాల తరువాత, బ్యాంకర్స్ ట్రస్ట్ ఈ బ్యాంకుతో కలిసింది.

ఇటాలి లో తమ విస్తరణ ను డ్యుయిష్ బ్యాంకు కొనసాగిస్తూనే వచ్చింది. 1993లో బాంకా పోపోలరే డి లేక్కో ను బాంకా పోపోలరే డి నోవార నుంచి US$476 మిలియను కు కొనుగోలు చేసింది.


అక్టోబర్ 2001లో, న్యూ యార్క్ స్టాక్ ఎక్స్చేంజ్(NYSE) లో డ్యుయిష్ బ్యాంక్ లిస్టు చేయబడింది. [911] ఆటంకం తరువాత NYSE లో లిస్టింగ్ అవ్వడం ఇదే మొదటి సారి. మరుసటి ఏడాది, స్కడెర్ ఇన్వెస్ట్మెంట్స్ ను కొనడంతో, USలో తమ కార్యక్రమాన్ని డ్యుయిష్ బ్యాంక్ విస్తరించింది. అదే సమయములో, రూడ్ బ్లాస్ & సై (2002) మరియు యునైటెడ్ ఫైనాన్షియల్ గ్రూప్ (2006) అనే రష్యన్ పెట్టుబడి బ్యాంకు ను కొనుగోలు చేయడంతో, డ్యుయిష్ బ్యాంక్ ఐరోపాలో తమ ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని విస్తరించింది. జేర్మనిలో నోరిస్ బ్యాంకు మరియు బెర్లినేర్ బ్యాంకు లను కొనుగోలు చేసి, డ్యుయిష్ బ్యాంక్ తమ స్వదేశీయ మార్కెట్ లో రిటైల్ సేవలను విస్తరించింది. 'ట్రాన్స్ఫర్మేషనల్' విలీనాలకంటే బోల్ట్-ఆన్ కొనుగోలు మార్గమే నయం అనే బ్యాంకు యొక్క యుక్తి ప్రకారమే ఈ కొనుగోళ్ళు జరిగాయి. ఈ కొనుగోళ్ళు బ్యాంకు యొక్క అభివృద్ధి ప్రణాళికలో బాగమయ్యాయి. అదే సమయములో, 25% రిటర్న్ ఆన్ ఈక్వీటి ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని బ్యాంకు 2005లో సాధించింది.

గూఢచార్య వివాదం[మార్చు]

మే 2009లో, డ్యుయిష్ బ్యాంక్ ఒక బహిరంగ ప్రకటన చేసింది. బ్యాంకు యొక్క కార్పరేట్ సెక్యూరిటి విభాగంలో కార్యకలాపాలకు సంబంధించి బ్యాంకు అనుసరించిన పద్ధతులలో లేదా చట్టబద్ధమైన అవసరాలలో గతములో కొన్ని ఉల్లంఘనలు జరిగినట్లు బ్యాంకు యాజమాన్యానికి తెలియవచ్చిందని ఆ ప్రకటనలో ఉంది. వెంటనే, ఫ్రాంక్ఫర్ట్ లోని క్లియరి గొట్లిబ్ స్టీన్ & హమిల్టన్ అనే ఒక న్యాయసంస్థను ఒక స్వతంత్ర దర్యాప్తు[21] చేయవలసిందిగా డ్యుయిష్ బ్యాంక్ కోరింది. ఈ విషయాన్ని జెర్మన్ ఫెడరల్ ఫైనాన్షియల్ సుపెర్వైసరి అథారిటి (బాఫిన్) కు తెలియజేసింది. ఆ న్యాయసంస్థ తాము కనుగొన్న ముఖ్య అంశాలను జూలై 2009లో ప్రకటించింది.[22]. సమాచార బద్రత లేదా ప్రైవసీ విషయాలు వంటి చట్ట సంబంధమైన నాలుగు సంఘటనలు జరిగాయని ఆ నివేదికలో ఉంది. అన్ని సంఘటనలోనూ బ్యాంకు యొక్క కార్పరేట్ సెక్యూరిటి విభాగం తరఫున సేవలు అందించే బయట సంస్థలకు సంబంధం ఉంది. ఈ సంఘటనలు ఒక క్రమంగా ప్రణాళిక ప్రకారం జరగలేదు, అవి చెదురు ముదురు సంఘటనలే. ప్రస్తుత పాలక మండలి సభ్యులు ఎవరికీ కూడా దీనిలో సంబంధం ఉందని చెప్పడానికి సూచనలు లేవు. అటువంటి సంఘటనలు జరిగినట్లు వారికి తెలుసనీ చెప్పడానికి కూడా ఆధారాలు లేవు.[22] పైన సూచించిన ఉల్లంఘన వలన నష్టపోయిన వారందరికీ డ్యుయిష్ బ్యాంక్ క్షమాపణ కోరింది. కోర్పరేట్ సెక్యూరిటీ విభాగానికి బయట నుంచి సేవలు అందించే సంస్థకు ఇచ్చే అధికారాల పైన బ్యాంకు తమ నియంత్రణను పెంచింది.[22]

2001 నుంచి కనీసం 2007 వరకు, బ్యాంకు తమను విమర్శించే వారి పై గోప్యంగా నిఘా పెట్టింది. 2001 మరియు 2007 లలో కార్పరేట్ సెక్యూరిటీ విభాగం కొరకు తాము గూడచార్య చర్యలకు పాల్పడినట్లు బ్యాంకు ఒప్పుకుంది. అయితే, ఇవి "చెదురు ముదురు" సంఘటనలే అని చెప్పింది.[23] వాల్ స్ట్రీట్ జర్నల్ వారి ఒకటో పేజి కథనం ప్రకారం, తమ బ్యాంకును విమర్శించే 20 మంది పేర్ల గల ఒక జాబితాను డ్యుయిష్ బ్యాంక్ తయారు చేసింది. వీరి పై గోప్యంగా నిఘా పెట్టాలని నిర్ణయించింది. వీరిలో మైకేల్ బోన్డార్ఫ్ (బ్యాంకు లో పెట్టుబడి పెట్టిన ఒక ఉద్యమకారుడు) మరియు లియో కిర్చ్ (బ్యాంకు తో న్యాయపోరాటం జరుపుతున్న ఒక పూర్వ మీడియా అధికారి) ఉన్నారు.[23] కిర్చ్ తరఫున వాదిస్తున్న బబ్ గావీలేర్ & పార్ట్నేర్ అనే ఒక మ్యూనిచ్ న్యాయ సంస్థను కూడా ఈ జాబితాలో చేర్చింది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, బ్యాంకు యొక్క న్యాయ విభాగం మరియు కార్పరేట్ సెక్యూరిటి విభాగం కలిసి ఈ చర్యలకు పాల్పడ్డాయి.[23] ఈ సంఘటనల పై దర్యాప్తు చేయవలసిందిగా క్లియరి గొట్లిబ్ స్టీన్ & హమిల్టన్ అనే ఒక న్యూ యార్క్ న్యాయసంస్థను బ్యాంకు కోరింది. క్లియర్లి సంస్థ దర్యాప్తు పూర్తీ చేసి, నివేదిక కూడా సమర్పించింది. కాని ఆ నివేదికను బహిరంగంగా బయట పెట్టలేదు.[23] వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, బబ్ గావీలేర్ సంస్థలో తమ గూఢచారి ఒకరిని ఒక ఇంటర్న్ లాగా పనిలో పెట్టాలని పధకాన్ని డ్యుయిష్ బ్యాంక్ రూపొందించినట్లు క్లియర్లి సంస్థ కనుగొంది. ఆ ఇంటర్న్ ఉద్యోగములో చేరింది కాని ఆమె పని ప్రారంభించే ముందే ఈ పధకాన్ని ఆపేసారు.[23] "ప్రబుత్వ న్యాయవాదులు మరియు బ్యాంకు యొక్క పై అధికారులు దీని గురించి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తారని నేను ఎదురు చేస్తున్నాను" అని ఆ చట్ట సంస్థ యొక్క ప్రధాన అధికారి పేటర్ గావీలేర్ చెప్పారు.[23]

పనితీరు[మార్చు]

సంవత్సరం 2009 2008 2007 2006 2005 2004 2003
నికర ఆదాయం €5.0bn €-3.9bn €6.5bn €6.1bn €3.5bn €2.5bn €1.4bn
ఆదాయాలు €28.0bn €13.5bn €30.7bn €28.5bn 25.3 €21.9bn €21.3bn
రిటర్న్ ఆన్ ఈక్విటి 29% 30% 26% 16% 1%
డివిడెండ్ 0.75 16.5 16.5 4.0 16.5 1.7 16.5

గత ఐదు సంవత్సరాలలో డ్యుయిష్ బ్యాంక్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రిటైల్ మరియు వ్యాపార లావాదేవీలకు పేరొందిన జెర్మని మీదే కేంద్రీకరించిన సంస్థ అనే రూపమునుంచి, సాంప్రదాయక మార్కెట్ల మీద తక్కువ ఆధారపడే ఒక ప్రపంచవ్యాప్త పెట్టుబడి బ్యాంకు అనే రూపానికి మారింది.

మంచి అభివృద్ధి సాధించిన సంస్థగా బ్యాంకు ప్రశంసలు అందుకుంది. 2003 మరియు 2005 లలో IFR బాంక్ అఫ్ ది ఇయర్ పురస్కారం అందుకుంది.

2008 ఆర్ధిక సంవత్సరములో, ఐదు దశాబ్ధాల కాలములో మొదటి సారిగా బ్యాంకు నష్టం ప్రకటించింది. AIGతో భీమా ఏర్పాటులు ఉండడంవలన, ఆ సంస్థనుంచి బ్యాంకు బిలియన్ల డాలర్లు అందుకున్నప్పటికి, బ్యాంకుకు నష్టం వాటిల్లింది. యునైటెడ్ స్టేట్స్ పన్ను చెల్లింపుదారుల చెందిన $11.8bn నిధులు AIGకు లభించినప్పటికి ఈ నష్టం ఏర్పటింది.[24][25]

యాజమాన్యం యొక్క రూపం[మార్చు]

ఇటీవల వరకు డ్యుయిష్ బ్యాంక్ లో CEO ఎవరు లేరు. పాలక మండలి కి "మండలి ప్రతినిధి" ఒకరు ఉండేవారు. ప్రస్తుతం, డ్యుయిష్ బ్యాంక్ పాలక మండలిలో ఉన్న సభ్యులు వీరే: జోసెఫ్ ఆకేర్మాన్ (చైర్ర్మన్ మరియు CEO); హ్యూగో బంజిగేర్ (చీఫ్ రిస్క్ ఆఫీసర్); మిచెల్ కహ్ర్స్ (గ్లోబల్ బ్యాంకింగ్); అన్షు జైన్ (గ్లోబల్ మార్కెట్స్); జర్గెన్ ఫిట్స్చెన్ (రీజనల్ మేనేజ్మెంట్); రైనేర్ నేస్కే (ప్రైవేట్ & బిజినెస్ క్లయంట్స్); హీర్మాన్-జోసెఫ్ లంబెర్టి (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) మరియు స్టీఫన్ క్రాస్.


పాలక మండలి సభ్యులతో పాటు బ్యాంకు యొక్క ఇతర వ్యాపార విభాగాల అధిపతులు కలిసి గ్రూప్ ఎక్సేక్యుటివ్ కమిటి లో ఉంటారు. వీరు: కెవిన్ పార్కేర్ (అసెట్ మానేజ్మెంట్); మరియు పియరీ డి వెక్ (ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్).


బ్యాంకు యొక్క సుపెర్వైసరి బోర్డ్ అధ్యక్షుడు గా క్లేమేన్స్ బోర్సిగ్ ఉన్నారు.

వ్యాపార పధ్ధతి[మార్చు]

"ఖాతాదారులకు ఆర్ధిక సేవలను అందించే ప్రపంచవ్యాప్త సంస్థలో ప్రాధాన సంస్థగా ఉండాలనదే మా లక్ష్యం. మా వాటాదారులకు జనానికి అతి గొప్ప విలువలను సృష్టించడమే మా లక్ష్యం" అనేదే డ్యుయిష్ బ్యాంక్ యొక్క ముఖ్య విధానం. బ్యాంకు యొక్క వ్యాపార పధ్ధతి రెండు అంశాల మీద ఆధారపడి ఉంది: కార్పరేట్ & ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (CIB) మరియు ప్రైవేట్ క్లయంట్స్ & అసెట్ మేనేజ్మెంట్.

CIB[మార్చు]

ఒక దశాబ్ద కాలములో, డ్యుయిష్ బ్యాంక్ యొక్క CIB విభాగం, ప్రపంచంలోనే ప్రధాన పెట్టుబడి బ్యాంకింగ్ సంస్థలో ఒకటిగా ఎదిగింది. బ్యాంకు యొక్క గ్లోబల్ మార్కెట్స్ మరియు గ్లోబల్ బ్యాంకింగ్ విభాగాలు CIBలో బాగం.

ఇటీవల వరకు, డ్యుయిష్ బ్యాంక్ ఆధాయాలలో మరియు లాభాలలో గ్లోబల్ మార్కెట్స్ విభాగం పెద్ద పాత్ర వహించింది. ఋణం మరియు ఈక్విటి, డిరివేటివ్ లు మరియు ఇతర నూతన ఉత్పాదనలను అమ్మడం మరియు వాటిలో లావాదేవీలు జరపడమే ఈ విభాగం యొక్క పని. బాండ్ మార్కెట్లు, విదేశీ మారకం మరియు డిరివేటివ్ లలో గ్లోబల్ మార్కెట్స్ యొక్క శౌర్యము గత ఐదు సంవత్సరాలలో దానికి అనేక అవార్డులు, ప్రసంశలు తెచ్చిపెట్టింది.

అయితే, 2004/5 నుంచి ఖర్చులు తగ్గించే కార్యక్రమాన్ని డ్యుయిష్ బ్యాంక్ మొదలు పెట్టింది. ముందుగా లండన్, ఫ్రాంక్ఫర్ట్ మరియు ఇతర చోట్లలో 6400 ఉద్యోగాలను తొలగించారు.[26] నవంబర్ 2008లో, క్రెడిట్ సంక్షోబాన్ని ఎదుర్కొనడానికి మరింత సిబ్బందిని బ్యాంకు తొలగించింది. తమ వ్యాపారులలో 7 గురులో 1 ని తొలగించడంతో ముఖ్యంగా లండన్ మరియు న్యూ యార్క్ లలో 900 ఉద్యోగాలు తొలగించబడ్డాయి.[27]

గ్లోబల్ బ్యాంకింగ్ విభాగంలో ప్రధానమైన ఉపవిభాగం విలీనం & కొనుగోళ్ళు (M&A). ఇది గత ఐదు సంవత్సరాలలో గణనీయంగా అభివృద్ధి చెందింది. 2007లో, బ్యాంకు యొక్క M&A వ్యాపారం మరింత అభివృద్ధి చెంది, ప్రపంచ స్థాయి ఫ్రాంచైస్ ను నిర్మించింది. ఈ క్రమములో M&A వ్యాపారములో ఏంటో కాలంగా స్థిరపడిన సంస్థలో బ్యాంకు పోటీ చేసింది. గ్లోబల్ బ్యాంకింగ్ విభాగంలో, ప్రపంచవ్యాప్త కేపిఅల్ మార్కెట్స్ వ్యాపారం కూడా ఉంది. ఈ వ్యాపారం, ఐరోపా లో ఇనిశియల్ పబ్లిక్ ఆఫెరింగ్ , ఈక్విటీ, ఋణం మరియు ఎక్కువ రాబడి మార్కెట్ లలో నూతన ప్రయోగాలు చేసి గణనీయమైన అభివృద్ధి సాధించింది.

ఖాతాదారులకు సేవలు అందించడం గూడ గ్లోబల్ బ్యాంకింగ్ విభాగం క్రిందే ఉంది.

గ్లోబల్ బ్యాంకింగ్ లో ఒక బాగమైన గ్లోబల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, నగదు మేనేజ్మెంట్, క్లియరింగ్, వ్యాపారాలాకు పెట్టుబడి మరియు ట్రస్ట్ & సెక్యూరిటీ సేవలను అందిస్తుంది. ఇటీవల సంవత్సరాలలో ఈ వ్యాపారం పలు రెట్లు పెరిగి, పరిశ్రమలోనే ప్రధాన సంస్థగా మారింది. బ్యాంకు యొక్క ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ సేవలకు, ముఖ్యంగా నగదు నిర్వాహణ సేవలకు డ్యుయిష్ బ్యాంక్ పలు పురస్కారాలు గెలుచుకుంది. IBIT రాంక్ చేస్తున్న అతిపెద్ద విబాగాలలో ఈ విభాగం కూడా ఒకటి.

CIB యొక్క ఖాతాదారులలో ప్రధానంగా ప్రైవేట్ మరియు ప్రబుత్వ రంగ సంస్థలు, స్వతంత్ర దేశాలు, సుప్రానేషనల్ సంస్థలు, బహుళజాతి సంస్థలు మరియు మధ్య-తరహా మరియు లఘు పరిశ్రమలు ఉన్నాయి.

PCAM[మార్చు]

ప్రైవేట్ క్లయంట్స్ & అసెట్ మానేజ్మెంట్ (PCAM) లో ప్రైవేట్ వెల్త్ మానేజ్మెంట్, ప్రైవేట్ & బిజినెస్ క్లయంట్స్ మరియు అసెట్ మానేజ్మెంట్ విభాగాలు ఉన్నాయి. ఈ మూడు వ్యాపార విభాగాలు కలిసి క్రింద సేవలను అందిస్తున్నాయి: ప్రైవేట్ మరియు సంస్థాగత ఖాతాదారులకు పెట్టుబడి నిర్వాహణా సేవలు, ప్రైవేట్ ఖాతాదారులకు మరియు చిన్న, మధ్య-తరహా వ్యాపారాలకు రిటైల్ బ్యాంకింగ్ కార్యకాలాపాలు.

ప్రైవేట్ ఆస్తి నిర్వాహణ[మార్చు]

ప్రైవేట్ ఆస్తి నిర్వాహణ అనేది బ్యాంకు యొక్క ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ నికర విలువ కలిగిన ధనవంత వ్యక్తులు మరియు కుటుంబాలకు ఆస్తి నిర్వాహణా సేవలను అందిస్తుంది. స్విట్జెర్లాండ్, లక్సంబర్గ్, ఛానల్ ఇలాండ్స్, కేమన్స్ మరియు దుబాయ్ వంటి ప్రైవేట్ బ్యాంకింగ్ కు ప్రధాన కేంద్రాలలో ఈ విభాగం సేవలను అందిస్తుంది.

కమ్యూనికేషన్[మార్చు]

ఆధునిక కమ్యూనికేషన్ పద్ధతులను ప్రారంభమునుంచే ఉపయోగించడం వలన డ్యుయిష్ బ్యాంక్ ప్రస్తుతం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన సంస్థగా ఎదగింది. 1972లో, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "స్లాష్ ఇన్ అ స్కొయర్" అనే నీలి రంగు లోగోను సృష్టించింది. దీనిని అంటోన్ స్టాన్కోస్కి రూపొందించారు. ఆపదను నియంత్రించుకొని అభివృద్ధి అనేది దీని అర్ధం.

కొనుగోళ్లు[మార్చు]

  • మోర్గన్, గ్రెన్ఫెల్& కంపెనీ, 1990.
  • బాన్కేర్స్ ట్రస్ట్ 30 నవంబర్ 1998.[28]
  • స్కడ్డర్ ఇన్వెస్ట్మెంట్స్, 2001
  • RREEF, 2002[29]
  • బెర్క్షయర్ మార్ట్గేజ్ ఫైనాన్స్ 22 అక్టోబర్ 2004.[30]
  • చాపెల్ ఫండింగ్, ఇప్పుడు DB హోమ్ లెండింగ్ 12 సెప్టెంబర్ 2006[31]
  • మార్ట్గేజ్ ఇట్ హోల్డింగ్స్ 3 జనవరి 2007[32]
  • సాల్. ఒప్పెన్హీం, 2010

ప్రముఖ ప్రస్తుత మరియు మాజీ ఉద్యోగులు[మార్చు]

  • హీర్మాన్ జోసెఫ్ అబ్స్ — ఛైర్మన్ (1957–67)
  • సర్ జాన్ క్రావెన్ — లండన్ లో పెట్టుబడిదారుడు
  • మైకేల్ డాబ్సన్ — ష్రోడేర్స్ అధిపతి
  • ఆల్ఫ్రెడ్ హర్హాసేన్ — ఛైర్మన్ (1971–89)
  • ఎడ్సన్ మిట్చేల్ — గ్లోబల్ మార్కెట్స్ అధిపతి (1995–2000)
  • కార్ల్ కిమ్మిచ్ — ఛైర్మన్ (1942–1945)
  • హీర్మాన్ వాళ్ళిచ్ — ఉప-వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ (1870–1893)
  • జార్జ్ వాన్ సీమెన్స్ — ఉప-వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ (1870–1900)
  • బొజ్ వీన్స్టీన్ — డెరివేటివ్ ల వ్యాపారి
  • అన్షు జైన్ - కార్పరేట్ మరియు పెట్టుబడి బ్యాంకింగ్ విభాగ అధిపతి

ప్రజా సేవ[మార్చు]

  • ఒట్టో హీర్మాన్ కాన్ — సర్వోపకారి

వీటిని కూడా పరిశీలించండి[మార్చు]

Lua error in package.lua at line 80: module `Module:Portal/images/c' not found.

  • యూరిపియన్ ఫైనాన్షియల్ సర్విసస్ రౌండ్ టేబుల్
  • DBFX - డ్యుయిష్ బ్యాంక్ యొక్క ఆన్లైన్ ఫోరెక్స్ లావాదేవీల ప్లాట్ఫారం

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Annual Results 2009". Deutsche Bank. సంగ్రహించిన తేదీ 4 February 2010. 
  2. Fins.com. "Deutsche Bank AG Overview". సంగ్రహించిన తేదీ 2010-07-12. 
  3. 2013 వరకు డ్యుయిష్ బ్యాంక్ CEO గా ఆకేర్మాన్ కొనసాగుతారు AFX న్యూస్
  4. డ్యుయిష్ బ్యాంక్ యొక్క చరిత్ర కొరకు చూడండి: లోతార్ గాల్ (et al.), ది డ్యుయిష్ బ్యాంక్ 1870-1995, లండన్ (వీడేన్ఫెల్డ్ & నికల్సన్) 1995.
  5. స్టాటట్ దర్ డ్యుయిష్ బాంక్ అక్టీన్-గేసేల్ల్శాఫ్ట్, బెర్లిన్ 1870, p.3-4.
  6. మన్ఫ్రేడ్ పోల్ / అన్జేలిక రాబ్-రేబెంటిష్, డై డ్యుయిష్ బ్యాంక్ ఇన్ బ్రేమేన్ 1871-1996, మ్యూనిచ్, జురిచ్ (పైపెర్) 1996.
  7. మన్ఫ్రేడ్ పోల్ / అన్జేలిక రాబ్-రేబెంటిష్, డై డ్యుయిష్ బ్యాంక్ ఇన్ హంబుర్గ్ 1872-1997, మ్యూనిచ్, జురిచ్ (పైపెర్) 1997.
  8. డ్యుయిష్ బ్యాంక్ ఇన్ చైనా, మునిచ్ (పైపెర్) 2008.
  9. మన్ఫ్రేడ్ పోల్ / అన్జేలిక రాబ్-రేబెంటిష్, డై డ్యుయిష్ బ్యాంక్ ఇన్ లండన్ 1873-1998, మ్యూనిచ్, జురిచ్ (పైపెర్) 1998.
  10. క్రిస్టోఫర్ కొబ్రాక్, బ్యాంకింగ్ ఆన్ గ్లోబల్ మార్కెట్స్. డ్యుయిష్ బ్యాంక్ అండ్ ది యునైటెడ్ స్టేట్స్, 1870 టు ది ప్రెసెంట్, న్యూ యార్క్ (కేంబ్రిడ్జ్ యునివర్సిటీ ప్రెస్) 2008.
  11. ఎ సెంచురీ అఫ్ డ్యుయిష్ బ్యాంక్ ఇన్ టర్కీ, ఇస్తాంబుల్ 2008, pp.21-27.
  12. హిస్తోరీష్ గేసేల్ల్శాఫ్ట్ డెర్ డ్యుయిష్n బ్యాంకు (ed.), డై డ్యుయిష్ బ్యాంక్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్ అం మెయిన్, మునిచ్, జురిచ్ (పిపెర్) 2005.
  13. మన్ఫ్రేడ్ పోల్ / అన్జేలిక రాబ్-రేబెంటిష్, డై డ్యుయిష్ బ్యాంక్ ఇన్ లీప్జిగ్ 1901-2001, మ్యూనిచ్, జురిచ్ (పైపెర్) 2001.
  14. మన్ఫ్రేడ్ పోల్, డ్యుయిష్ బ్యాంక్ బ్యూనస్ ఆయర్స్ 1887-1987, మైంజ్ (v. హసే & కోహ్లేర్) ౧౯౮౭.
  15. మాక్సిమిలియన్ ముల్లెర్-జబుష్, 50 జహ్రే డ్యుయిష్-ఆసియాటిష్ బ్యాంకు 1890-1939, బెర్లిన్ 1940.
  16. [175] ^ "హిస్టరీ."
  17. స్కిమిడ్, జాన్. డ్యుయిష్ బ్యాంక్ లింక్డ్ టు ఆష్విట్జ్ ఫండింగ్, ది న్యూ యార్క్ టైమ్స్ , ఫిబ్రవరి 5, 1999. సేకరణ తేదీ జనవరి 4, 2010.
  18. [1]
  19. నాజీలతో డ్యుయిష్ బ్యాంక్ యొక్క సంబంధం గురించి పూర్తి వివరాలకు చూడండి: హారొల్ద్ జేమ్స్. ది నాజి డిక్టేటర్షిప్ అండ్ ది డ్యుయిష్ బ్యాంక్. కేంబ్రిడ్జ్ యునివెర్సిటీ ప్రెస్, 2004, 296pp., ISBN 0-521-83874-6.
  20. [175] ^ "హిస్టరీ."
  21. డ్యుయిష్ బ్యాంక్ స్వతంత్ర దర్యాప్తు చేపట్టింది, మే 22, 2009. సేకరణ తేదీ జనవరి 4, 2010.
  22. 22.0 22.1 22.2 విచారణల గురించి డ్యుయిష్ బ్యాంక్ అప్డేట్ ఇస్తుంది, జూలై 22, 2009. సేకరణ తేదీ జనవరి 4, 2010.
  23. 23.0 23.1 23.2 23.3 23.4 23.5 క్రాఫోర్డ్, డేవిడ్; కర్నిట్స్ష్నిగ్ , మాథ్యూ. బ్యాంకు స్పై స్కాండల్ వైడన్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్ , ఆగష్టు 3, 2009. సేకరణ తేదీ జనవరి 4, 2010.
  24. [2]
  25. జవేర్స్, ఈమొన్. AIG షిప్స్ బిలియన్స్ ఇన్ బెయిల్ అవుట్ అబ్రాడ్, పోలిటికో , మార్చ్ 15, 2009. సేకరణ తేదీ జనవరి 4, 2010.
  26. గో, డేవిడ్. డ్యుయిష్ బ్యాంక్ కట్స్ 6,400 జాబ్స్, ది గార్డియన్ , ఫిబ్రవరి 4, 2005. సేకరణ తేదీ జనవరి 4, 2010.
  27. హాల్స్ట్రిక్, ఫిలిప్. డ్యుయిష్ బ్యాంక్ టు ఎక్స్ వన్ ఇన్ సెవెన్ ట్రేడర్స్, ర్యూటర్స్ , నవంబర్ 19, 2008. సేకరణ తేదీ జనవరి 4, 2010.
  28. బాన్కేర్స్ ట్రస్ట్ కొనుగోలు పూర్తి
  29. డ్యుయిష్ బ్యాంక్ టు అక్వయర్ RREEF ఫర్ $490 మిలియను. నేషనల్ రియల్ ఎస్టేట్ ఇన్వేస్టర్, మార్ 7, 2002
  30. బెర్క్షయర్ మార్ట్గేజ్ ఫైనాన్స్
  31. చాపెల్ ఫండింగ్ కొనుగోలు
  32. మార్ట్ గేజ్ ఇట్ హోల్డింగ్స్ కొనుగోలు

బాహ్య లింకులు[మార్చు]


మూస:Major investment banks మూస:DAX companies మూస:Members of Euro Banking Association మూస:50 largest US banks