దాద్రా నగరు హవేలీ
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
దాద్రా మరియు నగరు హవేలీ (Dadra & Nagar Haveli) పశ్చిమ భారత దేశములోని ఒక కేంద్ర పాలిత ప్రాంతము. దీని మొత్తం వైశాల్యం 491 చ.కి.మీ.
నగర్-హవేలీ అనేది మహారాష్ట్ర మరియు గుజరాత్ సరిహద్దులో ఒదిగి ఉన్న ఒక చిన్న ప్రాంతము. నగరుహవేలీకి కొన్ని కిలోమీటర్లు ఉత్తరాన గుజరాత్ రాష్ట్రం భూభాగం మధ్యలో దాద్రా అనే ప్రాంతమున్నది.
ఈ కేంద్ర పాలిత ప్రాంతము రాజధాని సిల్వాస్సా.
1779 నుండి 1954లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు ఇది పోర్చుగీస్ కాలనీగా ఉన్నది. 1961లో ఇది కేంద్ర పాలిత ప్రాంతము అయినది. గుజరాతీ ఈ ప్రాంతము యొక్క ముఖ్య భాష.
పారిశ్రామిక ఉత్పత్తులు ఇక్కడ ఆర్ధిక వ్యవస్థకు ప్రధానమైన వనరులు. ఎక్సైజు సుంకము లేదు.
అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే లెఫ్టినెంట్ గవర్నరు ఇక్కడ ప్రధాన ప్రభుత్వోద్యోగి.
చరిత్ర [మార్చు]
ఇంగ్లీషువారితోను, మొగలు చక్రవర్తులతోను తమకున్న వైరం, తరచు జరగే తగవులు కారణంగా మరాఠా పేష్వాలు వ్యూహాత్మకంగా పోర్చుగీసువారితో స్నేహం చేయాలనుకున్నారు. 1779 డిసెంబరు 17న ఒక ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం ఈ ప్రాంతం (దాద్రా, నగరు హవేలి) లోని 72 గ్రామాల పరగణాల్లో 1200 రూపాయలు శిస్తు ఆదాయాన్ని వసూలు చేసుకునే అధికారం పోర్చుగీసువారికి అప్పజెప్పడమైనది. అంతకు ముందు 'సంతన' అనే యుద్ధనౌకను పోర్చుగీసువారినుండి మరాఠాలు వశం చేసుకొన్నారు. అందుకు పరిహారం కూడా ఈ శిస్తు వసూలు ఒప్పందానికి ఒక కారణం.
1954 ఆగస్టు 2 వరకు ఇది పోర్చుగీసు వారి పాలనలోనే ఉన్నది. ప్రజలే దీనిని విముక్తి చేసి, తరువాత భారతదేశంలో విలీనం చేశారు. 1961 ఆగస్టు 11 న దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1954 నుండి 1989 వరకు 'వరిష్ట పంచాయత్' అనే పాలనా సలహా మండలి పనిచేసింది. తరువాత దాద్రా జిల్లా పంచాయతి, నగరు హవేలీ జిల్లా పంచాయతి, మరో 11 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి.
|
|
|
|---|---|
| రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ · అరుణాచల్ ప్రదేశ్ · అసోం · బీహార్ · ఛత్తీస్గఢ్ · గోవా · గుజరాత్ · హర్యానా · హిమాచల్ ప్రదేశ్ · జమ్మూ కాశ్మీరు · జార్ఖండ్ · కర్ణాటక · కేరళ · మధ్య ప్రదేశ్ · మహారాష్ట్ర · మణిపూర్ · మేఘాలయ · మిజోరాం · నాగాలాండ్ · ఒరిస్సా · పంజాబ్ · రాజస్థాన్ · సిక్కిం · తమిళనాడు · త్రిపుర · ఉత్తరాంచల్ · ఉత్తర ప్రదేశ్ · పశ్చిమ బెంగాల్ |
| కేంద్రపాలిత ప్రాంతములు | అండమాన్ నికోబార్ దీవులు · చండీగఢ్ · దాద్రా నగరు హవేలీ · డామన్ డయ్యు · లక్షద్వీపములు · పుదుచ్చేరి |
