తెలగపిండి కూర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలగపిండి పోపు కూర
తెలగపిండి కూర

తొక్క (పొట్టు) తీసిన నువ్వులను నువ్వు పప్పును అంటారు. నువ్వు పప్పు నుండి నూనె తీసిన తరువాత వచ్చే వ్యర్థాన్ని తెలక పిండి అంటారు. ఈ తెలకపిండితో వడియాలు లేదా కూర చేస్తారు. నువ్వులను కూడా గానుగలో వేసి ఆడుతారు. అప్పు డు వచ్చే నూనెను మున్నువ్వుల నూనె అంటారు. ఈ నూనె ఆడగా వచ్చిన పిండిని కూడా తెలకపిండి అనే అంటారు. కాని, ఇలావచ్చిన తెలకపిండికి, నువ్వుపప్పు ఆడగా వచ్చిన తెలకపిండికి రుచిలో చాలా తేడా ఉంటుంది. నువ్వులు ఆడగా వచ్చిన తెలకపిండిని నువ్వుల తెలకపిండి అని కూడా అంటారు. దీనిని పశువులకు ఆహారంగా పెడతారు. ముఖ్యంగా, ఈనిన ఆవులకు, గేదెలకు తెలకపిండిని (ఒక అచ్చును) పాలు పితికిన వెంటనే పెడతారు. ఇందువలన పశువుకు పాలు బాగాపడతాయిట. నువ్వు పప్పుతో ఆడినప్పుడు వచ్చే పిండి అచ్చులను నువ్వుపప్పు తెలక పిండి అంటారు. ఈ తెలక పిండితో కూర వండుకుంటారు.

కావలసిన పదార్ధాలు[మార్చు]

  • నువ్వు పప్పు తెలకపిండి 100 గ్రాములు,
  • నూనె - 50గ్రాములు,
  • పచ్చి మిర్చి - 6,
  • ఎండు మిర్చి - 4,
  • తొక్కతీసిన వెల్లుల్లి రెబ్బలు - 8,
  • ఆవాలు - 1 చెమ్చా,
  • జీలకర్ర -1 చెమ్చా,
  • మినపపప్పు - 2 చెమ్చాలు,
  • సెనగపప్పు - 2 చెమ్చాలు,
  • కరివేపాకు - 4 రెమ్మలు,

తయారు చేయువిధం[మార్చు]

  • తెలకపిండిలో నీళ్లు కలిపి ముద్దలాగా చేసుకోవాలి.
  • పొయ్యి మీద కూర మూకుడు పెట్టి నూనె వేసి, కాగిన తరువాత పోపు దినుసులు వేయించాలి.
  • తరువాత తడిపి ఉంచుకున్న తెలకపిండిని వేసి పొడిపొడిగా అయే వరకూ పొయ్యి మీద ఉంచాలి.
  • తక్కువ మంట మీద అపుడపుడు కలుపుతూ ఉండాలి.
  • ఉప్పువేసి పొయ్యి మీద నుండి దించుకోవాలి.

ఇవి కూడా చూడండి[మార్చు]