తాడేపల్లి

వికీపీడియా నుండి

  ?తాడేపల్లి మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటములో తాడేపల్లి మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో తాడేపల్లి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము తాడేపల్లి
జిల్లా(లు) గుంటూరు
గ్రామాలు 10
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
80,880 (2001)
• 40720
• 40150
• 71.20
• 78.29
• 64.03


తాడేపల్లి గుంటూరు జిల్లా లో, కృష్ణా నదీతీరంలోని గ్రామం, ఇదే పేరుతో గల మండల కేంద్రం. విజయవాడ నగరానికి సరిగ్గా ఎదురుగా 3 కి.మీ.దూరంలో కృష్ణకు అవతలి (కుడి) గట్టున ఉన్న ఈ గ్రామంలో కృష్ణా కెనాల్ జంక్షను పేరుతో రైల్వే జంక్షను ఉంది. విజయవాడ నుండి గుంటూరు, చెన్నై వైపు వెళ్ళే రైలు మార్గాలు చీలేదిక్కడే. ఒకప్పుడు ఇక్కడ ACC సిమెంటు కర్మాగారం ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని మూసివేసారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషను వారి చమురు ఉత్పత్తుల నిల్వ కేంద్రం ఇక్కడ ఉంది. ఈ కేంద్రం ఎంతో మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తోంది.తాడేపల్లి పంచాయతీకి పోలకంపాడు శివారు గ్రామం.రెడ్డి ల్యాబ్స్ అధినేత స్వగ్రామం.ఈ గ్రామము విజయవాడ నగరమునకు సమీపముగా ఉన్నది.కానీ బస్సు రవాణా సదుపాయముసరిగా లేదు. ప్రకాశం బ్యారేజీ మూసివేసిన తరువాత ఈగ్రామం వైభవాన్ని కోల్పోయింది.కృష్ణా నది పక్కనే వుంది. ఇక్కడ నీటి కొరత లేదు కానీ విజయవాడకు మాదిరిగా రక్షిత నీరు కాదు.దాదాపు అన్ని పంటలు పండుతాయి. ఒకప్పుడు దొంగలకు ప్రసిద్ధి.మునిసిపాలిటీ కావలసిన నగరం.వూరి నిండా గుడులూ, స్వాముల వార్ల ఆశ్రమాలు ఉన్నాయి.గ్రామం రాను రాను వున్న సదుపాయాలను కోల్పోతోంది.కృష్ణా కెనాల్ జంక్షన్ ను తాడేపల్లిరైల్వేస్టేషన్ గా అభివృద్ధి చేయాలి.పాత గోదావరి బ్రిడ్గిలాగా పాత కృష్ణా బ్రిడ్జి ని కాపాడుకోవాలి. కనకదుర్గ వారధి నుండి ఉండవల్లి సెంటర్ ను కలుపుతూ ఫ్లై ఓవర్ నిర్మిస్తే అమరావతి కి అతి దగ్గరి దారి ఏర్పడుతుంది

[మార్చు] మున్సిపాలిటీగా మారిన తాడేపల్లి

తాడేపల్లి, కృష్ణనగర్‌లు కలిపి ఓ మున్సిపాలిటీగా ఆవిర్భవించాయి.మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి, కృష్ణనగర్ పంచాయతీలు విజయవాడకు సమీపంలో ఉడా పరిధిలోఉన్నాయి. తాడేపల్లిలో 30వేల జనాభా, కృష్ణనగర్‌లో 10 వేల మంది జనాభా ఉన్నారు.

[మార్చు] మండలంలోని గ్రామాలు

  1. పెనుమాక
  2. ఉండవల్లి (గ్రామీణ)
  3. కుంచనపల్లి
  4. కొలనుకొండ
  5. వడ్డేశ్వరం
  6. ఇప్పటం
  7. గుండిమెడ
  8. చిర్రావూరు
  9. తాడేపల్లి (ఒ.జి)
  10. ఉండవల్లి (ఒ.జి)
  11. ప్రాతూరు
  12. మెల్లెంపూడి
  13. నూతక్కి
  14. సుందరయ్య నగర్
  15. నులకపేట
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు