దాసి (1988 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాసి
దర్శకత్వంబి.నరసింగరావు
రచనబి.నరసింగరావు
నిర్మాతబి.నరసింగరావు
తారాగణంఅర్చన
భూపాల్ రెడ్డి
రూప
సిద్దప్ప నాయుడు
శిల్ప
ఛాయాగ్రహణంఅపూర్బ కిషోర్ బిర్
విడుదల తేదీ
1988
సినిమా నిడివి
94 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
దాసి సినిమా పోస్టర్

దాసి 1988 లో విడుదలైన తెలుగు చిత్రము. బి.నరసింగరావు రచించి, దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రము. అలనాటి (1920 కాలంనాటి) తెలంగాణలో దొరల నిరంకుశ పాలనలో చితికిపోయిన గ్రామ ప్రజల జీవితాలను ప్రతిబింబించిన చిత్రం. భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యమిస్తూ ఆద్యంతం వాస్తవికధోరణిలో రూపొందించబడింది. ఈ చిత్రములో దాసిగా కామాక్షి పాత్రను పోషించిన ప్రముఖ నటి అర్చన 1989 సంవత్సరానికి గాని జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని పొందింది.

అవార్డులు[మార్చు]

ఈ చిత్రం జాతీయ స్థాయిలో అయిదు అవార్దులు గెలుచుకొంది.[1] ఒక తెలుగు చలన చిత్రానికి ఇన్ని అవార్దులు రావడం ఇదే ప్రధమం.[2] తెలుగులో ఉత్తమ సినిమాగా బి.నరసింగరావు, ఉత్తమ నటిగా అర్చన, ఉత్తమ సినిమాటొగ్రఫికి గాను అపూర్వ కిషొర్ బిర్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా సుదర్శన్, ఉత్తమ కళా దర్శకుడు గా టి. వైకుంఠం 1989 సంవత్సరపు జాతీయ చలన చిత్ర పురస్కారాలు అందుకొన్నారు. ఈ చిత్రం 1989 లో మాస్కో లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో డిప్లొమా ఆఫ్ మెరిట్ అవార్డ్ ను కూడా గెలుచుకొంది.[3]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2017-06-11.
  2. "సాక్షి దిన పత్రిక". ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక: 19. మార్చి 28, 2010.
  3. "Telugu creative genius Narsingh Rao's films regale Delhi". News.webindia123.com. 2008-12-21. Archived from the original on 2013-11-06. Retrieved 2012-08-27.