తిరుమల కళ్యాణకట్ట

వికీపీడియా నుండి
తిరుమలలో కళ్యాణకట్ట

ప్రతి ప్రసిద్ధ గుడిలో తలనీలాలు (తల వెంట్రుకలు) ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు. దీని వెనుక ఒక కథ కలదు. ఇది వరకు తిరుపతి దగ్గరలో ఉన్న కళ్యాణి నది ఒడ్డున తలనీలాలు తీసే ఏర్పాటు ఉండేది. తీయ బడిన జుట్టు చుట్టుప్రక్కల విస్తరించబడి అసహ్యంగా కనబడటం, మొక్కలపెరుగుదలకు ఆటంకముగా మారటం లాంటి కాలుష్య కారణాల రీత్యాతరువాతి కాలంలో అది తిరుమల కొండ పైకి మార్చబడింది.

కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యం

[మార్చు] తిరుమల కళ్యాణ కట్ట

మూడు అంతస్తులతో అన్ని వసతులతో కల పెద్ద భవనము దేవస్థానము వారిచే దేవస్థానము ప్రక్కగా నిర్మించబడినది. ఇక్కడ అనుభవజ్ఞులైన క్షురకులను దేవస్థానము నియమిస్తుంది. ఇక్కడి క్షురకులలో పురుషులతో పాటు స్త్రీలు కూడా కలరు. 2005 మేలో తలనీలాలు సమర్పించే మహిళల సౌకర్యార్ధము దేవస్థానము అనాదిగా వస్తున్న సాంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా వంద మంది మహిళా క్షురకురాళ్ళను నియమించింది.[1] తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టలో 500 మందికి పైగా క్షురకులు మూడు విడతలుగా 24 గంటలూ పనిచేస్తుంటారు. రద్దీగా ఉన్న సమయాలలో అదనంగా వంద మంది క్షురకులను తిరుమల తిరుపతి దేవస్థానము నియమిస్తున్నది.[2] కళ్యాణకట్టలో ఉచితముగా గుండు గీస్తారు.

తిరుపతిని ప్రతిరోజూ సందర్శించే 45,000 భక్తులలో మూడవ వంతు మంది తలనీలాలు సమర్పిస్తారని అంచనా. తల వెంట్రుకల అమ్మకం ద్వారా దేవస్థానానికి ప్రతియేటా 24 కోట్ల రూపాయల ఆదాయము సమకూరుతున్నది.[3]

[మార్చు] ఆరోగ్య జాగ్రత్తలు

  • ప్రతి ఒక్కరికి గుండు గీసే బ్లేడు లో మార్పిడి

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె