దక్షిణ మధ్య రైల్వే

వికీపీడియా నుండి
దక్షిణ మధ్య రైల్వే జోన్ (6వ నెంబరు)
దక్షిణ మధ్య రైల్వేలో పురాతనమైన రైల్వేస్టేషన్లలో ఒకటైన కాచిగూడ రైల్వేస్టేషన్
దక్షిణ మధ్య రైల్వే జోన్లో పెద్ద జంక్షన్ విజయవాడ
దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఈశాన్యాన చివరిది అనకాపల్లి రైల్వేస్టేషన్
కరీంనగర్ రైల్వేస్టేషన్
ఏలూరు రైల్వేస్టేషన్
తుని రైల్వేస్టేషన్ నుండి తూర్పు కనుమలపై సూర్యాస్తమయం

భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) 1966, అక్టోబర్ 2న ఏర్పడింది. ఈ రైల్వే జోన్ సికింద్రాబాదు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని పరిధిలో ప్రస్తుతం 6 రైల్వే డివిజన్‌లు కలవు. ఆంధ్ర ప్రదేశ్ లోని హైదరాబాదు, సికింద్రాబాదు, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు లతో పాటు మహారాష్ట్రకు చెందిన నాందేడ్ డివిజన్‌లు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించియున్న ఈ డివిజన్ కొంతమేరకు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా వ్యాపించియున్నది. మొత్తం 5752 కిలోమీటర్ల నిడివి కలిగిన రైలు మార్గం ఈ జోన్‌లో విస్తరించిఉన్నది. దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించే జోన్‌లలో ఇది ఒకటి.[1]

విషయ సూచిక

చరిత్ర [మార్చు]

1966, అక్టోబర్‌లో భారతీయ రైల్వేలో 9వ జోన్‌గా దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటుచేశారు.[2] దక్షిణ రైల్వే జోన్ నుండి విజయవాడ మరియు హుబ్లి డివిజన్లను, సెంట్రల్ రైల్వే లోని సికింద్రాబాదు మరియు షోలాపూర్ డివిజన్లు వేరు చేసి ఈ జోన్‌ను ఏర్పాటుచేశారు. 1977 అక్టోబర్ లో దక్షిణ రైల్వేకు చెందిన గుంతకల్లు డివిజన్‌ను దీనిలో విలీనం చేయబడింది. అదే సమయంలో షోలాపూర్ డివిజన్‌ను సెంట్రల్ రైల్వేకు బదిలీ చేశారు. 1978లో సికింద్రాబాదు డివిజన్‌ను రెండుగా విభజించి హైదరాబాదు డివిజన్‌ను నూతనంగా ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి సికింద్రాబాదు డివిజన్ నియంత్రణ కార్యకలాపాలను నిర్వహించగా, హైదరాబాదు డివిజన్ పరిపాలన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2003, ఏప్రిల్ 1న కొత్తగా ఏర్పడిన గుంటూరు మరియు నాందేడ్ డివిజన్లు కూడా ఈ జోన్‌లో భాగమయ్యాయి. అదివరకు దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగిన హుబ్లి డివిజన్‌ను నూతనంగా ఏర్పాటైన నైరుతి రైల్వేలో విలీనం చేశారు. ప్రస్తుతం ఈ జోన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 5 డివిజన్లు (సికింద్రాబాదు, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్లు), మహారాష్ట్రకు చెందిన ఒక డివిజను (నాందేడ్) కలిపి మొత్తం ఆరు (6) డివిజన్లు ఉన్నాయి.

డివిజన్ల పరిధి [మార్చు]

(1) సికింద్రాబాదు డివిజను:

(2) హైదరాబాద్ డివిజను:

(3) నాందేడ్ డివిజను:

(4) విజయవాడ డివిజను:

(5) గుంతకల్లు డివిజను:

(6) గుంటూరు డివిజను:

ద.మ.రైల్వే గణాంకాలు [మార్చు]

  • రైలుమార్గం పొడవు: 5809.990 కిలోమీటర్లు (బ్రాడ్‌గేజి:5634.060, మీటర్‌గేజి:175.930)
  • రైల్వే ట్రాక్ పొడవు: 7806.251 కిలోమీటర్లు.
  • డివిజన్ల సంఖ్య: 6.
  • విస్తరించిన రాష్ట్రాల సంఖ్య: 5 (తమిళనాడు(7 కి.మీ)తో కలిపి)
  • రైలు వంతెనల పొడవు: 117.85 కిలోమీటర్లు.
  • విద్యుదీకరించిన మార్గం: 1620 కిలోమీటర్లు.
  • రైల్వే స్టేషన్లు సంఖ్య : 689
  • పనిచేయు మొత్తం సిబ్బంది : 84,145 [3]
  • రోజువారీ నడిచే ప్రయాణీకులు (ప్యాసింజర్) రైళ్లు సంఖ్య  : 699
    • మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ళు సంఖ్య  : 218
    • ప్యాసింజర్ రైళ్లు సంఖ్య  : 302
    • లోకల్ రైళ్లు సంఖ్య  : 58
    • ఎమ్‌ఎమ్‌టిఎస్ (MMTS)  : 121

రైలు మార్గం నిడివి [మార్చు]

రాష్ట్రాలా వారీగా:
రాష్ట్రం బ్రాడ్‌గేని మీటర్‌గేజి మొత్తం
ఆంధ్రప్రదేశ్ 4005 267 4272
మహారాష్ట్ర 803 312 1115
కర్ణాటక 268 - 268
తమిళనాడు - - 7
మొత్తం 5083 651 5734
డివిజన్ల వారీగా:
డివిజన్ బ్రాడ్‌గేని మీటర్‌గేజి మొత్తం
సికింద్రాబాదు 1131 - 1131
హైదరాబాదు 570 - 570
విజయవాడ 933 - 933
గుంతకల్ 1037 267 1304
గుంటూరు 617 - 617
నాందేడ్ 616 383 998
మొత్తం 5083 651 5734

మనది మీటర్‌గేజ్‌ లేని రాష్ట్రం [మార్చు]

దక్షిణ మధ్య రైల్వేలోని బొగద రైలు సొరంగం

దక్షిణమధ్య రైల్వే కిందకు వచ్చే రాష్ట్ర పరిధిలోని మీటర్‌ గేజ్‌ రైలు మార్గాన్ని పూర్తిగా బ్రాడ్‌గేజ్‌గా మార్చేశారు.ఇక రాష్ట్రంలో పూర్తిగా బ్రాడ్‌గేజ్‌పైనే అన్ని రైళ్లూ పయనిస్తాయి.ఒక రాష్ట్రంలో అన్ని మార్గాలు బ్రాడ్‌గేజ్‌గా మారడం దేశంలో రికార్డు.

మైలురాళ్ళు [మార్చు]

  • దక్షిణ మధ్య రైల్వే ప్రారంభం తరువాత, 342,805 RKMs మార్గం (రూట్) కిలోమీటర్లు కొత్తగా వేశారు.మీటర్‌గేజ్ నుండి బ్రాడ్‌గేజ్‌నకు 2676,19 RKMs మార్గం (రూట్) కిలోమీటర్లు గేజ్ మార్పిడి పనులు, 1272,453 RKms మార్గం (రూట్) కిలోమీటర్లు ట్రాక్ రెట్టింపు అనగా రెండు లైన్లు పనులు చేపట్టారు, జరిగినవి.
  • పలు ప్రధాన నది వంతెనలు మార్చబడి, ఇంజనీరింగ్ అద్భుతాలను అనదగ్గ రాజమండ్రి వద్ద II గోదావరి వంతెన మరియు III గోదావరి వంతెనలతో సహా నిర్మించడము జరిగినది.

ప్రైవేట్‌ రైల్వే లైన్లు [మార్చు]

రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులను భరించడానికి ముందుకొచ్చే లైన్ల నిర్మాణానికి మాత్రమే రైల్వేశాఖ అనుమతి ఇస్తోంది.ఇకపై సర్వేలు పూర్తయి, లాభదాయకత ధ్రువపడికొత్తగా ప్రతిపాదించిన లైన్లు మాత్రమే ప్రవేటుకు అప్పగిస్తారు.విధానాలు:

  • లైన్‌ కనీసం 20 కిలోమీటర్ల పొడవు ఉండాలి.
  • రైళ్లు నడిపే అధికారం రైల్వేదే.
  • లైన్ల నిర్మాణం కోసం సేకరించిన భూములు, లైన్లన్నీ రైల్వే ఆస్తులుగానే పరిగణిస్తారు.
  • భూసేకరణ రైల్వేయే చేపడుతుంది. డబ్బులు మాత్రం ప్రైవేటు సంస్థలు చెల్లించాలి.
  • ప్రైవేటు సంస్థ సదరు లైనును 30 ఏళ్ల పాటు నిర్వహించుకొని ఆదాయం పొందాలి.

ప్రధాన సంఘటనలు [మార్చు]

  • 1966: సికింద్రాబాదులో రైల్ నిలయం భవనం శంకుస్థాపన.
  • 1974: గోదావరి నదిపై రెండో రైలు-రోడ్డు వంతెన ప్రారంభం.
  • 1974: గుంటుపల్లిలో వ్యాగన్ వర్క్‌షాప్ శంకుస్థాపన.
  • 1975: ద.మ.రైల్వేలో తొలిసారిగా విజయవాడలో ఇంటర్ లాకింగ్ సౌకర్యం ప్రారంభం.
  • 1976: హైదరాబాదు-కొత్త ఢిల్లీల మద్య సూపర్ ఫాస్ట్ రైలు ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ ఆరంభమైంది.
  • 1980: విజయవాడలో ఎలక్ట్రిక్ లోకోషెడ్ ప్రారంభం.
  • 1983: గూటి-ధర్మవరం మధ్య అదనపు బ్రాడ్‌గేజి మార్గం ప్రారంభం.
  • 1985: తిరుపతిలో క్యారేజి రిపేర్ షాప్ ప్రారంభమైంది.
  • 1987: బీబీనగర్-నడికుడి మధ్య రైళ్ళ రాకపోకల ప్రారంభం.
  • 1988: ద.మ.రైల్వేలో రైల్‌నెట్ ప్రారంభించబడింది.
  • 1989: ద.మ.రైల్వేలో తొలిసారిగా సికింద్రాబాదులో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది.
  • 1995: లాలగూడలో ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు శంకుస్థాపన.
  • 1997: రాజమండ్రి వద్ద మూడవ గోదావరి వంతెన ప్రారంభం.
  • 2002: సికింద్రాబాదు-కొత్త ఢిల్లీల మధ్య రాజధాని సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభించబడింది.
  • 2004: సికింద్రాబాదు-ఫలక్‌నామా మధ్య MMTS రైలు ప్రారంభించబడింది.
  • 2008: సికింద్రాబాదు-విశాఖపట్నం మధ్య గరీబ్ రథ్ ప్రారంభం.

ప్రధాన రైల్వే స్టేషన్లు [మార్చు]

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ లోని ప్రధాన రైల్వేస్టేషన్లు

ప్రధాన రైలుబండ్లు [మార్చు]

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ గుండా ప్రయాణించే ముఖ్యమైన రైలుబండ్లు
  • దేవగిరి ఎక్స్‌ప్రెస్ (ముంబాయి - సికింద్రాబాదు)
  • కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (ముంబాయి - భువనేశ్వర్)
  • తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (చెన్నై - కొత్త ఢిల్లీ)
  • ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (హౌరా - సికింద్రాబాదు)
  • పినాకినీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (విజయవాడ-చెన్నై)
  • రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం - విజయవాడ)
  • శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (విజయవాడ - సికింద్రాబాదు)
  • ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (హైదరాబాదు - కొత్త ఢిల్లీ)
  • పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (గుంటూరు - వికారాబాదు)
  • చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (చెన్నై - హైదరాబాదు)
  • కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (హౌరా - చెన్నై)
  • నవజీవన్ ఎక్స్‌ప్రెస్ (అహ్మదాబాదు - చెన్నై)
  • హుస్సేన్‌సాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ముంబాయి - హైదరాబాదు)
  • జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం - సికింద్రాబాదు)
  • గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం - హైదరాబాదు)
  • విశాఖ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్ - భువనేశ్వర్)
  • మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్ - మచిలీపట్నం)
  • గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (కాకినాడ-సికింద్రాబాదు)
  • గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (గుంటూరు-సిహైదరాబాదుద్రాబాదు)
  • భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాదు-బలార్షా)
  • సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (గుంటూరు-విశాఖపట్నం)
  • సర్కార్ ఎక్స్‌ప్రెస్ (చెన్నై-కాకినాడ)
  • కృష్ణా ఎక్స్‌ప్రెస్ (తిరుపతి- ఆదిలాబాదు)
  • నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (తిరుపతి-సికింద్రాబాదు)
  • రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (హైదరాబాదు-తిరుపతి)
  • వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాదు-తిరుపతి)
  • అజంతా ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాదు-ముద్‌ఖేడ్)
  • తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాదు-కర్నూలు)
  • శబరి ఎక్స్‌ప్రెస్ (హైదరాబాదు-కొచ్చివెల్లి)
  • ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (భువనేశ్వర్-బెంగుళూరు)
  • తిరుమల ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం-తిరుపతి)
  • శేషాద్రి ఎక్స్ ప్రెస్ (కాకినాడ - బెంగుళూరు )
  • నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ (హైదరాబాదు-నరసాపురం)
  • మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాదు- మణుగూరు)

బయటి లింకులు [మార్చు]

మూలాలు [మార్చు]