దమయంతీ స్వయంవరము (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దమయంతీ స్వయంవరము
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: విశ్వనాథ పావనిశాస్త్రి
విడుదల: 1962
ఆంగ్ల ప్రచురణ: 2006, 2013

దమయంతీ స్వయంవరము నవలను జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాశారు.

రచనా నేపథ్యం[మార్చు]

దమయంతీ స్వయంవరము నవల 1959-61 ప్రాంతంలో రచించబడినదని గ్రంథకర్త కుమారులు, విశ్వనాథ సాహిత్యానికి సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి నిర్థారించారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చెపుతూ ఉండగా జువ్వాడి గౌతమరావు లిపిబద్ధం చేశారు. ఈ నవల ప్రథమ ముద్రణ 1962లో జరిగింది. ద్వితీయ ముద్రణ 2006లో, తృతీయ ముద్రణ 2013లో జరిగింది.[1]

ఇతివృత్తం[మార్చు]

శైలి,శిల్పం[మార్చు]

అంకితం[మార్చు]

దమయంతీ స్వయంవరం నవలను విశ్వనాథ సత్యనారాయణ తన మిత్రుడు డా.పిశిపాటి వేంకటరమణయ్యకు అంకితమిచ్చారు. విశ్వనాథ అంకితం ఇచ్చిన పద్యాలు ఇవి:

ఉ. ఆది నిజాముపాలనమునందునదిక్కనిలేక హైదరా
బాదున జేరు నాంధ్రకవిపాళికి సత్యము పెంపుతోడి మ
ర్యాదకు దిండిత్రిప్పలకు నాదరువౌ పిశిపాటికైరవా
హ్లాదికి వైద్యమూర్తి రమణయ్యకు నంకిత మిట్టు నీకృతిన్

క. ఏ స్నేహితు డరుదెంచిన
నా స్నేహితునాకును నిష్టమైనవి కూర్చున్
ప్రస్నిగ్ధహృదయుడౌచు న
హా స్నానాదికము భోజనాదుల నెల్లన్.

ఉ. వీనుగ గృష్ణరాయప్రభు పేరున బెట్టినయట్టి ఆంధ్రభా
షా నిలయంబు నాంధ్రజనసాహితి వ్యక్తిత్వ నిల్వబెట్టె నా
నా నిలువంగ బెట్టబడు టన్నది యీ రమణయ్యవంటి ప్ర
జ్ఞానిధులైనవారు వెనుకన్ నిలుచుండుట హేతువై చనెన్

ఆ. సుకవి, హాస్యశీలి శుద్ధాంతరంగుండు
నవమనోజ్ఞభోజన ప్రియుండు,
చిత్తమెలయు చిన్ని చిన్ని నవ్వులవాడు.
మెచ్చి గుండెగోసి యిచ్చువాడు.

వ. అతని వంశాభివృద్ధికరమ్ముగా, నతనికి నుత్తమలోక ప్రాప్తిహేతువుగా. [2]

ప్రాచుర్యం[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. దమయంతీ స్వయంవరం 2013 ప్రచురణకు విశ్వనాథ పావనిశాస్త్రి ముందుమాట
  2. దమయంతీ స్వయంవరం 2013 ప్రచురణ