తిరుమల శిలాతోరణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుమల శిలాతోరణం

తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున ఒక కిలోమీటరు దూరంలో చక్రతీర్థం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఉంది. ఈ శిలాతోరణం యొక్క కొలతలు 8 మీటర్లు (26.2 అడుగులు) వెడల్పు, 3 మీటర్ల (9.8 అడుగులు) ఎత్తు. [1]

ఈ శిలాతోరణం జాతీయ స్మారక చిహ్నం. [2][3][4] ఇది ఎగువ ప్రోటెరోజోయిక్ (160-57 కోట్ల సంవత్సరాల క్రితం నాటి) కాలానికి చెందిన కడప క్వార్ట్జైటు రాళ్ళలో ఏర్పడింది. ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడింది.[5][6][7]

చరిత్ర[మార్చు]

1980 ల్లో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు జరుపుతూండగా, జియాలజిస్టులు ఈ తోరణాన్ని కనుగొన్నారు. రెండు వేర్వేరు రకాల రాళ్ళపై ఒక సన్నటి రాతి వంతెన ఉండడాన్ని వారు గమనించారు. ఈ రాళ్ళ వయసు 25 లక్షల సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేసారు. ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడిందని వారు భావించారు.[8] ఇలాంటి కోతను భూగర్భ శాస్త్ర పరిభాషలో ఎపార్కియన్ అన్‌కన్ఫర్మిటీ అంటారు.[9]

పౌరాణిక ప్రశస్తి[మార్చు]

ఈ తోరణాన్ని తిరుమల లోని వెంకటేశ్వర స్వామికి వివిధ రకాలుగా భక్తులు ఆపాదిస్తూంటారు.

ఈ తోరణాన్ని ఆదిశేషుడు, శంఖు చక్రాల రూపంగా భావిస్తారు.[10]

ఈ తోరణం ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుందని భావిస్తారు.[11]

విష్ణుమూర్తి వెంకటేశ్వరుడిగా వెలసేందుకు కొండపైకి దిగినపుడు తొలి అడుగు శ్రీవారి పాదాల వద్ద, రెండవ అడుగు తోరణం వద్ద, మూడవ అడుగు ఇప్పుడు మూలవిరాట్టు ఉన్నచోట ఉంచాడనీ భక్తుల విశ్వాసం..[12][13]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Engli, Sudheer. "తిరుమల తిరుపతి సహజ శిలాతోరణం గురించి కొన్ని నిజాలు - Rahasyavaani". wirally.com/ (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-05. Retrieved 2020-06-05.
  2. "National Geological Monument, from Geological Survey of India website". Archived from the original on 12 July 2017. Retrieved 16 February 2018.
  3. Geo-Heritage Sites, Minister of Mines Press release, 09-March-2016
  4. national geo-heritage of India Archived 2017-01-11 at the Wayback Machine, INTACH
  5. "Geological Monuments of India". Geological Survey of India. Archived from the original on 2008-09-15. Retrieved 2020-06-13.
  6. "Natural Arch in Tirumala Hills". Geological Survey of India. Archived from the original on 21 జూలై 2011. Retrieved 27 జనవరి 2009.
  7. "Carved by time". Chennai, India: Hindu. 2007-05-06. Archived from the original on 2007-05-08. Retrieved 2009-01-27.
  8. "Tirumala Tirupati Balaji Temple". Archived from the original on 2008-10-14. Retrieved 2009-01-27.
  9. T. Sadavisam on behalf of Bharathan Publications. 1979.
  10. "Carved by time". Chennai, India: Hindu. 2007-05-06. Archived from the original on 2007-05-08. Retrieved 2009-01-27.
  11. "Last decade of Endocrinology in India". Retrieved 2009-01-31.[dead link]
  12. "Places of Tourist interest". Sri Venkateswara Zoological Park, Govt of Andhra Pradesh. Archived from the original on 7 మార్చి 2009. Retrieved 31 జనవరి 2009.
  13. "Silatoranam & a small bird zoo – Kalyan". Retrieved 2009-01-31.