పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము
వికీపీడియా నుండి
|
తెలుగు విశ్వవిద్యాలయము |
|
|---|---|
| స్థాపన | 1985 |
| తరహా | Public |
| సంచాలకుడు | ఎన్.డి.తివారీ |
| ఉప సంచాలకుడు | డా.అనుమండ్ల భూమయ్య |
| ప్రదేశం | హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
| క్యాంపస్ | Urban |
| Affiliations | UGC |
| వెబ్‌సైటు | www.teluguuniversity.ac.in |
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము లేదా తెలుగు విశ్వవిద్యాలయము (ఆంగ్లం: Potti Sreeramulu Telugu University : PSTU) భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది 2 డిసెంబరు 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం (Act of Legislation No. 27 of 1985) ద్వారా హైదరాబాదులో స్థాపించబడినది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడినది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడినది. ఈ ధ్యాయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య మరియు లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం" గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (University Grants Commission) దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది.
[మార్చు] విభాగాలు
లలితకళా ప్రాంగణం, హైదరాబాదు
School of Social and other Sciences
- Department Communication & Journalism
- Department of Jyothisha & Vaastu
School of Comparative Studies
- Department of Comparative Studies
- Department of Translations
School of Literature
- Department of Telugu Literary Studies
School of Folk and Tribal Lore
- Department of Folk Studies
- Department of Tribal
నన్నయ ప్రాంగణం, రాజమండ్రి (School of Language Development)
- Department of Linguistics
- Department of Lexicography
పోతన ప్రాంగణం, వరంగల్ (School of Fine Arts)
- Department of Music
- Department of Dance
- Department of Folk Arts
- Department of Theatre Arts
- Department of Sculpture & Painting
- Department of Culture & Tourism
పాల్కురికి సోమనాథ ప్రాంగణం, శ్రీశైలం (School of History, Culture and Archeology)
- Department of History & Culture of Telugu Speaking People
- Department of Epigraphy & Written Records
- Department of Archaeology
శ్రీ సిద్ధేంద్రయోగి ప్రాంగణం, కూచిపూడి
[మార్చు] ప్రచురణలు
- హస్తాభినయం - డా. పి.యస్.ఆర్. అప్పారావు
- ఆంగిక వాచిక అభినయం - చాట్ల శ్రీరాములు
- బౌద్ధము - ఆంధ్రము - డా. బి.యస్.యల్. హనుమంతరావు
- తెలంగాణా ఆంధ్రోద్యమము - మాడపాటి హనుమంతరావు
- లలిత సంగీత చరిత్ర - పాలగుమ్మి విశ్వనాథం
- మిమిక్రీ - డా. నేరెళ్ళ వేణుమాధవ్
- ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర - బాలాంత్రపు రజనీకాంతరావు
- భాషాంతరంగం - ఆచార్య చేకూరి రామారావు
- ద్రావిడ భాషలు - పి.యస్. సుబ్రహ్మణ్యం
- వి.ఆర్. నార్ల జీవితం - రచనలు - డా. ఎన్. ఇన్నయ్య
- గిడుగు రామమూర్తి - డా. అక్కిరాజు రమాపతిరావు
- శివరాత్రి మహాత్మ్యము - డా. జె. మృత్యుంజయరావు
- తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు - డా. జె. మంగమ్మ
- శ్రీ మహాభాగవతము - బమ్మెర పోతనామాత్య
- వసుచరిత్ర - రామరాజ భూషణుడు
- ఆముక్తమాల్యద - శ్రీకృష్ణ దేవరాయలు
- పాండురంగ మహాత్మ్యము - తెనాలి రామకృష్ణ కవి
- మనుచరిత్ర - అల్లసాని పెద్దన
- విజయవిలాసం - చేమకూర వెంకటకవి
- అర్థ శతాబ్దపు ఆంధ్ర కవిత్వం - డా. శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి
- కందుకూరి వీరేశలింగం - అధిక్షేప రచనలు - డా. అక్కిరాజు రమాపతిరావు
- పాశ్చాత్య సాహిత్య చరిత్ర విమర్శ - సిద్ధాంతాలు - వడలి మందేశ్వరరావు
- తెలుగు శాసనాలు - డా. బూదరాజు రాధాకృష్ణ
- నీలగిరి యాత్ర - కోలా శేషాచలకవి
- మనోధర్మ సంగీతం - డా. శ్రీపాద పినాకపాణి
- ఆంధ్రుల జానపద విజ్ఞానం - డా. ఆర్వీయస్. సుందరం
- చాటు పద్య రత్నావళి - డా. శ్రీరంగాచార్య
- వావిలాల గోపాలకృష్ణయ్య - డా. అక్కిరాజు రమాపతిరావు
- సి.పి. బ్రౌణ్య ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు
- డా. బి.ఆర్. అంబేద్కర్ సమగ్ర సాహిత్యం - తెలుగు అనువాద సంపుటాలు