Coordinates: 9°17′19″N 78°50′04″E / 9.288498°N 78.834457°E / 9.288498; 78.834457

తిరుపుల్లాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుపుల్లాణి
తిరుపుల్లాణి is located in Tamil Nadu
తిరుపుల్లాణి
తిరుపుల్లాణి
భౌగోళికాంశాలు :9°17′19″N 78°50′04″E / 9.288498°N 78.834457°E / 9.288498; 78.834457
పేరు
తమిళం:ஆதிஜெகநாத பெருமாள் கோயில்
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:కల్యాణ జగన్నాథన్
ప్రధాన దేవత:కల్యాణవల్లి తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖం
పుష్కరిణి:చక్ర తీర్థము
విమానం:కల్యాణ విమానము
ప్రత్యక్షం:పుల్లారణ్య మహర్షికి

తిరుపుల్లాణి భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం. దీనిని దర్భశయనం అని అంటారు.

విశేషాలు[మార్చు]

ఈ క్షేత్రమునకు దగ్గరలో రామేశ్వరం, ధనుష్కోటి ఉన్నాయి. ఈ సన్నిధిలో గల అశ్వత్థ వృక్షము క్రింద నాగ ప్రతిష్ఠ చేసిన వార్కి సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. పెరుమాళ్లు ఆరగించు పాయసము తప్పక స్వీకరింపవలెను. ఇచట దేవగణములతో పత్నీ సహితుడైన వరుణుడు, విభీషణుడు శరాణాగతి చేయుచుండగా దర్భలపై శయనించిన చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులు) సేవ చేస్తారు.

సాహిత్యం[మార్చు]

శ్లో. శ్రీపుల్లాణి పురేతు పిప్పలనగ శ్రీ చక్ర తీర్థాంచితే
   కల్యాణాఖ్య విమాన మధ్య నిలయ:కల్యాణ వల్లీ ప్రియ:
   కల్యాణాఖ్య జగత్ప్రభు ర్విజయతే ప్రాగాననో రాజతే
   పుల్లారణ్య మహర్షి సేవిత తను:కలిద్వేషిణ:||

పాశురాలు[మార్చు]

పా. విల్లాలిలజ్గై మలజ్గచ్చరమ్‌ దురన్ద,
    వల్లాళన్ పిణ్ పోన నె-మ్‌ వరుమళవుమ్;
    ఎల్లారు మెన్ఱన్నై యేశిలుమ్‌ పేశిడినుం
    పుల్లాణి యెమ్బెరుమాన్ పొయ్‌కేట్టిరున్దేనే.
    
    కనై యారిడి కురలిన్ కార్ మణియణ్ నా వాడల్
    తినై యేనుమ్‌ నిల్లాదు తీయిల్ కొడిదాలో
    పునై యార్ మణిమాడ పుల్లాణి కై తొழுదేన్
    వినై యేన్ మేల్ వేలై యుమ్‌ వెన్దழలే వీశుమే.
    
    వేదముమ్‌ వేళ్వియుమ్‌ విణ్ణు మిరుశుడరుమ్‌
    ఆదియుమానా నరుళ్ తన్ద వానమక్కు
    పోదలరుమ్పొన్నై శూழ పుల్లాణికై కొழுదేన్
    ఓదముమ్‌ నాను ముఱజ్గా దిరున్దేనే.
           తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 9-4-5,7,9

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ స్థలవృక్షం ప్రదేశం విమానం ప్రత్యక్షం
కల్యాణ జగన్నాథన్ కల్యాణవల్లి తాయార్ చక్ర తీర్థము తూర్పు ముఖము కూర్చున్న భంగిమ అశ్వత్థవృక్షము పిప్పల పర్వతము దర్భ శయనము కల్యాణ విమానము పుల్లారణ్య మహర్షికి

చేరే మార్గం[మార్చు]

రామనాథపురమునకు 10 కి.మీ. కారైక్కుడి నుండి రామనాథపురము బస్‌లో పోవచ్చును.

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]