తేలప్రోలు

వికీపీడియా నుండి
తేలప్రోలు మెయిన్ రోడ్


తేలప్రోలు, కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలానికి చెందిన గ్రామము. ఇది హనుమాన్ జంక్షన్, గన్నవరంల మధ్య జాతీయ రహదారి 5 మీద జంక్షన్ కు 7 కి.మీ దూరంలో వుంది. విజయవాడ నుండి ఏలూరు వెళ్లు మంచినీటి కాల్వ (ఏలూరు కాల్వ) ఈ గ్రామం గుండా వెళ్లుతోంది. అదే ఈ గ్రామానికి మంచినీటి ఆధారం. ఇదే గ్రామంలో సీతారామపురం అనే గ్రామం కలసివుంది. ప్రధాన రహదారికి ఒకవైపు సీతారామాపురం, రెండోవైపు తేలప్రోలుగా ఉంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 4 మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలు, శాఖా గ్రంధాలములు కలవు.

ఈ గ్రామానికి గ్రామ దేవతగా శ్రీశ్రీశ్రీ రంగమ్మ పేరంటాళ్ళు అమ్మవారు కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరము చైత్ర శుద్ద నవమి (శ్రీరామనవమి) నుండి పౌర్ణమి వరకు అమ్మవారి తిరుణాళ్లు రంగరంగవైభవంగా జరుగుతాయి. ఈ తిరునాళ్ళకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జనసందోహం తండోపతండాలుగా వస్తారు.

తేలప్రోలు గ్రామము గన్నవరము నియోజకవర్గములో ఒక పెద్ద పంచాయితి.


"http://te.wikipedia.org/w/index.php?title=తేలప్రోలు&oldid=858663" నుండి వెలికితీశారు