తెలుగు కథా రచయుతలు

వికీపీడియా నుండి
(తెలుగు కథా రచయితలు నుండి దారిమార్పు చెందింది)

తెలుగు కథ, తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం. ఆంధ్ర దేశంలొ చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం బాగా అలవాటు. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. తెలుగులోను మరియు ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి సుమారు నూరేళ్ళయింది. ఈ నూరేళ్ళలో సుమారు లక్షకు పైగా కథలు రచించబడినట్లుగా ఒక అంచనా. ఇవి ఎక్కువగా దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. కొన్ని కథా సంకలనాలు ప్రత్యేకంగా ముద్రించబడుతున్నాయి. ఈ కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువుగా నడుస్తాయి. ఇతర సాహిత్య ప్రక్రియలన్నింటికన్నా కథకి ఆదరణ ఎక్కువ.

కథ పర్యాయపదాలు చరిత్ర, గాధ, వృత్తాంతం. కథ ప్రకృతి అయితే కత వికృతి. కథలు చెప్పేవాడిని 'కథకుడు' అంటారు. కథలో ప్రధాన పురుషుడు 'కథానాయకుడు' మరియు ప్రధాన స్త్రీ 'కథానాయకురాలు'. కీర్తిశేషుడైన లేదా మరణించిన పురుషుడు 'కథాశేషుడు' మరియు మరణించిన స్త్రీ 'కథాశేషురాలు'.

కథ అనే ప్రక్రియ తెలుగులో తొలిసారిగా గురజాడ అప్పారావు రచించిన 'దిద్దుబాటు' కథను పేర్కొంటారు. బండారు అచ్చమాంబ, ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ వంటి వారు గురజాడకు ముందే తెలుగు కథకు శ్రీకారం చుట్టారు. అయినా కూడా అన్ని మంచి లక్షణాలు గల మొదటి కథగా దిద్దుబాటును గౌరవిస్తున్నారు.

విషయ సూచిక

రచయితలు [మార్చు]

  1. అవసరాల రామకృష్ణారావు
  2. కేతు విశ్వనాధ రెడ్డి
  3. కాళోజీ నారాయణరావు
  4. కాళీపట్నం రామారావు
  5. కవన శర్మ
  6. గురజాడ అప్పారావు
  7. చాగంటి సోమయాజులు
  8. పెద్దిబొట్ల సుబ్బరామయ్య
  9. పురాణం సుబ్రహ్మణ్యశర్మ
  10. పులికంటి కృష్ణారెడ్డి
  11. బలివాడ కాంతారావు
  12. మొక్కపాటి నరసింహశాస్త్రి
  13. మిరియాల రామకృష్ణ
  14. మల్లాది రామకృష్ణశాస్త్రి
  15. ముళ్ళపూడి వెంకటరమణ
  16. వేలూరి శివరామశాస్త్రి
  17. సత్యం శంకరమంచి
  18. వివినమూర్తి
  19. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

రచయిత్రులు [మార్చు]

  1. భండారు అచ్చమాంబ
  2. భానుమతీ రామకృష్ణ
  3. అట్లూరి హజర
  4. అబ్బూరి ఛాయాదేవి
  5. కనుపర్తి వరలక్ష్మమ్మ
  6. కాంచనపల్లి కనకమ్మ
  7. చావలి బంగారమ్మ
  8. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ
  9. తెన్నేటి హేమలత
  10. దుర్గాబాయి దేశ్‌ముఖ్
  11. పి.యశోదారెడ్డి
  12. పోపూరి లలిత కుమారి
  13. బీనాదేవి
  14. మల్లాది సుబ్బమ్మ
  15. మాలతీ చందూర్
  16. రంగనాయకమ్మ
  17. రామినేని రామానుజమ్మ
  18. వాణీ రంగారావు
  19. వాసిరెడ్డి సీతాదేవి
  20. వి. ఎస్. రమాదేవి
  21. సరోజినీ నాయుడు
  22. స్థానాపతి రుక్మిణమ్మ



ఇవి కూడా చూడండి [మార్చు]

మూలాలు [మార్చు]