త్రివిక్రమ్ శ్రీనివాస్

వికీపీడియా నుండి
త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ శ్రీనివాస్ (ఆంగ్లం: Trivikram Srinivas) తెలుగు సినీ మాటల రచయిత మరియు దర్శకుడుస్వయంవరం (1999)ద్వారా మాటల రచయితగా తెరంగేట్రం చేసాడు. ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో బంగారు పతకం సాధించాడు. ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ్ముడి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. తెలుగు సినీ నటుల్లో ఆయనకు సునీల్ ఆప్తమిత్రుడు. ఇంకా దర్శకుడు విజయ భాస్కర్ కూడా మంచి స్నేహితుడే.

విషయ సూచిక

[మార్చు] పురస్కారములు

[మార్చు] తెలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారములు

2005: ఉత్తమ దర్శకుడు అతడు

[మార్చు] నంది పురస్కారములు

నంది పురస్కారాన్ని అందుకుంటున్న శ్రీనివాస్

2000: ఉత్తమ మాటల రచయిత చిరునవ్వుతో

2001: ఉత్తమ మాటల రచయిత నువ్వు నాకు నచ్చావ్

2002: ఉత్తమ మాటల రచయిత నువ్వే నువ్వే

2004: ఉత్తమ మాటల రచయిత మల్లీశ్వరి (2004 సినిమా)

2005: ఉత్తమ మాటల రచయిత అతడు

[మార్చు] సంభాషణలు

పదునైన సంభాషణలకి త్రివిక్రం పెట్టింది పేరు. ఏ రసమైనా, సంభాషణ క్లుప్తంగా, ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుంది. అతని కలంలో నుండి వెండితెరపైకి జాలువారిన కొన్ని సంభాషణలు:

[మార్చు] అతడు

  • మహేశ్ : నిజం చెప్పకపోవడం అబద్దం, అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం
  • మహేశ్ :నాకు బ్రతకటం రాదు పూరీ, ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నాను.
  • మహేశ్ :నువ్వడిగావు కాబట్టి చెప్పలేదు, నేను నమ్మాను కాబట్టి చెప్పాను.
  • త్రిష: వీడు చూడటానికి కాంప్లాన్ బాయ్ లా ఉన్నాడు, కాని చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని ఎవరికీ తెలియదు. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతి మొహం కావాలంట...
  • గిరిబాబు: దేవుడా, కూతుర్నివ్వమంటే క్వశ్చన్ బ్యాంక్ ని ఇచ్చావా?
  • త్రిష: బయట ఉన్న చపాతీ మొహాలు కావాలి, ఇంట్లో ఉన్న పూరీ మాత్రం అక్కర లేదు
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం: వాడంటే తెలివిగల వాడు కాబట్టి పెళ్ళి కాక ముందే ఆడాళ్ళు అందంగా ఉండరని తెలుసుకొన్నాడు. మా పెళ్ళాళ్ళు అందంగా ఉన్నారా, మాకు కాలా పెళ్ళిళ్ళూ, మేం చేయట్లేదా కాపురాలు?

[మార్చు] నువ్వు నాకు నచ్చావ్

  • వెంకీ: దణ్ణం పెట్టుకొంటున్నారా?

ఎం. ఎస్. నారాయణ: నువ్వన్నం పెట్టుకో బాబు!

  • వెంకీ: ప్రార్థనా? తప్పదా!

ఎం. ఎస్: ఏ రాదా?

  • వెంకీ: మీరేం చేస్తుంటారు?

ఎం. ఎస్: ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాను. తొందరపడి ఏదో ఒకటి చేయటం నాకిష్టం ఉండదు.

  • ఎం. ఎస్. నారాయణ: ఏం చేస్తావ్.. ఏం చేస్తావ్ అని మాటిమాటికీ అడగొద్దు.. ఏదో ఒకటి చేసేయగలను.
  • హేమ: మీరా దిక్కుమాలిన ముక్కలను పక్కన పడేసి వస్తే నేను మీ కాళ్ళకి దణ్ణం పెట్టుకొంటాను

ఎం. ఎస్: పిచ్చిదానా! కాళ్లకి దణ్ణం పెట్టుకోవటానికి చేతిలో ముక్కలని ఎందుకే పడేయటం, ఇవిగో కాళ్ళు, విచ్ఛలవిడిగా పెట్టుకో దణ్ణాలు.

సునీల్ : ఆవిడే పోయి 20 సంవత్సరాలు అయ్యింది.

  • బాధలో ఉన్న వాడిని బావున్నావా అని అడగటం అవివేకం... బాగున్నవాడిని ఎలా ఉన్నావ్ అని అడగటం అనవసరం..

[మార్చు] మల్లీశ్వరి

  • వెంకీ: మల్లీశ్వరిని మీరు పని మనిషంటున్నారు, నేను పని తెలిసిన మనిషి అంటాను.
  • కత్రినా: నీకు అసలు బుద్ది లేదా?

వెంకీ:ఉంది.కాని ఎక్కువగా వాడను.

  • వెంకీ: పద్దూ.......... వద్దు
  • ఆ అమ్మాయి అడగాలే గాని సినిమా కేంటయ్యా స్మశానానికైనా వెళ్తాను...

[మార్చు] జల్సా

  • బెదిరింపుకి భాష అక్కర లేదు యాస ఛాలు
  • సిగ్గు లేక కాదు సార్, ఇన్ ఫర్మేషన్ లేక, ఇన్ ఫర్మేషన్ ఉంటే ఇవన్నీఎందుకు చేస్తాం?
  • ఏదో కంట్రోల్ లో పెడదామని రెండు మూడు దెబ్బలేస్తే ఏడుపులు, పెడబొబ్బలు, డొమెస్టిక్ వయొలెన్స్, TV9
  • వీడి పర్సు కొట్టేసినా వీడు బిల్లెలా కడతాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి, నిరంతర వార్తాస్రవంతి, TV9
  • పంటకి పురుగు పట్టకుండా మందు చల్లాడు, పని చేయలేదు, తను తాగాడు, పని చేసింది.
  • నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఒక గన్ను కొనుక్కున్నాను.
  • నాకెప్పుడూ తొందర, పది నిముషాల ముందర, అందుకే నా జీవితమంతా చిందరవందర
  • యుద్ధంలొ గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు