తేనె మనసులు (1965 సినిమా)
| తేనె మనసులు (1965) | |
| దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
|---|---|
| నిర్మాణం | సి. సుందరం |
| కథ | ముళ్ళపూడి వెంకటరమణ |
| చిత్రానువాదం | ఆదుర్తి సుబ్బారావు |
| తారాగణం | కృష్ణ (బసవరాజు), సంధ్యారాణి, సుకన్య (భానుమతి), పద్మనాభం, జి.ఎస్.ఆర్. మూర్తి (నరసరాజు), కోనేశ్వరరావు (శ్రీనివాసరావు), రామ్మోహన్, కె.వి.చలం, పుష్పకుమారి, రాధాకుమారి, చలపతిరావు, వాణీబాల |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నేపథ్య గానం | పి.బి. శ్రీనివాస్, ఘంటసాల, పి.సుశీల |
| సంభాషణలు | ఆచార్య ఆత్రేయ, కె. విశ్వనాధ్ |
| నిర్మాణ సంస్థ | బాబూ మూవీస్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
తేనెమనసులు బాబూ మూవీస్ వారు 1965లో అందరూ కొత్తవారితో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం.
సంక్షిప్త చిత్రకథ [మార్చు]
చిట్టిబాబు (రామ్మోయన్) కు సీత (సంధ్యారాణి) తో పెళ్ళిచూపులయ్యాయి. పెళ్ళి నిర్ణయమయింది. అతను అమెరికా వెళ్ళాలంటే డబ్బు కావాలి. కాబట్టి ఎక్కువ కట్నం అడుగుతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో సీత తండ్రి దొంగతనం చేసి డబ్బు సమకూరుస్తాడు.
చిట్టిబాబు వివాహానంతరం అమెరికా వెళ్ళొస్తాడు. చిట్టిబాబు స్నేహితుడు బసవరాజు (కృష్ణ) డ్రిల్లు మాస్టారుగా పనిచేస్తుంటాడు. అతను, భానుమతి (సుకన్య) పరస్పరం ప్రేమించుకుంటారు. విదేశాల నుంచి వచ్చిన చిట్టిబాబు వద్ద సెక్రటరీగా పనిచేస్తుంది భానుమతి. పల్లెటూరి టైపులో వుండే భార్యను కాదని, భనుమతిని ప్రేమిస్తాడు చిట్టిబాబు. అతనికి జ్ఞానోదయం కలగాలని అతన్ని ప్రేమిస్తున్నట్టు నటించి ఒకనాటి రాత్రివేళ తనలాగా సీతను అలంకరించి చిట్టిబాబు వద్దకు పంపిస్తుంది భానుమతి. ఈ నాటకం తెలియని బసవరాజు భానుమతిని అనుమానించి చిట్టిబాబుతో గొడవ పడతాడు. భానుమతితో బసవరాజు పెళ్ళి జరుగుతుంది.
పాటలు [మార్చు]
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఎవరో ఎవరో నీవాడు | |||
| దివినుండి భువికి దిగివచ్చే, దిగివచ్చే పారిజాతమే నీవై, నీవై | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల పి.సుశీల |
| దేవుడు నేనై పుట్టాలి | |||
| ఎమమ్మా నిన్నేనమ్మా | |||
| నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
| మాస్టారు డ్రిల్లు మాస్టారు ఒక ఉద్యోగం ఇస్తాము చేస్తారా | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | పి.సుశీల, పద్మనాభం |
| అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే అదేమిటో ఆడదంటె మగవాడికి అలుసులే | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
మూలాలు [మార్చు]
- మంచి ఫలితాన్నిచ్చిన "తేనెమనసులు", నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీలు 211-12.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.