తుంగ నది
వికీపీడియా నుండి
తుంగ నది (కన్నడ: ತುಂಗಾ ನದಿ) కర్ణాటక రాష్ట్రంలోని పవిత్ర నది. ఇది పడమటి కనుమలలో వరాహ పర్వతంలో పుట్టి చిక్ మగలూరు మరియు షిమోగా జిల్లా ద్వారా ప్రవహిస్తుంది. దీని పొడవు సుమారు 147 కిలోమీటర్లు. ఈ నది కూడ్లి వద్ద భద్ర నదితో కలుస్తుంది. అక్కడనుండి దీనిని తుంగభద్ర అని పిలుస్తారు. తరువాత తూర్పుగా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.
"గంగా స్నానం తుంగా పానం" అని సామెత.
[మార్చు] పవిత్ర ప్రదేశాలు
శృంగేరి వద్ద తుంగ నది ఒడ్డున చాలా దేవాలయాలున్నాయి. వానిలో శారదా పీఠం, విద్యాశంకరాలయం ప్రముఖమైనవి.