జాతర
వికీపీడియా నుండి
(తిరునాళ్ళు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం ఒక భారతీయ సాంప్రదాయము గురించి. అదే పేరుగల సినిమా కొరకు, జాతర (సినిమా) చూడండి.
హిందూ సంప్రదాయములో దేవతలను, దేవుళ్లను, పుణ్య స్త్రీలను, మహిమగల స్త్రీ, పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది. ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిష్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటారు. జాతరని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉన్న మన భారతదేశములో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.
విషయ సూచిక |
[మార్చు] కొన్ని ముఖ్యమైన జాతరలు
- శంబర పోలమాంబ జాతర
- మేడారం సమ్మక్క సారక్క జాతర
- తిరుపతి గంగమ్మ జాతరలో పురుషులు స్త్రీల వేషాలు వేసుకుంటారు.
- పైడితల్లి జాతర: విజయనగరం రాజు విజయ రామరాజుకు పైడితల్లి సోదరి. బొబ్బిలి యుద్ధం సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను పైడితల్లి వద్దని వారించిందట. అయినా సమర భూమికేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు. ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి 1757లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి విజయ దశమి ముగిసిన తొలి మంగళవారం రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో సిరిమాను ఎక్కడ ఉందో పైడితల్లి అమ్మవారే స్వయంగా పూజారి కలలో కనబడి చెపుతుందట. ఆమె ఆజ్ఞానుసారంగా ఆ మానును వెతికి తెస్తారు. ఈ మానును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు.
- లింగమంతుల స్వామి జాతర : పెద్దగట్టు జాతర అనికూడా అంటారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో దురాజ్‌పల్లిలో ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 10 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లింగమంతుల జాతర దిష్టిపూజ కార్యక్రమంతో ప్రారంభమౌతుంది. హైదరాబాద్-విజయవాడ బస్సులను జాతర అయిదు రోజులూ నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లిస్తారు.
- నాగోబా జాతర: అదిలాబాద్ జిల్లాలో జరిగే గోండుల జాతర.
- శ్రీకాళహస్తి లో జరిగే ఏడుగంగల జాతర
[మార్చు] జాతరల గురించి
- పూజారి భోషాణమును కాపలాకాయు
చిల్లరవేల్పుల సేవజేసి గొర్రెపోతుల నల్ల జుర్రి గర్రున ద్రేచు కరకు సత్తులకు జాతరలు సల్పి ఏటేట పెండ్లి జేయించుకొం చుదయించు కృతకరాముల పల్లకీలు మోసి నిలువుదోపిడి చేసి తలకాయ గొరిగించు ఏడుకొండలవాని మేడలెక్కి అంబుధీశుని కళ్యాణులని తలంచి ముంచు గంగమ్మలకు డబ్బు పోసి పోసి పాతకము వోలె నా వెన్ను వాయకున్న గోచితో నిల్చియున్నాడ పేచకంబ--గుఱ్ఱము జాషువా గబ్బిలం
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
- మన జాతరలు-విధానాలు పుస్తకం : వంగరి లక్ష్మీభూమయ్య - హన్మకొండ.
- వార్త దినపత్రిక ఆధ్యాత్మికం-పేజి : శ్రీకాకుళం మొగ్గ ఎడిషన .