దలైలామా

వికీపీడియా నుండి
దలైలామా
Holiness
1st Dalai Lama.jpg
మొదటి దలైలామా
పరిపాలన 1391-
Tibetan ཏཱ་ལའི་བླ་མ་
Wylie transliteration taa la’i bla ma
Pronunciation మూస:IPA-all
THDL Dalai Lama
Pinyin Chinese Dálài Lǎmā
రాజకుటుంబము Dalai Lama

దలైలామా (ఆంగ్లం Dalai Lama) పేరు చెబితే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బౌద్దుల హృదయాలు పూజ్య భావంతో బరువెక్కుతాయి. దలైలామా బుద్ధుల మత గురువే కాదు ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి అధినేత కూడా. అహింసాయుతంగా టిబెట్ స్వతంత్ర్యం కోసం ఎభై ఏళ్ళుగా పోరాడుతున్నారు. 1933లో 13వ దలైలామా నిర్యాణం తరవాత ఈయన 1935 జూలై 6 తేదీన ఉత్తర టిబెట్ లోని థక్సర్ లో పుట్టారు. ఈయన అసలు పేరు లామోస్ తొండప్. నాలుగేళ్ళకే బౌద్ద సన్యాసిగా మారిన తొండప్ తరవాత 14 వ దలైలామా గా అవతరించారు. చైనా టిబెట్ ని ఆక్రమించి అక్కడ నుంచి దలైలామా ని వెళ్ళగొట్టడం తో 1959 నుంచీ ఈయన భారతదేశంలో శరణార్ధి గా ఉంటున్నారు. హిమాచల్ ప్రదెశ్ రాష్ట్రం లొని ధర్మశాలకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని ఎత్తైన కొండల మీద మెక్లోడ్ గంజ్ లో ఈయన ప్యాలెస్ ఉంది. ఆ ఆవరణ లో ఉండే ఆలయం లొ భక్తులకి దర్శనం ఇస్తుంటారు. దలైలామాలంతా బుద్దుని అంశ అయిన అవలోకేశ్వర్ పునర్జన్మలని బౌద్దుల నమ్మకం. దలైలామా మరణిస్తే మళ్ళీ ఇంకో చోట పుట్టి మళ్ళీ దలైలామాగా పగ్గాలు చేపడతారని బౌద్దుల విశ్వాసం. మహాత్మా గాంధీ మార్గంలొ టిబెట్ ఫ్రీడం కొసం పోరాడుతున్నదలైలామాకి నోబుల్ శాంతి బహుమతి కూడా లభించింది.

దలైలామాలు [మార్చు]

సంఖ్య అసలు పేరు సంవత్సరం జన్మస్థలం

1.                 జెడున్‌ ద్రుపా                          (1391 - 1474)                   షాబ్‌టాడ్‌ (ఉత్సాంగ్‌)
2.              జెడున్‌ గ్యాట్‌సో                               (1475 - 1542)                   తనాంగ్‌ సెగ్మీ (ఉత్సాంగ్‌)
3.              సోనం గ్యాట్‌సో                          (1543 - 1588)                   తొలుంగ్‌ (ఉత్సాంగ్‌)
4.              యాంటెన్‌ గ్యాట్‌సో                      (1589 - 1617)                   మంగోలియా 
5.              నగ్‌వాంగ్‌ లాబ్‌స్టాంగ్‌ గ్యాట్‌సో              (1617 - 1682)                    చింగ్‌వార్‌టాక్‌ట్సే(ఉత్సాంగ్‌)
6.              సంగ్‌యాంగ్‌ గ్యాట్‌సో                   (1682 - 1706)                   మాన్‌ తవంగ్‌ 
7.              కెల్‌సాంగ్‌ గ్యాట్‌సో                   (1708 - 1757)                   లిట్‌హాంగ్‌
8.              జాంపెల్‌ గ్యాట్‌సో                              (1758 - 1804)                   తోబ్‌గ్యాల్‌(ఉత్సాంగ్‌)
9.              లాంగ్‌టాక్‌ గ్యాట్‌సో                   (1805 - 1815)                   డాన్‌ చోకోహార్‌
10.             సుల్ట్రీమ్‌ గ్యాట్‌సో                           (1816 - 1837)                   లిట్‌హాంగ్‌
11.             కేద్రుప్‌ గ్యాట్‌సో                             (1838 - 1856)                   గతర్‌
12.             టిన్‌లే గ్యాట్‌సో                               (1856 - 1875)                   లోహ్‌కా 
13.             తుప్టేన్‌ గ్యాట్‌సో                             (1876 - 1933)                   తాక్‌పోలాండున్‌

మూలాలు [మార్చు]

- కోలా అరుణ్‌ కుమార్‌

"http://te.wikipedia.org/w/index.php?title=దలైలామా&oldid=812902" నుండి వెలికితీశారు