తాహితీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Tahiti
Plage.sable.noir.Tahiti.JPG
Tahiti is famous for black sand beaches.
Karta FP Societe isl.PNG
Geography
Location Pacific Ocean
Archipelago Society Islands
Major islands tahiti
Area

{{convert/{{{d}}}|1,045||sqmi|||||s=|r={{{r}}} |u=km2 |n=square kilomet{{{r}}} |h=square-kilomet{{{r}}} |t=square kilometre |o=sqmi |b=1000000

|j=6-0}}
Highest elevation 2
Highest point Mont Orohena
Country
Overseas collectivity  French Polynesia
Largest city Papeete (pop. 131,695 urban)
Demographics
Population 178,133[1] (as of August 2007 census)
Density 170

తాహితీ (Tahiti) అనేది ఫ్రెంచ్ పాలినేషియా అనువాత సమూహంలో ఉన్న అతిపెద్ద ద్వీపం, ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని సొసైటీ ద్వీపాలుగా పిలిచే ద్వీపసమూహంలో భాగంగా ఉంది. ఈ ద్వీపం ఫ్రెంచ్ పాలినేషియా యొక్క ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ కేంద్రంగా ఉంది. అగ్నిపర్వత కార్యకలాపం నుంచి ఈ ద్వీపం ఏర్పడింది, ఇది చుట్టూ పగడపు దిబ్బలతో ఎత్తైన మరియు పర్వతాలతో నిండిన భూభాగాన్ని కలిగివుంది. ఈ ద్వీపంలో 178,133 (2007 జనాభా లెక్కలు) మంది ప్రజలు నివసిస్తున్నారు,[1] ఫ్రెంచ్ పాలినేషియాలో ఇది అత్యధిక జనాభా గల ద్వీపంగా ఉంది, ఫ్రెంచ్ పాలినేషియా ద్వీప సమూహం యొక్క మొత్తం జనాభాలో 68.6% మంది ఇక్కడే నివసిస్తున్నారు.

రాజధాని పాపీట్ ద్వీపం యొక్క వాయువ్య తీరంలో ఉంది, ఈ ప్రాంతంలోని ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం ఫా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఈ నగరంలోని టౌన్ సెంటర్‌కు 5 km (3.11 mi) దూరంలో ఉంది. తాహితీలో AD (క్రీశ) 300 మరియు 800 మధ్య కాలంలో పాలినేషియన్‌లు స్థిరపడ్డారు. ద్వీప జనాభాలో సుమారుగా 70% మంది పాలినేషియన్‌లుకాగా, మిగిలినవారిలో ఐరోపావాసులు, చైనీయులు మరియు మిశ్రమ వారసత్వం గల పౌరులు ఉన్నారు. 1880లో ఈ ద్వీపాన్ని ఫ్రాన్స్ కాలనీ (వలసరాజ్యం)గా ప్రకటించారు, అయితే 1946 వరకు చట్టబద్ధంగా స్థానిక తాహితీయన్‌లు (తాహితీ పౌరులు) ఫ్రెంచ్ పౌరులుగా గుర్తింపు పొందలేదు. ఫ్రెంచ్ ఏకైక అధికారిక భాష అయినప్పటికీ, తాహితీయన్ భాషను (రియో తాహితీ ) విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

భౌగోళిక స్థితి[మార్చు]

తాహితీ-మూరీ పటం
తాహితీ జిల్లాలు

ఫ్రెంచ్ పాలినేషియాలో తాహితీ అత్యంత ఎత్తైన మరియు అతిపెద్ద ద్వీపంగా ఉంది. ఇది హవాయికి దక్షిణంగా 4,400 km (2,734.03 mi), చిలీ నుంచి 7,900 km (4,908.83 mi) మరియు ఆస్ట్రేలియా నుంచి 5,700 km (3,541.82 mi) దూరంలో ఉంది.

ద్వీపం యొక్క గరిష్ట వెడల్పు 45 km (27.96 mi), మొత్తం భూభాగ విస్తీర్ణం 1,045 కిమీ2. అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఓరోహెనా (ఎత్తు 2,241 మీ). ఆగ్నేయాన ఉన్న రోనుయి పర్వతం 1,332 మీ ఎత్తు ఉంటుంది. ఈ ద్వీపం అగ్నిపర్వతాలపై కేంద్రీకృతమైన సుమారుగా రెండు వృత్తాకార భాగాలను కలిగివుంది, ఈ రెండు భాగాలు ఒక చిన్న భూసంధితో కలపబడి ఉన్నాయి, ఈ భూసంధిని ఇక్కడ ఉన్న తారావావో అనే చిన్న పట్టణం పేరుతో పిలుస్తున్నారు.

వాయువ్య భాగాన్ని తాహితీ నుయి ("పెద్ద తాహితీ")గా, ఆగ్నేయంవైపు ఉన్న చిన్న భాగాన్ని తాహితీ ఐతీ ("చిన్న తాహితీ") లేదా తైయారపు గా గుర్తిస్తున్నారు. తాహితీ నుయి తీరం వెంబడి జనసాంద్రత ఎక్కువగా ఉంది, ముఖ్యంగా రాజధాని పాపీట్ పరిసరాల్లో జనసాంద్రత బాగా ఎక్కువగా ఉంటుంది.

తాహితీ నుయి అంతర్గత భూభాగంలో దాదాపుగా జనావాసాలు కనిపించవు. తాహితీ ఐతీ కూడా ఇప్పటికీ జనావాసానికి దూరంగా ఉంది, దీని యొక్క ఆగ్నేయ అర్ధ భాగానికి (తె పారీ ) పడవ లేదా కాలినడకన మాత్రమే చేరుకునేందుకు వీలుంది. మిగిలిన ద్వీపం చుట్టూ ఒక ప్రధాన రహదారి ఉంది, ఇది పర్వతాలు మరియు సముద్రాన్ని వేరు చేస్తుంది.

పాడి పరిశ్రమ కేంద్రాలు మరియు నిమ్మ తోటల గుండా ఉండే ఒక అంతర్గత రోడ్డు మార్గం విస్తృత దృశ్యాన్ని అందిస్తుంది. తాహితీ యొక్క ప్రకృతి దృశ్యాల్లో విశాలమైన వర్షారణ్యాలు మరియు ఉత్తరాన ఉన్న పాపెనో నదితోపాటు అనేక ప్రవాహాలు భాగంగా ఉన్నాయి.

శీతోష్ణస్థితి[మార్చు]

ఈ ద్వీపంలో నవంబరు నుంచి ఏప్రిల్ వరకు వర్షాకాలం ఉంటుంది, అత్యధిక వర్షపాతం నమోదయ్యే మాసం జనవరి, ఈ నెలలో పాపీట్‌లో 13.2 అంగుళాల (335 మిమీ) వర్షపాతం నమోదవుతుంది. ఆగస్టులో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది, ఈ నెలలో సుమారుగా 1.9 అంగుళాల (48 మిమీ) వర్షం కురుస్తుంది.

కాలాన్నిబట్టి కొద్దిగా హెచ్చతగ్గులు ఉన్నప్పటికీ, సగటు ఉష్ణోగ్రతలు 70 °F (21 °C) మరియు 88 °F (31 °C) మధ్య ఉంటాయి. బిబైస్‌లో అత్యల్ప మరియు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, అవి వరుసగా 61 °F (16 °C) మరియు 93 °F (34 °C).[2]

చరిత్ర[మార్చు]

రైయాటీ పర్వతం యొక్క దృశ్యం. తాహితీయన్ పాలకుల యొక్క సమాధులు గతంలో ఈ పర్వతంపై ఉండేవి, సాంప్రదాయికంగా దీనిని పవిత్రమైన ప్రదేశం (టాపు)గా పరిగణిస్తారు.

తాహితీయన్‌లు[మార్చు]

తాహితీ ద్వీపంలో క్రీస్తుశకం 300 మరియు 800 సంవత్సరాల మధ్యకాలంలో పాలినేషియన్‌లు స్థిరపడ్డారు, కొన్ని అంచనాలు ఇంతకు పూర్వమే ఇక్కడ జనావాసాలు ఉన్నట్లు సూచిస్తున్నాయి. మొదట స్థిరపడిన పౌరులు ఫిజీ, సామోవా లేదా టోంగా వంటి పశ్చిమ ద్వీప సముదాయాల నుంచి పాలినేషియా సముద్రయాన పద్ధతి సాయంతో సముద్రంపై వేలాది మైళ్లు ప్రయాణించి ఈ ద్వీపాన్ని చేరుకున్నట్లు భావిస్తున్నారు. 1770లో, జేమ్స్ కుక్ తాహితీని చూశారు, 33 మీటర్ల పొడవైన ఒక భారీ సంప్రదాయ పడవ (వా )ను ఉపయోగించి కుక్ ఈ ద్వీపాన్ని కనుగొన్నారు.[3] వివిధ వర్గాల్లో బంధుత్వం మరియు సైనిక శక్తి ఆధారంగా కులపెద్ద వ్యవస్థలు మరియు రాజ్యాలతో తాహితీయన్ సమాజం నిర్మించబడింది. ఒక కులపెద్ద (అరీ రహీ ), ఉన్నత వంశస్థులు (అరీ ) మరియు తక్కువస్థాయి పెద్దలు వారి వర్గానికి నేతృత్వం వహించేవారు. అరీ లను పాలినేషియన్ దేవుళ్ల వారసులుగా విశ్వసించేవారు, వారికి అసాధారణ శక్తి (మనా ) ఉండేదని నమ్మేవారు. ఎర్రని ఈకలతో చేసిన బెల్ట్‌లు (పట్టెడలు) వారి హౌదాకు గుర్తుగా ఉండేవి. అయితే, కులపెద్దలకు సంపూర్ణ అధికారం ఉండదు, వారి పాత్రలో, ముఖ్యంగా యుద్ధ సమయాల్లో సాధారణ సభలు లేదా మండళ్లను సంప్రదించడం భాగంగా ఉంటుంది. మారే అనేది ఒక పవిత్రమైన ప్రార్థనా ప్రదేశం, బహిరంగ ప్రదేశంలో ఎత్తుగా రాళ్లతో దీనిని నిర్మిస్తారు, ఇక్కడి పౌరులు కూడా ఇతర పాలినేషియా సమాజాలను పోలిన కొన్ని నిర్మాణాలను సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. వర్గం యొక్క ఆధ్యాత్మిక మరియు సామాజిక జీవితంలో మారీ కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ, దేవుళ్లను ఆవాహన చేసుకోవడం మరియు నేతలను సింహాసనం ఎక్కించడం చేసేవారు. యుద్ధ సన్నాహక దినం, పుట్టిన రోజు వేడుకలు మరియు కర్మకాండలు వంటి పలు కార్యక్రమాలు ఇక్కడ జరిగేవి. కుటుంబ వేదికలు (అరుగులు) నుంచి నేతల పెద్ద విగ్రహాలతో కూడిన నిర్మాణాల వరకు మారీ ల్లో రకాలు ఉన్నాయి, వీటన్నింటినీ టాపు గా గుర్తిస్తారు. లండన్ మిషనరీ సొసైటీ 1977లో అడుగుపెట్టడంతో ఈ ద్వీపంతో ప్రారంభ ఐరోపా సంబంధం ఏర్పడింది, ఈ మిషనరీ క్రైస్తవ మతాన్ని పరిచయం చేయడంతోపాటు, తాహితీయన్ భాష (రియో తాహితీ ) లిపిని అభివృద్ధి చేసింది.

ఐరోపావాసులతో సంబంధం[మార్చు]

1700వ శతకం[మార్చు]

రైయాటీ ద్వీపంపై పురాతన టాపుటాపువాటీ మేరీ.

ఒక ఆంగ్ల నౌక కెప్టెన్ సామ్యేల్ వాలీస్ జూన్ 18, 1767లో తాహితీ ద్వీపాన్ని చూశారు, ఆయన ఈ ద్వీపం యొక్క మొట్టమొదటి ఐరోపా సందర్శకుడిగా పరిగణించబడుతున్నారు. (తరువాతి ఒక నివేదికలో 1606లోనే మొదట స్పానిష్‌వారు తాహితీని గుర్తించినట్లు పెడ్రో ఫెర్నాండెజ్ డి క్విరోస్ పేర్కొన్నారు, అయితే వారు లా సాగిటారియా ద్వీపాన్ని చూసి, దానిని తాహితీ యొక్క ఆగ్నేయ ప్రాంతంగా తప్పుగా భావించి ఉండేందుకు అవకాశం ఉంది.)[4]

స్వేచ్ఛగా మరియు సంతోషంగా ఉన్న ప్రజలు మరియు ద్వీపం యొక్క లక్షణాన్ని చూసి ప్రారంభ ఐరోపావాసులు దీనిని ఒక స్వర్గంగా భావించారు, పశ్చిమ దేశాలు నాటిన భావుకత వాదం ఈ రోజుకు కూడా సజీవంగా ఉంది.

వాలీస్ తరువాత ఏప్రిల్ 1768లో ఫ్రెంచ్ అన్వేషకుడు లూయిస్-ఆంటోనీ డి బౌగైన్‌విల్లే ఇక్కడకు వచ్చారు, ఆయన ఈ ద్వీపాన్ని చుట్టివచ్చిన మొదటి ఫ్రెంచ్ అన్వేషకుడిగా గుర్తింపు పొందారు. వాయేజ్ ఆథోర్ డు మోండే ప్రచురించడం ద్వారా బౌగైన్‌విల్లే ఐరోపాలో తాహితీకి ప్రాచుర్యం కల్పించారు. ఆయన ఈ ద్వీపాన్ని భూమిపై ఉన్న స్వర్గంగా వర్ణించారు, ఇక్కడ పురుషులు మరియు మహిళలు నాగరికత అవినీతికి దూరంగా అమాయకత్వంతో సంతోషంగా నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. అనాది అటవిక జీవిత భావనను మరియు ఫ్రెంచ్ విప్లవం ముందుకాలానికి చెందిన జీన్-జాక్వస్ రౌస్సెయు వంటి తత్వవేత్తల యుటోపియన్ భావాల ప్రభావాన్ని కూడా ఆయన వర్ణించారు.

తౌటిరా

ఏప్రిల్ 1769లో కెప్టెన్ జేమ్స్ కుక్ జూన్ 2న శుక్రుడు సూర్యుడిని దాటిన సందర్భాన్ని చూసేందుకు పాలకుల రహస్య ఆదేశాలను అనుసరించి ఈ ద్వీపాన్ని సందర్శించారు. ఆగస్టు 9 వరకు మాటావాయ్ అఖాతం వద్ద ఏర్పాటు చేసిన స్థావరంలో ఆయన ఉన్నారు. వరుసగా ఉన్న మొత్తం సమీప ద్వీపాల్లో సుమారుగా 50,000 జనాభా ఉంటుందని అంచనా వేశారు. కుక్ తరువాత, ఐరోపా నౌకలు తరచుగా ఇక్కడకు వచ్చాయి. వీటిలో HMS బౌంటీ నౌక ముఖ్యమైనది, ఈ నౌక సిబ్బంది 1789లో తాహితీని విడిచివెళ్లిన తరువాత తిరుగుబాటు చేశారు. ఐరోపావాసుల ప్రభావం సాంప్రదాయిక సమాజాన్ని దెబ్బతీశాయి, వీరి వలన వ్యభిచారం, సుఖ రోగాలు, మధ్యం మరియు క్రైస్తవ మతం ఈ ద్వీపానికి పరిచయం చేయబడ్డాయి. 1795లో ప్రారంభించబడిన లండన్ మిషినరీ సొసైటీ హీనమైన పరిస్థితులు మరియు అతీంద్రియ శక్తుల ప్రభావంగా పరిగణించిన విషయాల్లో జోక్యం చేసుకోవాలని వారి తాహితీయన్ మిషినరీలకు ఆదేశాలు జారీ చేసింది.[5] టైఫస్ (విషజ్వరం), ఫ్లూ (విషపడిశం) మరియు మశూచి వంటి వ్యాధులు ప్రబలడంతో 1797నాటికి అనేక మంది తాహితీయన్‌లు మరణించారు, అప్పటికి వారి జనాభా 16 వేలకు పతనమయింది. తరువాత ఈ సంఖ్య మరింత తగ్గి ఆరు వేలకు చేరుకుంది.[6]

స్పానిష్ సింహాసనం ఆదేశాలపై పెరూ వైస్రాయ్ మాన్యేల్ డి అమాత్ వై జూనియట్ 1772లో ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు, ఇతర దేశాలపై తమ నియంత్రణను విస్తరించేందుకు మరియు ఎవాంగెలిజం విస్తరణ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన 1772-1775 మధ్యకాలంలో నాలుగు నావికా బృందాలను అక్కడికి పంపారు, అయితే స్పెయిన్ యొక్క ఛార్లస్ 111 చివరకు లౌకిక విధానం కారణంగా ఈ దండయాత్రను రద్దు చేశారు. ఈ యాత్రలకు చెందిన ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒక డైరీ రాసిన మెరైన్ సైనికుడు మాక్సిమో రోడ్రిగ్యూజ్ ఒకరు, 12 నెలల ప్రయాణానికి సంబంధించిన వివరాలను ఆయన దీనిలో రాశారు, 18వ శతాబ్దానికి చెందిన తాహితీయన్‌ల గురించి అనేక జాతిపరమైన వివరాలను దీనిలో వర్ణించడం జరిగింది.

1800వ శతకం[మార్చు]

సెప్టెంబరు 9, 1842నాటి డుపెటిట్ థౌవర్స్ యొక్క తాహితీ ఆక్రమణ.

నవంబరు 1835లో ఛార్లస్ డార్విన్ HMS బీగల్ నౌకపై తాహితీని సందర్శించారు, ఈ ద్వీపాన్ని చుట్టివచ్చిన బీగల్‌కు రాబర్ట్ ఫిట్జ్‌రాయ్ కెప్టెన్‌గా ఉన్నారు. మిషనరీల ప్రభావంతో జనాభాలో నిగ్రహశక్తి మరియు నైతిక విలువలు ఏర్పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. డార్విన్ అక్కడి ప్రకృతి దృశ్యాన్ని కీర్తించినప్పటికీ, తాహితీ రాణి పోమరే IVకు అవిధేయత ప్రదర్శించారు. కెప్టెన్ ఫిట్జ్‌రాయ్ తాహితీయన్‌లు ఇంగ్లీష్ నౌకపై దాడి చేయకుండా ఉండేందుకు పరిహారాన్ని చెల్లించేందుకు చర్చలు జరిపారు, ఇవి 1833లో జరిగాయి.[7]

1839లో ఈ ద్వీపాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల అన్వేషక బృందం సందర్శించింది; ఈ బృందంలో సభ్యుడైన ఆల్‌ఫ్రెడ్ థామస్ ఎగేట్ తాహితీయన్ జీవితం గురించి అనేక చిత్రాలు గీశారు, వీటిలో కొన్ని తరువాత అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రచురించబడ్డాయి.

1842లో మొరాకోకు సంబంధించి ఫ్రాన్స్ మరియు గ్రేట్ బ్రిటన్ దేశాల మధ్య ఒక ఐరోపా సంక్షోభం ఏర్పడింది, ఈ సమయంలో అడ్మిరల్ డుపెటిట్ థోవర్స్ ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి స్వతంత్రంగా వ్యవహరిస్తూ, తాహితీని ఫ్రెంచ్ రక్షిత రాజ్యంగా ఉండేందుకు రాణి పోమరే IVను అంగీకరింపజేశారు. బర్మింగ్‌హామ్-కు చెందిన మిషినరీ మరియు తాత్కాలిక బ్రిటీష్ దౌత్యాధికారి జార్జి ప్రిట్‌చార్డ్ ఈ సమయంలో విధులకు దూరంగా ఉన్నారు. ఆయన తిరిగి విధులకు హాజరైన తరువాత స్థానికులను రోమన్ క్యాథలిక్ ఫ్రెంచ్‌వారిపై తిరుగుబాటుకు ప్రేరేపించారు. నవంబరు 1843లో, డుపెటిట్-థోవర్స్ (సొంత ప్రయత్నంపై) ఈ ద్వీపానికి నావికులను పంపించి, దానిని ఫ్రాన్స్ ఆధీనంలోకి వచ్చేలా చేశారు. ఆయన తరువాత ప్రిట్‌ఛార్డ్‌ను జైలులో పెట్టారు, తరువాత అతనిని బ్రిటన్‌కు పంపించారు.

తాహితీయన్ పిల్లలు, సుమారుగా. 1906

తాహితీ వార్త 1844లో ఐరోపా చేరుకుంది. ఫ్రెంచ్ జాతీయ నేత ఫ్రాంకోయిస్ గుయ్‌జోట్ ఫ్రాన్స్ రాజు లూయిస్-ఫిలిప్ మద్దతుతో, ద్వీపం ఆక్రమణను రద్దు చేశారు. అయితే, ఫ్రాన్స్ మరియు తాహితీయన్‌ల మధ్య యుద్ధం 1847 వరకు కొనసాగింది. జూన్ 29, 1880 వరకు ఈ ద్వీపం ఫ్రాన్స్ రక్షిత రాజ్యంగా ఉంది, రాజు పోమరే V (1842–1891) తాహితీ సార్వభౌమత్వాన్ని మరియు స్వాతంత్ర్యాన్ని ఫ్రాన్స్‌కు అప్పగించాల్సి వచ్చింది. రాజుకు లీజియన్ ఆఫ్ హానర్ మరియు అగ్రికల్చరల్ మెరిట్ ఆఫ్ ఫ్రాన్స్ పట్టాలను ఇచ్చారు.

20వ శతాబ్దం[మార్చు]

1946లో, తాహితీ మరియు మొత్తం ఫ్రెంచ్ పాలినేషియా ప్రాంతం ఒక ఫ్రాన్స్ విదేశీ భూభాగంగా మారింది. తాహితీయన్‌లకు ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చారు, జాతీయవాద నేత మార్సెల్ పౌవానా ఎ ఊపా అనేక సంవత్సరాలుపాటు ఈ హక్కు కోసం పోరాడారు.[8] 2003లో, ఫ్రెంచ్ పాలీనేషియా హోదాను కలెక్టివ్ డి'అవుటర్-మెర్ (ఫ్రెంచ్ విదేశీ సమాజం)గా మార్చడం జరిగింది.

ఫ్రెంచ్ చిత్రకారుడు పాల్ గావుగుయిన్ 1890వ దశకంలో తాహితీలో నివసించారు, ఇక్కడ ఆయన అనేక తాహితీ విషయాలపై చిత్రాలు గీశారు. పాపీరీ అనే ఒక చిన్న గువాగుయిన్ మ్యూజియం ఇక్కడ ఉంది.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో, పాపీట్ ప్రాంతంపై రెండు జర్మన్ యుద్ధనౌకలు దాడి చేశాయి. ఒక ఫ్రెంచ్ గన్‌బోట్‌తోపాటు, స్వాధీనం చేసుకున్న ఒక జర్మన్ యుద్ధనౌకను నౌకాశ్రయంలో నీటముంచారు, రెండు జర్మనీ యుద్ధనౌకలు కాలనీపై బాంబులతో దాడి చేశాయి. 1966 మరియు 19996 మధ్య కాలంలో, ఫ్రాన్స్ ప్రభుత్వం మోరురోవా మరియు ఫాంగాటౌఫా పగడపు దిబ్బలపై మరియు దిగువన 193 అణు బాంబు పరీక్షలు నిర్వహించింది. చివరి పరీక్షను జనవరి 27, 1996లో నిర్వహించారు.[9]

రాజకీయాలు[మార్చు]

తాహితీయన్‌లు సంపూర్ణ పౌర మరియు రాజకీయ హక్కులతో ఫ్రాన్స్ పౌరులుగా ఉన్నారు. ఫ్రెంచ్ అధికారిక భాషగా ఉన్నప్పటికీ, తాహితీయన్ భాష మరియు ఫ్రెంచ్ భాష రెండు వాడుకలో ఉన్నాయి. అయితే, 60వ మరియు 70వ దశకాల్లో పిల్లలు పాఠశాలల్లో తాహితీయన్ భాష మాట్లాడటం నిషేధించారు. ప్రస్తుతం ఈ ఆలోచనా ధోరణిలో మార్పు కనిపిస్తుంది, తాహితీయన్ భాషను ఇప్పుడు పాఠశాలల్లో నేర్పుతున్నారు; కొన్నిసార్లు ఉద్యోగానికి ఇది ఒక అవసరంగా కూడా ఉంది.

ఫ్రెంచ్ పాలినేషియాలో తాహితీ భాగంగా ఉంది. ఫ్రెంచ్ పాలినేషియా ప్రాంతం ఒక పాక్షిక-స్వయంప్రతిపత్తిగల ఫ్రాన్స్ భూభాగం, దీనికి సొంత అసెంబ్లీ, అధ్యక్షుడు, బడ్జెట్ మరియు చట్టాలు ఉన్నాయి. ఫ్రాన్స్ యొక్క నియంత్రణ సబ్సిడీలు, విద్య మరియు భద్రతకు మాత్రమే పరిమితమై ఉంది. ఫ్రెంచ్ పాలినేషియా మాజీ అధ్యక్షుడు ఆస్కార్ తెమురు ఫ్రాన్స్ నుంచి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారు. అయితే 20% జనాభా మాత్రమే సంపూర్ణ స్వాతంత్ర్యానికి మద్దతు ఇచ్చింది.

రెండో ఫ్రాన్స్-ఓషియానియా సదస్సు సమయంలో జూన్ 26, 2006న ఒక విలేకరుల సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్వస్ చిరాక్ మాట్లాడుతూ తాహితీయన్‌లలో ఎక్కువ మంది స్వాతంత్ర్యాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. భవిష్యత్‌లో ఒక సాధ్యనీయ ప్రజాభిప్రాయ సేకరణకు ద్వారాలు తెరిచివుంచుతానని తెలిపారు.

ఫ్రెంచ్ పాలినేషియా భూభాగ అసెంబ్లీ అయిన ఫ్రెంచ్ పాలినేషియా అసెంబ్లీకి ఎన్నికలు మే 23, 2004లో జరిగాయి (ఫ్రెంచ్ పాలినేషియా శాసనసభ ఎన్నికలు, 2004ను చూడండి). దీనిలో ఆశ్చర్యకరమైన రీతిలో, ఆస్కార్ తెమురు నేతృత్వంలోని స్వాతంత్ర్యానుకూల ప్రగతిశీల కూటమి 57-సీట్లు ఉన్న పార్లమెంట్‌లో ఒకేఒక్క సీటు మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, గాస్టోన్ ఫ్లోస్సీ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఈ ఎన్నికల్లో అతిస్పల్ప తేడాతో పరాజయం చవిచూసింది (ఫ్రెంచ్ పాలినేషియా రాజకీయ పార్టీల జాబితాను కూడా చూడండి). అక్టోబరు 8, 2004న, ఫ్లోస్సీ ప్రభుత్వం ఒక అభిశంసన తీర్మానంతో కూలిపోయింది, దీని వలన సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. రాజకీయ సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో ఒక స్థానిక ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా ఎన్నికలు నిర్వహించేందుకు ఫ్రాన్స్ జాతీయ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలా వద్దా అనేదానిపై ఒక వివాదం నెలకొంది.

జనాభా[మార్చు]

మందార పువ్వుతో ఇద్దరు తాహితీయన్ బాలికలు

పాలినేషియన్ వారసత్వం కలిగివున్న స్థానిక తాహితీయన్‌లు మొత్తం జనాభాలో 70% మంది ఉన్నారు, వీరితోపాటు ఐరోపావాసులు, తూర్పు ఆసియన్‌లు (ఎక్కువగా చైనీయులు) మరియు తరచుగా డెమీస్‌ గా సూచించబడే మిశ్రమ వారసత్వం గల పౌరులు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. వీరు ఫ్రెంచ్ పాలినేషియాలో అతిపెద్ద జనాభాగా ఉన్నరు. మెట్రోపాలిటన్ ఫ్రాన్స్‌కు చెందిన ఎక్కువ మంది పౌరులు పాపీట్ మరియు దీని శివారుల్లో, ముఖ్యంగా పునౌయాలో నివసిస్తున్నారు, ఇక్కడ వీరి జనాభా మొత్తం జనాభాలో దాదాపుగా 20% ఉంది.[citation needed]

చారిత్రక జనాభా[మార్చు]

1767 1797 1848 1897 1911 1921 1926 1931 1936 1941
50,000[10] నుంచి
200,000[11]
16,000[10] 8,600 10,750 11,800 11,700 14,200 16,800 19,000 23,100
1951 1956 1962 1971 1977 1983 1988 1996 2002 2007
30,500 38,100 45,400 79,494 95,604 115,820 131,309 150,721 169,674 178,133
గత జనాభా లెక్కల నుంచి అధికారిక గణాంకాలు.[1][12][13][14][15][16]

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

తాహితీయన్ తీరం

ఈ ద్వీపంలో పర్యాటకం ఒక ప్రధాన పరిశ్రమగా ఉంది, ఎక్కువగా బోరా బోరా మరియు మోరెయా ద్వీపాల్లో ఈ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది.

జులైలో, పాపీట్‌లో జరిగే హీవా వేడుకలో పాలినేషియా సంస్కృతిని ప్రతిబింబిస్తుంది, ప్యారిస్‌లో బాస్టిల్లే విప్లవానికి స్మారకోత్సవంగా దీనిని జరుపుతున్నారు.

1963లో CEP (సెంటర్ డి'ఎక్స్‌పెరిమెంటేషన్ డు పసిఫిక్)ని ఏర్పాటు చేసిన తరువాత, ఫ్రెంచ్ పాలినేషియాలో జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి, అనేక మంది పాలినేషియన్‌లు సాంప్రదాయిక వృత్తులను విడిచిపెట్టి, పాపీట్ పట్టణ ప్రాంతానికి వలసవచ్చారు. జీవన ప్రమాణాలు మెరుగపడినప్పటికీ (ప్రధానంగా ఫ్రాన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) కారణంగా), ఆర్థిక వ్యవస్థ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. CEP కార్యకలాపాలు నిలిపివేసిన సమయంలో, తాహితీతో ఫ్రాన్స్ ఒక ప్రగతి ఒప్పందంపై సంతకం చేసింది, దీనిలో భాగంగా ఆర్థిక వనరుల నష్టానికి పరిహారం చెల్లించేందుకు మరియు విద్య మరియు పర్యాటక రంగాల అభివృద్ధికి సాయం చేసేందుకు 2006 నుంచి ఏడాదికి US$150 మిలియన్ల నిధులను తాహితీకి అందించేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది.

ద్వీపం యొక్క ప్రధాన వ్యాపార భాగస్వామి ఫ్రాన్స్, సుమారుగా 40% దిగుమతులు మరియు 25% ఎగుమతులు ఫ్రాన్స్‌తో ముడిపడివున్నాయి, మిగిలిన వ్యాపారం USA, జపాన్, ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ దేశాలతో జరుగుతుంది.

దస్త్రం:Oceania Political Map (EEZ based).PNG
ఓషియానియా రాజకీయ పటం, EEZ సరిహద్దులు

నల్ల ముత్యాల పెంపకం కూడా గణనీయమైన ఆదాయ వనరుగా ఉంది, ఎక్కువగా ముత్యాలను జపాన్, ఐరోపా మరియు USలకు ఎగుమతి చేస్తున్నారు. తాహితీ నుంచి వెనీలా, పళ్లు, పువ్వులు, మోనోయి, చేపలు, కొబ్బరి నూనె మరియు నోనీ ఎగుమతి కూడా జరుగుతుంది.

నిరుద్యోగం జనాభాలో 13% మందిని ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా మహిళలు మరియు అనర్హతగల యువకులు నిరుద్యోగంతో బాధపడుతున్నారు.

యూరోతో తాహితీ కరెన్సీ ఫ్రెంచ్ పసిఫిక్ ఫ్రాంక్ (CFP, దీనిని XPFగా కూడా గుర్తిస్తారు) యొక్క మారకపు విలువ 1 CFP = EUR .00838 (సుమారుగా. 81 CFP = US డాలర్, జనవరి 2008) వద్ద ఉంది. ఇక్కడ హోటళ్లు మరియు ఆర్థిక సంస్థలు మారకపు సేవలు అందిస్తున్నాయి.

తాహితీలో అమ్మకపు పన్నును TVA లేదా ఆంగ్లంలో V.A.T. అని పిలుస్తారు. పర్యాటక సేవలపై V.A.T. 2009 10% ఉంది, చిన్న వసతి గృహాలు, ఆహారం మరియు పానీయాలపై 6% వద్ద ఉంది. వస్తువుల మరియు ఉత్పత్తుల కొనుగోలుపై V.A.T. 16% వద్ద ఉంది.

సంస్కృతి[మార్చు]

పాల్ గువుగుయిన్ గీసిన తాహితీయన్ వుమెన్ ఆన్ ది బీచ్ (1891) చిత్రం

తాహితీయన్ సంస్కృతులు ఒక మౌఖిక సంప్రదాయాన్ని కలిగివున్నాయి, వివిధ దేవుళ్లు మరియు విశ్వాసాల పురాణాలు, పచ్చబొట్లు వేయించుకోవడం మరియు సముద్రయానం వంటి పురాతన సంప్రదాయాలు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి. జులైలో జరిగే వార్షిక హీవా వేడుక సాంప్రదాయిక సంస్కృతి, నృత్యం, సంగీతం మరియు క్రీడలతో జరుగుతుంది, ఫ్రెంచ్ పాలినేషియా ద్వీపాల మధ్య ఆధునిక తెడ్డు పడవలతో (వా) సుదూర పడవ పోటీని ఈ క్రీడల్లో భాగంగా నిర్వహిస్తున్నారు.

తాహితీలోని పాల్ గావుగుయిన్ మ్యూజియం ఫ్రెంచ్ కళాకారుడు పాల్ గావుగిన్ (1848–1903) యొక్క జీవితం మరియు కళాఖండాలకు ప్రత్యేకించబడింది, ఆయన తాహితీయన్ వుమెన్ ఆన్ ది బీచ్ మరియు వేర్ డు వి కమ్ ఫ్రమ్? , వాట్ ఆర్ వి? వేర్ ఆర్ వి గోయింగ్? వంటి ప్రసిద్ధ చిత్రాలను గీశారు.

ప్రపంచంలో ముత్యాల కోసం ప్రత్యేకించబడిన ఏకైక మ్యూజియం రాబర్ట్ వాన్ పెరల్ మ్యూజియం. పాపీట్ మార్కెట్‌లో స్థానిక కళలు మరియు హస్తకళా వస్తువులు విక్రయిస్తుంటారు.

నృత్యం[మార్చు]

సంప్రదాయ వస్త్రాల్లో తాహితీయన్ మహిళ, సుమారుగా1906
ప్రత్యేక వస్త్రధారణతో ఉపాఉపా నృత్యాన్ని ప్రదర్శిస్తున్న తాహియన్ పౌరులు

ఈ ద్వీపాలకు చెందిన అత్యంత విస్తృత గుర్తింపు పొందిన విషయాల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాహితీయన్ నృత్యం కూడా ఒకటి. కొన్నిసార్లు ఓటీ అని రాసే ʻōteʻa అనేది తాహితీకి చెందిన ఒక సాంప్రదాయిక నృత్యం, దీనిలో పలువురు నృత్యకారులు పంక్తులుగా నిలబడి, వివిధ రకాల ఆకృతులను ప్రదర్శిస్తారు. వేగంగా తుంటిభాగాన్ని-ఊపడం, గడ్డితో తయారు చేసిన పావడాలు ధరించడం ద్వారా ఈ నృత్యాన్ని సులభంగా గుర్తించవచ్చు, తరచుగా దీనిని హవాయికి చెందిన హులాగా భావిస్తుంటారు, అయితే హవాయి నృత్యంలో తుంటి భాగం కంటే ఎక్కువగా చేతులు మరియు కథలు చెప్పడంపై దృష్టి పెడతారు.

ఐరోపా పూర్వ కాలంలో ఒక పురుషుల నృత్యంగా ఉన్న అతికొద్ది నృత్యాల్లో ఓటీ కూడా ఒకటి. మరోవైపు, హురా (హులాకు ఇది తాహితీయన్ ప్రాంతీయ శైలి) అనేది మహిళల నృత్యం, ఇది కనుమరుగైంది, జంటల నృత్యం 'ఉపా'ఉపా కూడా ఇదే విధంగా కనుమరుగై, టామూరే రూపంలో తిరిగి అవతరించింది. అయితే ప్రస్తుతం ఓటీ నృత్యాన్ని పురుషులు (ఓటీ టాన్), మహిళలు (ఓటీ వాహిన్) లేదా ఇరువురూ కలిసి (ఓటీ అముయ్ = సంయుక్త) ప్రదర్శిస్తున్నారు. ఈ నృత్యం కేవలం సంగీతంతో, ప్రధానంగా డోలులతో ప్రదర్శించబడుతుంది, దీనిలో పాటలు ఉపయోగించరు. వివిధ రకాల టోయర్‌లలో డోలును ఒకదానిగా చెప్పవచ్చు, పొడవైన బద్దతో చెక్కకొయ్యపై ఈ డోలును తయారు చేస్తారు, దీనిని ఒకటి లేదా రెండు కర్రలతో కొడతారు. లేదా తిమింగలం చర్మంతో తయారు చేసే పురాతన తాహతీయన్ డోలు పాహును కూడా దీనికి ఉపయోగిస్తారు, ఈ డోలును చేతితో లేదా కర్రలతో కొడతారు. టోయర్ నుంచి లయ బాగా వేగంగా, పాహు నుంచి నెమ్మదిగా ఉంటుంది. చిన్న డోలు ఫాటేట్‌ను కూడా ఈ నృత్యానికి ఉపయోగిస్తారు.

నృత్యకారులు ప్రదర్శించే అభినయాలు దైనందిన జీవన వృత్తులను సూచిస్తుంటాయి. పురుషులకు ఇతివృత్తాలను యుద్ధం లేదా సముద్రయానం నుంచి ఎంచుకుంటారు, వారు దీని కోసం ఈటెలు లేదా తెడ్డులు ఉపయోగిస్తారు.

మహిళలకు ఇతివృత్తాలను ఇళ్లు లేదా ప్రకృతి నుంచి తీసుకుంటారు, ఉదాహరణకు జట్టు దువ్వుకోవడం లేదా సీతాకోకచిలుక ఎగరడం వంటివాటిని ఇతివృత్తాలుగా ఎంచుకుంటారు. అయితే మరింత విస్తృతమైన ఇతివృత్తాలను కూడా ఎంచుకోవడం జరుగుతుంది, ఉదాహరణకు ఒక నృత్యం ప్రసిద్ధ ప్రదేశాలకు ప్రాధాన్యత ఇస్తూ, తాహితీ పటంతో ముగుస్తుంది. ఒక విలక్షణ ఓటీలో ఇతివృత్త కథ మొత్తం నృత్యమంతా వ్యాపించివుంటుంది.

పసిఫిక్‌లో తెడ్డుతో పిరోగ్యూ అనే తెడ్డుతో నడిపే పడవ

సముద్రయానం[మార్చు]

పాలినేషియన్‌లు అయిన స్థానిక తాహితీయన్ పౌరులు విస్తృతమైన ఓషియానిక్ పౌరుల కుటుంబంలో భాగంగా ఉన్నారు, వారు చరిత్ర మరియు సంస్కృతిలో సముద్రయాన నైపుణ్యాల ద్వారా ప్రత్యేక గుర్తింపు కలిగివున్నారు, వారు సాగర పర్యావరణాల్లో వాణిజ్యం మరియు సమాచార ప్రసారం కోసం సముద్రయాన నైపుణ్యాలను అభివృద్ధి చేశారు.

పాలినేషియన్ సముద్రయానం, తాహితీపై రాత్రిపూట ఆకాశంలో కనిపించే సిరియస్ అనే నక్షత్రం ఆధారంగా జరిగేది, ఈ నక్షత్రం మహాసముద్ర ప్రయాణాల్లో సాంప్రదాయిక మార్గ గుర్తింపుకు ఒక ధ్రువతారగా పనిచేసింది.

విద్య[మార్చు]

తాహితీలో యూనివర్శిటీ ఆఫ్ ఫ్రెంచ్ పాలినేషియా అనే ఒక ఫ్రెంచ్ విశ్వవిద్యాలయం ఉంది. ఇది ఒక అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయం, దీనిలో 2,000 మంది విద్యార్థులు మరియు 60 మంది పరిశోధకులు ఉన్నారు. న్యాయవాద, వాణిజ్యం, విజ్ఞానశాస్త్రం మరియు సాహిత్యం వంటి అనేక రంగాలకు చెందిన కోర్సులు దీనిలో ఉన్నాయి.

రవాణా[మార్చు]

తాహితీలో ఫా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది, ఎయిర్ తాహితీ నుయి జాతీయ విమానయాన సంస్థకాగా, ఎయిర్ తాహితీ ద్వీపాల మధ్య విమానాలు నడిపే ప్రధాన విమానయాన సంస్థగా ఉంది. మోరీ ఫెర్రీ అనేది ఒక ప్రసిద్ధ ఫెర్రీ (పడవ) సేవ, ఇది పాపీట్ నుంచి నిర్వహించబడుతుంది. ప్రజలను మరియు వస్తువులను ద్వీపాలకు రవాణా చేసే అనేక ఇతర ఫెర్రీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

క్రీడ[మార్చు]

తాహితీలో రగ్బీ యూనియన్ ఒక ప్రసిద్ధ క్రీడ.

చిత్రశ్రేణి[మార్చు]

వీటిని కూడా చూడండి[మార్చు]

Script error

  • స్వీకరణలో సాంస్కృతిక వైవిధ్యాలు#పాలినేషియా
  • ఫ్రెంచ్ పాలినేషియాలో అగ్నిపర్వతాల జాబితా
  • తాహితీ సంగీతం
  • అణ్వస్త్రరహిత మండలం
  • ఫ్రెంచ్ పాలినేషియా యొక్క పోస్టల్ స్టాప్‌లు మరియు పోస్టల్ చరిత్ర
  • తాహితీయన్ భాష

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 (French) Institut Statistique de Polynésie Française (ISPF). "Recensement de la population 2007" (PDF). Archived from the original on 2007-12-03. Retrieved 2007-12-02. 
  2. పాపీట్, ఫ్రెంచ్ పాలినేషియా. Weatherbase.com. సేకరణ తేదీ 2007-09-26.
  3. Laneyrie-Dagen, Nadeije (1996). Larousse, ed. Les grands explorateurs, sous la direction de Nadeije Laneyrie-Dagen. p. 148. ISBN 2-03-505305-6. 
  4. http://www.jps.auckland.ac.nz/document/Volume_12_1903/Volume_12,_No.3,_September_1903/Who_discovered_Tahiti%3F_by_Geo._Collingridge,_p184-186
  5. అలెన్ మూర్‌హెడ్, ది ఫాటల్ ఇంపాక్ట్ (1966)
  6. ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ డీపాపులేషన్ ఆఫ్ ఫ్రెంచ్ పాలినేషియా ఇన్ ది 19th సెంచరీ
  7. [1] వాయేజ్ ఆఫ్ ది బీగల్
  8. ది పసిఫిక్ ఐల్యాండ్స్: ఎన్ ఎన్‌సైక్లోపీడియా
  9. http://www.sarinoni.com/article/Nuclear%20Tests%20in%20Tahiti.htm
  10. 10.0 10.1 రాబర్ట్ సి. ష్మిత్ ఇన్ పాపులేషన్ ట్రెండ్స్ ఇన్ హవాయి అండ్ ఫ్రెంచ్ పాలినేషియా
  11. ఎస్టిమేట్ బై జేమ్స్ కుక్
  12. 2002 సెన్సస్
  13. 1971, 1977, 1983, 1988, మరియు 1996 జనాభా లెక్కలు
  14. సెన్ససెస్ ఫ్రమ్ 1911 టు 1962 ఇన్ పాపులేషన్, 1972, #4-5, పేజి 720, పబ్లిష్డ్ బై INED
  15. లా గ్రాండ్ ఎన్‌సైక్లోపీడియా ఫర్ ది 1897 సెన్సస్
  16. 1848 సెన్సస్

బాహ్య లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=తాహితీ&oldid=1184960" నుండి వెలికితీశారు