తాజ్ లేక్ ప్యాలెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో లేక్ ప్యాలేస్(దీనిని అందరూ జగ్ నివాస్ అని పిలుస్తారు.) అనేది 83 గదులు, పాలరాతి గోడలతో కూడిన అధునాతన సూట్లు గల ఒక విలాసవంతమైన హోటల్. భారత దేశం లోని ఉదయ్ పూర్ నగరంలోని లేక్ పిచోలా ప్రాంతంలో ఇది ఉంది. ఇక్కడి జగ్ నివాస్ లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన 4ఎకరాల( 16000 చదరపు మీటర్లు) విస్తీర్ణంలోని ద్వీపంలో లేక్ ప్యాలేస్ హోటల్ నిర్మించారు. [1] హోటల్ కు వచ్చే అతిథుల రవాణా కోసం స్పీడ్ బోట్ ను సిటీప్యాలేస్ వద్దనున్న జెట్టీ నుంచి నడిపిస్తున్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే శృంగార హోటల్ గా లేక్ ప్యాలేస్ గుర్తింపు పొందింది.

Lake Palace on Lake Pichola, Udaipur, India

చరిత్ర[మార్చు]

ఈ హోటల్ ను 1743-1746 మధ్యకాలంలో నిర్మించారు. [1] రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ రాజైన మహారాణా జగత్ సింగ్-II(మేవార్ రాజవంశస్థుల పాలనలో 62వ రాజు) ఈ ప్యాలెస్ ను వేసవిలో తన విడిదిగా ఉపయోగించేవారు. అప్పట్లో దీనిని జగ్ నివాస్ లేదా జన్ నివాస్ అని పిలిచేవారు. హిందువుల ఆరాధ్య దైవమైన సూర్యున్ని నమస్కరించుకునేందుకు వీలుగా ఈ ప్యాలేస్ ను తూర్పు ముఖంగా నిర్మించారు. [2] ఇప్పటికీ ఈ హోటల్ సన్ బాత్ కు, సూర్య నమస్కారాలకు ప్రసిద్ధి గాంచింది. ఆనాటి నుంచి ఆకాలం మేవార్ రాజు వంశస్థులు, రాజులు వేసవిలో ఇక్కడి చల్లదనానికి ముగ్దులై తమ ఎండాకాలం విడిదిగా ఈ ప్యాలెస్ నువాడుకున్నారు. అప్పట్లో తమ రాజ దర్బార్లను కూడా ఇక్కడే నిర్వహించేవారు. దర్బార్ లోని అందమైన ఫిల్లర్లు, చూడముచ్చటైన పై అంతస్తుతో పాటు ఇక్కడి తోటలు ప్రత్యేక ఆకర్షణ నిస్తాయి. ప్యాలేస్ లోని పై గది దాదాపు 21 అడుగుల(6.4 మీటర్లు) వ్యాసంతో పూర్తి వృత్తాకారంలో ఉంటుంది. దీని ఫ్లోరింగ్ మొత్తం నలుపు, తెలుపు రంగు పాలరాతితో పరిచారు. అదేవిధంగా ప్యాలేస్ గోడలు రంగురంగుల ఖరీదైన రాళ్లతో నిర్మించారు. ప్యాలేస్ గోపురము చూడడానికి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. [2] లేక్ ప్యాలేస్ హోటల్ నిర్వహణ బాధ్యతలను 1971లో తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలేసెస్ తీసుకుంది. [3] ఆ తర్వాత ఈ ప్యాలేస్ కు అదనంగా మరో 75 గదులు నిర్మించారు. [4] ఈ హోటల్ లో అత్యత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు తాజ్ గ్రూప్ లో కీలక వ్యక్తిగా ఉన్న జెమ్సెడ్ డి.ఎఫ్. లామ్ తన హోటల్ నిర్వహణ అనుభవం, కృషిని ఉపయోగించారు. లేక్ ప్యాలేస్ లో రాజుల కాలం నాడు బట్లర్లుగా పనిచేసిన వారి వారసులు ఇప్పటికీ ఇక్కడ" రాయల్ బట్లర్లు" గా పనిచేస్తున్నారు. [1] ఇక్కడికి వచ్చిన అతిథులకు వీరంతా రాచ మర్యాదలు అందిస్తారు. వీరు చేసే మర్యాదలకు అతిథులంతా మంత్రముగ్దులవుతారు.

Lily Pond at Lake Palace, Udaipur

ప్రత్యేకతలు[మార్చు]

  • ఎయిర్ కండిషనింగ్
  • మినీ బార్
  • రక్షణ
  • టెలిఫోన్
  • వ్యక్తిగత స్నానాల గదులు
  • కలర్ టీవీ
  • యోగా, ధ్యానం, స్పా చికిత్స, వ్యాయామశాల
  • చిన్నపిల్లల కూర్చునే వసతి
  • కారు అద్దె సౌకర్యం
  • ద్రవ్య వినిమయ సదుపాయం(కరెన్సీ మార్పు)
  • పోస్టల్/ పార్సిల్ సేవలు
  • ముందుగా కోరితే రక్షణ ఎస్కార్ట్

సమాచారం[మార్చు]

లేక్ ప్యాలేస్ హోటల్లో ఆతిథ్యం పొందిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. తాజ్ లేక్ ప్యాలేస్ లో లార్డ్ కర్జన్, వీవీన్ లీ, ఎలిజెబెత్ రాణి, ఇరాన్ ఒకప్పటి రాజు, నేపాల్ రాజు, ఒకప్పటి అమెరికా ప్రథమ మహిళ జాక్వలిన్ కెన్నడి లాంటి వాళ్లంతా ఇక్కడ ఆతిథ్యం పొందినవారు కావడం విశేషం. ఈ ప్యాలేస్ లో అనేక సినిమాలు కూడా షూటింగ్ జరుపుకున్నాయి:

  • 1959 : ఫ్రిట్జ్ లాంజ్ ది టైగర్ ఆఫ్ ఎస్చన్ పుర్, ది ఇండియన్ టోంబ్ సినిమాల చిత్రీకరణ.
  • 1983 : జేమ్స్ బాండ్ సినిమా అయిన ఆక్టోపుస్సీ లో ప్రధాన పాత్రదారి అయిన ఆక్టోపుస్సీ నివాసంగా ఇక్కడ చిత్రీకరణ జరిపారు. (మౌడ్ ఆడమ్స్ ఈ పాత్రను పోషించారు). ఈ సినిమాలోని ఇతర సన్నివేశాలను ఉదయ్ పూర్ లోని జగ్ మందిర్ , మాన్ సూన్ ప్యాలేస్ లో చిత్రీకరించారు.
  • 1984 : బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ అయిన ది జువెల్ ఇన్ ది క్రౌన్ కు మీరట్ నవాబ్ యొక్క అతిథి గృహాన్ని ఉపయోగించారు.
  • 2001 : సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన భారతీయ బాలివుడ్ సినిమా యాదేన్
  • 2006 : తార్ సెమ్ సింగ్ దర్శకత్వం వహించిన ది ఫాల్ సినిమా
Relation of the palace to the city of Udaipur Panorama from Jag Mandir Island
Relation of the palace to the city of Udaipur Panorama from Jag Mandir Island

కేటగిరీలు[మార్చు]

సాహిత్యం[మార్చు]

  • Crump, Vivien; Toh, Irene (1996). Rajasthan (hardback). London: Everyman Guides. pp. 400 pages. ISBN 1-85715-887-3.
  • Crites, Mitchell Shelby; Nanji, Ameeta (2007). India Sublime – Princely Palace Hotels of Rajasthan (hardback). New York: Rizzoli. pp. 272 pages. ISBN 978-0-8478-2979-8.
  • Badhwar, Inderjit; Leong, Susan. India Chic. Singapore: Bolding Books. p. 240. ISBN 981-4155-57-8.
  • Michell, George; Martinelli, Antonio (2005). The Palaces of Rajasthan. London: Frances Lincoln. pp. 271 pages. ISBN 978-0-7112-2505-3.
  • Preston, Diana & Michael (2007). A Teardrop on the Cheek of Time (Hardback) (First ed.). London: Doubleday. pp. 354 pages. ISBN 978-0-385-60947-0.
  • Tillotson, G.H.R (1987). The Rajput Palaces - The Development of an Architectural Style (Hardback) (First ed.). New Haven and London: Yale University Press. pp. 224 pages. ISBN 0-300-03738-4.
  • William Warren; Jill Gocher (2007). Asia's Legendary Hotels: The Romance of Travel (hardback). Singapore: Periplus Editions. ISBN 978-0-7946-0174-4.
Lake Palace Hotel

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Taj Lake Palace,Udaipur". Taj Hotels. Archived from the original on 2011-08-24. Retrieved 2010-07-28.
  2. 2.0 2.1 "Jag Niwas Lake Palace,Jag Niwas Palace in Udaipur India,Lake Palace Udaipur Rajasthan". Indiasite.com. Archived from the original on 2012-09-16. Retrieved 2010-07-28.
  3. "Warren, Page 60".
  4. "Taj Lake Palace Rooms". cleartrip.com.

ఇతర లింకులు[మార్చు]