Coordinates: Coordinates: Unknown argument format

తిరువిణ్ణగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరువిణ్ణగర్
ఆలయం రాజగోపురం (గేట్‌వే టవర్).
ఆలయం రాజగోపురం (గేట్‌వే టవర్).
తిరువిణ్ణగర్ is located in Tamil Nadu
తిరువిణ్ణగర్
తిరువిణ్ణగర్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఉప్పిలియప్పన్(శ్రీనివాసర్)
ప్రధాన దేవత:భూమిదేవి తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:ఆర్తి పుష్కరిణి(అహోరాత్ర పుష్కరిణి)
విమానం:విష్ణు విమానము
కవులు:పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:గరుత్మంతునకు, కావేరికి, యమునకు, మార్కండేయ మహర్షికి

తిరువిణ్ణగర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

ఈ దివ్యదేశమునకు "నణ్ణగర్" అను విలక్షణమైన తిరునామము ఉంది. శ్లాఘ్యమైన దివ్యదేశము. (తి.వా.మొ. 6-3-2) నల్ కురువుమ్‌ అను తిరువాయిమొழிలో (6-3) నమ్మాళ్వార్లు తమకు సేవ సాయించిన తిరువిణ్ణగర్ పెరుమాళ్ళ కల్యాణ గుణములను అనుభవించుచు "పల్‌వకయుం పరన్ద" అని సర్వేశ్వరుని ఆఘటిత ఘటనా సామర్ద్యమనెడి కల్యాణ గుణమును ప్రకాశింపజేసిరి. తంజావూరు జిల్లాలో ప్రసిద్దమైన క్షేత్రము. ఇచ్చట స్వామి మార్కండేయ పుత్రికను వివాహమాడిరి. ఆ సమయమున భూమిదేవి నాచ్చియార్ చిన్న వయసు గలవారగుటచే తళియలో ఉప్పువేయుట కూడా తెలియనివారైరి. అందుచే నాటి నుండి స్వామి ఉప్పులేని ప్రసాదమునే ఆరగించెడివారు. నేటికిని ఉప్పులేని ప్రసాదమునే ఆరగించు చున్నారు. ఈ క్షేత్రమునకు తులసీ వనమనియు తిరునామము ఉంది. అన్ని వసతులు గలవు. సన్నిధిలో ప్రసాదములు లభించును. .

ఆలయ ఏనుగు
ఏనుగు, మహౌట్ స్తంభాల హాలు గుండా నడుస్తున్నారు.

సాహిత్యం[మార్చు]

శ్లో. భాతి శ్రీ తిరువణ్ణగర్ పురవరే హార్త్యబ్జినీ శోభితే
   శ్రీ మద్విష్ణు విమాన సంస్థితి లసన్ శ్రీ భూమి దేవీ పతి:
   శ్రీ మాను ప్పిలి యప్పనాహ్వయ యుత: పక్షీంద్ర కావేరికా
   ధర్మైర్దష్ట వపు శ్శఠారి కలిజిత్ సమ్యక్ స్తుత:ప్రాజ్ముఖ:|

పాశురం[మార్చు]

   పర--డరుడమ్బాయழక్కు ప్పదిత్త పుడమ్బాయ్;
   కరన్దుం తోన్ఱియుమ్‌ నిన్ఱుమ్‌ కైదవజ్గల్ శెయ్‌దుమ్; విణ్ణోర్‌
   శిరజ్గళాల్ వణజ్గుమ్‌ తిరువిణ్ణగర్ చ్చేర్‌న్ద పిరాన్
   వరజ్గొళ్ పాదమల్లాలిల్లై యావర్‌క్కుమ్‌ వన్‌శరణే.
          నమ్మాళ్వార్-తి.మొ 6-3-7

   వణ్డుణు నఱుమల రిణ్డై కొణ్డు-వణ్ణనమ్‌ వినై కెడవెన్ఱు; ఆడిమేల్
   తొణ్డరు మమరరుం పణియనిన్ఱ జ్గణ్డమోడ కలిడ మళన్దవనే
   ఆణ్డాయున్నైక్కాణ్బద్బో రరుళె నక్కరుళుదియేల్
   వేణ్డేన్ మనై వాழక్కైయై విణ్ణగర్ మేయవనే.
        తిరుమంగై ఆళ్వార్ పె.తి.మొ. 6-1-1

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
ఉప్పిలియప్పన్ (శ్రీనివాసర్) భూమిదేవి తాయార్ ఆర్తి పుష్కరిణి (అహోరాత్ర పుష్కరిణి) తూర్పు ముఖము నిలచున్న భంగిమ పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ విష్ణు విమానము గరుత్మంతునకు, కావేరికి, యమునకు, మార్కండేయ మహర్షికి

చేరే మార్గం[మార్చు]

కుంభఘోణమునుండి టౌన్ బస్ ఉంది. ఈసన్నిధి తిరునాగేశ్వరము అను ప్రసిద్ధ శివ క్షేత్రమునకు 1 కి.మీ. ఇచట నుండి తిరుచ్చేరై "నాచ్చియార్‌కోయిల్" పోయి సేవింప వచ్చును

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]