తరంగము
యానకంలో ఏర్పడిన అలజడి (disturbance), యానక కణాల ఆవర్తన (periodic) చలనం వల్ల, ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రసారితమయ్యే ప్రక్రియను తరంగము ( wave) అని అంటారు. నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో, ఒక గులక రాయిని వేస్తే, అది పడిన చోట, వృత్తాకార తరంగాలు (అలలు) ఏర్పడడం మనం గమనిస్తాం. కంటికి చేరే కాంతి, చెవికి చేరే ధ్వని, రేడియో, టెలివిజన్, మొబైల్ ఫోన్లను చేరే వివిధ రకాల సంకేతాలు, వైద్య రంగంలో ఉపయోగించే ఎక్స్ కిరణాలు, సముద్ర అలలు మొదలైనవన్నీ తరంగాలే.
తరంగ ప్రసార ప్రక్రియలో యానక కణాలు, తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయి తప్ప తరంగంతో పాటు ముందుకు ప్రయాణించవు. శక్తికి ప్రతిరూపమైన అలజడి, ఒక కణం నుంచి మరో కణానికి బదిలీ అవుతూ ముందుకు సాగుతుంది. తరంగాలన్నీ శక్తిని జనక స్థానం నుండి ముందుకు తీసుకుని పోతాయి.
[మార్చు] భాషా విశేషాలు
తరంగము [ taraṅgamu ] tarangamu. సంస్కృతం n. A wave, a surge, an undulating swell or surface like waves. అల. తరంగిణి tarangiṇi. n. A river. This and other expressions for river, sea, stream, are used in the titles of some books, as విద్యాతరంగిణి the Circle of the Sciences.
[మార్చు] ఉదాహరణలు
- సముద్ర తరంగాలు, నీటి ఉపరితలంలో ఏర్పడి ముఖ్యంగా తీరం వెంట కనిపించే కెరటాలు.
- రేడియో తరంగాలు, కాంతి కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, X-కిరణాలు, మరియు గామా కిరణాలు మొదలైన విద్యుదయస్కాంత తరంగాలు. ఈ విధమైన తరంగాలు ఏ విధమైన మాధ్యమం లేకుండా శూన్యంలో కూడా ప్రయాణిస్తాయి.
- శబ్ద తరంగాలు — గాలి, ద్రవాలు మరియు ఘన పదార్ధాలలో ప్రసరిస్తాయి.
- భూకంపాలు లో మూడు ప్రకంపనలు రకాలు; S, P, మరియు L రకాలున్నాయి.