తెనాలి

వికీపీడియా నుండి

  ?తెనాలి మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటములో తెనాలి మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో తెనాలి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°15′N 80°35′E / 16.25, 80.58
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము తెనాలి
జిల్లా(లు) గుంటూరు
గ్రామాలు 12
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
224,100 (2001)
• 112810
• 111290
• 75.21
• 80.97
• 69.37

అక్షాంశరేఖాంశాలు: 16°15′N 80°35′E / 16.25, 80.58

తెనాలి (Tenali), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము. తెనాలి ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు మంచి వ్యాపార కూడలి. కళాకారులకు, సాహితీవేత్తలకు పుట్టినిల్లు. 2001 జనాభా లెక్కల ప్రకారం తెనాలి పట్టణ జనాభా 149,839


జిల్లా కేంద్రమైన గుంటూరునుండి తెనాలికి 25 కి.మీ (16 మైళ్ళు). కృష్ణానది నుండి వచ్చే మూడు కాలువలు ఈ మండలం గుండా ప్రవహిస్తున్నయి. అందులో ఒక కాలువ పడవల కాలువ కాగా (ఒకప్పుదు ఈ కాలువ ఈ తాలూకాలొ ముఖ్యమైన ప్రయాణ మార్గం) మిగిలిన రెండూ ఇక్కడ మంచి వరి పంటకు నీటి సదుపాయాన్ని అందిస్తున్నాయి. గుంటూరు, విజయవాడ, చెన్నై నగరాల రైలు మార్గాలను కలిపే ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. తెనాలి నుండి నాటక, సినిమా రంగాలలోకి చాలా మంది కళాకారులు రావడం వల్ల దీనిని 'ఆంధ్రా పారిస్' (Andhra Paris) అని అంటుంటారు. కాంచనమాల, కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, జమున, శారద, ఘట్టమనేని కృష్ణ, ఎ.వి.ఎస్. వంటి కళాకారుల స్వస్థలం తెనాలి.

విషయ సూచిక

[మార్చు] భౌగోళికం

తెనాలి అక్షాంశ రేఖాంశాలు 16.25° N 80.58° E[1]. సముద్ర తలం నుండి ఎత్తు 11 మీటర్లు (36 అడుగులు). విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాలు ఒకదానికొకటి 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక సమత్రికోణం లా ఉంటాయి.

2001 జనాభా లెక్కల ప్రకారం [2], తెనాలి జనాభా 149,839. ఇందులో ఆడ, మగవారు సుమారు 50%, 50%. తెనాలి అక్షరాస్యత 67% (దేశం సగటు 59.5%: మగవారిలో అక్షరాస్యత 72%, ఆడువారిలో 61%. ఆరు సంవత్సరాలకంటే చిన్నవారైన వారు జనాభాలో 10% ఉన్నారు.

[మార్చు] ఆర్ధికం

సారవంతమైన నల్ల రేగడి నేల, మూడు కృష్ణా కాలువలు, ప్రధాన నగరాలకు దగ్గరగా ఉండడం వలన తెనాలి ముఖ్యమైన వ్యవసాయోత్పత్తి కేంద్రం, వ్యాపార కేంద్రం, కళాకేంద్రంగా అభివృద్ధి చెందింది. చెరకు, వరి,మామిడి ఈ ప్రాంతంలో ముఖ్యమైన పంటలు.

పట్టణంలో ప్రధాన వ్యాపార కేంద్రాలు - మెయిన్ రోడ్, బోస్ రోడ్, గాంధీ చౌక్.

[మార్చు] శాసనసభ నియోజకవర్గం

[మార్చు] చుట్టు ప్రక్కల

  • దగ్గరలోని చిలువూరు ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి ఇంటర్ నెట్ గ్రామము. ఇచట 'కాట్రగడ్డ ఫొండేషను' వారు ప్రజలకు విశేష సేవలందిస్తున్నారు.
  • ఆషానెట్ అనే స్వచ్ఛంద సంస్థ చింతలపూడి గ్రామంలో నిర్వహించిన సంక్షేమ కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది[3].
  • కంచెర్ల పాలెం ఒక చరిత్రాత్మకమైన గ్రామం. స్వాతంత్ర్య యోధులు, దానశీలులు ఇక్కడ జన్మించారు. వారి సహకారంతో మంచి గుడులు, సత్రాలు నిర్మించారు.

[మార్చు] విద్యా సంస్థలు

తెనాలి గుంటూరు జిల్లాలో ఒక విద్యా కేంద్రంగా ఉండేది. 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో ఈ జిల్లాలో ఉన్న ఉన్నత పాఠశాలలలో తెనాలి తాలూకా హైస్కూలు పేరు గాంచినది. తెనాలి నుండి రేపల్లె వరకు గల చాల గ్రామాల నుండి స్నాతక విద్య(graduate course)కై చాల మంది విద్యార్ధులు తెనాలి వచ్చేవారు. ఆయా ప్రదేశాలలో వివిధ కళాశాలల ఆవిర్భావముతో తెనాలి ప్రాముఖ్యత తగ్గింది. ముద్రాక్షర లేఖనం(టైపు రైటింగు) మరియు హ్రస్వ లేఖనం (షార్ట్ హేండు) ప్రాచుర్యంలో ఉన్న కాలంలో కొత్తపేటలో ఉన్న అనేక శిక్షణా శాలలు వివిధ గ్రామాలు, చిన్న పట్టణాలనుండి వచ్చే విద్యార్ధులతో నిండి ఉండేవి.

చిరకాలముగా ఈ పట్టణములో ఉన్న విద్యాలయాలు:

  • తాలూకా జూనియర్ కళాశాల
  • వి.యస్.ఆర్ ఎన్.వి.ఆర్ కళాశాల
  • జె.యం.జె మహిళా కళాశాల
  • మునిసిపల్ బాలుర మరియు బాలికల ఉన్నత పాఠశాలలు
  • కోగంటి శివయ్య ఉన్నత పాఠశాల
  • నెహౄ నికేతన్
  • వివేక విద్యా సంస్థ మొదలైనవి

.* N S S M HIGH SCHOOL

[మార్చు] గుడులు

తెనాలిలో పేరు పొందిన గుళ్ళు(మందిరాలు):

  • వైకుంఠ పురం (చిన్న తిరుపతి)

పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము. దశాబ్దాలుగా తెనాలివారి తమదైన తిరుపతి. సుమారు నలభై సంవత్సరాల క్రితం ఒక పుట్టపై శయనించి ఉన్న వేంకటేశ్వరునికి దేవాలయనిర్మాణం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ తమ మొదటి పంట(వరి)ని తెచ్చి, పాయసం (పరమాన్నం) వండి, దేవునికి నివేదన చేస్తారు. కేశఖండన తిరుపతి లాగానే సర్వసామాన్యం.

  • దొంగ రాముడి గుడి

ఒక్క రాత్రిలో దొంగతనంగా కట్టిన గుడి అట. అందుకే ఆ పేరు. మునిసిపల్ ఆఫీసు (గాడి బావి)వద్ద ఉన్నది. (ఆ గాడి బావి ఈనాడు కానరాదు.

అమ్మవారి పేరుతో ప్రసిధ్ధమైన శివాలయం. రాజ రాజేశ్వరి అమ్మవారు కూడా వేంచేసి వున్నారు. పట్టణ వైశ్య సముదాయముచే నడపబడే ఈ దేవస్థానములో దసరా ఉత్సవము కనుల పండుగగా, పట్టణ సంస్కృతిని ప్రతిబింబించేదిగా ఉంటుంది.

  • పాత శివాలయం
  • రామలింగేశ్వర ఆలయం
  • పాత ఆంజనేయ స్వామి గుడి (పంచముఖ ఆంజనేయ స్వామి గుడి).
  • చిట్టి ఆంజనేయ స్వామి గుడి.
  • శివాలయం (మోరిస్ పేట )
  • సాయి బాబా మందిరం
  • మార్వాడి గుడి (జైన దేవాలయం)
  • వేణుగోపాల స్వామి గుడి
  • గంగానమ్మ గుడి
  • అప్పలస్వామి మందిరం
  • PERANTALLAMMA GIDDI ( ITHANAGAR )

శ్రీరామ నవమి సందర్భముగా వసంత నవరాత్రోత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో సుమారు ఒక కి.మీ. పొడవైన పందిరి (చిట్టి ఆంజనేయ స్వామి గుడి నుండి దొంగ రాముడి గుడి వరకు) వేసి చాల ఘనంగా జరుపుతారు. భద్రాచలం తరువాత అంత ఘనంగా చేస్తారని ప్రతీతి. ఇది కాక తెనాలిలో సంవత్సరం పొడవునా పెక్కు ధార్మిక, సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.

  1. REDIRECT

[మార్చు] భట్టిప్రోలు

తెనాలి నుండి 28 కి.మీ. దూరంలో ఉన్న భట్టి ప్రోలు స్థూపం ప్రపంచ ప్రసిద్ధమైనది. చిన్న లంజ దిబ్బ, విక్రమార్క కోట దిబ్బలను త్రవ్వగా బౌద్ధ స్థూపం బయటపడింది. దీనిని షుమారు క్రీ.పూ. 2వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడే 'అలెక్జాండర్ రియా' (Alexander Rea) రాతి సమాధి పెట్టెల మూతలపైనున్న అశోకుని కాలం నాటి బ్రాహ్మీ లిపిలో ఉన్న ప్రత్యేక వ్రాతను కనుగొన్నాడు. దీనిని భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నీ ఈ లిపినుండి పరిణామము చెందాయి[4]

[మార్చు] ప్రసిద్ధులు

[మార్చు] విశేషాలు

  • ఆంధ్ర ప్రదేశ్‌ ప్రాంతంలో మొదటి ముద్రణా యంత్రాలయం "కాకుమాను ప్రెస్" తెనాలిలో స్థాపించబడింది. వారిచే 1930లో బ్రహ్మంగారి కాలజ్ఞానం అనే పుస్తకం ప్రచురించబడింది.
  • తెనాలి లింగాకర్షక బుట్టల తయారీకి కూడా ప్రఖ్యాతి చెందివది. రాష్ట్రవ్యాప్తం గా మరియు దేశవ్యాప్తంగా ఈ ఊరి నుండి లింగాకర్షక బుట్టలు సరఫరా జరుగుతుంది.

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] మూలాలు

  1. Falling Rain Genomics, Inc - Tenali
  2. censusCensus of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional). Census Commission of India. 2004-06-16న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2008-11-01.
  3. http://www.ashanet.org/projects/project-view.php?p=675
  4. Inscribed lid of stone reliquary. Government Museum Chennai. తీసుకొన్న తేదీ: 2006-08-08.

గుంటూరు జిల్లా పట్టణాలు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు