తిరువల్లవాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరువల్లవాయ్
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:నారాయణన్(నావాయ్ ముకుందన్)
ప్రధాన దేవత:మలర్ మంగై తాయార్
దిశ, స్థానం:దక్షిణ ముఖము
పుష్కరిణి:శెంగమల పుష్కరిణి
విమానం:వేద విమానం
కవులు:భంగిమ నమ్మాళ్వార్ తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:లక్ష్మీదేవికి గజేంద్రునకు

తిరువల్లవాయ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

మలైనాడు సన్నిధులలో తాయార్లకు వేరుగా సన్నిధి ఇచట మాత్రమే ఉంది. నమ్మాళ్వార్లు ఈ పెరుమాళ్ల విషయమై "ఆసృశంస్యము" అనే గుణమును ప్రకాశింపజేసిరి.

సర్వేశ్వరుని వియోగముచే కలిగిన దు:ఖ సముద్రమును దాటించు నావవంటివాడు ఈస్వామి "ఆవానడి యానివనెన్నరుళాయే" వీడు నా దాసుడని నన్ను దయజూడుమా! అని ఆసృశంస్య గుణమును (9-8-7) ప్రకాశింపజేసిరి.

పేరువెనుక చరిత్ర[మార్చు]

ఇచట "నవాయుఱైకిన్ఱ" "నావగా వసించుచున్నట్టివాడు" అని పేర్కొనుటచే ఈ దేశమునకును తిరునావాయ్ అను నామము వచ్చింది.

సాహిత్యం[మార్చు]

శ్లో. శ్రీమచ్చెంగమలాభిధాన సరసా యుక్తే పురే సుందరే
   నావాయ్ నామని వేద మందిర వరే యా మ్యాఅసనాలంకృత:
   లక్ష్మీ నాగవరేక్షిత స్సముపయన్ దేవీం మలర్ మంగ ఇ
   త్యాస్తే స్తుత్య వపు శ్శఠారి కలిజిత్ యుగ్మేణ నారాయణ:||

పాశురాలు[మార్చు]

పా. కోవాగియ;మావలియై నిలజ్కొణ్డాయ్
    తేవాశురమ్; శెత్తవనే తిరుమాలే!
    నావా యుఱైగిన్ఱ ఎన్నారణ నమ్బీ;
    ఆవా వడియా నివ నెన్ఱరుళాయే.
        నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-8-7.

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
నారాయణన్ (నావాయ్ ముకుందన్) - మలర్ మంగై తాయార్ శెంగమల పుష్కరిణి దక్షిణ ముఖము కూర్చున్నసేవ భంగిమ నమ్మాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ వేద విమానం లక్ష్మీదేవికి గజేంద్రునకు

చేరే మార్గం[మార్చు]

షోరానూర్ నుండి కళ్లికోట పోవు మార్గములో గల "ఎడకోలమ్" నకు 1 కి.మీ. దూరమున గలదు. షోరానూర్ నుండి బస్‌లో కుట్టీపురంచేరి అక్కడ నుండి వేరుబస్సులోను చేరవచ్చును. వసతులు స్వల్పము

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]