త్యాగరాజు కీర్తనలు

వికీపీడియా నుండి

త్యాగయ్య, త్యాగ బ్రహ్మ, త్యాగ రాజు గా ప్రసిద్ది కెక్కిన ఈయన ముత్తు స్వామి దీక్షితార్, శ్యామ శాస్త్రి లతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకడు. 16 వ శతాబ్దాంతమున విజయ నగర సామ్రాజ్య పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వాడే త్యాగయ్య కూడా. కర్నూలు జిల్లా కు చెందిన కాకర్ల గ్రామమునకు చెందినవాడని చెప్పుకున్నాడు త్యాగయ్య. 1767?? లో కాకర్ల రామబ్రహ్మం,సీతమ్మలకు తిరువారూర్ గ్రామంలో జన్మించాడు త్యాగయ్య. తరువాత కావేరీ నదీ తీరాన ఉన్న తిరువయ్యూరు కు మారాడు కాకర్ల రామబ్రహ్మం. ఇప్పటికీ తిరువయ్యూరులో త్యాగరాజ వంశస్తులు ఆయన ఇంటిని పరిరక్షిస్తూనే ఉన్నారు.

ఈయన పంచ రత్న కృతులు, సంగీతం మీద త్యాగయ్య పట్టు ను వెల్లడిచేస్తాయి. వీటితో పాటు ఈయన ఎన్నో ఉత్సవ సంప్రదాయ కీర్తనలు,దివ్య నామ సంకీర్తనలు కూర్చాడు.

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడయిన త్యాగరాజులవారి కీర్తనలు


విషయ సూచిక

[మార్చు] కీర్తనలు

మచ్చుకు ఈ కీర్తనను చూడండి:

బిళహరి రాగము - ఆది తాళము

దొరకునా ఇటువంటి సేవ ॥దొరకునా॥ దొరకునా తప మొనరించిన భూ సురవరులకైన సురలకైన ॥దొరకునా॥


తుంబుర నారదులు సుగుణకీర్త


నంబుల నాలాపము సేయగా

అంబరీష ముఖ్యులు నామము సే

యగ జాజులపై చల్లగా

బింబాధరులగు సురవారయళి

వేణులు నాట్యములాడగా

అంబుజభవ పాకారు లిరుగడల

నన్వయ బిరుదావళిని బొగడగా

అంబరవాస సతులు కరకంక

ణంబులు ఘల్లని విసరగ మణిహా

రంబులు ఘల్లని విసరగ మణిహా

రంబులు గదలగ సూచే ఫణి త

ల్పంబున నెలకొన్న హరిని గనుగొన ॥దొరకునా॥



మరకతమణిసన్నిభ దేహంబున

మెఱుగు గనకచేలము శోభిల్ల

చరణయుగ నభావళికాంతులు

జందురు పిల్లలను గేర

వరనూపురము వెలుగంగ గతయుగమున

వజ్రపు భూషణములు మెఱయ

ఉరమున ముక్తాహారములు మఱియు

ఉచితమైన మకరకుండలంబులు

చిఱునవ్వులుగల వదనంబున ముం

గురు లద్దంపుగపోలము ముద్దు

గురియు దివ్యఫాలంబున దిలకము

మెఱసే భువిలావణ్యనిధిని గన

తామసగుణరహిత మునులకు బొగడ

దరముగాకనే భమసి నిల్వగ

శ్రీమత్కనకపు దొట్లపైని చెలు

వందగ గొలువుండగ

కామితఫలదాయకియౌ సీత

కాంతునిగని యుప్పొంగగ

రామబ్రహ్మ తనయుడౌ త్యాగ

రాజు తా బాడుచు నూచగ

రాముని జగదుద్ధారుని సురరిపు

భీముని త్రిగుణాతీతుని బూర్ణ

కాముని చిన్మయరూపుని సద్గుణ

ధాముని కనులార మదిని కనుగొన ॥దొరకునా॥

[మార్చు] నగుమోము కనవా!

పల్లవి:నగుమోము గలవాని నామనోహరుని
జగమేలు శూరుని జానకీ వరుని

చరణం1:దేవాదిదేవుని దివ్యసుందరుని
శ్రీవాసుదేవుని సీతా రాఘవుని

చరణం2:నిర్మాలాకారుని నిఖిల లోచనుని
ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని

చరణం3:సుజ్ఞాన నిధిని సోమసూర్యలోచనుని
అజ్ఞాన తమమును అణచు భాస్కరుని

చరణం4:భోధతో పలుమారు పూజించి నేను
ఆరాధింతు శ్రీత్యాగరాజా సన్నుతుని

[మార్చు] కోదండ రామ

రామ కోదండ రామ
రామ కల్యాణ రామ
రామ పట్టాభి రామ
రామ పావన రామ

రామ సీతాపతి
రామ నేవేగతి
రామ నీకుమ్రొక్కితి
రామ నీచేజిక్కితి

రామ నేనందయినను
రామ నిను వేడగలేను
రామ ఎన్నడైనను
రామ బాయగలేను

రామ నీకొక్క మాట
రామ నాకొక్క మూట
రామ నీమాటే మాట
రామ నీపాటే పాట

రామ నామమే మేలు
రామ చింతనే చాలు
రామ నేవు నన్నేలు
రామ రాయడే చాలు

రామ నీకెవ్వరు జోడు
రామ క్రీకంట జూడు
రామ నేను నీవాడు
రామ నాతో మాటాడు

రామాభి రాజ రాజ
రామ ముగజీతరాజ
రామ భక్త సమాజ
రక్షిత త్యాగరాజ




[మార్చు] గంధము పూయరుగా...

గంధము పూయరుగా
పన్నీరు గంధము పూయరుగా
అందమైన యదునందుని పైని
కుందరదనవర వందగ పరిమళ "గంధము"

తిలకము దిద్దరుగా
కస్తూరి తిలకము దిద్దరుగా
కళకళమని ముఖకళగని సొక్కుచు
పలుకుల నమృతము నొలెకిడి స్వామికి "తిలకము"

చేలము గట్టరుగా
బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాల బాలులతో
నాల మేపిన విశాల నయనునికి "చేలము"

హారతులెత్తరుగా
ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యవ్వన
వారక యొసగెడి వారిజాక్షునికి "హారతులు"

పూజలు చేయరుగా
మనసారా పూజలు చేయరుగా
జాజులు మరివిర జాజుల దవనము
రాజిత త్యాగరాజ వినుతునికి "పూజలు"

"గంధము" "తిలకము" "చేలము" "హారతులు" పూజలు"

పేజీకి సంభందించిన లింకులు