తిరుమవళవన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Thol.Thirumavalavan
దస్త్రం:Tbio.jpg
Member of Parliament
నియోజకవర్గం Chidambaram
వ్యక్తిగత వివరాలు
జననం (1962-08-17) 17 ఆగష్టు 1962 (వయస్సు: 52  సంవత్సరాలు)
Anganur, Tamil Nadu, India
రాజకీయ పార్టీ VCK
నివాసం Chennai

తిరుమవళవన్ లేదా తాల్. తిరుమవళవన్ (తమిళం: தொல்.திருமாவளவன், జననం 17 ఆగస్టు 1962), దళిత ఉద్యమ నేత, 15వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడు మరియు భారతదేశంలోని తమిళనాడులో దళిత రాజకీయ పార్టీ అయిన విధుతలై చిరుతైగల్‌ కచ్చి (లిబరేషన్‌ పాంథర్స్‌ పార్టీ)కి ప్రస్తుత అధ్యక్షుడు. 1990ల కాలంలో దళిత ఉద్యమనేతగా ఎదిగారు. 1999లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. దళిత సామాజిక వర్గం చుట్టూ ఆయన రాజకీయ జీవితం కేంద్రీకృతమై ఉంటుంది. తమిళ జాతీయవాదాన్ని సరికొత్త రీతిలో చాటడం ద్వారా ఆయన రాజకీయంగా మంచి స్థానానికి చేరుకోగలిగానని అంటారు. శ్రీలంకతో పాటు తమిళ జాతీయవాద ఉద్యమాలు మరియు సంస్థలు ఎక్కడున్నా సరే వాటికి ఆయన మద్దతిచ్చేవారు.

ప్రారంభ జీవితం[మార్చు]

తాళ్‌కప్పయన్(రామస్వామి), పెరియమ్మాళ్‌లకు తిరుమవళవన్ రెండో సంతానం. తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో అంగనూర్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ఎనిమిదో గ్రేడ్ వరకు చదువుకున్నారు. కాని ఆయన తల్లి మాత్రం నిరక్ష్యరాసురాలు. ఆయనకు ఒక సోదరి మరియు ముగ్గురు సోదరులు. కాని వీళ్ల కుటుంబంలో ఈయన ఒక్కరే పాఠశాల చదువులు పూర్తయ్యాక ఉన్నత చదువులకు వెళ్లారు. మద్రాసు న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రాన్ని చదవడానికి ముందు ఆయన రసాయనశాస్త్రాన్ని చదువుకున్నా, తరువాత నేరశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని చేశారు. తరువాత ఆయన ప్రభుత్వ ఫోరెన్సిక్ విభాగంలో సైంటిఫిక్ అసిస్టెంట్‌గా పనిచేయడం ప్రారంభించారు.[1]

1982లో విద్యార్థిగా ఉండగానే ఆయనకు రాజకీయాల పై ఆసక్తి కలిగింది. శ్రీలంకలోని తమిళుల పై శ్రీలంక సైన్యం దురుస ప్రవర్తనకు సంబంధించి శరణార్థులు చెప్పినదాన్ని బట్టి ఆయన దృష్టి రాజకీయాల పై మళ్లింది. శ్రీలంక కారణానికి మద్దతుగా, ర్యాలీలు, బహిష్కరణలు‌, సమావేశాలు నిర్వహించేవారు. మద్రాసు న్యాయ కళాశాలలో చదివారు కానీ, ఫెయిలయ్యారు. తాను దళితుడు అయినందనే ఇలా చేశారని ఆరోపించారు. ఈ సంఘటన, తమిళనాడులోని పెద్ద రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) నేతలతో కలిసిపోయేలా చేసింది.[1]

దళిత ఉద్యమం[మార్చు]

1988లో మధురైలోని ప్రభుత్వ ఫోరెన్సిక్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు, దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న దళిత పాంథర్స్‌ ఆఫ్ ఇండియా (DPI)కు తమిళనాడు రాష్ట్ర కన్వీనర్‌గా ఉన్న మలైకామిని కలిశారు. తరువాతి ఏడాది మలైకామి చనిపోవడంతో తిరుమవళవన్ డీపీఐకి నేతగా ఎన్నికయ్యారు. 1990లో సంస్థ కోసం కొత్త జెండాకు రూపకల్పన చేశారు. తన పనిలో భాగంగా, మధురై ప్రాంతంలోని దళిత గ్రామాలను కూడా సందర్శించడం ప్రారంభించారు. దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి తెలుసుకున్నారు. 1992లో ఇద్దరు దళితులను చంపేసినప్పుడు ఆ ఘటన తనను మరింత తీవ్రవాదిగా మార్చేసిందని చెబుతారు.[1] దళిత ఉద్యమ నేపథ్యాన్ని బట్టి తమిళనాడులోని, ప్రత్యేకించి దక్షిణాది జిల్లాల్లో ఆయనకు బలమైన మద్దుతు ఉంది. దీంతో ఆయన తమిళనాడులో ముఖ్యమైన ఇద్దరు దళిత నేతల్లో ఒకరిగా ఎదిగారు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

1999 సార్వత్రిక ఎన్నికలు వరకు డీపీఐ ఎన్నికలను బహిష్కరించింది. జి.కె. మూపనార్‌కు చెందిన తమిళ మానిల కాంగ్రెస్‌ తో తిరుమవళవన్ సంధి చేసుకున్నారు మరియు థర్ట్‌ఫ్రంట్‌ను సూచించారు. పార్లమెంటరీ స్థానాలైన చిదంబరం మరియు పెరంబూలూర్‌ లలో ఈ పార్టీ పోటీ చేసింది. తిరుమవళవన్‌ చిదంబరంలో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 2.25 లక్షల ఓట్లు పోలయ్యాయి.[3]

2001 రాష్ట్ర ఎన్నికల్లో విదుతలై చిరుతైగళ్‌ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగంకు మద్దతిచ్చి 8 స్థానాల్లో పోటీ చేసింది.[citation needed] మంగళూరు నుంచి రాష్ట్ర అసెంబ్లీకి తిరుమ ఎన్నిక్యయారు.[4] 2004 సార్వత్రిక ఎన్నికల్లో జనతాదళ్‌(యునైటెడ్‌)తో కలిసి చిదంబరం నుంచి తిరుమవళవన్‌ పోటీ చేశారు. 2.57లక్షల ఓట్లు పోలైనా, తక్కువ మార్జిన్‌తో ఓడిపోయారు.[5]

2006 తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)కూటమిలో చేరారు. 2006 మార్చి 2న ఆయన పార్టీని భారత ఎన్నికల సంఘం, నమోదు చేయబడిన రాజకీయ పార్టీగా గుర్తించింది. విధుతలై చిరుతైగళ్ కచ్చి తమిళనాడులోని 9 స్థానాల్లోనూ మరియు పాండిచ్చేరిలోని 2 స్థానాల్లోనూ పోటీచేసింది. వీటిలో 2 స్థానాలను పార్టీ గెలుచుకుంది. కట్టుమన్నార్‌ కోయిల్ నుంచి దురై రవికుమార్‌, మంగుళూరు నుంచి సెల్వపెరుతగై గెలిచారు.[6] 2009 సార్వత్రిక ఎన్నికల్లో చిదంబరం లోక్‌సభ స్థానం నుంచి తిరుమవళవన్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

రాజకీయ ఉద్దేశ్యాలు[మార్చు]

తమిళ జాతీయావాదం ఆధారంగా తిరుమవళవన్ రాజకీయాలు ఉండేవి. ఇది కుల వ్యవస్థ నుంచి దీనిని బయటపడే దిశగా ఉండేది.[7] దళితుల అణిచివేతకు సంబంధించి, భారతదేశంలో, తమిళనాడులో కూడా ఇది ఉందన్నారు. తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ పార్టీలు, కులవ్యవస్థను రూపుమాపడానికి అంకితభావంతో ఉండాలన్నారు. ద్రవిడ ఉద్యమ లక్ష్యాలకు దూరంగా వాళ్లు వ్యవహరిస్తున్నారని తిరుమవళవన్‌ వాదించారు. వాళ్ల విధానాలన్నీ మధ్యవర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇవి దళితుల అణిచివేతను మరింత పెంచేవిగా ఉన్నాయి. బ్రాహ్మణులతో మధ్యస్థ కులాలను భర్తీ చేస్తున్నారు. ద్రవిడ పార్టీల నుంచి దళితులు ఎటువంటి సాయాన్ని ఆశించరు, కోరుకోరు.[2]

తిరుమవళవన్ ప్రకారం తమిళ జాతీయవాదాన్ని అనుసరించడమే దీనికి పరిష్కారం. పెరియార్ ఈ.వి.రామస్వామి ఆధ్వర్యంలో ద్రవిడ ఉద్యమం తొలిరోజుల్లో జరిగిన విధంగా, తమిళ సెంటిమెంట్ల ద్వారా బలమైన పునాదులు ఏర్పాటు చేసి కులవ్యవస్థను నిర్మూలించగలమని ఆయన అన్నారు.[2] తమిళనాడులోని రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే, కులవ్యవస్థ తక్షణం మాయమవుతుందని అన్నారు.[7]

హిందుత్వ జాతీయవాదం ప్రత్యేకించి హిందుత్వకు సంబంధించి తిరుమవళవన్ గట్టి విమర్శకుడు. హిందుత్వ , భారతీయ వ్యవస్థను అణిచివేస్తుందని తిరుమవళవన్ అంటారు.[7] ఉత్తర భారతదేశంలా తమిళ సామ్రాజ్యాన్ని హిందుత్వ మార్చేస్తుందని ఆయన వాదిస్తారు. దీనివల్ల తమిళం తన ఉనికిని కోల్పోతుందని తిరుమవళవన్ అంటారు.[2] హిందుత్వను ఎదుర్కోవడానికి తమిళ జాతీయవాదం తప్పనిసరి అన్నది ఆయన అభిప్రాయం.[7]

తిరుమవళవన్ అభిప్రాయం ప్రకారం, తమిళ గుర్తింపునకు ఉన్న ప్రాధాన్యతతో ఆయన శ్రీలంకలో తమిళ విధానాలను అనుసరించే లిబరేషన్‌ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలంతో కలిపి అన్ని వర్గాలకు బలమైన మద్దతు ఇచ్చేలా చేసింది. మిలిటెంట్ సెసషనిస్ట్ సమూహం అయిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలంను తీవ్రవాద సంస్థ అంటూ భారతదేశంలో నిషేధం విధించారు.[1] 2008 మరియు 2009లో LTTEకి వ్యతిరేకంగా శ్రీలంక సైన్యం చేపట్టిన చర్యలకు భారతదేశం మద్దతివ్వడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. శ్రీలంకలో తమిళుల రక్షణ కోసం తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా తమిళనాడులోని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.[8] శ్రీలంకలోని తమిళుల పై దాడులను నిరసిస్తూ, 2009 జనవరి 15న ఆయన చెన్నై (మరియమలై అడిగళ నగర్‌)లో నిరాహార దీక్ష ప్రారంభించారు.[9] నాలుగు రోజుల తరువాత జనవరి 19న ఆయన తన నిరాహారదీక్షను విరమించారు. ఇది భారత ప్రభుత్వం పై ఎటువంటి ప్రభావం చూపలేదని, అందుకే దీని స్థానంలో హర్తాళ్ ఉద్యమానికి పిలుపునిచ్చారు.[10]

పుస్తకాలు[మార్చు]

తమిళంలోని ఆయన పుస్తకాలు, 'అత్తుమీరు' (ట్రాంగ్రెస్‌), 'తమిజర్‌గళ్ హిందుక్కల', (ఆర్‌ ద తమిళ్స్‌, హిందూస్‌?), 'ఈలం ఎన్రాల్‌ పులిగళ్‌', 'పుళిగల్‌ ఎన్రాల్‌ ఈలం' ( ఈలం మీన్స్ టైగర్స్, టైగర్స్ మీన్స్ ఈలం), 'హిందుతవతై వీరరూపం' (వుయ్ షల్‌ అప్‌రూట్ హిందుత్వ), 'సాధియా సంధర్పవాధ అనియై వీజ్తువమ్‌' (వుయ్ షల్ డిఫీట్ ద క్యాస్టియస్ట్‌ ఆపర్టునిస్ట్ అలియన్స్‌) మొదలైనవాటిని కలిగి ఉన్నాయి.

ఆయన పుస్తకాల్లోని రెండు పుస్తకాలను స్ట్రీ-సామ్యా బుక్స్ ద్వారా ఆంగ్లం‌లో ముద్రించారు. కోల్‌కతా: తలిస్‌మాన్‌: దళిత లిబరేషన్‌కు చెందిన భావోద్వేగాలు (ఇండియాటూడే తమిళ ఎడిషన్‌లో 34 వారాలపాటు రాజకీయ వ్యాసాలు రాశారు) మరియు అప్‌రూట్ హిందుత్వ: ది ఫియరీ వాయిస్ ఆఫ్ ద లిబరేషన్‌ పాంథర్స్‌ ( ఆయన రాజకీయ ఉపన్యాసాల్లో 12 ఉంటాయి).[7][2]

నిథర్‌సనమ్ లాంటి ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అసోసియేషన్‌ అండ్ ఆర్గనైజేషన్స్ , శ్రీలంకలోని జాఫ్నాలో నిర్వహించిన మానుదతిన్ తమిజ్ కూడల్ (హ్యుమానిటీస్ తమిళ్‌ మీట్)కు అతిథిగా వెళ్లారు.[11]

చలనచిత్రాలు[మార్చు]

ఎల్‌.జి.రవిచంద్రన్ దర్శకత్వం వహించిన 'అన్బు తోజి'[12](లేడీ లవ్) ఆయన మొదటి సినిమా. ఇందులో తిరుమవళవన్, శ్రీలంకలోని తమిళ మిలిటెంట్ల సమూహానికి నాయకుడిగా, అతిథి పాత్రలో నటించారు.[1] కలహం(ముటినిటీ)లో తిరుమవళవన్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించారు. ము కలించియమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లా కాలజ్ ప్రొఫెసర్‌ బాలసింగం పాత్రను పోషించారు. ఇది ఆయన రెండో సినిమా.[1] మన్సూర్ అలీఖాన్ సినిమా అయిన 'ఎన్నై పార్ యోగం వరుమ్'లోనూ నటించారు.

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Mathai, Kamini (3 February 2008), "Poster boy", The New Indian Express (Chennai), సంగ్రహించిన తేదీ 30 January 2009 
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Viswanathan, S. (1 June 2004), "Voice of the oppressed", written at Chennai, India, The Hindu (Chennai), సంగ్రహించిన తేదీ 30 January 2009 
  3. చిదంబరం (ఎస్‌సి) కాన్‌స్టిట్యున్సీ, తమిళనాడు, ఇండియన్ ఎలక్షన్స్‌, ఇండియన్ ఎలక్షన్స్‌ 1999, ఫోర్త్‌కమింగ్ ఇండియన్‌ ఎలక్షన్స్‌, ఎలక్షన్స్‌ ఇన్ ఇండియా.
  4. అసెంబ్లీ ఎలక్షన్స్‌ - 2001
  5. చిదంబరం (ఎస్‌సి) కాన్‌స్టిట్యున్సీ, తమిళనాడు, ఇండియన్ ఎలక్షన్స్‌, ఇండియన్ ఎలక్షన్స్‌ 2004, ఫోర్త్‌కమింగ్ ఇండియన్‌ ఎలక్షన్స్‌, ఎలక్షన్స్‌ ఇన్ ఇండియా.
  6. స్టేట్ ఎలక్షన్స్‌ 2006 విన్నర్స్‌ డీటైల్స్‌ ఫర్ విదుతలై చిరుతైగళ్‌ కచ్చి ఇన్ తమిళనాడు
  7. 7.0 7.1 7.2 7.3 7.4 Nambath, Suresh (10 May 2005), "Politicisation of identity", written at Chennai, India, The Hindu (Chennai), సంగ్రహించిన తేదీ 30 January 2009 
  8. Express News Service title=Decide boldly on Sri Lanka, Thirumavalavan tells CM (6 January 2009), The New Indian Express (Chennai) http://www.expressbuzz.com/edition/story.aspx?Title=Decide+boldly+on+Sri+Lanka,+Thirumavalavan+tells+CM&artid=OiOVLtTjOgc=&SectionID=vBlkz7JCFvA=&MainSectionID=oHSKVfNWYm0=&SectionName=EL7znOtxBM3qzgMyXZKtxw==&SEO= |url= missing title (సహాయం), సంగ్రహించిన తేదీ 31 January 2009 
  9. "Thol Thirumavalavan begins indefinite fast". The Times Of India. 16 January 2009. 
  10. Kolappan, B. (19 January 2009), "Thirumavalavan calls off fast", written at Chennai, India, The Hindu (Chennai), సంగ్రహించిన తేదీ 30 January 2009 
  11. తమిళనెట్‌ : 23.10.02 స్టేట్ పవర్ సెడ్ నెసస్సరీ ఫర్ అప్‌లిఫ్టింగ్ తమిళ్‌
  12. [1]

మరింత చదవడానికి[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]