కపిలతీర్థం

వికీపీడియా నుండి
(తిరుపతి కపిల తీర్ధం నుండి దారిమార్పు చెందింది)
కపిలతీర్థం

శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్ధం లేదా ఆళ్వార్ తీర్ధం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.

కపిలతీర్థం ప్రవేశద్వారం
కపిలతీర్థం ఓ వేసవి మధ్యాహ్నం

విజయనగర చక్రవర్తి, అచ్యుత రాయలు ఈ తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు[1].

[మార్చు] మూలాలు

  1. అనాదిగా తిరుమల - పి.కుసుమ కుమారి
"http://te.wikipedia.org/w/index.php?title=కపిలతీర్థం&oldid=442069" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె