తెలుగు భాషా పరిరక్షణ

వికీపీడియా నుండి

భాషాఏర్పడటానికి చాలా కాలం పట్టినట్లుగానే, భాష అంతరించటానికి చాలా కాలం పడుతుంది. [1]. తెలుగు సాహిత్యంలో, మాధ్యమాలలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. మాటల పొందిక కరువైపోతుంది. తేటతెనుగు మాటల అల్లిక కరువైపోతున్నది. స్వరమాధుర్యం కరువైపోతున్నది. తెలుగు భాషలో మట్లాడే వారే తక్కువైపోతున్నారు. ఆధునిక పోకడల పేరుతో మాతృభాష-స్వరూప స్వభావాలను, రూపురేఖలను మార్చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే వర్ణ,పద, వాక్య స్థాయిలో పరభాషా పదాలు ఎక్కువై , వ్యాకరణం మాత్రమే తెలుగులో వుండే స్థితి వచ్చింది.

తెలుగు భాష దుస్థితి కి కారణాలు
  • మాతృభాషాభిమానం జనసామాన్యానికి లేకపోవడం.ఇద్దరు తెలుగువారు కలసినా ఇంగ్లీషులో మాట్లాడటం.
  • పాఠ్యాంశాలలో తెలుగు లేకపోవడం, లేక స్థాయిని దిగజార్చడం. ప్రాథమిక విద్యా స్థాయి బోధకులలో భాషా పండితులు వుండటంలేదు.
  • పరభాషా పదాలను విచ్చలవిడిగా, తెలుగు పదాలున్నాకూడా పత్రికలలో వాడటం
  • కొత్త పద నిర్మాణం ఎక్కువగా జరగకపోవడం.
మెరుగుకు సూచనలు
  • జనవ్యవహారంలో సహజసిద్దంగా పుట్టే పదాలను వాడుకలోకి తేవాలి. విశాఖ వాసులు డ్రెడ్జర్ ని తవ్వోడ, సబ్ మెరైన్ ని దొంగోడ అంటారు.
  • పత్రికలు తెలుగు పదాలనే విధిగా వాడాలి, ఉదా: అసెంబ్లీ - శాసనసభ,కోర్టు -న్యాయస్థానం, ఆర్గానిక్ ఫార్మింగ్ - సేంద్రీయ వ్యవసాయం, వాటర్ షెడ్స్ - వాలుగట్లు, చెక్ డ్యాం -వరద కట్టు. ఆంగ్లపదాలకు సమానార్థకాలను వాడటానికి సూచనలు. ఉన్నమాటలను పరిమితార్థంలో వాడటం, ఉన్న మాటలకు కొత్త అర్థాలను కల్పించటం, భాషానువాదం మరియు యథానువాదం. అర్థబోధక శక్తి వున్నరూపాలు వ్యాకరణ విరుద్ధాలైనా వాడటమే మంచిది, ఉదా: ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ
  • కొత్త పదాలను సృష్టించి ప్రచారం చేయాలి. దీనికి కాశీనాథుని నాగేశ్వరరావు, ఇతర భారతీయ భాషా పరిరక్షణ వాదులు మనకు అదర్శం కావాలి. ఆయన సృష్టించిన పదాలు ఉదా: నైట్రోజన్-నత్రజని, నికెల్-నిఖిలము,ఆక్సిజన్ - ప్రాణ వాయువు, ఫొటోసింథసిన్ - కిరణ జన్య సంయోగక్రియ, ఎంతో ప్రాచుర్యం పొందాయి.
  • మాటల ద్వారా, పాటల ద్వారా, సమాచార మాధ్యమాల ద్వారా, తెలుగు భాష సొబగులను, సొగసుందనాలను కాపాడుకుందామా ! గోదారి, కృష్ణా, తుంగా, పెన్నాల, యెన్నెన్నో సెలయేళ్ళ గలగలలు వింటూ తరించిపోదామా. నాటకాలు, నాటికలు, ప్రహనసనాలు, చతుర సంభాషణలు, జనపదాలు, పల్లె గీతాలు, చిందు గీతాలు, మొ- ని, మనం నిధిగా తలచి కాపాడుకోవాలి.

[మార్చు] తెలుగు భాషా సంస్ధలు

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] వనరులు

  1. తెలుగు వెలుగులేవి, అద్దంకి శ్రీనివాస్, హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకులు. ఆంధ్రజ్యోతి,ఆగష్టు 29, 2010 మాతృ భాషా దినోత్సవ సందర్భంగా వ్యాసం
  2. e-తెలుగు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె