తుకారాం
వికీపీడియా నుండి
తుకారాం (Tukaram) (1608 - 1649) మహారాష్ట్రకు చెందిన మహాభక్తుడు. ఇతడు 17వ శతాబ్దంలో జీవించాడు. ఇతడు పరమ పుణ్యప్రదమైన పండరిని మ్రొక్కుబడిగా దర్శించే భక్తులైన వరకారీ లకు చెందినవాడు. తుకారాం పూర్వులు రైతులు. తర్వాతివారు వ్యాపారం చేసారు. ఇతని తండ్రి బల్హోబా గ్రామాధికారిగా పనిచేశారు. భయంకరమైన కరువు మూలంగా ఇతని మొదటి భార్య పిల్లవాడు ఆహుతైపోయారు. శివాజీ ఇవ్వజూపిన సంపదను తుకారాం నిరాకరించాడు. భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష సాగించాడు. చివరికి పండరీపురం చేరాడు. ఇతడు రచించిన భక్తి గీతాలను అభంగాలు అంటారు. "మానవసేవయే మాధవసేవ" అని భావించిన మహనీయుడు తుకారాం.
కొన్ని సూక్తులు [మార్చు]
- సాధువులు దీపావళి, దసరా పండుగలలో మన ఇండ్లకు వస్తారు. వారి రాక వైకుంఠం కలివచ్చినట్లే వుంటుంది.
- మనసుకు కొంచెంగా దైవభక్తి రుచి గనుక చూపిస్తే అది దానిని ఇంక వదలనే వదలదు.
- విగ్రహాన్ని మనస్సులో ప్రతిష్టించు, అది అక్కడే పూజలందుకుంటుంది.
- దశరథ పుత్రుడు రాముడు మొన్నటివాడు కాగా, ఆత్మారాముడు శాశ్వతుడు.
మూలాలు [మార్చు]
- తుకారాం (1608-1649), దక్షిణాది భక్తపారిజాతాలు, శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.
