తిమ్మరాజుపాలెం

వికీపీడియా నుండి

తిమ్మరాజుపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలానికి చెందిన గ్రామము. తిమ్మరాజుపాలెం నిడదవోలు నుండి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్నది. నిడదవోలు గణపతి సినిమా దియేటరు సెంటరు నుండి ప్రభుత్వ ఆసుపత్రి వైపు వెళ్ళే మార్గంలో తిన్నగా రెండు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామము వస్తుంది. ఈ గ్రామము వ్యవసాయ ఆధారిత గ్రామము. ఈ గ్రామంలొ ప్రసిద్ధిచెందిన కోటసత్తెమ్మ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలొ ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన ఉత్సవాలు, జాతరలు జరుగుతాయి.

[మార్చు] కోట సత్తెమ్మ ఆలయ చరిత్ర

అత్యంత నమ్మకమైన తల్లిగా పేరున్న కోట సత్తెమ్మ దేవాలయానికి అనేక జిల్లాల నుండి భక్తులు వస్తుంటారు. 1934 వ సంవత్సరంలో దేవులపల్లి రామమూర్తిశాస్త్రి అనే భూస్వామి పొలందున్నుతుండగా నాగలికి తగిలిన శిలను చూసి చుట్టూ మట్టి తవ్వి చూడగా బ్రహ్మాండమైన అమ్మవారి ధర్శనం కలిగింది. తరువాత 1935 లో భక్తులు అమ్మవారి దేవాలయ నిర్మాణం కావించి, చుట్టూ ప్రహరీ కట్టి పూజాదులు నిర్వహించుట మొదలెట్టినారు. అప్పటి నుండి ఆలయము వేగముగా అభివృద్ది చెందుతూ ప్రస్తుతము ఏడాదికి యాభై లక్షల ఆదాయం కలిగిన పెద్ద దేవస్థానముగా రూపుదాల్చినది.

దేవాలయంలో సౌకర్యాలు
  • దేవాలయ ఆవరణలో కళా ప్రదర్శనలకొరకు రెండు లక్షలరూపయల వ్యయంతో కళావేదికను నిర్మించారు.
  • దేవాలయ ఆవరణను ఆనుకొని భక్తుల భోజన వసతికి(నిత్యాన్నదానం)గదులను, హాలు కలిగి ఉన్నది.
  • దేవాలయంలో రోజూ నిత్యాన్న దానం జరుగుతుంది. లడ్డూ ప్రసాదం విక్రయిస్తారు.
  • దేవాలయానికి వెళ్ళు మార్గము పొడవునా పూజా సామగ్రి దుకాణాలు, పండ్ల, పూల దుకాణాలు, ఇతర దుకాణాలు కలవు.


పేజీకి సంభందించిన లింకులు