దానం

వికీపీడియా నుండి
(దానము నుండి దారిమార్పు చెందింది)
బీదవానికి దానం చేస్తున్న హిందూ మహిళ, రాజా రవివర్మ చిత్రం.

దానం (Donation) ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని దాత (Donor) అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, పశువులు, మొదలైన వస్తువులు దానం చేస్తారు. భూకంపం, వరదలు వంటి కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవతాదృష్ట్యా వారి జీవనానికి అవసరమైన వాటన్నింటినీ కొందరు వ్యక్తులు మరియు సంస్థలు బాధితులకు అందిస్తాయి. అలాగే వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన రక్తం మరియు వివిధ అవయవాలను కొందరు దానం ఇచ్చే అవసరం ఉన్నది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరం లో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), చర్మం (skin), గుండె (heart), మూత్రపిండం (kidney), రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్చందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.

విషయ సూచిక

దాతృత్వం [మార్చు]

ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు దాన గుణం ఎక్కువట.వరల్డ్ గివింగ్ ఇండెక్స్ సంస్థ 153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో శ్రీలంక ,ఐర్లాండ్, కెనడా, గయానా, సియర్రా లియానె వాసుల్లో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.[1]

రక్త దానం [మార్చు]

రక్త దానం (Blood donation) అనేది ప్రాణ దానంతో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు. చిరంజీవి లాంటి కొందరు బ్లడ్ బ్యాంకు లు నడుపుతున్నారు.

అవయవ దానం [మార్చు]

కళ్ళు,గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు కూడా దానమిస్తున్నారు. దీనిని అవయవ దానం (Organ donation) అంటారు:మోహన్ ఫౌండేషన్‌ , గూడూరి సీతామహాలక్ష్మి శరీరదానం కోసం పనిచేస్తున్నారు. "మోహన్ ఫౌండేషన్" వ్యాదిగ్రస్థులకు, వైద్యులకు, ప్రజలకు మధ్య అవయవ దానం, అవయవ మార్పిడిపై అవగాహన కలిగించే స్వచంద సేవా సంస్థ .అవయావాలు అమ్మడం కొనడం నేరం, మోహన్ ఫౌండేషన్ వాలంటీర్లు అవయ మార్పిడి ఆవశ్యకత గురించి, కిడ్నీ, కాలేయం, గుండెమార్పిడుల అవయవ దానం అవసరం గురించి ప్రజల్లో అవగాన పెంచేందుకు కృషి చేస్తున్నారు, రకరకాల ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల బందువులకు కౌన్సిలింగ్ ఇచ్చి అవయదానంపై అవగాహన పెంచి స్వచ్చందంగా అవయదానానికి సహకరించాలని కోరుతున్నారు, అవయదానంచేసిన వారి బంధువులు ఆ అవయవాల వల్ల జీవంపోసుకున్న వారిని చూసి తమవారు ఇంకా బ్రతికే ఉన్నారని సంతృప్తి చెందుతున్నారు.మోహన్ ఫౌండేషన్‌[[1]] హైదరాబాదు ఫోన్ నంబర్: 040 -66369369.

అన్న దానం [మార్చు]

ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు. బుడ్డా వెంగళరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 19వ శతాబ్దంలో సంభవించిన డొక్కల కరువు సమయంలో ఎన్నో వేలమంది ప్రాణాల్ని కాపాడిన మహాదాత.

కన్యాదానం [మార్చు]

కన్యాదానం :వివాహం లో పెళ్ళికూతురు తండ్రి కన్యగా తన కూతుర్ని ఇచ్చే దానం.వరకట్న ప్రభావం వల్ల ఇది కన్యతో పాటు ధన వస్తు కనక వాహన దానం గా కూడా పేరుగాంచింది.

పురాణాలలో దానం [మార్చు]

  • వైశాఖమాసము దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి.
  • బలి చక్రవర్తి మూడడుగులు విష్ణుముర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.
  • శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
  • కర్ణుడు తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
  • ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి ఇచ్చాడు

ఆస్తి దానం [మార్చు]

అమెరికాలోని సంపన్నులంతా తమ ఆస్తిలో సగభాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించేందుకు ప్రతినబూనాల్సిందిగా బఫెట్‌, బిల్ గేట్స్ పిలుపునిచ్చారు. అమెరికాలో దాదాపు 400 మంది బిలియనీర్లున్నారు. వీరంతా తమ సంపదలో అధిక భాగాన్ని దానధర్మాలకు మళ్లిస్తే- దాతృత్వ కార్యక్రమాల తీరుతెన్నులే మారిపోతాయని వ్యాఖ్యానించారు. 2006లో బఫెట్‌ తన 'బెర్క్‌షైర్‌ హాథవే' కంపెనీలోని షేర్లన్నింటినీ దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించారు. నా ఆస్తిలో 99 శాతానికి పైగా నా జీవితకాలంలోనో, నా తదనంతరమో దాతృత్వ కార్యక్రమాలకు వెళ్లిపోతుంది. ఈ డబ్బునంతా ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే ఖర్చుపెట్టాలనుకుంటున్నాను. ఇంత దానం చేసినా మా జీవన సరళి ఏ మాత్రం ప్రభావితం కాదు. నేనూ, నా పిల్లలూ హాయిగా జీవించేందుకు నా మొత్తం ఆస్తిలో 1% ఉంచుకుంటే చాలు. అంతకు మించి ఉంచుకోవటం వల్ల మా జీవితాల్లోగానీ, మా సుఖ సంతోషాల్లో గానీ పెద్దగా మార్పేమీ రాదు' అని ఆయన లేఖలో వ్యాఖ్యానించారు. ఈ దాతృత్వ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు బఫెట్‌, బిల్‌గేట్స్‌, మిలిండా గేట్స్‌ ముగ్గురూ కలిసి.. www.givingpledge.org పేరుతో ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించారు. ప్రపంచంలోని 793 మంది బిలియనీర్లలో కేవలం 14 మంది మాత్రమే ఈ మాత్రం దానాలు చేసినట్టు తేలింది. కొందరైతే ఆర్భాటంగా ప్రకటనలు చేసేసి.. ఆ తర్వాత నెరవేర్చలేదనీ తేలింది.

అపాత్రదానం [మార్చు]

ప్రధాన వ్యాసం అపాత్రదానం

మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం. దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానంను అపాత్రదానం అంటారు.

మూలాలు [మార్చు]

Wiktionary-logo-en.png
దానం గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
  1. సాక్షి16.9.2010
"http://te.wikipedia.org/w/index.php?title=దానం&oldid=834467" నుండి వెలికితీశారు