తిరప్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Tirap జిల్లా
Arunachal Pradesh జిల్లాలు
Arunachal Pradesh రాష్ట్రంలో Tirap యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Arunachal Pradesh
ముఖ్యపట్టణం Khonsa
Area
 • మొత్తం 2,362
జనాభా (2011)
 • మొత్తం 1,11,997[1]
జనగణాంకాలు
 • అక్షరాస్యత 52.2%[1]
 • లింగ నిష్పత్తి 931[1]
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం లోని 17 జిల్లాలలో తిరప్ జిల్లా ఒకటి. ఈ జిల్లా సరిహద్దులో నాగాలాండ్ మరియు అస్సాం మరియు అంతర్జాతీయంగా మయన్మార్ మరియు రాష్ట్రంలోని చంగ్‌లంగ్ మరియు లంగ్‌డింగ్ లు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

తిరప్ ప్రాంతంలో పూర్వం స్థానిక గిరిజనులు నివసిస్తూ ఉండేవారు. 16వ శతాబ్ధంలో అహోం పాలనా కాలంలో ఇక్కడకు నొక్టే ప్రజలు వచ్చి స్థిరపడ్డారు. 1945 లో ఈ ప్రాంతం జపానీయుల ఆక్రమితప్రాంతంగా కొంతకాలం ఉంది. జపనీయుల సాంరాజ్యం పతనం అయ్యే వరకు ఇది కొనసాగింది. తరువాత " సుమన్ గోప్ " పాలన మొదలైంది. తరువాత తిరప్ నాగాతిరుగుబాటు దారుల లక్ష్యంగా మారింది. గ్రేటర్ నాగాలాండ్ లక్ష్యంగా సైనికపరంగా ఈ దాడులు సాగాయి. నాగా తిరుగుబాటు దారులకు బాప్టిస్ట్ మిషనరీలు సహాయం అందించారు. [2]

1887 నవంబర్ 14 న తిరప్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి చంగ్‌లంగ్ జిల్లా రుఇపొందించబడింది. 2013 లో తిరప్ లోని మరికొంత భూభాగం వేరుచేసి లాంగ్‌డింగ్ జిల్లా రూపొందించబడుంది .[3]

భౌగోళికం[మార్చు]

తిరప్ జిల్లా వైశాల్యం 2,362 చ.కి.మీ. [4] ఇది కెనడా లోని కార్న్‌వాల్ ద్వీపం వైశాల్యానికి సమానం. [5] ఈ ప్రాంతం సముద్రమట్టానికి 200 నుండి 4,000 మీటర్ల (పత్కై కొండలు) ఎత్తులో ఉంది.

విభాగాలు[మార్చు]

  • తిరప్ జిల్లాలో అరుణాచల్ ప్రదేశం లెజిస్లేటివ్ అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి : నాంసాంగ్, తూర్పు ఖొంస, పశ్చిమ ఖొంస, బోర్డురియ-బోగాపని.

ఇవి అరుణాచల్ ఈస్ట్ పార్లమెంటరీ విభాగంలో భాగంగా ఉన్నాయి. [6]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 111,997,[1]
ఇది దాదాపు. గ్రెనడా దేశ జనసంఖ్యకు సమానం. [7]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 613వ స్థానంలో ఉంది. .[1]
1చ.కి.మీ జనసాంద్రత. 13 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.63%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 931:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాశ్యత శాతం. 52.23%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

తిరప్ జిల్లాలో నాగాగిరిజన జాతికి చెందిన నొక్టే ప్రజలు అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో నొక్టే ప్రజలతో నాగాలకు చెందిన కొన్యాక్, మరియు వింకో ప్రజలు కూడా ఉన్నారు. వీరు సంప్రదాయకంగా హిందూయిజం మరియు అనిమిజం ఆచరిస్తుంటారు. ప్రస్తుతం వీరంతా క్రైస్తవ మతం అనుసరిస్తున్నారు. అల్పసంఖ్యాకులు అయిన తుస్తా, తంగ్సా మరియు సింగ్పొ ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు, పండుగ సందర్భాలలో నొక్టే ప్రజలు లొకు, వింకో ప్రజలు ఒరియా, తుస్తా ప్రజలు పొంగ్తు ఉత్సవాలు అత్యుత్సాహంగా నిర్వహిస్తుంటారు. వీటితో దుర్గా పూజ కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు.

అరుణాచల ప్రదేశ్ లో క్రైస్తవ మతం ప్రచారం తిరప్ జిల్లా నుండి మొదలైంది. బోర్డురియా గ్రామం మొదటగా 2004 లో కాథలిక్ చర్చి సిల్వర్ జూబ్లి ఉత్సవం జరుపుకుంది. గుర్తించతగిబంత మంది హిందూ నొక్టేలు క్రమంగా క్రైస్తవమతానికి మారుతున్నారు. ప్రత్యేకంగా ఖొంసా ప్రాంతంలో ఇది అధికంగా జరిగింది.

విద్య[మార్చు]

తిరప్ జిల్లాలో " రామక్రిష్ణా మిషన్ స్కూల్ " ఉంది. ఇది తిరప్ వాసులు విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in. 
  2. http://www.kentaxrecords.com/iaca/php/item_display.php?id=1069145781&type=news
  3. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11. 
  4. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7. 
  5. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Retrieved 2011-10-11. "Cornwall Island 2,358km2" 
  6. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011. 
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. "Grenada 108,419 July 2011 est." 

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=తిరప్&oldid=1265568" నుండి వెలికితీశారు