ఢిల్లీ మెట్రో

వికీపీడియా నుండి

మూస:Infobox Public transit


భారతదేశంలోని ఢిల్లీ నగరంలో ఉన్న వేగవంతమైన రవాణా వ్యవస్థను ఢిల్లీ మెట్రో (హిందీ: दिल्ली मेट्रो Dillī Meṭro ) అని పిలుస్తారు, దీనిని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (DMRC ) నిర్మించి నిర్వహిస్తోంది.[1]


ఢిల్లీ మెట్రో యొక్క తొలి భాగం డిసెంబరు 24, 2002న ప్రారంభించబడింది. భారతదేశంలో ఇది రెండో భూగర్భ ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ, కోల్‌కతాలో మొదటి భూగర్భ ప్రజా రవాణా వ్యవస్థ నిర్మించబడింది. వంతెనపై, భూమిపై మరియు భూగర్భంలో ఢిల్లీ మెట్రోకి సంబంధించిన రైల్వే మార్గాలు ఉన్నాయి, ప్రారంభించిననాటి నుంచి ఏడేళ్ల కాలంలో ఇది ఒక బిలియన్ మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది.[2]


విషయ సూచిక

[మార్చు] చరిత్ర

1969లో ఢిల్లీ నగరంలో నిర్వహించిన ట్రాఫిక్ మరియు ప్రయాణ లక్షణాల అధ్యయనం నుంచి ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ (మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) అంశం తొలిసారి తెరపైకి వచ్చింది.[3]మూస:Rp తరువాత అనేక సంవత్సరాలపాటు, సాంకేతిక పరిజ్ఞానం, మార్గ అమరిక మరియు ప్రభుత్వ అధికార పరిధికి సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అనేక అధికారిక కమిటీలు ఏర్పాటయ్యాయి.[3]మూస:Rp 1984లో, ఢిల్లీ డెవెలప్‌మెంట్ అథారిటీ మరియు అర్బన్ ఆర్ట్స్ కమిషన్ బహుళ-నమూనా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రతిపాదనతో ముందుకొచ్చాయి, నగరంలో ప్రస్తుతం ఉన్న ఉపపట్టణ రైల్వే మరియు రోడ్డు రవాణా వ్యవస్థలను బాగా వృద్ధి చేయడంతోపాటు మూడు భూగర్భ ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలు (అండర్‌గ్రౌండ్ మాస్ రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌లు) నిర్మించాలని ఈ ప్రతిపాదనలో పేర్కొన్నారు.[4]


విస్తృత సాంకేతిక అధ్యయనాలు మరియు ప్రాజెక్టు నిధుల కోసం అన్వేషణ కార్యక్రమాలు సాగుతుండగా, నగర పరిమాణం గణనీయంగా పెరిగింది, దీని ఫలితంగా 1981 మరియు 1998 మధ్యకాలంలో నగర జనాభా రెండు రెట్లు మరియు వాహనాల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది.[4] ఈ కారణంగా, ట్రాఫిక్ సమస్యలు మరియు కాలుష్యం బాగా పెరిగాయి, అందుబాటులో ఉన్న బస్సు వ్యవస్థ రద్దీకి తగ్గట్టుగా అవసరాలు తీర్చలేకపోతుండటంతో, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది.[3]మూస:Rp బస్సు రవాణా వ్యవస్థను 1992లో ప్రైవేటీకరణ చేయడంతో సమస్య మరింత తీవ్రమైంది, అనుభవంలేని నిర్వాహకుల పేలవమైన నిర్వహణ, పొడవైన మార్గాలపై పెద్ద శబ్దాలతో, ఎక్కువ కాలుష్యానికి బస్సులు కారణమవుతుండటం, బాగా ఎక్కువసేపు వేచివుండాల్సి రావడం, ఆధారపడలేని సేవలు, అధిక రద్దీ, అర్హత లేని చోదకులు, మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంతో బస్సులను నడపడం వంటి సమస్యలు అన్నీ కలిసి ఈ ప్రయత్నం బెడిసికొట్టింది.[5] పరిస్థితిని సరిచేసేందుకు, భారతదేశ కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మార్చి 5, 1995న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అని పిలిచే ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి.[6]


ఢిల్లీ మెట్రో యొక్క అసలు నిర్మాణ పనులు అక్టోబరు 1, 1998న ప్రారంభమయ్యాయి.[7] కలకత్తా మెట్రో నిర్మాణం బాగా జాప్యం అవడంతోపాటు, దీని నిర్మాణం పూర్తయ్యే సమయానికి "అనవసర రాజకీయ జోక్యం, సాంకేతిక సమస్యలు, అధికారిక జాప్యాలు" కారణంగా ముందుగా అంచనా వేసిన దానికంటే 12 రెట్లు ఎక్కువ నిధులు అవసరమయ్యాయి, కలకత్తా మెట్రో నిర్మాణంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని DMRCకి వ్యక్తుల నియామకం, టెండర్ల ఆహ్వానం మరియు నిధుల నిర్వహణకు సంబంధించి పూర్తి అధికారాలు ఇచ్చారు.[8] దీని ఫలితంగా, నిర్మాణం సాఫీగా సాగింది, అయితే 2000 సంవత్సరంలో మాత్రం ఒక ప్రధాన అభిప్రాయభేదం ఏర్పడింది, ఈ వివాదం ఏమిటంటే రైల్వే మంత్రిత్వ శాఖ బ్రాడ్ గేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేయగా, DMRC మాత్రం స్టాండర్డ్ గేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపింది.[9] . మొదటి మార్గం డిసెంబరు 24, 2002న ప్రారంభమైంది, ప్రాజెక్టు మొదటి దశ మొత్తం డిసెంబరు 2005లో పూర్తయింది, బడ్జెట్ పరిధిలో నిర్మించడంతోపాటు మరియు షెడ్యూల్ కంటే మూడేళ్ల ముందుగా దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు, ఈ సాధన ఒక అద్భుతంగా వర్ణించబడింది.[10]


[మార్చు] నెట్‌వర్క్

మొదటి దశ నెట్‌వర్క్ మొత్తం 65.11 కిలోమీటర్ల రైలు మార్గం కలిగివుంది, ఇందులో 13.01 km భూగర్భ రైలు మార్గంకాగా, 52.10 km ఉపరితల/వంతెన మార్గం ఉంది.


రెండో దశ నెట్‌వర్క్‌లో 128 km పొడవైన రైలు మార్గాన్ని నిర్మిస్తారు, దీనిపై 79 స్టేషన్లు ఉంటాయి, ప్రస్తుతం ఇది నిర్మాణంలో ఉంది, దీనిలో తొలి భాగం జూన్ 2008న ప్రారంభమైంది, 2010నాటికి రెండో దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.[11]


మూడో (112 km) మరియు నాలుగో (108.5 km) దశలను వరుసగా 2015 మరియు 2020నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికా రచన చేశారు, ఈ దశలు కూడా పూర్తయితే ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థ పరిమాణం 413.8 kmలకు చేరుకుంటుంది.


[మార్చు] ప్రస్తుత మార్గాలు

ప్రధాన వ్యాసాలు: Red Line (Delhi Metro)Yellow Line (Delhi Metro) & Blue Line (Delhi Metro)


జనవరి 2010నాటికి, మొదటి దశ పూర్తిగా, రెండో దశలోని కొన్ని భాగాలు పూర్తయ్యాయి, నెట్‌వర్క్ మొత్తం పొడవు >

96 km (60 mi)మూస:Convert/test/Aonతో మూడు మార్గాలు నిర్మించబడ్డాయి.[12]


నిర్వహణలో ఉన్న ఢిల్లీ మెట్రో మార్గాలు
పేరు సంఖ్య టెర్మినళ్లు పొడవు (km) స్టేషన్లు నడుస్తున్న రైళ్లు
రెడ్ +1% దిల్షాద్ గార్డెన్ - రిథలా 25.09[13] -21 23 రైళ్లు[13]
ఎల్లో 2 జహంగీర్‌పురి - హుద సితి సెన్త్రె 17.36[13] 15 16 రైళ్లు[13]
బ్లూ 3 నోయిడా సిటీ సెంటర్ - యమునా బ్యాంక్ - ద్వారకా సెక్టార్ 9 47.40[14] 42 43 రైళ్లు[15]
4 యమునా బ్యాంక్ - ఆనంద్ విహార్ 6.25[16] 5 4 రైళ్లు[16]

[మార్చు] నిర్మాణంలో ఉన్న మార్గాలు

ప్రధాన వ్యాసాలు: Green Line (Delhi Metro)Violet Line (Delhi Metro) & Airport Express (Delhi Metro)


రెండో దశ >

127 km (79 mi)మూస:Convert/test/Aon కొత్త రైలు మార్గాన్ని కలిగివుంది, దీనిలో ఈ కింది సెక్షన్లు నిర్మాణంలో ఉన్నాయి.[17] ఈ దశ 2010నాటికి పూర్తికావాల్సి ఉంది. జులై 2009నాటికి రెండో దశలో 37% నిర్మాణం పూర్తయింది.[18][19]


గూర్గావ్‌కు విస్తరణలో రెండో దశ భాగంగా పురోభివృద్ధిలో ఉన్న నిర్మాణ పనులు.



ప్రణాళిక ప్రకారం ప్రారంభ తేదీ మార్గం టెర్మినళ్లు పొడవు(km) స్టేషన్లు
మార్చి 2010[20] యెల్లో లైన్ కుతుబ్ మినార్ - సుశాంత్ లోక్ (గుర్గావ్) 14.47 8
మార్చి 2010[20] గ్రీన్ లైన్ ఇంద్రలోక్ - ముండ్కా 15.15 +13%
జూన్ 2010[20] ఎల్లో లైన్ సెంట్రల్ సెక్రటేరియట్ - కుతుబ్ మినార్ 12.53 11
జూన్ 2010[20] గ్రీన్ లైన్ కీర్తి నగర్ - అశోక్ పార్క్ 3.32 2
సెప్టెంబరు 2010[20] బ్లూ లైన్ ద్వారకా సెక్టార్ 9 - సెక్టార్ 21 2.76 2
సెప్టెంబరు 2010[20] ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ - IGI ఎయిర్‌పోర్ట్ 19.2 6
సెప్టెంబరు 2010[20] బ్లూ లైన్ ఆనంద్ విహార్ - వైశాలి (గజియాబాద్) 2.5 2
సెప్టెంబరు 2010[20] వైలెట్ లైన్ సెంట్రల్ సెక్రటేరియట్ - బాదర్‌పూర్ 20.16 15



[మార్చు] మార్గ పటం

ఢిల్లీ మెట్రో యొక్క మొదటి దశ మరియు రెండో దశ పటం, జనవరి 2010నాటికి నిర్వహణలో ఉన్న మరియు నిర్మాణంలో ఉన్న మార్గాలను ఇది చూపిస్తుంది.


[మార్చు] భవిష్యత్ విస్తరణలు

మూడో దశలో >

112 kilometres (70 mi)మూస:Convert/test/A పొడవైన మార్గాన్ని నిర్మించాలనుకుంటున్నారు, దీనికి 2015లోగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మరియు ప్రస్తుతానికి ఉపయోగపడే విధంగా బాద్లీ, ముకుంద్‌పూర్, బహదూర్‌గఢ్, శివ విహార్, బార్వాలా, గజియాబాద్, గూర్గావ్ మరియు ఫరీదాబాద్‌లకు విస్తరణలు ఇందులో ఉన్నాయి.[21] నాలుగో దశను 2020లోగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, ప్రస్తుతానికి ఉపయోగపడే విధంగా, సారాయ్ కాలే ఖాన్ ISBT, సోనియా విహార్, రియోలా ఖాన్‌పూర్, ముకుంద్‌పూర్, పాలం, నిజాఫ్‌గడ్, గాజీపూర్, నోయిడా సెక్టార్ 62, గూర్గావ్ మరియు ఫరీదాబాద్ విస్తరణలతో ఇది మొత్తం >

108.5 km (67.4 mi)మూస:Convert/test/Aon పొడవు కలిగివుంది.[21]


I-IV దశల్లో ఈ మార్గాలతోపాటు, నోయిడా సెక్టార్-62 నుంచి గ్రేటర్ నోయిడాకు కొత్త మార్గాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు పరిగణలో ఉన్నాయి, ఇది ఇంద్రప్రస్థ- నోయిడా సెక్టార్ 32 మార్గాన్ని ఖండిస్తుంది.[22] ఇదిలా ఉంటే గజియాబాద్ డెవెలప్‌మెంట్ అథారిటీ ఢిల్లీ మెట్రో మార్గాలను గజియాబాద్‌లోకి 5 దశల్లో విస్తరించేందుకు ప్రణాళికా రచన చేస్తోంది, ఇంద్రప్రస్థ - ఆనంద్ విహార్ - వైశాలి రైలు మార్గాన్ని ఇందిరాపురం మీదగా మెహ్రౌలి వరకు విస్తరించే ఆలోచన కూడా ఈ ప్రణాళికల్లో భాగంగా ఉంది.[23][24]


స్వతంత్రంగా నిర్వహించబడుతున్న గూర్గావ్ మెట్రో నిర్మించబడితే, ఇది కూడా ఢిల్లీ మెట్రోతో మార్పిడి చెందుతుంది.


[మార్చు] పెట్టుబడులు

[మార్చు] ఆర్థిక మద్దతు

2004నాటి ధరల ప్రకారం I & II దశల నిర్మాణానికి Indian Rupee ₹14,430 crore (US$2.74 బిలియన్) మూల వ్యయం అవుతుందని అంచనా వేశారు.[25] అయితే, ఇటీవల అంచనాలు ప్రతి కిలోమీటర్‌కు నిర్మాణ వ్యయాన్ని మూస:INRConvert/nolinksకి చేర్చాయి.[26] I & II దశలకు మొత్తం పెట్టుబడుల్లో ముప్పై శాతం నిధులను భారత ప్రభుత్వం (GoI) మరియు ఢిల్లీ ప్రభుత్వం సమాన వాటాలతో ఈక్విటీ కాపిటల్ ద్వారా సేకరించారు, సుమారుగా మిగిలిన 60 శాతం నిధులను దీర్ఘకాలిక లేదా ఆధారిత రుణం రూపంలో సేకరించారు. మిగిలిన పెట్టుబడిని కార్యకలాపాల నిర్వహణ మరియు ఆస్తుల అభివృద్ధి ద్వారా వచ్చే అంతర్గత ఆదాయాల ద్వారా సేకరించాలని ప్రతిపాదించబడింది.[25] మార్చి 2008 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో GoI, నోయిడా మరియు హర్యానా అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీల నుంచి మెట్రో మూస:INRConvert/nolinks సహాయ నిధులు పొందింది, అంతేకాకుండా II దశ విస్తరణలకు గజియాబాద్ డెవెలప్‌మెంట్ అథారిటీ ఏప్రిల్ 2008లో మూస:INRConvert/nolinks నిధులు అందజేసింది.[27]


[మార్చు] ఆదాయం మరియు లాభాలు

2007లో, ప్రపంచంలో ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా లాభాల్లో నడిచిన ఐదు మెట్రో రైలు వ్యవస్థల్లో ఢిల్లో మెట్రో కూడా ఒకటిగా నిలిచింది. నిర్వహణ వ్యయాలను కనిష్ట స్థాయిలో ఉంచడం ద్వారా, టిక్కెట్ల విక్రయాలతోపాటు, ప్రకటనలు మరియు ఆస్తుల అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయాలు ఢిల్లీ మెట్రోను లాభాల్లో ఉంచాయి. [28][29] మార్చి 2008తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నిర్వాహణ ఆదాయాలు మూస:INRConvert/nolinks మరియు పన్ను మినహాయింపుకు ముందు లాభం మూస:INRConvert/nolinks వద్ద ఉన్నట్లు ఢిల్లీ మెట్రో ప్రకటించింది.[27]


[మార్చు] కార్యకలాపాలు

ఢిల్లీ మెట్రోలో 6:00 నుంచి 23:00 మధ్య వేళల్లో 3 నుంచి 4.5 నిమిషాల వ్యవధితో రైళ్లు నడుస్తుంటాయి. నెట్‌వర్క్‌లోపల నడిచే రైళ్లు >

80 km/h (50 mph)మూస:Convert/test/Aon కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి, ప్రతి MRTS స్టేషన్‌లో 20 సెకెన్లు ఆగుతాయి. స్వయంచాలక స్టేషన్ ప్రకటనలు హిందీ మరియు ఆంగ్ల భాషల్లో రికార్డు చేయబడి ఉంటాయి. అనేక స్టేషన్లు ATMలు, ఆహార విక్రయ కేంద్రాలు, కేఫ్‌లు మరియు వసతి కేంద్రాలు వంటి సేవలు కలిగివున్నాయి. ఈ మొత్తం వ్యవస్థలో తినడం, త్రాగడం, ధూమపానం మరియు గమ్ నమలడం నిషేధించబడింది.


[మార్చు] భద్రత

అన్ని మెట్రో స్టేషన్లు మరియు రైళ్లను 1200 క్లోజ్డ్-సర్క్యూట్ కెమేరాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి మరియు ప్రత్యేకంగా శిక్షణ పొందిన CISF సిబ్బంది అన్ని స్టేషన్లు మరియు రైళ్లలో ఉంటారు, వ్యవస్థలో శాంతి-భద్రతలను వీరు పర్యవేక్షిస్తుంటారు. ప్రయాణికులు సులభంగా ఎక్కిదిగేందుకు వీలుగా రైలు మరియు ప్లాట్‌ఫామ్‌కు మధ్య అతితక్కువ ఖాళీ మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రైళ్లలో ఏకరీతి వస్త్రధారణ కలిగిన మెట్రో-మార్షల్స్ పనిచేసే కొద్ది మెట్రోల్లో ఢిల్లీ మెట్రో కూడా ఒకటి. ప్రయాణికులు మరియు డ్రైవర్‌కు మధ్య అత్యవసర సమాచారాన్ని తెలియపరిచేందుకు ప్రతి రైలు బోగీలోనూ ఇంటర్‌కామ్‌లు ఉంటాయి.


[మార్చు] టిక్కెట్ల జారీ

దస్త్రం:Delhi metro smart card.jpg
ఢిల్లీ మెట్రో స్మార్ట్ కార్డ్
ఢిల్లీ మెట్రో ఏక ప్రయాణ టోకెన్

టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు ఈ కింది ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.

  • స్మార్ట్ కార్డ్: కొనుగోలు చేసిన తేదీ నుంచి లేదా చివరిసారి రీఛార్జి చేసిన తేదీ నుంచి ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది (చివరి రీఛార్జి నుంచి), ఈ కార్డులు రూ. 50 నుంచి రూ. 800 మధ్య ధరల్లో కొనుగోలు చేయవచ్చు. దీనిపై చేసిన అన్ని ప్రయాణాలకు 10% తగ్గింపు ఇస్తారు.[30] కొత్త కార్డు కొనుగోలు చేసేందుకు రూ. 50 డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.[30] రోజూ రైళ్లు ఉపయోగించే ప్రయాణికులకు ఈ కార్డులు బాగా సౌకర్యవంతంగా ఉంటాయి.
  • RFID టోకెన్: కొనుగోలు చేసిన రోజు ఒక్క ప్రయాణానికి మాత్రమే ఈ టోకెన్లు చెల్లుబాటు అవుతాయి, వీటి ధర గమ్యస్థానంపై ఆధారపడి ఉంటుంది. టోకెన్ పట్టికను ఉపయోగించి గమ్యస్థాన స్టేషన్ ఆధారంగా ఛార్జీలు నిర్ణయిస్తారు. ఒక్క ప్రయాణం యొక్క ఛార్జీలు రూ. 8 నుంచి రూ. 30 వరకు ఉంటాయి.[31]
  • పర్యాటక కార్డు: స్వల్పకాలిక వ్యవధిలో ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌లో అపరిమిత ప్రయాణాలు చేసేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయి. రెండు రకాల పర్యాటక కార్డులు అందుబాటులో ఉన్నాయి - అవి 1 రోజు మరియు 3 రోజులు చెల్లుబాటు అయ్యే కార్డులు. 1-రోజు కార్డు ధర రూ. 100 మరియు 3-రోజుల కార్డు ధర రూ. 250.


[మార్చు] సమస్యలు

తూర్పు ఢిల్లీలోని యమునా బ్యాంక్ స్టేషన్ వద్ద టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు పెద్ద క్యూలో నిలబడిన ప్రయాణికులు.


నెట్‌వర్క్ విస్తరించబడటంతో, అధిక ప్రయాణికుల సామర్థ్యం మరియు కొత్త రైళ్లలో సాంకేతిక అంతరాయాలు కారణంగా ఢిల్లీ మెట్రోలో కిక్కిరిసిన ప్రయాణాలు మరియు జాప్యాలు జరుగుతున్నాయి.[32][33] ఈ సమస్యను పరిష్కరించేందుకు, కొత్త కోచ్‌లకు ఆర్డర్లు చేయబడ్డాయి, రైళ్ల రాకపోకలను పెంచే ప్రణాళిక కూడా ప్రతిపాదించబడింది.[32] అప్పుడప్పుడు, రైలు స్టేషన్ల నుంచి సమీపంలోని ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేసే బస్సు సేవలు అధికరద్దీ కలిగివుండటం మరియు అవ్యవస్థితంగా ఉండటం ఒక ఆందోళనకర అంశంగా నివేదించబడింది.[34][35]


[మార్చు] ప్రమాదాలు

అక్టోబరు 19, 2008న తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో బారుదూలాన్ని పైకెత్తే యంత్రం ఒకటి మరియు బ్లూ లైన్ ఇంద్రప్రస్థ-న్యూ అశోక్ నగర్ విస్తరణకు సంబంధించి నిర్మాణంలో ఉన్న వంతెన మార్గంలోని ఒక భాగం కూలిపోయి కింద వెళుతున్న వాహనాలపై పడ్డాయి. వంతెన యొక్క 400-టన్నుల కాంక్రీటు దిమ్మెను కార్మికులు క్రేను సాయంతో పైకెత్తుతుండగా, లాంఛర్ (పైకెత్తే యంత్రం)తోపాటు 34 మీటర్ల పొడవైన దిమ్మె ఒక బ్లూలైన్ బస్సుపై పడ్డాయి, ఈ ప్రమాదంలో ఒక చోదకుడు మరియు ఒక కార్మికుడు మృతి చెందారు.[36]


జులై 12, 2009న నిర్మాణంలో ఉన్న వంతెనలోని ఒక భాగం లాంచింగ్ గర్డర్ సమతూకం కోల్పోవడంతో కూలిపోయింది, సెప్టెంబరు 2010లో ప్రారంభం కావాల్సివున్న సెంట్రల్ సెక్రటేరియట్- బాదర్‌పూర్ కారిడార్‌పై కైలాష్ తూర్పు ప్రాంతం సమీపంలోని జమ్రుద్‌పూర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 15 మంది ఇతరులు గాయపడ్డారు.[37] మరో రోజు తరువాత, జులై 13, 2009న, కూలిపోయిన శిథిలాలు తొలగిస్తున్న ఒక క్రేను సమీపంలోని మరో రెండు క్రేన్‌లపై కూలిపోయింది, ఇందులో మరో ఆరుగురు గాయపడ్డారు.[38] జులై 22, 2009న నిర్మాణంలో ఉన్న అశోక్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద ఒక ఇనుప దూలం కార్మికుడిపై పడింది.[39] అక్టోబరు 3, 2009న, దక్షిణ ఢిల్లీలోని సయదుల్లా అజాబ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక ప్రదేశంలో మరో క్రేను కూలిపోయింది, ఇందులో ఎవరూ గాయపడలేదు.[40] 1998లో ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు ప్రారంభమైననాటి నుంచి ఇప్పటివరకు 93 మంది కార్మికులతోపాటు, వంద మందికిపైగా మృతి చెందారు.[41]


[మార్చు] సాంకేతిక వివరాలు

[మార్చు] నడుస్తున్న రైళ్లు

మొదటి దశ బ్రాడ్ గేజ్ రైలు, దీనిని BEML తయారు చేసింది.
బంబార్డియర్ తయారు చేసిన రెండో దశ బ్రాడ్ గేజ్ రైలు.
యఎల్లొవ్ ళినె.
బ్లుఎ ళినె.
విఒలెత్ ళినె.

మెట్రో రెండు వేర్వేరు గేజ్‌లకు సంబంధించిన రైళ్లను నడుపుతోంది. మొదటి దశ మార్గాల్లో >

1,676 millimetres (5.50 ft)మూస:Convert/test/A బ్రాడ్ గేజ్ రైళ్లు నడుపుతున్నారు, రెండో దశలో నడిపే కొన్ని భవిష్యత్ రైళ్లు స్టాండర్డ్ గేజ్‌ను ఉపయోగించనున్నాయి.


రెండు ప్రధాన సరఫరాదారులు బ్రాడ్ గేజ్ రైళ్లను తయారు చేస్తున్నాయి:


  • మొదటి దశ కోసం ఉద్దేశించబడిన రైళ్లను హ్యుందాయ్ రోటెమ్, మిత్సుబిషి కార్పొరేషన్ మరియు MELCOలతో కూడిన ఒక కంపెనీల కన్సార్టియం సరఫరా చేసింది, ఈ రైళ్ల కోచ్‌లు సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఏర్పాటు ద్వారా BEML తన యొక్క బెంగళూరు కర్మాగారంలో నిర్మిస్తోంది.[42] ఈ రైళ్లు నాలుగు 3.2 మీటర్ల వెడల్పైన స్టెయిన్‌లెస్ స్టీల్ తేలికపాటి కోచ్‌లను కలిగివుంటాయి, పొడవువ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలకు ద్వారాలు ఉంటాయి, ఒక్కో రైలు 1500 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు,[43] ప్రతి కోచ్ 50 సీట్లు, 330 మంది ప్రయాణికులు నిలబడేందుకు వీలున్న ప్రదేశాన్ని కలిగివుంటుంది.[44] కోచ్‌ల అన్నీ పూర్తిగా ఎయిర్‌కండిషన్, ఆటోమేటిక్ డోర్‌లు, మైక్రోప్రాసెసర్ నియంత్రిత బ్రాక్‌లు మరియు సెకండరీ ఎయిర్ సస్పెన్షన్ కలిగివుంటాయి,[45] ఈ రైళ్లు >

1.1 km (0.68 mi)మూస:Convert/test/Aon దూరంపాటు >

32 km/h (20 mph)మూస:Convert/test/Aon సగటు వేగంతో నడిచే సామర్థ్యం కలిగివున్నాయి.[44] ఈ వ్యవస్థ భవిష్యత్‌లో 8 కోచ్‌ల వరకు విస్తరించే అవకాశం కలిగివుంది, స్టేసన్లలోని ప్లాట్‌ఫామ్‌లు కూడా దీనికి తగ్గట్లుగా రూపొందించబడ్డాయి.[43]

  • రెండో దశకు సంబంధించిన రైళ్లలోని కోచ్‌లను బాంబార్డియర్ సరఫరా చేస్తోంది, 400 కోచ్‌లు సరఫరా చేసేందుకు ఈ సంస్థకు $590 మిలియన్ల కాంట్రాక్టును అప్పగించారు. ప్రారంభ రైలు కోచ్‌లు మాత్రం జర్మనీ మరియు స్వీడన్‌లలో తయారు చేస్తారు, మిగిలిన కోచ్‌లను వడోదరా సమీపంలోని సావ్లీలో ఉన్న బాంబార్డియర్ యొక్క భారతీయ కర్మాగారంలో నిర్మిస్తారు.[46] ఈ రైళ్లు నాలుగు కోచ్‌లు మరియు ఆరు కోచ్‌లు కలిగివుంటాయి, వీటిలో ప్రతి రైలులో వరుసగా 1178 మరియు 1792 మంది ప్రయాణించవచ్చు. ఈ కోచ్‌లు CCTV కెమేరాలు, అదనపు భద్రత కోసం ఎనిమిది గంటల బ్యాకప్, అన్ని కోచ్‌లలో సెల్‌ఫోన్ మరియు ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్‌లు, కిక్కిరిసిన పరిస్థితుల్లోనూ 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను అందించే మరింత అధునాతన ఎయిర్‌కండిషనింగ్ వ్యవస్థలు మరియు శీతాకాలంలో హీటర్లు వంటి అనేక సదుపాయాలు కలిగివుంటాయి.[47]


స్టాండర్డ్ గేజ్ రైళ్లు BEML తన యొక్క బెంగళూరు కర్మాగారంలో తయారు చేస్తోంది. నాలుగు-కార్లు (కోచ్‌లు) కలిగిన రైళ్లలో ఒక్కో రైలు 1506 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగివుంటుంది,[48] ప్రతి కోచ్‌లోనూ 50 సీట్లు మరియు 292 మంది ప్రయాణికులు నిలబడే ప్రదేశం ఉంటుంది.[44] ఈ రైళ్లు లోపలి భాగంలో మరియు వెలుపలి వైపు CCTV కెమేరాలు, మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జ్ చేసుకునేందుకు విద్యుత్ సరఫరా కనెక్షన్లు, మెరుగైన ఆర్థ్రత నియంత్రణ, మైక్రోప్రాసెసర్ నియంత్రిత డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి,[49] ఇవి >

1.1 km (0.68 mi)మూస:Convert/test/Aon దూరంపాటు >

34 km/h (21 mph)మూస:Convert/test/Aon సగటు వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగివుంటాయి.[44]


ప్రస్తుతం, DMRC ప్రతిరోజు 84 రైళ్లతో 1400 రైలు సేవలను నడుపుతుంది,[15] సెప్టెంబరు 2010నాటికి రైళ్ల సంఖ్య 153కు, కోచ్‌ల సంఖ్య 900లకు పెరగనుంది.[50] ఖైబర్ పాస్, నిజాఫ్‌గఢ్, శాస్త్రి పార్క్ మరియు యమునా బ్యాంక్ వద్ద ఉన్న డిపోల్లో రైళ్లకు నిర్వహణ కార్యకలాపాలు నిర్వహిస్తారు.

[మార్చు] సిగ్నలింగ్ మరియు టెలీకమ్యూనికేషన్

ఢిల్లీ మెట్రో క్యాబ్ సిగ్నలింగ్‌తోపాటు ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ మరియు ఆటోమేటిక్ ట్రైన్ సిగ్నలింగ్ మాడ్యూల్స్ కలిసివుండే కేంద్రీకృత స్వయంచాలక రైలు నియంత్రణ వ్యవస్థను ఉపయోగిస్తోంది.[51]


అన్ని 3 మార్గాల్లో వాయిస్ మరియు డేటా ఇన్ఫర్మేషన్ రెండింటి బదిలీకి మోటరోలా అందించిన 380 MHz డిజిటల్ ట్రంక్డ్ TETRA రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్ ఉపయోగించబడుతోంది. [52] మూడో మార్గం కోసం, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సికాస్ , ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్ వికోస్ OC 500 మరియు ఆటోమేషన్ కంట్రోల్ సిస్టమ్ LZB 700 M లను సీమెన్స్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్ సరఫరా చేసింది.[53] ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ఆన్-ట్రైన్ రేడియో, CCTV, మరియు కేంద్రీకృత గడియారం మరియు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కలిగివుండే ఒక సమగ్ర వ్యవస్థను రైళ్ల రాకపోకలు మరియు అత్యవసర సమయాల్లో టెలీకమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్నారు.[54]


[మార్చు] పర్యావరణం మరియు అలంకారాలు

ఢిల్లీలోని ద్వారకాలో ఉన్న ఒక ఎలివేటెడ్ (వంతెనపై నిర్మించిన) మెట్రో స్టేషన్

పర్యావరణ స్నేహపూరిత పద్ధతులు ఉపయోగిస్తున్నందుకు ఐక్యరాజ్యసమితి,[55] RINA,[56] మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ వంటి సంస్థల నుంచి ఢిల్లీ మెట్రో అవార్డులు గెలుచుకుంది,[56] ప్రపంచంలో పర్యావరణ స్నేహపూరిత నిర్మాణానికి అందించే ISO 14001 గుర్తింపును పొందిన తొలి మెట్రోగా నిలిచింది.[57] బ్లూ లైన్‌లోని దాదాపుగా అన్ని మెట్రో స్టేషన్లలో పర్యావరణ రక్షణ పద్ధతుల్లో భాగంగా వర్షపునీటి సంరక్షణ విధానాలు అమలు చేయబడుతున్నాయి[58]. ఢిల్లీ మెట్రో అనేక స్టేషన్ల వద్ద ఆశావహంగా-రూపొందించిన పరివాహక ప్రాంతాలు ఏర్పాటు చేసింది.


సమాజ మౌలిక సదుపాయాల్లో ఒక సమగ్ర భాగంగా మెట్రో ప్రోత్సహింపబడింది, స్థానిక జీవనశైలిని ప్రతిబింబించే సమాజ కళాకృతులు స్టేషన్ల వద్ద ప్రదర్శించబడుతుంటాయి.[3]మూస:Rp స్థానిక ఆర్ట్ కాలేజ్‌లకు చెందిన విద్యార్థులు మెట్రో స్టేషన్ల వద్ద అలంకారాలను రూపొందించారు.[59]


[మార్చు] ప్రసిద్ధ సంస్కృతిలో ఢిల్లీ మెట్రో

నిర్మాణ సంస్థలకు ప్రసిద్ధ చిత్రీకరణ ప్రదేశంగా ఢిల్లీ మెట్రో గుర్తింపు పొందింది, అనేక సినిమాలు, ప్రకటనలు ఢిల్లీ మెట్రో రైళ్లలో చిత్రీకరించబడ్డాయి.[60] 2008-2009లో, ఆరు బాలీవుడ్ సినిమాల్లో - బేవఫా, బ్లాక్ & వైట్, ఢిల్లీ 6, దేవ్ D, లవ్ ఆజ్ కల్ మరియు పా - మరియు ఒక టెలీసీరియల్ మరియు అనేక యాడ్-ఫిల్మ్‌ల్లో ఢిల్లీ మెట్రో దర్శనమిచ్చింది.[61] షూటింగ్‌లు కూడా DMRCకి ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి, ప్రతి గంట చిత్రీకరణకు నిర్మాతలు రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది, దీనితోపాటు సెక్యూరిటీ డిపాజిట్ మరియు ఇన్స్యూరెన్స్ కూడా చెల్లించాలి.[60] ఇది నగరం రోజువారీ జీవితానికి ప్రతిరూపంగా మారుతుండటంతో, ఢిల్లీతో మెట్రో అనుబంధం బలపడుతోంది, ఈ కారణంగా అధిక వ్యయమవుతున్నప్పటికీ నిర్మాతలను ఇది ఆకర్షిస్తుంది.[61] డిస్కవరీ ఛానల్ లఘుచిత్రం 24 అవర్స్ విత్ ది ఢిల్లీ మెట్రో లో కూడా ఇది కనిపిస్తుంది,[62] రిచీ మెహతా దర్శకత్వం వహించిన టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ ప్రొడక్షన్ అమల్‌ లోనూ దీనిని వీక్షించవచ్చు.[63] 2003[64] మరియు 2008లో ఢిల్లీ మెట్రో గురించి రెండు పుస్తకాలు ప్రచురితమయ్యాయి.[65]


[మార్చు] ఇవి కూడా చూడండి



[మార్చు] సూచనలు

  1. Delhi Metro Rail Corporation Ltd.: About Us. Official webpage of DMRC. తీసుకొన్న తేదీ: 2009-09-10.
  2. Delhi Metro crosses billion mark (2009-11-28). తీసుకొన్న తేదీ: 2010-01-25.
  3. 3.0 3.1 3.2 3.3 Siemiatycki, Matti (June 2006). "Message in a Metro: Building Urban Rail Infrastructure and Image in Delhi, India". International Journal of Urban and Regional Research 30 (2): 277-292. Retrieved on 2009-09-17. 
  4. 4.0 4.1 History. Official webpage of DMRC. తీసుకొన్న తేదీ: 2009-09-17.
  5. Pucher, John; Nisha Korattyswaroopam, Neenu Ittyerah (2004). "The Crisis of Public Transport in India". Journal of Public Transportation 7 (4): 1-20. Retrieved on 2009-09-17. 
  6. Need for a Metro. Official webpage of DMRC. తీసుకొన్న తేదీ: 2009-09-17.
  7. Delhi metro rail work begins but without fanfare. The Indian Express (1998-10-02). తీసుకొన్న తేదీ: 2009-09-18.
  8. Delhi Metro showcases public sector success. The Indian Express (2007-04-13). తీసుకొన్న తేదీ: 2009-09-10.
  9. Delhi Metro Rail to adopt BG system. The Hindu Business Line (2000-08-07). తీసుకొన్న తేదీ: 2009-09-10.
  10. Nandini Lakshman (2007-03-19). The Miracle-Worker of the Delhi Metro. BusinessWeek. తీసుకొన్న తేదీ: 2009-09-10.
  11. Smriti Kak Ramachandran (2007-09-17). Delhi Metro confident of meeting deadline. The Hindu. తీసుకొన్న తేదీ: 2009-09-10.
  12. http://netindian.in/news/2010/01/06/0004697/delhi-metros-yamuna-bank-anand-vihar-line-opened
  13. 13.0 13.1 13.2 13.3 Atul Mathur (2009-09-17). A swankier, smarter Metro. Hindustan Times. తీసుకొన్న తేదీ: 2009-11-12.
  14. Metro enters Noida, set to change travelling habits of people. Daily News and Analysis (2009-11-12). తీసుకొన్న తేదీ: 2009-1-12.
  15. 15.0 15.1 Megha Suri Singh (2010-01-07). With only 131 trains, Metro's crowded. The Times of India. తీసుకొన్న తేదీ: 2010-01-08.
  16. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Anand_Vihar అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  17. విస్తరణల పటం, DMRC
  18. రెండో దశ స్థితి
  19. I మరియు II దశల దూరాలు
  20. 20.0 20.1 20.2 20.3 20.4 20.5 20.6 20.7 Target Opening Dates of Various Corridors of Phase - II. Official webpage of DMRC. తీసుకొన్న తేదీ: 2010-01-06.
  21. 21.0 21.1 http://www.delhimetrorail.com/commuteరూ. images/metro_map_big.jpg
  22. Gaurav Vivek Bhatnagar (2006-12-25). Delhi Metro map to cover Greater Noida. The Hindu. తీసుకొన్న తేదీ: 2009-09-10.
  23. గజియాబాద్ ఆన్ ఫాస్ట్ ట్రాక్ - Yahoo! ఇండియా వార్తలు
  24. గజియాబాద్ డెవెలప్‌మెంట్ అథారిటీ
  25. 25.0 25.1 M.N. Murty; K.K. Dhavala, Meenakshi Ghosh, Rashmi Singh (October 2006). Social Cost-Benefit Analysis of Delhi Metro. Institute of Economic Growth. తీసుకొన్న తేదీ: 2009-11-24.
  26. Madhav G. Badami (2009). "Urban Transport Policy as if People and the Environment Mattered: Pedestrian Accessibility the First Step". Economic and Political Weekly 44 (33): 43-51. Retrieved on 2009-11-24. 
  27. 27.0 27.1 Annual Report, 2007-2008. Delhi Metro Rail Corporation. తీసుకొన్న తేదీ: 2009-11-24.
  28. Increase in DMRC profit. The Hindu (2007-09-24). తీసుకొన్న తేదీ: 2009-11-24.
  29. Amy Yee (2009-11-05). Delhi's Subway Builder. Forbes. తీసుకొన్న తేదీ: 2009-11-24.
  30. 30.0 30.1 10 % Discount on Metro SMART CARDS. Official webpage of DMRC.
  31. Metro Fares. Official webpage of DMRC. తీసుకొన్న తేదీ: 2008-12-29.
  32. 32.0 32.1 Sweta Dutta (2009-11-16). Widening reach, Metro looks at ways to ease rush. The Indian Express. తీసుకొన్న తేదీ: 2009-11-21.
  33. Atul Mathur (2009-11-19). Crowded stations, slow trains. Hindustan Times. తీసుకొన్న తేదీ: 2009-11-21.
  34. Atul Mathur (2009-12-08). Feeder service or the lack of it. Hindustan Times. తీసుకొన్న తేదీ: 2009-12-08.
  35. Parking, feeder bus woes on Metro's Noida line. India Today (2009-11-12). తీసుకొన్న తేదీ: 2009-12-08.
  36. "Delhi Metro bridge collapses; 1 dead", CNN-IBN, IBN Live, 2008-10-19. Retrieved on 2008-10-19.
  37. "A chronology of Delhi Metro accidents", Indo-Asian News Service, Hindustan Times Online, 2009-07-12. Retrieved on 2009-07-12.
  38. Megha Suri (2009-07-14). Day 2: 3 cranes fall, Metro image takes beating. The Times of India. తీసుకొన్న తేదీ: 2010-01-06.
  39. http://www.centralchronicle.com/viewnews.asp?articleID=10567
  40. మూస:Cite new
  41. Atul Mathur (2009-12-07). City's nightmare on wheels. Hindustan Times. తీసుకొన్న తేదీ: 2009-12-08.
  42. P. Manoj (2005-08-25). BEML to rake in big money from proposed metro projects. The Hindu. తీసుకొన్న తేదీ: 2009-09-26.
  43. 43.0 43.1 Second Metro rail arrives in Delhi. The Times of India (2002-10-15). తీసుకొన్న తేదీ: 2009-09-26.
  44. 44.0 44.1 44.2 44.3 Rolling Stock: Ensuring Passenger Comfort, Safety and Reliability. Official webpage of DMRC. తీసుకొన్న తేదీ: 2009-11-23.
  45. Metro Rail gets first train. The Hindu (2002-07-27). తీసుకొన్న తేదీ: 2009-09-26.
  46. http://www.projectsmonitor.com/detailnews.asp?newsid=14183
  47. Metro to get swankier, bigger coaches. The Times of India (2009-09-17). తీసుకొన్న తేదీ: 2009-09-26.
  48. BEML delivers India's 1st standard gauge metro car. The Economic Times (2009-09-11). తీసుకొన్న తేదీ: 2009-09-26.
  49. Smriti Kak Ramachandran (2009-07-30). Trial run begins on first standard gauge Metro line. The Hindu. తీసుకొన్న తేదీ: 2009-07-26.
  50. Sweta Dutta (2009-05-13). Eight depots for Metro as it chugs along ever-widening network. The Indian Express. తీసుకొన్న తేదీ: 2009-09-26.
  51. Technical Notes: Signalling. Official webpage of DMRC. తీసుకొన్న తేదీ: 2009-11-23.
  52. Delhi Metro Railway Corporation, India. Motorola Electronics. తీసుకొన్న తేదీ: 2010-01-03.
  53. Metro Line 3, New Delhi, India. Siemens AG. తీసుకొన్న తేదీ: 2008-07-06.
  54. Technical Notes: Telecommunication. Official webpage of DMRC. తీసుకొన్న తేదీ: 2009-11-23.
  55. Delhi Metro gets UN certificate for preventing carbon emission. The Times of India (2009-02-22). తీసుకొన్న తేదీ: 2009-09-10.
  56. 56.0 56.1 Delhi Metro gets OHSAS 18001. Official webpage of DMRC. తీసుకొన్న తేదీ: 2009-09-10.
  57. Metro Receives ISO 14001 Certificate. Official webpage of DMRC. తీసుకొన్న తేదీ: 2009-09-10.
  58. Metro doing rain water harvesting. Official webpage of DMRC.
  59. Anuradha Mukherjee (2002-12-13). Vibrant murals bring cheer. The Times of India. తీసుకొన్న తేదీ: 2009-11-30.
  60. 60.0 60.1 Sweta Dutta (2009-12-28). On silver screen, Metro a symbol of urban Delhi. The Indian Express. తీసుకొన్న తేదీ: 2010-01-25.
  61. 61.0 61.1 Garima Sharma (2009-12-28). Metro Movie. The Times of India. తీసుకొన్న తేదీ: 2010-01-25.
  62. 24 hours with the Delhi Metro. Discovery channel collaboration (press).
  63. Amal.
  64. Gaurav Vivek Bhatnagar (2003-10-27). Recording the journey of Metro. The Hindu. తీసుకొన్న తేదీ: 2009-09-10.
  65. Press Release. Official webpage of DMRC. తీసుకొన్న తేదీ: 2009-09-10.


[మార్చు] బాహ్య లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కింది విషయానికి సంబంధించిన మీడియా ఉంది.


మూస:Delhi మూస:Rapid transit in India

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు