టి. కృష్ణ

వికీపీడియా నుండి
(తొట్టెంపూడి కృష్ణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
టి. కృష్ణ

తొట్టెంపూడి కృష్ణ
జన్మ నామంతొట్టెంపూడి కృష్ణ
జననం 1950 ఆగస్టు 1
మరణం 1987 అక్టోబరు 21(1987-10-21) (వయసు 37)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
భార్య/భర్త కోటేశ్వరమ్మ
పిల్లలు 3, గోపీచంద్, ప్రతిమలతో సహా

తొట్టెంపూడి కృష్ణ (1950 సెప్టెంబరు 1 - 1987 అక్టోబరు 21) తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఈయన చలన చిత్ర పరిశ్రమలో టి.కృష్ణ గా ప్రసిద్దుడు.

విశేషాలు[మార్చు]

ఈయన 1950లో ప్రకాశం జిల్లా కాకుటూరి వారి పాలెంలో జన్మించాడు. ఇతని తండ్రి మంచి పండితుడు. ఉభయభాషా ప్రవీణుడు. కృష్ణ తన మేనమామ మాజీ మంత్రి టి.హయగ్రీవాచారి ప్రోద్బలంతో నాటకాలలో ప్రవేశించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1948లో బి.ఎ. పూర్తి చేశాడు. కొంతకాలం గోలకొండ పత్రికలో సినిమా సమీక్షలు వ్రాయడం, హైదరాబాదులోని ఆలిండియా రేడియోలో గ్రామస్తుల కార్యక్రమాలలో "లింగడు" అనే తెలంగాణ యాసలో మాట్లాడే పాత్రను నిర్వహించడం వంటివి చేశాడు. సినిమాలలో పనిచేయాలనే బలమైన కోరికతో 1950లో మద్రాసు చేరుకున్నాడు. హెచ్.ఎం.రెడ్డి వద్ద దర్శకత్వశాఖలో అప్రెంటీస్‌గా చేరాడు. ఆదర్శం అనే సినిమాలో సావిత్రికి జంటగా ఒక హాస్యపాత్రలో నటించాడు. అదే చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఎం.వి.రాజన్ వద్ద ఎడిటింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. రాజ్ కపూర్ తీసిన ప్రేమలేఖలు సినిమాలో "ప్రాణ్"కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. అమర సందేశం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టరుగా, అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు. కృష్ణ ప్రేమ చిత్రంతో ఇతను పూర్తి స్థాయి ఎడిటర్‌గా మారి 30కి పైగా చిత్రాలకు ఎడిటర్‌గా ఉన్నాడు. ఇతడు దర్శకత్వం వహించిన తొలి సినిమా ఉపాయంలో అపాయం.[1] ఈయన ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు[2]. ఈ తరం పిక్చర్స్ సంస్థని స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఈయన మలయాళంలో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ తెలుగు నటుడు తొట్టెంపూడి గోపీచంద్ ఈయన కుమారుడే. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 1987 మే 8న టి. కృష్ణ మరణించాడు.

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సంపాదకుడు (1 February 1974). "ఎడిటర్, డైరెక్టర్ టి.కృష్ణ". విజయచిత్ర. 8 (8): 53–54.
  2. http://www.imdb.com/name/nm0471453/

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=టి._కృష్ణ&oldid=4032869" నుండి వెలికితీశారు