దాన వీర శూర కర్ణ

వికీపీడియా నుండి

(దానవీరశూరకర్ణ నుండి దారిమార్పు చెందింది)
దాన వీర శూర కర్ణ (1977)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
నిర్మాణం నందమూరి తారక రామారావు
కథ మహాభారతంలోని కధ, ఎన్.టి.ఆర్. కూర్పు
చిత్రానువాదం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
నందమూరి హరికృష్ణ,
ధూళిపాల,
నందమూరి బాలకృష్ణ,
కైకాల సత్యనారాయణ,
శారద,
ప్రభ,
ఎస్.వరలక్ష్మి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం పి.సుశీల,
ఎస్.జానకి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
జి.ఆనంద్,
ఎమ్.రమేష్,
వి.రామకృష్ణ,
ఎమ్.వెంకటరావు
నృత్యాలు వెంపటి చినసత్యం
గీతరచన సి.నారాయణ రెడ్డి,
దాశరధి కృష్ణమాచార్యులు,
తిరుపతి వెంకట కవులు పద్యాలు,
కొండవీటి వెంకటకవి పద్యాలు
సంభాషణలు కొండవీటి వెంకటకవి
ఛాయాగ్రహణం నందమూరి మోహనకృష్ణ
నిర్మాణ సంస్థ రామకృష్ణా సినీ స్టూడియోస్
విడుదల తేదీ జనవరి 14, 1977
నిడివి 4 గంటల 17 నిముషాలు
భాష తెలుగు
పెట్టుబడి షుమారు 10 లక్షలు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


దాన వీర శూర కర్ణ సినిమా (Telugu Film - Daana Veera Soora Karna, DVS Karna) చాలా విధాలుగా రికార్డులు సృష్టించిన తెలుగు సినిమా.

[మార్చు] విశేషాలు

ఇది నందమూరి తారక రామారావు, కొండవీటి వెంకట కవి కలసి సృష్టించిన సంచలన చిత్రం. కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది. 1994లో రెండవసారి విడుదల అయినప్పుడు మళ్ళీ కోటి రూపాయలు వసూలు చేసింది.


ఈ సినిమా పూర్తిగా ఎన్.టి.ఆర్. శ్రమ ఫలితం. అప్పటి సినిమా రంగంలో తిరుగులేని కధానాయకునిగా ఎంతో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్. ఈ సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించి, ఆపైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించాడు. మొత్తం 4 గంటల 17 నిముషాల నిడివి గల సినిమాలో దాదాపు నాలుగు గంటలపాటు ఎన్.టి.ఆర్. ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటాడు. (రాజ్ కపూర్ హిందీ సినిమా 'మేరా నామ్ జోకర్' మొదట 4 గంటల 24 నిముషాలు గాని తరువాత అందులో 40 నిముషాలు తగ్గించారు. కనుక దాన వీర శూర కర్ణ బహుశా భారతీయ చిత్రాలలో పొడవైనవాటిలో ఒకటి)


ఇంత భారీ చిత్రం కేవలం 43 పనిదినాల్లో షూటింగ్ ముగించుకొని విడుదలయ్యింది. అదే సమయంలో కమలాకర కామేశ్వరరావు దర్శకతవంలో హీరో కృష్ణ తీస్తున్న కురుక్షేత్రం సినిమాకు, ఈ సినిమాకు రంగంలో ఉత్కంఠమైన పోటీ నెలకొంది. త్వరపడి తీయడం వలన ఫొటోగ్రఫీలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి. అయినా ప్రేక్షకులు పట్టించుకొనలేదు.


ఒక సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న కొండవీటి వెంకటకవి నాస్తికుడు. కులమత వ్యవస్థకు వ్యతిరేకి. మొదట సినిమా సంభాషణలు వ్రాయడానికి నిరాకరించిన ఆయనను ఎన్.టి.ఆర్. ఎలాగో ఒప్పించాడు. సినిమా డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నాయి.

ఈ సినిమాలో అర్జునునిగా నందమూరి హరికృష్ణ, అభిమన్యునిగా నందమూరి బాలకృష్ణ నటించారు. తండ్రితో ఈ ఇద్దరు కొడుకులూ తాతమ్మకల చిత్రం లోనూ, రామ్ రహీమ్(బి.వి.సుబ్బారావు దర్శకత్వంలో) లోనూ,ఈ చిత్రంలోనూ మాత్రమే నటించారు. సమయానికి చిత్రం ముగించే పని వత్తిడిలో బాలకృష్ణ, హరికృష్ణ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వారితో కలిసి మయసభ సీనులు పెయింటింగ్‌లో పాల్గొన్నారు.


ఎన్టీఆర్‌ నటించిన 248వ చిత్రమిది.

[మార్చు] పాత్రధారులు

  • ఎన్.టి.ఆర్. - కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు
  • ధూళిపాల - శకుని
  • ప్రభాకర రెడ్డి - ధర్మరాజు
  • కైకాల సత్యనారాయణ - భీముడు
  • నందమూరి హరికృష్ణ - అర్జునుడు
  • నందమూరి బాలకృష్ణ - అభిమన్యుడు
  • ప్రభ - భానుమతి (దుర్యోధనుని భార్య)
  • శారద - ద్రౌపది
  • బి.సరోజాదేవి - ప్రభావతి (కర్ణుని భార్య)
  • ఎస్.వరలక్ష్మి - కుంతి
  • రాజశ్రీ - సత్యభామ
  • కాంచన - సుభద్ర
  • దీప - ఉత్తర
  • రాజనాల - ద్రోణాచార్యుడు
  • మల్లాది - ధృతరాష్ట్రుడు
  • మిక్కిలినేని - భీష్ముడు
  • జగ్గారావు - దుస్శాసనుడు
  • చలపతిరావు - ఇంద్రుడు, జరాసంధుడు, అతిరధుడు
  • గుమ్మడి - పరశురాముడు
  • ముక్కామల - శల్యుడు
  • జయభాస్కర్ - సూర్యుడు, ఏకలవ్యుడు
  • హలం, జయమాలిని - నర్తకులు
  • ఇంకా ఇతర పాత్రధారులు: విజయకృష్ణ, గోపాలకృష్ణ, వి.వెంకటేశ్వరరావు, రాజకుమార్, శంకర్ ప్రసాద్, భాస్కర శాస్త్రి, సుజాత, బెజవాడ చంద్రకళ తదితరులు


[మార్చు] పాటలు, పద్యాలు

ఈ సినిమాలో రికార్డు స్థాయిలో మొత్తం 10 పాటలు, 35 పద్యాలు ఉన్నాయి. ఎక్కువ పద్యాలను తిరుపతి వేంకట కవులు రచించిన సుప్రసిద్ధ పౌరాణిక నాటకం పాండవోద్యోగ విజయాలు నుండీ, మరి కొన్ని కవిత్రయం మహాభారతంనుండీ తీసుకొన్నారు.

పాట పాడినవారు రచన
ఏ తల్లి నిను కన్నదో నేను నీ తల్లినైనానురా పి.సుశీల సి.నారాయణ రెడ్డి
జయీభవ! దిగ్విజయయీభవ! ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్ సి.నారాయణ రెడ్డి.
జాబిలి కంటే చల్లనిది పి.సుశీల, ఎస్.జానకి దాశరధి కృష్ణమాచార్యులు
చిత్రం! భళారే, విచిత్రం! ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల సి.నారాయణ రెడ్డి.
తెలిసెనులే, ప్రియరసికా! ఎస్.జానకి, పి.సుశీల సి.నారాయణ రెడ్డి.
ఓ కురుసర్వభౌమా! ఎస్.జానకి, పి.సుశీల సి.నారాయణ రెడ్డి.
అన్నా, దేవుడు లేడన్నా! ఎస్.జానకి బృందం సి.నారాయణ రెడ్డి.
ఇదిరా, దొరా, మదిర! ఎస్.జానకి సి.నారాయణ రెడ్డి.
ఏల శాంతమ్మొ మరి రామకృష్ణ సి.నారాయణ రెడ్డి.
కలగంటినో స్వామి పి.సుశీల, రమేష్ దాశరధి కృష్ణమాచార్యులు.
జయతి రవి ఉదయ సమయే
ధారుణి రాజ్యసంపద మదంబున
కురువృద్ధుల్ గురువృద్ధబాంధవులనేకుల్
ఎక్కడ నుండి రాక యిటకు రామ కృష్ణ
బావా, ఎప్పుడు వచ్చితీవు రామ కృష్ణ
కౌరవపాండవుల్ పెనగు కాలము ఎస్.పి.బాలసుబ్హ్మణ్యం
ముందుగ వచ్చితీవు రామ కృష్ణ
ఆయుధమున్ ధరింప రామ కృష్ణ
నందకుమరా! మాధవపెద్ది రమేష్
ఆలును బిడ్డ ఏడుపు
ఒక దుర్మార్గుడు
నిదురవొచుంటివో లేక బెదరి పల్కుచుంటివో
కురుపతి పెనుతొడల్
ఆలములోని
పాలడుగంగ
అయినను పోయిరావలయు హస్తినకు
శ్రీకృష్ణా
తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి
తనయుల వినిచెదవో
అలుగుటయే యెరుంగని
సంతోషంబున సంధి సేయుదురే
సమరము సేయరే బలము సాలిన
జయతి జననంద
అంచితులయిన
ఏ సాటి వహిలోన
సూతుని చేతికిన్ దొరకి
కామము చేతగాని
వందారు భక్తమందర
శ్రీవైకుంఠ నివాసాయ
రణమున
ఉదయాద్రి
పట్టపగలింతె
ఏ మూల దాగెనో

==వనరులు== ఈ సినిమాలొ దుర్య్యొదనుని అభిమానదనునిగా ఛూస్తాము ప్రస్తుత సమాజములొ ఛెడ్డవారిని దుర్యొదనునితొ పొలుస్థున్నాము


పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు