ఢమరుకం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఢమరుకం
దర్శకత్వంశ్రీనివాసరెడ్డి
నిర్మాతఆర్.ఆర్.వెంకట్
తారాగణంనాగార్జున
అనుష్క
రవి శంకర్
గణేష్ వెంకట్రామన్
ప్రకాష్ రాజ్
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుగౌతమ్ రాజు
సంగీతందేవి శ్రీ ప్రసాద్
పంపిణీదార్లుఆర్. ఆర్. మూవీ మేకర్స్
విడుదల తేదీ
నవంబర్ 23, 2012
దేశంభారతదేశం
భాషతెలుగు

ఢమరుకం 2012 లో విడుదలైన సామాజిక ఫాంటసీ తెలుగు చిత్రం, ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ఈ చిత్రానికి ప్రధాన పాత్రదారులుగా నాగార్జున, అనుష్క నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించింది దేవి శ్రీ ప్రసాద్. ఈ చలన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ సమీక్షలతో 1400 పైగా థియేటర్లలో 2012 నవంబరు 23 న విడుదలైంది. ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో బాక్స్ ఆఫీసు వద్ద ఓపెనింగ్ అయిన అతిపెద్ద చిత్రంగా నమోదయింది.

తారాగణం[మార్చు]

  • నాగార్జున - మల్లికార్జున
  • అనుష్క - మహేశ్వరీ
  • రవి శంకర్ - అంధకాసుర
  • ప్రకాష్ రాజ్ - శివుడు (దేవుడు) / సాంబయ్య
  • గణేష్ వెంకట్రామన్ - రాహుల్
  • దేవన్ - విశ్వనాధం, మహేశ్వరీ తండ్రి
  • ప్రగతి - రాజేశ్వరీ, మహేశ్వరీ యొక్క తల్లి
  • బ్రహ్మానందం - రుద్రాక్ష
  • జీవా - మాయి
  • అభినయ - శైలు, మల్లికార్జున సోదరి
  • ఛార్మి - ఒక పాటలో ప్రత్యేక ప్రదర్శన
  • పంచి బోరా - కవిత

పాటల జాబితా[మార్చు]

ఓంకారం , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. వెంకట సాయి

అరుణ ధవళ , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గానం.కార్తీక్

నేస్తమా నేస్తమా, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.శ్రీకృష్ణ , హరిణి

రెప్పలాపాయి , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. హరిహరన్, కె ఎస్ చిత్ర

ధీంతన , రచన: కరుణాకర్, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు(మంత్రాస్) గానం.శంకర్ మహదేవన్

సక్కుబాయి గరం చాయ్ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.సుచిత్ సురేశన్, మమతా శర్మ

లాలీ లాలీ, రచన: చంద్రబోస్ , గానం.గోపికా పూర్ణిమ

భూనభో తాలకే , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎం ఎల్ ఆర్ కార్తీకేయన్

కన్యాకుమారి , రచన: సాహితీ , గానం.జస్ప్రీత్ జస్ , సునీత

శివ శివ శంకర, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.శంకర్ మహదేవన్ .

నిర్మాణం[మార్చు]

తారగణం[మార్చు]

ఈ చిత్రంలో నాగార్జున మరియూ అనుష్క హీరో హీరోయిన్లుగా నటించగా, గణేష్ వెంకట్రామన్, ప్రకాష్ రాజ్, జీవా, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, రఘుబాబు, ఎం.ఎస్. నారాయణలు ముఖ్య పాత్రలను పోషించారు[1] గౌతం రాజు కూర్పు, చొటా కే నాయుడు ఛాయాగ్రహణం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.[2] ప్రముఖ నటి చార్మి ఈ చిత్రంలో ఒక పాటలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది[3]

చిత్రీకరణ[మార్చు]

ఈ చిత్రం యొక్క షూటింగ్ 2011 ఏప్రిల్ 25 న ప్రారంభమైంది.[4][5] 2011 సెప్టెంబరు 29 న ఈ చిత్రం యొక్క ట్రైలరును ఆనాడు విడుదలైన రెబెల్ చిత్రంతో పాటు విడుదల చేసారు. ఆ ట్రైలరుకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.[6] 70 నిమిషాల పాటు భారీ గ్రాఫిక్సు కలిగిన మొదటి తెలుగు చిత్రంగా దీనికి గుర్తింపు లభించింది.అంజి, అరుంధతి, మగధీర, ఈగ వంటి ఎన్నో చిత్రాలకు గ్రాఫిక్స్ ని అందించిన ఫైర్ ఫ్లై సంస్థ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందించింది[7]

విడుదల[మార్చు]

సెన్సారు బోర్డువారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ని అందజేసారు. ఈ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత 2011 నవంబరు 23 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.[8]

వనరులు[మార్చు]

  1. http://www.indiaglitz.com/channels/tamil/article/71320.html
  2. http://www.indiaglitz.com/channels/telugu/article/66327.html
  3. http://www.mirchi9.com/movienews/lakshmi-rai-misses-out-charmee-grabs/
  4. http://www.indiaglitz.com/channels/telugu/article/65780.html
  5. http://www.indiaglitz.com/channels/telugu/article/65938.html
  6. http://entertainment.oneindia.in/telugu/news/2012/nagarjuna-damarukam-theatrical-trailer-response-099868.html[permanent dead link]
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-25. Retrieved 2012-11-23.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-10. Retrieved 2012-11-23.